జనవరిలో స్టార్ట్‌ | Krrish 4 to Have Time Travel Storyline | Sakshi
Sakshi News home page

జనవరిలో స్టార్ట్‌

Jul 10 2020 1:28 AM | Updated on Jul 10 2020 1:28 AM

Krrish 4 to Have Time Travel Storyline - Sakshi

హృతిక్‌ రోషన్‌

ప్లాన్‌ ప్రకారం అన్నీ అనుకున్నట్లు జరిగినట్లయితే ఈ ఏడాది క్రిస్మస్‌ పండగకి హృతిక్‌ రోషన్‌ ‘క్రిష్‌ 4’ చిత్రం థియేటర్‌లోకి రావాల్సింది. కానీ ‘క్రిష్‌’ ఫ్రాంచైజీ దర్శకుడు రాకేశ్‌ రోషన్‌ (హృతిక్‌ రోషన్‌ తండ్రి) క్యాన్సర్‌ బారిన పడి, కోలుకోవడానికి కొంత సమయం పట్టడంతో ‘క్రిష్‌ 4’ చిత్రం సెట్స్‌పైకి వెళ్లలేదు. అయితే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఎలాగైనా విడుదల చేయాలనే పట్టుదలతో ఉన్నారట రాకేశ్‌ రోషన్‌. ఇందుకు తగ్గట్లుగానే ఈ సినిమా స్క్రిప్ట్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయని బాలీవుడ్‌ సమాచారం. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా షూటింగ్‌ను ఆరంభించాలనుకుంటున్నారని టాక్‌. అప్పటికి కరోనా పరిస్థితులు ఓ కొలిక్కి వస్తాయని, ఫారిన్‌ షూటింగ్స్‌కు పెద్ద సమస్యలు ఉండవని భావిస్తోందట చిత్రబృందం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement