![Hrithik Roshan Father Rakesh Roshan Diagnosed with Early Stage Cancer - Sakshi](/styles/webp/s3/article_images/2019/01/8/Hrithik%20Roshan.jpg.webp?itok=kfPBnoCV)
బాలీవుడ్ సూపర్ హీరో హృతిక్ రోషన్ అభిమానులకు షాక్ ఇచ్చారు. ఈ రోజు(మంగళవారం) ఉదయం తండ్రి రాకేష్ రోషన్‌తో కలిసి జిమ్‌లో దిగిన ఫోటోను తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేసిన హృతిక్ తన తండ్రి క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టుగా వెల్లడించారు. ఇటీవల బాలీవుడ్ సినీ ప్రముఖులు క్యాన్సర్ బారిన పడినట్టుగా వార్తలు తరుచూ వినిపిస్తున్నాయి.
ఇర్ఫాన్ ఖాన్, సోనాలి బ్రిందేల ఆరోగ్యానికి సంబంధించిన వార్తల నుంచి తెరుకోక ముందే రాకేష్ రోషన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టు తెలియటంతో అభిమానులు షాక్ అయ్యారు. ఈ రోజు రాకేష్ రోషన్‌కు సర్జరీ జరగనుందని వెల్లడించాడు హృతిక్. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించిన రాకేష్ రోషన్ తరువాత హృతిక్‌ను స్టార్ హీరోగా నిలబెట్టడంలో సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం హృతిక్ హీరోగా క్రిష్ 4, క్రిష్ 5 చిత్రాలను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు రాకేష్.
Comments
Please login to add a commentAdd a comment