
తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలోని వార్గల్ గ్రామంలోని కొండపై ఉన్న సరస్వతి ఆలయం బాసర తర్వాత రాష్ట్రంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన సరస్వతీ ఆలయం

ఈ ఆలయం పిల్లలకు అక్షరాభ్యాసానికి ప్రసిద్ధి

ఇది సిద్దిపేట & హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటి

శ్రీ విద్యా సరస్వతీ ఆలయం అని కూడా పిలుస్తారు, దీనిని శ్రీ యామవరం చంద్రశేఖర శర్మ నిర్మించారు

చాలా కుటుంబాలు తమ పిల్లల అక్షరాభ్యాసం కోసం మొదటిసారి పాఠశాలలో చేరడానికి ముందు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు

నిత్య అన్నదానం పేరుతో ఆలయ ప్రాంగణంలో భక్తులందరికీ ఉచితంగా భోజనం అందిస్తారు

ఈ ఆలయంలో వసంత పంచమి, నవరాత్రి మహోత్సవాలు, శని త్రయోదశి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి

వర్గల్ గ్రామం సికింద్రాబాదుకు 47 కి.మీ దూరంలో ఉంది. ప్రతి 10 నిముషాలకు ఆర్.టి.సి బస్సులు జూబ్లీ బస్ స్టేషను నుండి అందుబాటులో ఉంటాయి

సిద్దిపేట, కరీంనగర్, మంచిర్యాల, వేములవాడ మీదుగా పోతాయి

ఈ దేవాలయం ఆవరణలో ఒక వేద పాఠశాల ఉంది. ఇచ్చట అనేక మంది విద్యార్థులు వేదాలను నేర్చుకుంటున్నారు







