బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ (69) కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాక్షించారు. రాకేష్‌ను ఆయన ‘ఫైటర్’గా అభివర్ణించారు. ‘రాకేష్ జీ ఎంతో ధైర్యం కలిగిన వ్యక్తి. ఆయన ఈ చాలెంజ్‌ను ధీటుగా ఎదుర్కొంటారు’ అని మోదీ హృతిక్‌కి ట్వీట్ చేశారు. కాగా, రాకేష్‌కు ‘స్క్వామస్ సెల్ కార్సినోమా’ అనే గొంతు క్యాన్సర్ ఉందన్న సంగతి తెలిసిందే. అయితే, అభిమానులు ఆందోళన చెందాల్సిన పనిలేదని, నాన్నకు క్యాన్సర్ ప్రారంభ స్థాయిలోనే ఉందన్నారు హృతిక్. తన తండ్రి కోలుకోవాలని విష్ చేసినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. సర్జరీ విజయవంతంగా పూర్తయిందని రీట్వీట్ చేశారు. (గెట్ వెల్ సూన్)
‘నాకు తెలిసినంత వరకు మా నాన్నే స్ట్రాంగ్ మ్యాన్. ఆపరేషన్ జరిగే రోజుకూడా ఆయన జిమ్ చేశారు’ అని చెప్పుకొచ్చారు హృతిక్. ఆయన క్యాన్సర్‌ను జయిస్తారని ధీమా వ్యక్తం చేశారు. తన తండ్రితో కలిసి జిమ్‌లో దిగిన ఫోటోను షేర్ చేస్తూ హృతిక్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ విషయాలు వెల్లడించారు.
ఇదిలాఉండగా.. నటుడు, నిర్మాత, దర్శకుడైన రాకేష్ రోషన్ కుమారుడు హృతిక్ హీరోగా కహోనా ప్యార్ హై, కోయి మిల్ గయా, క్రిష్, కాబిల్ చిత్రాలను నిర్మించారు. క్రిష్ సిరీస్‌లో భాగంగా క్రిష్ 4, క్రిష్ 5 చిత్రాలను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు.
Dear Hrithik, praying for the good health of Shri Rakesh Roshan Ji. He is a fighter and I am sure he will face this challenge with utmost courage. @RakeshRoshan_N https://t.co/Z0IaYSS4A4
— Narendra Modi (@narendramodi) January 8, 2019
Thank you Sir for your concern and good wishes. I am very happy to inform that according to the doctors his surgery has gone off well. 🙏🏻 https://t.co/BS42lCy0Kn
— Hrithik Roshan (@iHrithik) January 8, 2019
Comments
Please login to add a commentAdd a comment