న్యూఢిల్లీ: ఫెయిర్ లవ్లీ యాడ్‌లో మెరిసి.. ఆ తర్వాత 'విక్కీ డోనర్' సినిమాతో తెరపై కనువిందు చేసింది యామీ గౌతమీ. తెలుగులో 'కొరియర్ బాయ్ కల్యాణ్'లో కనిపించిన ఈ అమ్మడికి ఇప్పటివరకు చిన్నాచితకా అవకాశాలే వచ్చాయి. తాజాగా బాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన హృత్తిక్ రోషన్‌తో కలిసి నటించే భారీ చాన్స్ రావడంతో ఈ అమ్మడు ఎగిరి గంతేస్తోంది. 'కాబిల్' సినిమాలో హృత్తిక్‌తో స్క్రీన్ షేర్ చేసుకొనే అవకాశం రావడం ఎంతో ఎక్సైటింగ్‌గా ఉందని యామీ గౌతమి చెప్తోంది.
'ఇది నిజంగా గొప్ప అవకాశం. ఆయనతో కలిసి నటిస్తుండటం ఎంతో ఎక్సైటింగ్‌గా ఉంది. అదే సమయంలో కొంచెం ఆందోళన కూడా ఉంది. ఆయన చాలా పెద్ద స్టార్ హీరో. ఎప్పుడూ నాలో స్ఫూర్తినింపే నటుడు ఆయన. ఆయనతో కలిసి నటించడం నిజంగా అద్బుతంగా ఉంటుంది. ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా' అని యామీ మీడియాతో తెలిపింది. ఇప్పటివరకు 'టోటల్ సిపాయ', 'బద్లాపూర్' వంటి సినిమాలతో మెప్పించిన యామీ త్వరలోనే 'సానమ్ రే' సినిమాతో ప్రేక్షకులను పలుకరించనుంది.
'ఆ చాన్స్‌తో చాలా ఎక్సైటింగ్‌గా ఉంది'
Published Tue, Feb 9 2016 7:22 PM | Last Updated on Wed, Sep 5 2018 8:44 PM
Advertisement
Advertisement