ఆ హీరోయిన్ గురించి చెబితే షాకవుతారు | Kangana Ranaut Hrithik Roshan controversy: Here's what Rakesh Roshan has to say | Sakshi
Sakshi News home page

ఆ హీరోయిన్ గురించి చెబితే షాకవుతారు

Published Mon, Sep 26 2016 11:22 AM | Last Updated on Mon, Sep 4 2017 3:05 PM

ఆ హీరోయిన్ గురించి చెబితే షాకవుతారు

ఆ హీరోయిన్ గురించి చెబితే షాకవుతారు

న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరో హీరోయిన్లు హృతిక్ రోషన్, కంగనా రౌత్ వివాదంపై హృతిక్ తండ్రి స్పందించాడు. కంగనా పేరు ప్రస్తావించకుండా రాకేష్ రోషన్ ఘాటైన విమర్శలు చేశాడు. హృతిక్ విభిన్నమైన వ్యక్తని, ఒకరు (కంగనా) అతని గురించి అబద్ధాలు ప్రచారం చేసిందని, అయినా హుందాగా మౌనం పాటించాడని చెప్పాడు. హృతిక్ నిజం ఏంటన్నది బయటకు చెబితే ప్రతి ఒక్కరూ షాకవుతారని రాకేష్ అన్నాడు.

హృతిక్ సినిమా షూటింగ్తో తీరికలేకుండా ఉన్నాడని, విరామం లభిస్తే ఈ విషయంపై స్పందిస్తాడని రాకేష్ చెప్పాడు. కాగా వాస్తవం ఏంటన్నది చెప్పాలా వద్దా అన్నది అతని ఇష్టమని అన్నాడు. గతేడాది హృతిక్-కంగనా వివాదం బాలీవుడ్లో సంచలనం కలిగించింది. మాజీ ప్రేమికులైన ఈ ఇద్దరూ విబేధాలతో తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. ఇద్దరూ కోర్టుకు వెళ్లి లీగల్ నోటీసులు పంపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement