ఆ హీరోకు తండ్రి వత్తాసు ఎందుకు? | Why does a son need his father to rescue him from controversies, says Kangana Ranaut | Sakshi
Sakshi News home page

ఆ హీరోకు తండ్రి వత్తాసు ఎందుకు?

Published Sun, Oct 2 2016 9:26 AM | Last Updated on Tue, Oct 2 2018 2:40 PM

ఆ హీరోకు తండ్రి వత్తాసు ఎందుకు? - Sakshi

ఆ హీరోకు తండ్రి వత్తాసు ఎందుకు?

కంగనా రనౌత్‌ సుత్తి లేకుండా సూటిగా మాట్లాడుతోంది. మనసులో ఉన్న విషయాన్ని ధైర్యంగా చెప్తోంది. తాజాగా రచయిత చేతన్‌ భగత్‌ పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్న కంగనా.. హృతిక్‌ రోషన్‌తో వివాదం విషయంలో సూటిగా స్పందించింది. హృతిక్‌ తండ్రి రాకేష్‌ రోషన్‌ ఇటీవల ఓ దినపత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ హృతిక్‌-కంగన వివాదంపై స్పందించారు. తన కొడుకు గురించి కొందరు అసత్యాలు ప్రచారం చేస్తున్నా.. అతను మాత్రం మౌనంగా ఉన్నాడని, హృతిక్‌ వాస్తవాలు మాట్లాడితే.. అవి అందరినీ షాక్‌కు గురిచేస్తాయని ఆయన పేర్కొన్నారు.

రాకేష్‌ వ్యాఖ్యలపై విలేకరులు అడుగగా కంగన ఘాటుగా స్పందించింది. ‘భారతీయ పురుషులు ఎందుకు తమ కాళ్ల మీద నిలబడరు? 43 ఏళ్ల వయస్సు వచ్చిన కొడుకుని తండ్రి రక్షించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎంతకాలం వాళ్లు తమ తండ్రుల పేరుప్రఖ్యాతల వెనుక దాక్కుంటారు? అతను పెద్దవాడు. సినీ ప్రపంచంలో వచ్చే వివాదాలను అతను ఎదుర్కోగలడు. ఇది చిన్న వివాదం. ఇందులో కొడుకులను తండ్రులు రక్షించాల్సినంతగా ఏముంది? నాకు అర్థం కావడం లేదు’ అని కంగన పేర్కొంది. ‘సిల్లీ ఎక్స్‌’ అని హృతిక్‌ను ఉద్దేశించి కంగన పేర్కొనడంతో వీరిద్దరి మధ్య గత జనవరి వివాదం మొదలైన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement