ఆ నిజం తెలిస్తే షాకవుతారు! | rakesh roshan breaks silence on hrithik kangana row | Sakshi
Sakshi News home page

ఆ నిజం తెలిస్తే షాకవుతారు!

Published Tue, Sep 27 2016 9:15 AM | Last Updated on Wed, Aug 21 2019 10:13 AM

ఆ నిజం తెలిస్తే షాకవుతారు! - Sakshi

ఆ నిజం తెలిస్తే షాకవుతారు!

బాలీవుడ్‌లో ఈ ఏడాది ప్రారంభంలో హృతిక్ రోషన్ - కంగనా రనౌత్‌ల మధ్య జరిగిన వివాదం గురించి అందరికీ తెలిసిందే. ఒకరి మీద ఒకరు తీవ్రస్థాయిలో బురద చల్లుకున్నారు. తమ మధ్య 2010 సంవత్సరంలో కైట్స్ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమ మొదలైందని కంగనా చెబుతుంటే.. హృతిక్ మాత్రం అలాంటిదేమీ లేదన్నాడు. అయితే.. ఈ విషయంలో ఇన్నాళ్లు ఏమీ మాట్లాడని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే.. అది హృతిక్ తండ్రి రాకేష్ రోషన్. అలాంటిది ఆయన కూడా దీనిపై ఇప్పుడు నోరు విప్పారు. హృతిక్ రోషన్ నిజం చెబితే ప్రతి ఒక్కరూ షాకవుతారని ఆయన అన్నారు. హృతిక్ చాలా విభిన్నంగా ఉంటాడని.. అతడి గురించి ఎవరైనా అబద్ధాలు ప్రచారం చేస్తున్నా కూడా అతడు చాలా కామ్‌గా విని ఊరుకుంటాడు తప్ప అవతలి వాళ్లను ఇబ్బంది పెట్టడని ఆయన చెప్పారు. అతడు గనక నిజం ఏంటో బయటపెడితే అంతా షాకవుతారని తెలిపారు.

అయితే దాని గురించి చెప్పాలా.. వద్దా అన్నది మాత్రం పూర్తిగా హృతిక్ ఇష్టానికే వదిలిపెడుతున్నానన్నారు. ప్రస్తుతానికి హృతిక్ తన సినిమాతో బిజీగా ఉన్నాడని, దాన్నుంచి కాస్త విరామం దొరికితే ఈ విషయం మీద మాట్లాడే అవకాశం ఉందని అన్నారు. ఏం చేయాలన్నది అతడి ఇష్టమని చెప్పారు. రాకేష్ రోషన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న కాబిల్ అనే సినిమా షూటింగులో హృతిక్ పూర్తి బిజీగా ఉన్నాడు. త్వరలోనే క్రిష్ 4 కూడా తీస్తానని రాకేష్ తెలిపారు. హృతిక్ హీరోగా ఉండే ఈ సినిమా 2018లో విడుదల అవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement