కాబిల్ షూటింగ్కు బ్రేక్ | Hrithik Roshans Kaabil shoot halted | Sakshi
Sakshi News home page

కాబిల్ షూటింగ్కు బ్రేక్

Published Thu, Aug 25 2016 3:21 PM | Last Updated on Mon, Sep 4 2017 10:52 AM

కాబిల్ షూటింగ్కు బ్రేక్

కాబిల్ షూటింగ్కు బ్రేక్

మొహెంజోదారో సినిమా తరువాత.. ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా తన నెక్ట్స్ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు కండల వీరుడు హృతిక్ రోషన్. అయితే భారీ యాక్షన్ సీన్స్ ఉన్న మొహెంజోదారో షూట్, ఆ వెంటనే ప్రమోషన్ కార్యక్రమాలు, ఆ వెంటనే కాబిల్ షూట్ ఇలా బిజీ షెడ్యూల్తో అలిసి పోయిన హృతిక్ ప్రస్తుతం జ్వరంతో బాధపడుతున్నాడు.

అందుకే కాబిల్ టీం హృతిక్తో చేయాల్సిన షూటింగ్ను వాయిదా వేసింది. తీవ్ర జ్వరంతో ఉన్న హృతిక్ కోలుకోవటానికి మరో నాలుగైదు రోజుల సమయం పట్టనుండటంతో ఈ గ్యాప్లో హీరో పాత్ర కనిపించని
సీన్స్ను తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే హృతిక్ కూడా షూటింగ్కు హాజరవుతారన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

హృతిక్ సరసన యామీ గౌతమ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు సంజయ్ గుప్తా దర్శకుడు. హృతిక్ త్రండి రాకేష్ రోషన్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. 2017 జనవరి 26న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement