బాలీవుడ్ బాద్షాకు బాహుబలి సాయం | Sharukk Khan Using Baahubali 2 for raees release | Sakshi
Sakshi News home page

బాలీవుడ్ బాద్షాకు బాహుబలి సాయం

Published Wed, Nov 9 2016 10:59 AM | Last Updated on Mon, Sep 4 2017 7:39 PM

బాలీవుడ్ బాద్షాకు బాహుబలి సాయం

బాలీవుడ్ బాద్షాకు బాహుబలి సాయం

రిపబ్లిక్ డే కానుకగా బాలీవుడ్లో రెండు భారీ చిత్రాలు రిలీజ్కు రెడీ అవుతున్నాయి. షారూఖ్ హీరోగా తెరకెక్కిన రాయిస్తో పాటు, గ్రీకువీరుడు హృతిక్ లీడ్ రోల్లో తెరకెక్కిన కాబిల్ చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. రెండు సినిమాలు భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతుండటంతో ఎవరిది పై చేయి అవుతుందని అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు.

ఈ భారీ పోటిలో సత్తా చాటేందుకు షారూఖ్ ఖాన్, బాహుబలిని వాడేస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం రాయిస్ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న సంస్థే బాహుబలి సినిమాను కూడా డిస్ట్రిబ్యూట్ చేయనుండటంతో.. సింగిల్ స్క్రిన్స్లో రాయిస్ రిలీజ్ చేసిన థియేటర్లకే బాహుబలి సినిమాను ఇస్తామన్నా కండిషన్ పెడుతున్నారట. దీంతో బాహుబలి లాంటి సినిమాను వదులుకోలేక రాయిస్ను కూడా తమ థియేటర్లలో రిలీజ్ చేసుందుకు రెడీ అవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement