హృతిక్ రోషన్ హీరోగా నటించిన 'క్రిష్'కి అభిమానులు కాని వారుండరు. 2006లో వచ్చిన ఆ చిత్రం హిందీలోనే కాదు.. తెలుగులోనూ అనువాద రూపంలో మంచి విజయం సాధించింది. తరువాత వచ్చిన 'క్రిష్ 3' (2013) కూడా మంచి విజయమే సాధించింది. ఇప్పుడు ఈ సిరీస్‌లో నాలుగో భాగం వస్తున్న విషయం తెలిసిందే. అయితే గత చిత్రాల కంటే భారీగా ‘క్రిష్ 4′ ను రూపొందించాలన్నది హృతిక్ ఆలోచిస్తున్నాడట. యాక్షన్ సన్నివేశాలు, గ్రాఫిక్స్ భారీ ఎత్తున ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు.
అయితే ఈ సినిమాకి సంబంధించిన విషయాల్లో తండ్రి రాకేశ్ రోషన్ సలహాను హృతిక్ పాటించడం లేదట. ఈ సినిమాకి సంబంధించి హృతిక్‌కి కొన్ని ఆలోచనలు ఉన్నాయట. ఏఏ ఆర్టిస్టులను తీసుకోవాలి. ఎలాంటి గ్రాఫిక్స్‌ను వాడాలని అనే విషయాలను హృతిక్‌యే చూసుకుంటున్నాడట. ఎలాంటి విజువల్ ఎఫెక్ట్ సినిమాలో పెట్టాలనే అంశాన్ని కూడా అతనే చూసుకుంటున్నాడట. తండ్రి రాకేశ్ రోషన్ కంటే హృతిక్ కే నేటితరం ప్రేక్షకులపై మంచి అవగాహన ఉంది. ఎలాంటి గ్రాఫిక్స్ సన్నివేశాలయితే ప్రేక్షకులకు నచ్చుతాయో హృతిక్ బాగా తెలుసు. అందుకే సినిమా సంబంధించిన విషయాల్లో తండ్రి మాట వినడం లేదని బాలీవుడ్ సర్కిల్‌లో వినిపిస్తోంది. ఏదేమైనా భారీ హంగులతో 2020లో క్రిష్-4 సినిమాను విడుదల చేయాలని తండ్రీ-కొడుకులు ఆరాటపడుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం హృతిక్ రోషన్ ‘సూపర్ 30’ సినిమాలో నటిస్తున్నారు. ప్రముఖ గణిత శాస్త్రజ్ఞుడు, ఉపాధ్యాయుడు ఆనంద్ కుమార్ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రమిది.
Comments
Please login to add a commentAdd a comment