sudhanshu pandey
-
ధాన్యంపై కేంద్రం క్లారిటీ.. ఏం చెప్పిందంటే!
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: ధాన్యం కొనుగోళ్ల విషయంలో తెలంగాణ పట్ల ఎలాంటి వివక్ష చూప డం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పంజాబ్‌లో ధాన్యాన్ని కొనుగోలు చేసిన తరహాలోనే దేశమంతటా ఒకే విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపింది. దీనికి సంబంధించి టీఆర్ఎస్ ప్రభు త్వం చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ కార్యదర్శి సుధాంశు పాండే పేర్కొన్నారు. తెలంగాణలో యాసంగి ధాన్యం కొనాల్సిందేనంటూ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఢిల్లీలో దీక్ష చేపట్టిన నేపథ్యంలో సుధాంశుపాండే మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో డీసెంట్రలైజ్ ప్రొక్యూర్మెంట్ విధానం (డీసీపీ)లో బియ్యం సేకరిస్తున్నామని.. పంజాబ్ నుంచి నాన్ డీసీపీ విధానంలో సెంట్రల్ పూల్ ద్వారా బియ్యం సేకరించి ఇతర రాష్ట్రాలకు పంపిస్తున్నామని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ నేటిదాకా ఒకే విధానం అమల్లో ఉందని చెప్పారు. తెలంగాణ అవసరాలకు వినియోగించుకోగా మిగిలిన బియ్యాన్ని సెంట్రల్ పూల్ కింద ఎఫ్‌సీఐకి అప్పగిస్తోందని గుర్తు చేశారు. ఇన్నాళ్లూ ఏటా యాసంగిలో పండిన పంటను బాయిల్డ్ రైస్‌గా మార్చి ఎఫ్‌సీఐకి అప్పగిస్తోందన్నారు. అదే పంజాబ్ అయితే ఖరీఫ్ సీజన్లో మాత్రమే వరి పండించి బియ్యాన్ని సెంట్రల్ పూల్ కింద ఎఫ్‌సీఐకి అప్పగిస్తుందని.. రబీలో గోధుమలను పండిస్తోందని వివరించారు. పంజాబ్ నుంచి కేంద్రం బాయిల్డ్ రైస్ తీసుకోవడం లేదని.. ఆ రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధరకు ధాన్యం సేకరిస్తోందని తెలిపారు. రాష్ట్రం ఒప్పుకున్నాకే.. తెలంగాణతోపాటు దక్షిణ భారతదేశం నుంచి ఎఫ్‌సీఐ సేకరించే బాయిల్డ్ రైస్‌ను సెంట్రల్ పూల్ కింద కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు పంపిస్తామని సుధాంశు పాండే తెలిపారు. తెలంగాణ కూడా పశ్చిమ బెంగాల్, బిహార్‌లకు బాయిల్డ్ రైస్‌ను పంపుతుందన్నారు. తెలంగాణలో బాయిల్డ్ రైస్ వినియోగం లేనందున మొత్తం బియ్యాన్ని ఎఫ్‌సీఐకే పంపిస్తూ వస్తోందన్నారు. దేశంలో ప్రస్తుతం నాలుగేళ్లకు సరిపడా బాయిల్డ్ రైస్ నిల్వలు ఉన్నందున తెలంగాణ నుంచి రా రైస్ మాత్రమే సేకరిస్తామని ముందే చెప్పామని.. రాష్ట్ర ప్రభుత్వం దీనికి అంగీకరించి ఒప్పందంపై సంతకం కూడా చేసిందని వివరించారు. అంతేగాకుండా 2021–22 యాసంగి ధాన్యం సేకరణ ప్రతిపాదనను తెలంగాణ పంపలేదని చెప్పారు. -
సామాన్యులకు షాక్.. ఇక ఉచిత రేషన్ బంద్!
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా పెద ప్రజలకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనలో భాగంగా అందిస్తున్న ఉచిత రేషన్ అందించే కార్యక్రమాన్ని ఈ నెల 30 తర్వాత పొడిగించే ప్రతిపాదనేది లేదని కేంద్ర ప్రభుత్వ ఆహార, ప్రజాపంపిణీ విభాగం కార్యదర్శి సుధాన్షు పాండే తెలిపారు. కరోనా సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం వల్ల ప్రతిపాదన చేయలేదని ఆయన వెల్లడించారు. గతేడాది కోవిడ్-19 వల్ల విధించిన లాక్డౌన్ దృష్ట్యా పెదప్రజలకు ఉచితంగా రేషన్ అందించడానికి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన(పీఎంజీకెఏవై)ని మార్చి 2020లో ప్రకటించారు. 2020 ఏప్రిల్‌లో ఈ పథకం మొదలైంది. కరోనా సెకండ్ వేవ్‌లో ఈ ఏడాది మే, జూన్ వరకు అమలు చేశారు. ఆ తర్వాత కరోనా పరిస్థితుల వల్ల పేదలు ఇబ్బంది పడకుండా.. జూన్‌లో మరో ఐదు నెలలు( 2021 నవంబర్ 30 వరకు) పొడిగించారు. "ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం, ఆహార ధాన్యాల ఒఎమ్ఎస్ఎస్(ఓపెన్ మార్కెట్ అమ్మకపు పథకం) డిస్పోజల్ కూడా ఈ సంవత్సరం మంచిగా ఉంది. కాబట్టి, పీఎంజీకెఏవైని పొడిగించే ప్రతిపాదన లేదు" అని సుధాన్షు పాండే విలేకరులకు విలేకరులకు తెలిపారు. దేశవ్యాప్తంగా జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్ఎఫ్ఎస్ఎ) కింద గుర్తించిన 80 కోట్ల రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం ఉచిత రేషన్ సరఫరా చేస్తుంది. (చదవండి: సామాన్యులకు శుభవార్త, వంటనూనె ధరల్ని తగ్గించిన కేంద్రం!) -
భూ రికార్డులు చూశాకే ధాన్యం కొనుగోలు
న్యూఢిల్లీ: ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) వ్యాపారులకు కాకుండా అసలైన రైతులకే దక్కేలా కీలక నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆహార శాఖ కార్యదర్శి సుదాన్షు పాండే చెప్పారు. వచ్చే నెల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసేటప్పుడు రైతుల భూమి రికార్డులను పరిశీలించనున్నట్లు (క్రాస్‌చెక్) సుదాన్షు తెలిపారు. రాష్ట్రాల్లోని డిజిటల్ ల్యాండ్ రికార్డులను ఎఫ్‌సీఐతో అనుసంధానించినట్లు వెల్లడించారు. రైతన్నల ప్రయోజనాల కోసమే ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నట్లు స్పష్టం చేశారు. రైతులు వారి సొంత భూమిలో లేదా కౌలుకు తీసుకున్న భూమిలో పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం సేకరిస్తుందని అన్నారు. ఏ ప్రాంతంలో ఎంత పంట పండించారు అనేది తెలుసుకోవడంతోపాటు అసలైన రైతులకు కనీస మద్దతు ధర దక్కేలా చేయడమే భూమి రికార్డుల క్రాస్‌చెక్ ఉద్దేశమని వివరించారు. -
ఇక ఎక్కడికెళ్లినా రేషన్ తిప్పలు ఉండవు!
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ ఆహార భద్రతా చట్టం కింద దేశవ్యాప్తంగా వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ పథకాన్ని అమలు చేసే ప్రణాళికలో మరో అడుగు ముందుకు పడింది. శుక్రవారం కేంద్రప్రభుత్వం మేరా రేషన్ మొబైల్ యాప్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం ఈ యాప్ ఇంగ్లి్లష్, హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. జీవనోపాధి కోసం కొత్త ప్రాంతాలకు వెళ్ళే రేషన్ కార్డ్ హోల్డర్లకు మేరా రేషన్ మొబైల్ యాప్ ప్రయోజనం చేకూరుస్తుందని ఆహార, ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శి సుధాన్షు పాండే ప్రకటించారు. ప్రస్తుతం 32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ పథకంలో భాగస్వామ్యం అయ్యాయని ఆయన తెలిపారు. మిగిలిన నాలుగు రాష్ట్రాలైన అస్సాం, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల అనుసంధానం రాబోయే కొద్ది నెలల్లోనే పూర్తవుతుందని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి మధ్య మొత్తం 15.4 కోట్ల పోర్టబిలిటీ లావాదేవీలు వన్ నేషన్ వన్ రేషన్ కింద జరిగాయని వివరించారు. 2019 ఆగస్టులో 4 రాష్ట్రాల్లో ప్రారంభించిన ఈ వ్యవస్థను 2020 డిసెంబర్ నాటికి తక్కువ వ్యవధిలో వేగంగా విస్తరించగలిగామని అన్నారు. ప్రస్తుతం వన్ నేషన్ వన్ రేషన్ వ్యవస్థలో దేశంలోని దాదాపు 69 కోట్ల ఎన్ఎఫ్ఎస్ఏ లబ్ధిదారులు ఉన్నారని పేర్కొన్నారు. ప్రతీ నెల సగటున 1.5 –1.6 కోట్ల పోర్టబిలిటీ లావాదేవీలు నమోదు అవుతున్నాయని పాండే తెలిపారు. -
ఎనర్జిటిక్ స్టార్ కోసం బాలీవుడ్ విలన్
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మరో ఇంట్రస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. తన స్టైల్‌కు పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యే ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాను ప్రారంభించారు. డబుల్ దిమాక్ అనే ట్యాగ్ లైన్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాతో పూరి కంబ్యాక్ అవుతారన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమాలో రామ్ కు జోడిగా నిధి అగర్వాల్ నటిస్తుండగా ప్రతినాయక పాత్రలకు బాలీవుడ్ నటుడిని తీసుకున్నట్టుగా తెలుస్తోంది. బాలీవుడ్ సినిమాల్లో స్టైలిష్ విలన్‌గా పేరు తెచ్చుకున్న సుదాన్షు పాండే ఈ సినిమాలో విలన్‌గా కనిపించనున్నాడు. రజనీకాంత్, శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన 2.ఓ లో సుధాన్షు గెస్ట్ రోల్లో కనిపించిన సంగతి తెలిసిందే. -
50 కోట్లు ఇవ్వాలంటున్న హీరో తండ్రి
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తండ్రి, ప్రముఖ దర్శక నిర్మాత అయిన రాకేష్ రోషన్, సుదాంన్షు పాండే అనే వ్యక్తిపై చట్టపరమైన చర్యలకు దిగుతున్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు చేసినందుకుగాను రూ.50 కోట్లు డిమాండ్ చేస్తూ అతడిపై కోర్టులో పరువు నష్టం కింద వేయనున్నారు. కాగా తన రాసుకున్న కథను రాకేష్ రోషన్ చోరీ చేసాడంటూ గతంలో సుదాంన్షు పాండే ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ప్రముఖ మోడల్, నటుడు అయిన సుదాంన్షు పాండే.. రాకేష్ రోషన్, సంజయ్ గుప్తాలు తన ఫర్మాయిష్ సినిమా కథను దొంగిలించి, అదే కథతో హృతిక్ రోషన్ హీరోగా కాబిల్ పేరుతో సినిమా తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారని ఆరోపిస్తూ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇప్పటికే ఈ విషయమై రాకేష్ రోషన్, సంజయ్ గుప్తాను విచారించిన పోలీసులు వారి స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. దీంతో సుదాంన్షు పాండే ఆధారాలు లేకుండా చేసిన ఆరోపణ మూలంగా తనకు జరిగిన వ్యక్తిగత నష్టానికి, 50 కోట్లు పరువు నష్టం కింద చెల్లించాలంటూ రాకేష్ రోషన్ కోర్టు ఆశ్రయించడానికి రెడీ అవుతున్నారు.