రివ్యూలు బాగున్నా.. కలెక్షన్లు అంతమాత్రమే | Hrithik Roshan's Film Continues To Struggle | Sakshi
Sakshi News home page

రివ్యూలు బాగున్నా.. కలెక్షన్లు అంతమాత్రమే

Published Wed, Feb 1 2017 5:33 PM | Last Updated on Tue, Sep 5 2017 2:39 AM

రివ్యూలు బాగున్నా.. కలెక్షన్లు అంతమాత్రమే

రివ్యూలు బాగున్నా.. కలెక్షన్లు అంతమాత్రమే

ముంబై: ఒకేరోజు విడుదలైన బాలీవుడ్ సినిమాలు రేయీస్, కాబిల్లకు బాక్సాఫీసు వద్ద మిశ్రమ స్పందన వస్తోంది. వసూళ్లలో రేయీస్ దూసుకెళ్తుండగా, కాబిల్ వెనుకబడింది. విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నా కాబిల్ సినిమాకు రోజురోజుకూ కలెక్షన్లు పడిపోతున్నాయి.

జనవరి 25న విడుదలైన కాబిల్ ఏడు రోజుల్లో  61.5 కోట్ల వసూళ్లు సాధించింది. ఆదివారం వరకు ఈ సినిమాకు చెప్పుకోదగ్గ కలెక్షన్లు రాగా సోమవారం నుంచి బాగా తగ్గాయి. సోమవారం 4  కోట్లు, మంగళవారం 3.5 కోట్ల రూపాయలు వచ్చాయి. కాబిల్లో హృతిక్ సరసన యామీ గౌతమ్ నటించింది. కాగా జనవరి 25న విడుదలైన రేయీస్ ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది. ఓవర్సీస్లో 62.56 కోట్లు, దేశంలో 152.61 కోట్ల రూపాయలు వచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement