'క్రిష్3' వేయి కోట్లు కొల్లగొడుతుంది'
'క్రిష్3' వేయి కోట్లు కొల్లగొడుతుంది'
Published Wed, Oct 23 2013 11:22 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
బాలీవుడ్ లో వంద కోట్లు కొల్లగొట్టడం చాలా చిన్న విషయంగా కనిపిస్తోంది. కొద్దికాలం క్రితం వరకు 100, 200 కోట్ల చిత్రం అంటూ ప్రచారంతో బాలీవుడ్ అదరగొట్టిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా బాలీవుడ్ లో అగ్ర దర్శకుడు రాకేశ్ రోషన్ తాజా లక్ష్యం వేయి కోట్లుగా కనిపిస్తొంది. రాకేశ్ రోషన్ దర్శకత్వంలో ఆయన తనయుడు హృతిక్ రోషన్ నటిస్టున్న 'క్రిష్3' చిత్రం నవంబర్ 1 తేదిన విడుదలకానుంది. క్రిష్ చిత్రం బాక్సాఫీస్ వద్ద 1000 కోట్లు రాబడుతుందనే సానుకూలం ఆలోచనతో రాకేశ్ ఉన్నట్టు ఆయన మాటలు చెబుతున్నాయి.
నవంబర్ 1 తేదిన విడుదలకానున్న క్రిష్3 చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాకేశ్ రోషన్, హృతిక్ రోషన్, వివేక్ ఒబెరాయ్, ప్రియాంక చోప్రా, కంగనా రనౌత్ లు పాల్గొన్నారు. క్రిష్3 చిత్రం ఎన్ని కోట్లు రాబడుతుందనే ప్రశ్నకు రాకేశ్.. సమాధానమిస్తూ.. ఈ చిత్రం 1000 కోట్ల కలెక్షన్లను రాబడుతుంది అని ముసిముసి నవ్వులు నవ్వాడు.
సూపర్ హీరో గా హృతిక్ నటించిన ఈ చిత్రంలో విజువల్, యాక్షన్ చిత్రాలను చిత్రీకరించేందుకు, కన్నుల పండుగ ఉండేందుకు భారత దేశానికి చెందిన స్పెషలైజ్డ్ ఆర్టిస్టులను రాకేశ్ వినియోగించుకున్నారు. భారతీయ చిత్రపరిశ్రమలో తొలిసారి సూపర్ హీరో పాత్ర కనిపించనుందని.. ఈ చిత్రాన్ని రూపొందించినందుకు గర్వపడుతున్నామన్నారు. క్రిష్3 చిత్రం భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకుపోవడం ఖాయం అని రాకేశ్ ధీమా వ్యక్తం చేశారు.
Advertisement
Advertisement