బాలీవుడ్‌ నటుడు కన్నుమూత | Kaabil actor Narendra Jha passes away | Sakshi
Sakshi News home page

బాలీవుడ్‌ నటుడు కన్నుమూత

Published Wed, Mar 14 2018 11:11 AM | Last Updated on Fri, Aug 17 2018 2:27 PM

Kaabil actor Narendra Jha passes away - Sakshi

సాక్షి,ముంబై: బాలీవుడ్ నటుడు నరేంద్ర ఝా  (55) కన్నుమూశారు.  తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆయన బుధవారం  తుది శ్వాస విడిచారు. బాలీవుడ్‌ స్టార్‌హీరోలతో కలిసి పలు కీలక పాత్రల్లో  నటించిన  నరేంద్ర మోడలింగ్‌తో కెరియర్‌ ప్రారంభించారు. టెలివిజన్‌ నటుడుగా కూడా ప్రఖ్యాతి గాంచారు. అలా 2002లో  ఫంటూష్‌  సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అనంతరం హదర్‌, రాయీస్‌, మొహంజోదారో లాంటి ప్రఖ్యాత సినిమాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా బాలీవుడ్‌ స్టార్ హీరో హృతిక్‌  రోషన్‌ మూవీ ‘కాబిల్‌’లో నరేంద్ర ఝా పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించారు. టాలీవుడ్‌లో యమదొంగ, లెజెండ్‌, ఛత్రపతి సినిమాల్లో  నటించారు. కాగా సల్మాన్‌ఖాన్‌  హీరోగా బాలీవుడ్‌ అప్‌ కమింగ్‌  మూవీ  రేస్‌-3  నరేంద్ర ఆఖరి చిత్రం. నరేంద్ర ఝా ఆకస్మిక మృతి పట్ల ...ఇండస్ట్రీ నటీనటులు, దర్శక నిర్మాతలు సహా పలువురు  సంతాపాన్ని వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement