Super 30
-
నేను ఆ టైప్ కాదు, నటినని నా బాయ్‌ఫ్రెండ్ వదిలేశాడు: హీరోయిన్
ప్రముఖ బుల్లితెర నటి మృణాల్ ఠాకూర్ సూపర్ 30 సినిమాతో హీరోయిన్గా మారింది. తొలి సినిమాతోనే ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ సరసన నటించే చాన్స్ కొట్టేసింది. సూపర్ 30 మంచి విజయం సాధించడంతో ఆమె వరస అవకాశాలు అందుకుంటోంది. ఈ క్రమంలో ఆమె హందీ జెర్సీలో కథానాయికగా నటించింది. తెలుగు హీరో నాని జెర్సీ రిమేక్ ఇది. ఇందులో షాహిద్ కపూర్ హీరో. ఇదిలా ఉంటే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు రెడీ అవుతోంది. ఈ క్రమంలో హీరోయిన్ మృణాల్ మూవీ ప్రమోషన్లో భాగంగా ఇంటర్య్వూలతో బిజీగా ఉంది. చదవండి: నాన్న పీస్ డేని చెడగొట్టే మిషన్‌లో బిజీ, సితార పోస్ట్ వైరల్ తాజాగా ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆమె మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. తన వ్యక్తిగత విషయాలను పంచుకుంది. ‘చిన్న వయసులోనే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. మానసిక ఒత్తికి గురయ్యా. ఒకానోక సందర్భాల్లో చచ్చిపోవాలనే ఆలోచనలు కూడా నన్ను వెంటాడేవి’ అంటూ చెప్పుకొచ్చింది. తన ప్రేమ, బ్రేకప్‌పై ఆమె స్పందించింది. ‘పెళ్లి, పిల్లలు కాకుండా నాకు ఏదైనా కొత్తగా చేయాలనే తపన ఉండేది. కెరీర్ పరంగా ఉన్నత స్థాయిలో ఉండాలనేది నా కోరిక. ఈ క్రమంలో నాకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నాను. ఇప్పుడిలా నటిగా మీ ముంద్దు నిలిచాను. చదవండి: రవితేజపై ఖిలాడి డైరెక్టర్ రమేశ్ వర్మ భార్య షాకింగ్ కామెంట్స్, ఈ వివాదం మరింత ముదరనుందా? గ్లామర్ ఫీల్డ్ నా ఆలోచనలకు సరిపోతాయనే నటనను ఎంచుకుని ముందుకు నడిచాను. ఇప్పుడు నటిగా మీ అందరి అభిమానాన్ని పొందుతున్’ అని చెపపింది. అయితే ‘ఇదే.. ఫీల్డ్ నా బ్రేకప్‌కు కారణమైంది. 7 నెలల క్రితం నా బాయ్‌ఫ్రెండ్ వదిలేశాడు. దానికి కారణంగా నాకు షాకింగ్‌గా అనిపించింది. నటిననే కారణంగానే అతడు నన్ను వదిలేసి పారిపోయాడు’ అని చెప్పింది. ఎందుకంటే ‘నేను ప్రమించే వ్యక్తి సంప్రదాయా కుటుంబానికి చెందినవాడు. పద్దతులు, కట్లుబాట్లను బాగా ఫాలోతాడు. కొన్నాళ్లుగా ఒకరినినొకరం ప్రమించుకున్నాం. కానీ నేను ఉన్న ఫీల్డ్ నచ్చలేదని అతడు నన్ను వదిలేసి వెళ్లిపోయాడు. కానీ అతనిపై నాకేం కోపం లేదు. ఎందుకంటే మేమిద్దరం సర్ది చెప్పుకొని రిలేషన్లో ముందుకు వెళ్లినా పెళ్లి తర్వాత తరచూ మా మనస్పర్థలు రావోచ్చు’ అని పేర్కొంది. -
మరోసారి కేబీసీకి ‘సూపర్ 30’ ఆనంద్
ముంబై : సూపర్ 30 వ్యవస్థాపకుడు, ప్రముఖ మ్యాథమెటీషియన్ ఆనంద్ కుమార్.. బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ షోలో మరోసారి పాల్గొననున్నారు. త్వరలో జరగనున్న ఎపిసోడ్ 51, 61,62లలో పాల్గొనవల్సిందిగా కేబీసీ ఆనంద్‌ను ఆహ్వానించనుంది. ఈ మేరకు సూపర్ 30 శనివారం ఓ ప్రకటనను విడుదల చేసింది. 2017లో మొదటిసారి ఆయన కేబీసీలో పాల్గొన్నారు. గేమ్ ఆడి 25 లక్షల రూపాయలను గెలుచుకున్నారు. అంతేకాకుండా ‘అరక్షణ్’ సినిమాలో పాత్రకు సంబంధించి అమితాబ్ బచ్చన్‌కు ఆనంద్ కొన్ని సలహాలను కూడా ఇచ్చారు. చదవండి : అక్షయ్ బాటలో మిలింద్.. తొలిసారి ఆ పాత్రలో! -
'జ్యోతి కుమారికి ఉచితంగా ఐఐటీ కోచింగ్'
పట్నా : లాక్డౌన్ నేపథ్యంలోనూ గాయపడిన తన తండ్రిని సొంతూరుకు చేర్చడం కోసం 1200 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణించిన జ్యోతి కుమారి పట్ల సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ప్రముఖ మ్యాథమెటీషియన్, సూపర్ 30 వ్యవస్థాపకుడు ఆనంద్ కుమార్ జ్యోతి కుమారికి ఉచితంగా ఐఐటీ-జేఈఈ కోచింగ్ అందిస్తామని ప్రకటించాడు. ''ఐదు రోజుల పాటు సైకిల్ తొక్కుతూ 1200 కిలోమీటర్ల ప్రయాణించడం అంటే ఒక సాహసమే. కానీ జ్యోతి కుమారి సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమే అని నిరూపించింది. సూపర్ 30 తరపున మా తమ్ముడు జ్యోతి కుటుంబాన్ని కలిసి సహాయం అందించాడు. భవిష్యత్తులో ఐఐటీయన్ కావాలనుకుంటే జ్యోతికుమారికి మా సూపర్ 30 స్వాగతం పలుకుతుంది'' అంటూ ఆనంద్ కుమార్ ట్వీట్ చేశారు. (పల్లె విద్యార్థులకు ఆనంద్ కుమార్ పాఠాలు ) #Bihar daughter #jyotikumari has set an example by paddling all the way from #Delhi carrying her father on a bicycle, covering an unimaginable 1200 kms. Yesterday, my brother @Pranavsuper30 met her. If she would like to prepare for #IIT in future she is welcome to the #super30 pic.twitter.com/PMhsMvhDwn — Anand Kumar (@teacheranand) May 25, 2020 అంతకుముందు సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జ్యోతికి సైక్లింగ్‌లో శిక్షణతో పాటు ఆమె చదువుకు కూడా సహాయం అందిస్తామని ప్రకటించింది. జ్యోతిని ధైర్యవంతురాలిగా ప్రశంసిస్తూ పలువురు మంత్రులు ఆమెకు సహాయం అందివ్వడానికి ముందుకు వచ్చారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి రాబ్రీ దేవి సైతం జ్యోతి చదువుకు, వివాహానికి అయ్యే మొత్తం ఖర్చు తానే భరిస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఆర్డేడీ అధికారంలోకి వచ్చిన తర్వాత తన తండ్రికి ఉద్యోగం ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. ఇక జ్యోతి సాహాసానికి ఇవాంకా ట్రంప్ సైతం ఫిదా అయ్యారు. ఆమె కథని ట్విట్టర్ వేదికగా పంచుకున్న ఇవాంకా ''అదో అందమైన సహనంతో కూడిన ప్రేమ. ఆమె చేసిన ఫీట్‌ని భారత ప్రజలతో పాటు సైక్లింగ్ ఫెడరేషన్ గుర్తించాయి'' అంటూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. (జ్యోతి కుమారి నిజంగా అద్భుతం : ఇవాంక ) -
పల్లె విద్యార్థులకు ఆనంద్ కుమార్ పాఠాలు
న్యూఢిల్లీ: ‘సూపర్–30’ కోచింగ్‌తో ఫేమస్ అయిన ఆనంద్ కుమార్ పల్లెటూర్లకు చెందిన పేద విద్యార్థుల కోసం ఒక్క రూపాయికే కోచింగ్ అందించే ప్రాజెక్టులో పాలుపంచుకున్నారని ఈ గవర్నెన్స్ బుధవారం తెలిపింది. ప్రజలకు సుపరిచితుడైన ఆనంద్ కుమార్ ఆన్లైన్లో విద్యార్థులకు ట్రైనింగ్ ఇచ్చే మాడ్యూల్‌కు కోర్సును తయారు చేయనున్నారు. ఇది ఐఐటీ జేఈఈ పరీక్షలు రాసే విద్యార్థులకు ఉపయోగపడనుంది. ఇది పేద విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని, సైన్సు, లెక్కలు విద్యార్థులు పట్టు సాధించేలా ఉంటుందని ఆనంద్ చెప్పారు. ఒక్క రూపాయికే పేద విద్యార్థులకు అందుబాటులో ఉంటుందన్నారు. కొత్త రకమైన బోధనా పద్ధతులతో విద్యార్థులు నేర్చుకునేలా, సబ్జెక్టులపై ఆసక్తి పెంచేలా ఉంటుందన్నారు. -
హృతిక్‌రోషన్‌కు ప్రతిష్టాత్మక అవార్డు
బాలీవుడ్ గ్రీక్‌గాడ్ హృతిక్ రోషన్ గణిత శాస్త్రవేత్త ఆనంద్ కుమార్ పాత్రలో నటించిన చిత్రం సూపర్ 30. ఈ మూవీలో ఆనంద్ కుమార్ పాత్రలో హృతిక్ అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. అయితే తాజాగా సూపర్ 30 మూవీలోని నటనకు దాదాసాహెబ్ ఫాల్కే ఫౌండేషన్ అవార్డును 2020గాను హృతిక్‌రోషన్ గెలుచుకున్నారు. వికాస్ బల్ దర్శకత్వం వహించిన సూపర్ 30లో టీవీ నటి మృణాల్ ఠాకూర్, వీరేంద్ర సక్సెనా, జానీ లీవర్, పంకజ్ త్రిపాఠి నటించిన విషయం తెలిసిందే. (స్ఫూర్తినింపే ‘సూపర్ 30’) అనంద్ కుమార్ పాత్రలో హృతిక్ నిరుపేద విద్యార్థులకు ఉచితంగా గణిత విద్యను అందించి ఐఐటీ- జేఈఈ పరీక్షల్లో ర్యాంకులు సాధించే విధంగా తయారు చేస్తారు. కండలతో ఉండే హృతిక్ ఈ మూవీలో పూర్తి భిన్నంగా కనిపించి తన అద్భుత నటనతో ప్రేక్షాదారణ పొందారు. కాగా హృతిక్ ఇటీవల వార్ చిత్రంలో టైగర్ ష్రాఫ్‌తో కలిసి నటించారు. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. వార్ చిత్రం సైతం విమర్శకుల మన్ననలు పొందింన సంగతి తెలిసిందే.( ఆనంద్ మహీంద్రా సాయం తిరస్కరించిన ఆనంద్ కుమార్) -
అమ్మ తొమ్మిదిసార్లు చూసింది
‘‘నేను నటించిన ‘సూపర్ 30’ చిత్రాన్ని మా అమ్మ తొమ్మిదిసార్లు చూసింది’’ అంటున్నారు బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్. పాట్నాకు చెందిన ఆనంద్ కుమార్ అనే గణితశాస్త్రవేత్తకు సంబంధించిన కథ ఆధారంగా నిర్మితమైన ఈ చిత్రాన్ని హృతిక్ రోషన్ తల్లి పింకీ రోషన్ థియేటర్లలో ఇప్పటి వరకు తొమ్మిదిసార్లు చూశారట. ‘ఆనంద్ సార్‌ని, ఆయన సోదరుడు ప్రణవ్ను ఇంతవరకు వ్యక్తిగతంగా కలిసే అవకాశం దొరకలేదు’ అని తన తల్లి అన్నారని కూడా హృతిక్ తెలిపారు. మొత్తానికి సూపర్ 30 సక్సెస్ మీట్‌తో ఆవిడ కోరిక నెరవేరింది. కొంతకాలం క్రితమే ఈ చిత్రం విడుదలైంది. ఆనంద్‌కుమార్ అనే 46 సంవత్సరాల మాథమెటీషియన్ మీద ఎంతో ఇన్స్పైరింగ్గా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆనంద్‌కుమార్‌కు, ఆయన సోదరుడు ప్రణవ్కుమార్కు సక్సెస్ మీట్లో తన తల్లిని పరిచయం చేశారు హృతిక్ రోషన్. -
పైసా వసూల్ మూవీగా సూపర్ 30
ముంబై : బాలీవుడ్ గ్రీక్‌గాడ్ హృతిక్ రోషన్ టైటిల్ పాత్రలో గణిత శాస్త్రవేత్త ఆనంద్ కుమార్ బయోపిక్‌గా తెరకెక్కిన సూపర్ 30 బాక్సాఫీస్ వద్ద డ్రీమ్‌రన్ కొనసాగిస్తోంది. నాలుగో వారంలోనూ నిలకడగా వసూళ్లు సాధిస్తూ బ్లాక్‌బస్టర్ దిశగా దూసుకుపోతోంది. నాలుగోవారంతో కలుపుకొని సూపర్ 30 భారత్‌లో రూ 134.71 కోట్లు కలెక్ట్ చేసిందని ట్రేడ్ అనలిస్ట్, సినీ విమర్శకులు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. కొత్త సినిమాలు థియేటర్లకు క్యూ కట్టినా సూపర్ 30 స్ర్టాంగ్ రన్ కొనసాగుతోందని ఆయన వెల్లడించారు. మరోవైపు ఓవర్సీస్లోనూ సూపర్ కలెక్షన్స్ రాబడుతోంది. ఓవర్సీస్లో ఆగస్ట్ 1 వరకూ ఈ మూవీ ఏకంగా రూ 35.05 కోట్లు కొల్లగొట్టింది. హృతిక్‌తో పాటు ఈ సూపర్ 30లో టీవీ నటి మృణాల్ ఠాకూర్, వీరేంద్ర సక్సెనా, జానీ లీవర్, పంకజ్ త్రిపాఠి తదితరులు నటించారు. -
రూ 100 కోట్ల క్లబ్లో సూపర్ 30
ముంబై : బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ గణిత శాస్త్రవేత్త ఆనంద్ కుమార్ పాత్రలో నటించిన సూపర్ 30 బాక్సాఫీస్ వద్ద నిలకడగా దూసుకుపోతోంది. పదిరోజుల్లో ఈ మూవీ రూ 100 కోట్ల వసూళ్ల మైలురాయిని అధిగమించింది. పలు స్ధానిక, హాలీవుడ్ చిత్రాల నుంచి పోటీ ఎదురైనా బాక్సాఫీస్ వద్ద సూపర్ 30 దూకుడుకు బ్రేక్ పడలేదని రెండో వారాంతంలోనూ మూవీ మెరుగైన వసూళ్లు రాబట్టి రూ 100 కోట్ల మార్క్‌ను దాటిందని ప్రముఖ సినీ క్రిటిక్, ట్రేడ్ విశ్లేషకులు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. సూపర్ 30 రెండవ వారాంతంలో శనివారం రూ 8.53 కోట్లు, ఆదివారం రూ 11.68 కోట్లు రాబట్టి మొత్తం ఇండియాలో రూ 100.58 కోట్లు వసూలు చేసిందని వెల్లడించారు. సూపర్ 30లో హృతిక్‌తో పాటు నందిష్ సంధూ, ఆదిత్య శ్రీవాస్తవ, వీరేంద్ర సక్సేనా, పంకజ్ త్రిపాఠి తదితరులు ఇతర పాత్రల్లో కనిపించారు. -
‘నా సాయం తిరస్కరించారు.. అభినందనలు’
పట్నా : ఐఐటీ జేఈఈ పరీక్షకు సిద్ధం అవుతోన్న వారికి బిహార్‌కు చెందిన ప్రముఖ గణిత వేత్త ఆనంద్ కుమార్ గురించి తెలిసే ఉంటుంది. ప్రతిభావంతులైన 30 మంది నిరుపేద విద్యార్థులకు ఉచిత కోచింగ్ అందించి.. వారు ఐఐటీలో సీటు సాధించేందుకు తోడ్పడుతూ.. వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు ఆనంద్ కుమార్. ఈ ఐఐటీ ట్యూటర్ జీవిత చరిత్ర ఆధారంగా... బాలీవుడ్లో ‘సూపర్ 30’ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హృతిక్ రోషన్, ఆనంద్ కుమార్ పాత్రలో నటించారు. రెండు రోజుల క్రితం విడుదలైన ఈ చిత్రం కలెక్షన్లలోనూ దూసుకుపోతుంది. ఆనంద్ కుమార్ కృషి గురించి తెలుసుకున్న వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా.. ఆయనను కలిశారు. ఈ సందర్భంగా ఆనంద్ కుమార్‌తో కలిసి దిగిన ఫోటోను ట్విటర్లో షేర్ చేశారు ఆనంద్ మహీంద్రా. అంతేకాక ‘ఆనంద్ చేస్తోన్న పని గురించి తెలిసి అతడిని అభినందించడానికి వెళ్లాను. నా వంతుగా ఆయనకు ఆర్థిక సాయం చేద్దామని భావించాను. కానీ ఆశ్చర్యం.. ఆనంద్ నా సాయాన్ని తిరస్కరించారు. తన స్వంతంగానే ఈ సూపర్ 30 కార్యక్రమాన్ని కొనసాగించాలనుకుంటున్నట్లు వెల్లడించారు. ఆయన పట్టుదల చూసి నాకు చాలా ముచ్చటేసింది. ఆయన కృషిని అభినందిస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. దీనిపై ఆనంద్ కుమార్ స్పందిస్తూ.. ‘ధన్యవాదాలు సార్.. మీ అభినందనలే నాకు ఎంతో బలాన్నిస్తాయి’ అంటూ రీట్వీట్ చేశాడు. Anand Kumar says in the article that he turned down my offer to fund his efforts. I confirm that when we met, he courteously declined my offer of financial support. I remain an admirer of how he’s changed the lives of so many. https://t.co/3Gn3V1Qdlp pic.twitter.com/fAFqYg6UtU — anand mahindra (@anandmahindra) July 13, 2019 ఆనంద్ కుమార్ 2002లో ఈ సూపర్ 30 ఇన్స్టిట్యూట్ను ప్రారంభించారు. నైపుణ్యం కలిగిన 30 మంది పేద పిల్లలను ఎంచుకుని వారికి ఉచిత వసతి కల్పిస్తూ పాఠాలు చెప్తుంటారు. మొదటి ఏడాదిలోనే ఈ అకాడమీకి చెందిన 30 మందిలో 18 మంది ఐఐటీకి సెలక్ట్ అయ్యారు. ఆ తర్వాత ఏడాది నుంచి ఈ సంఖ్య పెరుగుతూ వస్తోంది. 2010 లో ఈ అకాడమీకి చెందిన 30 మంది విద్యార్థులు ఐఐటీ జేఈఈకి పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంతో ఆనంద్ కుమార్ గురించి దేశవ్యాప్తంగా తెలిసింది. ఫారిన్ మీడియా కూడా ఆనంద్ కుమార్ కృషిని ప్రశంసించింది. -
మూవీ రివ్యూ: స్ఫూర్తినింపే ‘సూపర్ 30’
అదిరిపోయే డ్యాన్సులు, నటనతో బాలీవుడ్ గ్రీక్ గాడ్‌గా ఫేమ్ తెచ్చుకున్న కథా నాయకుడు హృతిక్‌రోషన్. 2017లో కాబిల్ లాంటి వైవిధ్యమైన చిత్రంతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న ఈ హీరో దాదాపు రెండున్నర సంవత్సరాల విరామం తర్వాత సూపర్–30తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ప్రతిభ ఉన్న పేద విద్యార్థులకు ఉచితంగా శిక్షణనిస్తూ ఐఐటీలకు పంపుతూ పేరు గడించిన ప్రముఖ గణితవేత్త ఆనంద్‌కుమార్ జీవిత గాథతో తీసిన సూపర్ 30 సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. మరి వాటిని ఈ చిత్రం ఎంతమేర అందుకుందో తెలుసుకుందాం.. కథ: బిహార్‌లోని పాట్నాలో ఉండే ఆనంద్‌కుమార్‌కు గణితం అంటే ఎనలేని ఆసక్తి. ఆ ఇష్టంతోనే తక్కువ కాలంలో గణితంపై పట్టు తెచ్చుకొని, ప్రఖ్యాత కేంబ్రిడ్జి వర్సిటీలో సీటు దక్కించుకుంటాడు. కానీ పేదింట్లో పుట్టిన ఆనంద్ ఆర్థిక సమస్యలతో కేంబ్రిడ్జికి వెళ్లలేకపోతాడు. అదే సమయంలో అతని కుటుంబంలో జరిగిన కొన్ని సంఘటనలతో అతడి చదువు ఆగిపోతుంది. కుటుంబ పోషణ కోసం ప్రైవేటు కోచింగ్ సెంటర్లలో క్లాసులు చెప్తూ మంచి పేరు తెచ్చుకుంటాడు. కానీ ఓ రాత్రి ఒక బాలుడు, రిక్షా కార్మికుడితో జరిపే సంభాషణతో తీవ్ర వేదనకు గురైన ఆనంద్ ఉద్యోగం మానేసి, పేద పిల్లలకు ఉచితంగా ఐఐటీ శిక్షణ ఇవ్వాలన్న నిర్ణయానికి వస్తాడు. సొంత అకాడమీని నెలకొల్పి, నైపుణ్యం కలిగిన 30 మంది పేద పిల్లలను ఎంచుకుని వారికి ఉచిత వసతి కల్పిస్తూ పాఠాలు చెప్తుంటాడు. తమ కోచింగ్ వ్యాపారానికి ఆనంద్ చర్యలతో నష్టమని గ్రహించిన ప్రైవేటు శిక్షణ సంస్థ యజమాని ఆదిత్య శ్రీవాత్సవ, రాజకీయ నాయకుడు పంకజ్ త్రిపాఠీ ఆనంద్‌పై కక్ష కడతారు. చివరికి వారు ఆనంద్‌పై ప్రతీకారం తీర్చుకోవడానికి ఏం చేశారు? తను శిక్షణనిస్తున్న పిల్లలకు ఐఐటీలో సీట్లు తీసుకురావాలన్న ఆనంద్‌కుమార్ కల నెరవేరిందా లేదా అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. నటీనటులు: ఆనంద్‌కుమార్ పాత్రలో హృతిక్‌రోషన్ జీవించాడనే చెప్పాలి. ఆ పాత్రలో హృతిక్ ఒదిగిన తీరు అద్భుతం. చాలా చోట్ల ఆయన కళ్లతో, హావభావాలతో సన్నివేశాలకు అదనపు హంగులద్దాడు. కేంబ్రిడ్జిలో సీటు వచ్చే సీన్, పతాక సన్నివేశాల్లో హృతిక్ నటన ఆడియన్స్‌ను సీట్ల నుంచి కదలనివ్వకుండా చేస్తుంది. కొన్ని సీన్లలోనే కనపడినా క్లాసికల్ డ్యాన్స్, మంచి లుక్స్‌తో రితూ పాత్రలో కథానాయిక మృనాల్ ఠాకూర్ ఆకట్టుకుంది. హీరో తండ్రి పాత్రలో నటించిన సీనియర్ నటుడు వీరేందర్ సక్సేనా సహజసిద్ధ నటనతో మెప్పించాడు. కోచింగ్ సెంటర్ యజమానిగా బాగా నటించిన ఆదిత్య శ్రీవాత్సవ పాత్ర కథను కీలక మలుపు తిప్పుతుంది. రాజకీయ నాయకుడిగా పంకజ్ త్రిపాఠీ పాత్ర ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది. ఆనంద్‌కుమార్ తమ్ముడు ప్రణవ్ కుమార్‌గా నటించిన నందిష్ సింగ్ చక్కని నటనతో మంచి మార్కులు కొట్టేశాడు. ఆనంద్ వద్ద శిక్షణ పొందే పిల్లలుగా నటించిన వారందరూ ఆకట్టుకున్నారు. విలేకరిగా నటించిన అమిత్ సాద్‌తోపాటు మిగిలిన వారు తమ పాత్రల పరిధి మేర బాగానే నటించారు. విశ్లేషణ: ఆదర్శంగా నిలిచే ఆనంద్‌కుమార్ జీవితాన్ని అంతే స్ఫూర్తిమంతంగా తెరకెక్కించి, ప్రేక్షకుల ముందుంచడంలో దర్శకుడు వికాస్ భల్ విజయవంతమయ్యాడు. పాత్రల చిత్రణ, వాటి తాలూకు సంఘర్షణకు తెరరూపమివ్వడంలో ఆయన సఫలమయ్యాడు. చిన్న పిల్లల నుంచి తనకు కావాల్సిన నటనను రప్పించుకోవడం, హృతిక్‌ను పాత్రకు తగ్గట్లుగా మలచడంలో సక్సెస్ అయ్యాడు. కథనంలో వేగం తగ్గిన్నప్పుడల్లా సున్నితమైన హాస్యంతో సినిమాను నిలబెట్టాడు. పాత్రకు తగ్గట్టుగా తనను తాను మార్చుకున్న హృతిక్ రోషన్ స్టార్ ఇమేజ్ తాలూకు ఛాయలు పాత్రలో కనపడనీయకుండా అద్భుతమైన నటనను కనబరిచారు. బిహారీ హిందీ యాసలో హృతిక్, పంకజ్ త్రిపాఠీ, వీరేందర్ సక్సేనాలు తమ డైలాగులు, నటనతో పేక్షకుల్ని మాయ చేస్తారు. అనయ్ గోస్వామి తన కెమెరా పనితనంతో పాట్నా వీధులు, పేదల జీవితాలను బాగా చూపాడు. అజయ్–అతుల్ సంగీతం కథలో భాగంగా సాగగా.. నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. సంజీవ్ దత్తా రాసిన సంభాషణలు మనసుకు హత్తుకునేలా, పొట్టచెక్కలయ్యేలా, ఆలోచింపజేసేలా ఉన్నాయి. స్ఫూర్తినింపుతూ సందేశాన్నిచ్చే కథ, నటీనటుల సహజమైన నటన, చక్కని వినోదం, హృతిక్‌ను కొత్తగా చూపిన విధానం కలగలిపిన ఈ సినిమా సగటు ప్రేక్షకుడిని మెప్పిస్తుందనడంలో సందేహం లేదు. టైటిల్: సూపర్ 30 (హిందీ చిత్రం) జానర్: బయోగ్రఫీ నటీనటులు: హృతిక్ రోషన్, మృణాల్ ఠాకూర్, పంకజ్ త్రిపాఠీ, వీరేందర్ సక్సేనా, అమిత్ సాద్, నందిష్ సింగ్, ఆదిత్య శ్రీవాత్సవ సంగీతం: అజయ్ గోగావలే –అతుల్ గోగావలే నిర్మాత: అనురాగ్ కశ్యప్, మధు మంతెన వర్మ, సాజిద్ నదియాడ్వాలా దర్శకత్వం: వికాస్ భల్ – నిధాన్ సింగ్ పవార్ -
సూపర్ 30కి సూపర్బ్ కలెక్షన్లు
ముంబై : హృతిక్ రోషన్ హీరోగా గణిత శాస్త్రవేత్త ఆనంద్ కుమార్ బయోపిక్ సూపర్ 30 కలెక్షన్లలోనూ దీటుగా నిలిచింది. మిశ్రమ స్పందనతో ఓపెన్ అయిన మూవీ తొలిరోజు రూ 11.83 కోట్లు వసూలు చేసి డీసెంట్ వసూళ్లు రాబట్టిన సూపర్ 30 శనివారం రెండో రోజు ఏకంగా రూ 18.19 కోట్లు వసూలు చేసింది. రెండు రోజుల్లో సూపర్ 30 బాక్సాఫీస్ వద్ద మొత్తం రూ 30.20 కోట్లు కలెక్ట్ చేసింది. శనివారం మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్ర్కీన్స్లోనూ మెరుగైన వసూళ్లు సాధించడంతో ఆదివారం మూవీ రూ 20 కోట్లు కలెక్ట్ చేసి తొలి వారాంతంలో రూ 50 కోట్ల వసూళ్లు సాధిస్తుందని ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. -
సూపర్ 30 : మొదటి రోజు రికార్డ్ కలెక్షన్
సాక్షి : బిహార్‌కు చెందిన ప్రముఖ గణిత వేత్త ఆనంద్‌కుమార్ జీవిత కథ ఆధారంగా బాలీవుడ్లో రూపొందించిన చిత్రం సూపర్ 30. హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటించగా వికాస్ బహల్ దర్శకత్వం వహించారు. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకొంది. ఫర్హా ఖాన్, కరణ్ జోహార్లతో పాటు చాలా మంది ప్రముఖులు ఈ సినిమాను మెచ్చుకుంటున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఈ చిత్రం చూసి మంచి కంటెంట్ ఉన్న సినిమాను ప్రేక్షకులకు అందించారనీ, హృతిక్ నటన బాగుందని అభినందిస్తూ ట్వీట్ చేశారు. ఇక కలెక్షన్ పరంగా చూస్తే ఈ చిత్రం మొదటి రోజు దాదాపు పదకొండున్నర కోట్లు వసూలు చేసింది. హృతిక్ రోషన్ ఇంతకు ముందు చిత్రం కాబిల్ 10.43 కోట్లను రాబట్టగా, తాజా చిత్రం ఆ రికార్డును చెరిపేసింది. అంతేకాక, గతేడాది సూపర్ హిట్లుగా నిలిచిన అజయ్ దేవగణ్ రైడ్, అక్షయ్ కుమార్ ప్యాడ్ మ్యాన్ల కంటే ఎక్కువగా ఈ చిత్రం మొదటిరోజు వసూళ్లను సాధించింది. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్ల పరంగా దూసుకెళ్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
అది అసలు ప్రేమే కాదు: హృతిక్
ముస్లిం వ్యక్తిని ప్రేమించిన కారణంగా తనను చిత్ర హింసలకు గురిచేస్తున్నారంటూ హీరో హృతిక్ రోషన్ సోదరి సునయన రోషన్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సొంత ఇళ్లే తనకు నరకంగా మారిందని, తమ్ముడు హృతిక్ కూడా తనపై ద్వేషం పెంచుకుని, వేధిస్తున్నాడంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ విషయంపై హృతిక్ తొలిసారిగా స్పందించాడు. ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘ మాది అందమైన అనుబంధం. ఇక ప్రేమ అనేది మన పిల్లలు, స్నేహితులతో ఉండే బంధం వంటిదే. అయితే అందులో కూడా కాస్త విఙ్ఞత పాటించాలి. మనపై ఎవరి ప్రేమ నిజమైందో తెలుసుకోగలగాలి. ఒక విషయం మాత్రం కచ్చితంగా చెప్పగలను. ప్రేమ ఎన్నటికీ ద్వేషంగా రూపాంతరం చెందదు. ఒకవేళ అలా జరిగితే అసలు అది ప్రేమే కాదు. ఈ విషయం అర్థం చేసుకోగలిగితే ఎవరైనా పూర్వపు ప్రేమ పొందవచ్చు’ అని సునయను ఉద్దేశించి నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు. ఇక ప్రస్తుతం హృతిక్ తన అప్‌కమింగ్ మూవీ ‘సూపర్ 30’ ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. కాగా తన ప్రేమ విషయం గురించి సుయన మాట్లాడుతూ..‘ గతేడాది రుహైల్ అమీన్ అనే వ్యక్తితో ప్రేమలో పడ్డాను. కానీ అతడు ముస్లిం అన్న కారణంగా మా నాన్న మా రిలేషన్‌షిప్‌ను అంగీకరించలేదు. నన్ను తీవ్రంగా కొట్టారు. అతడు ఒక ఉగ్రవాది అతడిని పెళ్లి చేసుకుంటావా అంటూ హింసించారు. ఈ విషయంలో హృతిక్ కూడా నాకు సహాయం చేయలేదు. తను కూడా నన్ను వేధిస్తున్నాడు. రుహైల్‌తో ప్రేమ అతడికి ఇష్టం లేదు’ అని ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సునయన రోషన్ తన ఇంట్లోనే వేధింపులకు గురవుతున్నారంటూ హీరోయిన్ కంగనా రనౌత్ సోదరి రంగోలి చేసిన వరుస ట్వీట్లు కలకలం రేపాయి. అయితే ఇంతవరకు రుహైల్ మాత్రం సునయనతో ప్రేమ విషయంపై నోరు విప్పలేదు గానీ.. ఈ విషయంలో ఆమె తండ్రి రాకేశ్ రోషన్‌ను తప్పుబడుతూ వ్యాఖ్యలు చేశాడు. కాగా రుహైల్కు ఇది వరకే పెళ్లై, పిల్లలు కూడా ఉన్నారని..అతడు సునయను ట్రాప్ చేశాడని బీ-టౌన్లో వార్తలు వినిపిస్తున్నాయి. -
అప్పడాలమ్మా అప్పడాలు
.... అని రోడ్డుపై అమ్ముతున్నారు బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో హృతిక్‌రోషన్. హీరో అప్పడాలు అమ్మాడంటే అది కచ్చితంగా ఏదో సినిమాకే అయ్యుంటుంది. అవును... ‘సూపర్ 30’ కోసం హృతిక్ అప్పడాలు అమ్మారు. బీహార్‌కు చెందిన గణిత శాస్త్రవేత్త ఆనంద్ కుమార్ జీవితం ఆధారంగా హిందీలో తెరకెక్కిన చిత్రం ‘సూపర్ 30’. ఆనంద్ పాత్రలో హృతిక్ నటించారు. వికాస్ బాల్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమాలోని హృతిక్ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ‘‘ఆనంద్‌కుమార్ జీవితంలో ఇలా అప్పడాలు అమ్మే నాటి పరిస్థితులు ఎంతో ఉద్వేగంతో కూడుకున్నవి. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్న ఆయన కష్టపడి జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి చేరుకున్నారు’’ అని హృతిక్ పేర్కొన్నారు. ఈ సినిమా ఈ ఏడాది జూలై 12న విడుదల కానుంది. -
అప్పడాలు అమ్ముకుంటోన్న హీరో
హీరోలు పాత్ర కోసం ఎన్ని పాట్లైనా పడాల్సి వస్తుంది. అలా కష్టపడి నటిస్తేనే పాత్రలకు జీవం పోసినట్టవుతుంది. పాత్ర డిమాండ్ చేస్తే ఎంత డీగ్లామర్గానైనా నటించే హీరోలు అరుదుగా దొరుకుతారు. కొందరు మాత్రమే తమపంథాను మార్చుకుని, క్యారెక్టర్ డిమాండ్ మేరకు ఆ పాత్రల్లోకి దూరిపోతారు. అలాంటి వారే స్టార్‌గా ఎదుగుతారు. ప్రస్తుతం బాలీవుడ్లో రాబోతోన్న సూపర్ 30 అనే మూవీలో హృతిక్ రోషన్ డీ గ్లామర్‌గా కనిపించి తన నటనతో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. గ్రీకు శిల్పంలా కనిపించే హృతిక్ రోషన్ మొదటిసారి డీగ్లామర్ రోల్లో కనిపించేసరికి.. అభిమానులు కాస్త నిరాశపడినా పాత్రకు జీవం పోయడంలో సక్సెస్ అయ్యాడని సంబరపడుతున్నారు. ఎక్కడో మారుమూలన ఉన్న గణిత శాస్త్రవేత్త అయిన ఆనంద్.. ఐఐటీలో విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం, జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించడం వంటి అంశాల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆయన ఆ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం వెనుక ఎంతో శ్రమ దాగి వుందని, దానికోసం ఆయన ఎంతో కష్టపడ్డాడని హృతిక్ షేర్ చేసిన ఓ పిక్‌ను చూస్తే అర్థమవుతుంది. ‘ఆనంద్ జీవిత ప్రయాణంలో పాపడాలు అమ్ముకునే ఘట్టం చాలా ముఖ్యమైనది. ఆ సమయంలో ఆయన పడిన భావోద్వేగమే.. తరువాత సాధించిన విజయాలకు కారణమైంద’ ని హృతిక్ ట్వీట్ చేశారు. వికాస్ భల్ దర్శకత్వంలో సాజిద్ నడియాద్వాలాకు చెందిన నడియాద్వాలా గ్రాండ్సన్ ఎంటర్టైన్మెంట్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్, ఫాంటమ్ ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీ జూలై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. “The papad selling phase of Anand Kumar’s journey is an important one as it was cathartic and became the genesis of all that he did later on in his life.” #Super30 #12thJULY pic.twitter.com/I7FCbXyphG — Hrithik Roshan (@iHrithik) June 27, 2019 -
నల్లగా ఉంటే ఏమవుతుంది?
హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా సినిమా సూపర్ 30. ప్రముఖ గణితవేత్త ఆనంద్ కుమార్ జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాపై హృతిక్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. పాత్రకు జీవం పోసేందుకు తన పంథాను మార్చుకుని... పూర్తి డీగ్లామర్‌గా(నలుపు రంగులో) కనిపించి అభిమానులకు షాక్ ఇచ్చాడు. అయితే ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ను చూసిన అభిమానులు.. హృతిక్ నటనను ప్రశంసిస్తూనే లుక్ మాత్రం బాగా లేదంటూ పెదవి విరుస్తున్నారు. కాగా ఈ విషయంపై సూపర్ 30లో హృతిక్ జోడీగా నటిస్తున్న మృణాల్ ఠాకూర్ స్పందించారు. ఓ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ..‘ పాత్రకు జీవం పోసేందుకు హృతిక్ అలా కనిపించారు. నిజానికి షూటింగ్లో హృతిక్‌ను చూస్తుంటే నాకు ఆనంద్ గారిని చూసినట్లే అనిపించింది. సినిమా పూర్తయ్యేనాటికి ఆయనను ఆనంద్ అని పిలవడం మొదలుపెట్టాను. సినిమా చూసిన తర్వాతే హృతిక్ ఎందుకు నల్లగా కనిపించాడో మీకే అర్థమవుతుంది. అసలు నల్లగా కనిపిస్తే ఏమవుతుంది. ‘లవ్ సోనియా’ సినిమాలో నేను పూర్తిగా నలుపు రంగుతో, డీ గ్లామరైజ్డ్గా కనిపించాను. ఆ క్యారెక్టర్ నాకు మంచి గుర్తింపు తెచ్చింది’ అని చెప్పుకొచ్చారు. అందం అనేది వ్యక్తిత్వానికి సంబంధించిందే తప్ప శరీర ఛాయపై అది ఆధారపడి ఉండదని అభిప్రాయపడ్డారు. కాగా బుల్లితెర ఆర్టిస్టుగా తెరంగేట్రం చేసిన మృణాల్ అనతికాలంలోనే హృతిక్ సరసన హీరోయిన్గా ఎంపికవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. చదవండి : ఆనంద్‌కుమార్ అబద్ధాలు.. చిక్కుల్లో ‘సూపర్ 30’ ఇక వికాస్ భల్ దర్శకత్వంలో సాజిద్ నడియాద్వాలాకు చెందిన నడియాద్వాలా గ్రాండ్సన్ ఎంటర్టైన్మెంట్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్, ఫాంటమ్ ఫిల్మ్స్ సంయుక్తంగా సూపర్ 30ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. కాగా తన ‘సూపర్ 30’ ఇన్స్టిట్యూట్ ద్వారా ఎక్కువమంది విద్యార్థులను ఐఐటీలో చేరుస్తున్నట్టు ఆనంద్‌కుమార్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఈ విషయంలో ఆయన వ్యాఖ్యలు అవాస్తవమని పలువురు ఐఐటీ విద్యార్థులు న్యాయస్థానంలో గత ఏడాది పిల్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో సినిమా విడుదల జాప్యం కానున్నట్లు తెలుస్తోంది. -
'సూపర్ 30' ఆనంద్‌కుమార్ ఇంటర్వ్యూ
బాలీవుడ్లో బయోపిక్‌ల పరంపర కొనసాగుతోంది. సామాన్య ప్రజల అసాధారణ జీవిత చరిత్రలను బయోపిక్‌లుగా మలిచి.. హిట్ మీద హిట్ కొడుతున్నారు. ఈ క్రమంలో వస్తున్న తాజా బయోపిక్ సూపర్ 30. బిహార్‌కు చెందిన గణిత శాస్త్రవేత్త ఆనంద్కుమార్గా ఈ సినిమాలో హృతిక్ రోషన్ నటిస్తున్నాడు. నిరుపేద విద్యార్థులకు ఉచిత కోచింగ్ అందించి.. వారు ఐఐటీలో సీటు సాధించేలా చేసిన ఆనంద్‌కుమార్ జీవిత నేపథ్యాన్ని ఈ సినిమాలో చూపిస్తున్నారు. అయితే మూవీ టైలర్ రిలీజైన తరువాత నుంచి హృతిక్ మాట తీరు, వేషధారణపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. 12 సంవత్సరాలుగా సరైన హిట్‌లేని హృతిక్ ఈ సినిమాతో తనకు మంచి హిట్ దొరుకుతుందని ఆశిస్తున్నాడు. చివరగా 2017లో కాబిల్ చిత్రంలో కనిపించిన హృతిక్ దాదాపు రెండేళ్ల తర్వాత సూపర్30 సినిమాతో జూలై 12న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ నేపథ్యంలో ‘సూపర్ 30’ ఇన్స్టిట్యూట్ అధినేత, ప్రముఖ గణిత శాస్త్రవేత ఆనంద్‌కుమార్‌ను ఇండియా టుడే పలుకరించింది. ఈ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సూపర్ 30 సినిమాకు ముందు ఆ సినిమా డైరెక్టర్ వికాస్ భల్ ఎవరో తనకు తెలియదని, సూపర్‌హిట్ అయిన క్వీన్ మూవీని ఆయన డైరెక్ట్ చేసిన విషయం కూడా తెలియదని ఆనంద్‌కుమార్ చెప్పారు. సూపర్ 30 సినిమా చర్చల్లో భాగంగా డైరెక్టర్ వికాస్ ఫైనల్ స్ర్కిప్ట్‌ను తీసుకురావడానికి పన్నెండుసార్లు కథలో మార్పులు చేశారన్నారు. ఈ సినిమా కోసం హృతిక్ భోజ్‌పురి(బిహారీ)ను నేర్చుకున్నాడని తెలిపారు. ఈ సినిమాను నిర్మిస్తున్న సమయంలో తనతోపాటు వికాస్‌కు కూడా సమస్యలు ఎదురయ్యాయని, వికాస్ భల్‌పై వచ్చిన లైంగిక ఆరోపణలు వచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అయితే, ఈ వ్యవహారంలో కోర్టు అతనికు క్లీన్చిట్ ఇచ్చిందని, చేసిన కష్టానికి తగ్గ ఫలితం ఎప్పుడూ దక్కుతుందని, అందుకే ఆయనకు క్లీన్చిట్ లభించి.. చిత్ర దర్శకుడిగా క్రెడిట్ కూడా దక్కిందని తెలిపారు. ఐఐటీ సీటు సాధించిన తమ ఇన్స్టిట్యూట్కు చెందిన 30 మంది విద్యార్థుల పేర్లు వెల్లడించలేదంటూ గౌహతీ ఐఐటీకి చెందిన నలుగురు విద్యార్థులు తనకు వ్యతిరేకంగా హైకోర్టులో పిల్ వేశారని ఆనంద్ చెప్పుకొచ్చారు. అయితే, అస్సాంకు చెందిన ఆ నలుగురు విద్యార్థులను తనను ఎన్నడూ కలవలేదన్నారు. కొందరు పెద్దల ఒత్తిడి కారణంగానే వారు పిల్ వేశామని ఒప్పుకొన్నారని, తనపై దాడికి యత్నించడమే కాకుండా మళ్లీ పిల్ వేస్తామని కొంతమంది బెదిరిస్తున్నారని, వారి పేర్లను వెల్లడించడానికి తనకు ఇష్టం లేదని ఆనంద్ చెప్పారు. తనకు రక్షణగా బీహార్ ప్రభుత్వం నలుగురు కమాండోలను నియమించిందన్నారు. తన జీవితచరిత్ర ఆధారంగా రూపొందుతున్న సూపర్ 30 మూవీకి బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, దర్శకుడు వికాస్‌భల్ తగిన న్యాయం చేశారన్నారు. సినిమా చూస్తే అసలు వాస్తవం తెలుస్తుందన్నారు. -
ఆనంద్‌కుమార్ అబద్ధాలు.. చిక్కుల్లో ‘సూపర్ 30’
పట్నా: హృతిక్ రోషన్ తాజా సినిమా ‘సూపర్ 30’ విడుదల చిక్కుల్లో పడే అవకాశం కనిపిస్తోంది. ప్రముఖ మ్యాథమేటిషియన్ ఆనంద్‌కుమార్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. అయితే, తన ‘సూపర్ 30’ ఇన్స్టిట్యూట్ ద్వారా ఎక్కువమంది విద్యార్థులను ఐఐటీలో చేరుస్తున్నట్టు ఆనంద్‌కుమార్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఈ విషయంలో ఆయన వ్యాఖ్యలు అవాస్తవమని పలువురు ఐఐటీ విద్యార్థులు న్యాయస్థానంలో గత ఏడాది పిల్ దాఖలు చేశారు. ఈ పిల్ విచారణలో ఉండగానే ఆనంద్‌కుమార్ జీవితాన్ని గొప్పగా చూపిస్తూ సినిమా ఎలా విడుదల చేస్తారని ఈ పిల్ దాఖలు చేసిన విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే పిల్ దాఖలు చేసిన ఐఐటీ విద్యార్థులైన అవినాశ్ బారో, బికాస్ దాస్, మోన్‌జిత్ దోలే, ధనిరాం థా.. ‘సూపర్ 30’ సినిమా విడుదలను ఆపాలంటూ మరో వ్యాజ్యం వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఒక కేసు నమోదైన వ్యక్తిపై.. ఆ కేసు తేలకముందే సినిమా ఎలా విడుదల చేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. ఆనంద్‌కుమార్‌పై తీసిన సినిమా నిజాలను ప్రతిబింబించినట్టు కనిపించడం లేదని, సినిమాకు నష్టం చేయాలన్నది తమ ఉద్దేశం కానప్పటికీ.. అతనిపై వచ్చిన అభియోగాలకు ఇప్పటివరకు సరైన సమాధానం ఆనంద్‌కుమార్ ఇవ్వాలేదని విద్యార్థుల తరఫు న్యాయవాది అమిత్ గోయల్ తెలిపారు. 2018లో తమ ఇన్స్టిట్యూట్ నుంచి 26మంది విద్యార్థులు ఐఐటీలో చేరారని ఆనంద్‌కుమార్ చెప్పుకున్నారని, కానీ, ఐఐటీలో చేరిన ఆ 26 మంది విద్యార్థులెవరో.. వారి పేర్లు వెల్లడించాలని కోర్టులో కోరినా.. ఇప్పటివరకు ఆయన ఆ వివరాలు తెలుపలేదని పిటిషనర్లు అంటున్నారు. నిరుపేద కుటంబాలకు చెందిన విద్యార్థులకు స్వయంగా కోచింగ్ ఇచ్చి.. ప్రతి సంవత్సరం వారు ఐఐటీల్లో చేరేలా కృషి చేస్తున్న ఆనంద్‌కుమార్ దేశవ్యాప్తంగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఆయన జీవితాన్ని తెరమీద ఆవిష్కరిస్తూ.. హృతిక్ రోషన్ హీరోగా ‘సూపర్ 30’ సినిమా తెరకెక్కింది. -
ఆకట్టుకుంటోన్న ‘సూపర్ 30’ ట్రైలర్
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో ప్రముఖ గణిత శాస్త్రవేత్త ఆనంద్ కుమార్ బయోపిక్‌గా తెరకెక్కుతున్న ‘సూపర్ 30’ షూటింగ్‌ను పూర్తి చేసుకుని విడుదలకు సిద్దంగా ఉంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రానికి విడుదల తేదీని ఫిక్స్ చేశారు మేకర్స్. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను కాసేపటి క్రితమే విడుదల చేశారు. ఈ ట్రైలర్ మొత్తంలో హృతిక్ రోషన్ సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచాడు. ఆనంద్ కుమార్ పాత్రలో జీవించేశాడు. హృతిక్ రోషన్ అంటే ప్రేక్షకులు ఎలా ఊహించుకుంటారో దానికి భిన్నంగా(డీగ్లామర్ క్యారెక్టర్లో) ఈ ట్రైలర్లో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల అయినప్పటి నుంచి ఈ మూవీపై అంచనాలు పెరిగాయి. తాజాగా విడుదల చేసిన ట్రైలర్‌తో భారీ హైప్ క్రియేట్ అయింది. వికాస్ భల్ దర్శకత్వంలో సాజిద్ నడియాద్వాలాకు చెందిన నడియాద్వాలా గ్రాండ్సన్ ఎంటర్టైన్మెంట్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్, ఫాంటమ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈచిత్రం జూలై 12న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
జూలై 12న రానున్న ‘సూపర్ 30’
ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్న సూపర్ 30 చిత్రాన్ని ఎట్టకేలకు మోక్షం లభించింది. హృతిక్ రోషన్ నటించిన ఈ మూవీపై కంగన రనౌత్ కక్షగట్టి.. వాయిదా పడేలా చేస్తూ వచ్చింది. మొత్తానికి ఈ చిత్రం విడుదల కానున్నట్లు ఓ తేదీని ప్రకటించింది చిత్రయూనిట్. ప్రముఖ గణిత శాస్త్రవేత్త ఆనంద్ కుమార్ బయోపిక్‌గా తెరకెక్కుతున్న సూపర్ 30 సినిమాను జూలై 12న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. బిగ్ స్క్రీన్‌పై హృతిక్ తొలిసారిగా రియల్ లైఫ్ క్యారెక్టర్‌ను పోషిస్తుండటంతో మూవీపై అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. చెందిన నడియాద్వాలా గ్రాండ్సన్ ఎంటర్టైన్మెంట్, ఫాంటమ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్, టీవీ నటుడు నందిష్ సింగ్ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. -
సమాజంలో అలాంటివారిని చూశా!
బాలీవుడ్లో నటుడు హృతిక్ రోషన్, నటి కంగనా రనౌత్‌ల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఉన్న సంగతి తెలిసిందే. వ్యక్తిగత విషయాల నుంచి సినిమాల రిలీజ్‌ల వరకు వీరి మధ్య పరస్పర ఆరోపణలు మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా మరోసారి కంగనా, హృతిక్ పరోక్షంగా మాటల బాణాలు విసురుకున్నారు. హృతిక్ ‘సూపర్ 30’, కంగనా ‘మెంటల్ హై క్యా’ సినిమాలు ఒకేరోజు (జూలై 26) విడుదలవుతుండమే ఇందుకు కారణం. ముందుగా ‘సూపర్ 30’ సినిమాను హృతిక్ రిలీజ్ రెడీ చేశారని, కంగనా తన సినిమా విడుదల వాయిదా వేయాలని హృతిక్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. కంగనా ప్రయత్నించినప్పటికీ కుదర్లేదట. ఇంతలోనే..‘కంగనా చేతిలో నీ పనైపోవడం ఖాయం’ అని హృతిక్‌ను ఉద్దేశిస్తూ కంగనా సోదరి రంగోలి అన్నారు. దీనిపై అనవసరంగా మరో వివాదాన్ని తెరపైకి తీసుకురావడం ఎందుకు అనుకున్నారేమో కానీ హృతిక్ ఓ ప్రెస్‌నోట్‌ను విడుదల చేశారు. ‘‘సూపర్ 30’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. మీడియా సర్కస్‌లో నా సినిమా వివాదం నలగకుండా ఉండటంతో పాటుగా, నా మానసిక ప్రశాంతత కోసం ‘సూపర్ 30’ సినిమా విడుదలను వాయిదా వేయమని మా సినిమా నిర్మాతలను కోరాను. సరైన తేదీలో వీలైనంత తొందరగా విడుదలకు ప్లాన్ చేయమని చెప్పాను. ఒకరు ఒకర్ని పరోక్షంగా బాధపెడుతుంటే బాధపడుతున్న వారిని చూసి ఆనందపడేవారిని కొందర్ని ఈ సమాజంలో చూశాను. సమాజం పట్ల నమ్మకం కోల్పోకుండా ఉండాలంటే ఇలాంటి విషయాలపై అందరికీ అవగాహన కలగాలి. దీని కోసం ఇప్పటికీ ఆశగా ఎదురు చూస్తున్నాను. ఇలాంటి పరిస్థితులకు ముగింపు పలకాలి’’ అని హృతిక్ అన్నారు. ఈ విషయంపై కంగనా రనౌత్ స్పందించారు. ‘‘హృతిక్ రోషన్ ఆ విషాదకరమైన స్టోరీ ఎందుకు రాశారో నాకు తెలియదు. కానీ, మా ‘మెంటల్ హై క్యా’ సోలోగా రిలీజ్‌కు రెడీ అవడం హ్యాపీగా ఉంది. ఈ పురుషాధిక్య ఇండస్ట్రీలో సోలో రిలీజ్‌కు కృషి చేసిన మహిళా నిర్మాత ఏక్తా కపూర్ నిజంగా గ్రేట్. ఆమె పవర్‌ను మెచ్చుకోవాలి’’ అన్నారు. గతంలోనూ ఇలాగే...! నిజానికి గత ఏడాది సెప్టెంబరు నుంచి ఈ ఏడాది రిపబ్లిక్ డేకి ‘సూపర్ 30’ సినిమాను తొలుత వాయిదా వేశారు హృతిక్ రోషన్. ఆ తర్వాత సడన్‌గా రిపబ్లిక్ డే వీకెండ్లో కంగనా రనౌత్ ‘మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’ చిత్రం రిలీజ్‌కు సిద్ధం అయ్యింది. అప్పట్లో కూడా కంగనా వర్సెస్ హృతిక్ అని వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత కొన్ని అనుకోని కారణావల్ల ‘సూపర్ 30’ సినిమాను జూలై 26కి పోస్ట్‌పోన్ చేశారు టీమ్. దీంతో కంగనా ‘మణికర్ణిక: ది క్వీన్ఆఫ్ ఝాన్సీ’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు కూడా కంగనా నటించిన ‘మెంటల్ హై క్యా’ సినిమానే ప్రేక్షకుల ముందుకు రాబోతుండటం విశేషం. -
సూపర్ 30 రిలీజ్ డేట్ ఫిక్స్!
ఐఐటీ బాబాగా పేరుగాంచిన గణిత ఉపాధ్యాయుడు ఆనంద్ కుమార్ జీవిత చరిత్ర ఆధారంగా సూపర్ 30 చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆనంద్ కుమార్ పాత్రలో హృతిక్ రోషన్ నటించగా.. వికాస్ బాల్ దర్శకత్వం వహించారు. అయితే ఆ మధ్య వికాస్ బాల్‌పై మీటూ ఆరోపణలు రాగా.. ఆయన్ను ఈ చిత్రం నుంచి నిర్మాతలు తప్పించిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావల్సి ఉండగా.. వాయిదాలు పడుతూ వస్తోంది. అయితే వికాస్ బాల్‌ను తప్పించే సమయానికే షూటింగ్ పూర్తైందని మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ మూవీని జనవరి 25న విడుదల చేసేందుకు ప్లాన్చేసినా.. అది కుదరలేదు. అయితే తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. జూలై 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటించారు. సాజిద్ నడియాద్వాలాకు చెందిన నడియాద్వాలా గ్రాండ్సన్ ఎంటర్టైన్మెంట్, ఫాంటమ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా.. మృణాల్ ఠాకూర్, టీవీ నటుడు నందిష్ సింగ్ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. -
సముద్ర జీవిగా?
క్రిష్ సముద్ర జీవిగా మారబోతున్నాడా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. శంకర్ దర్శకత్వంలో హృతిక్ రోషన్ హీరోగా ఓ సినిమా రూపొందనుందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి బీటౌన్‌లో మరో వార్త పుట్టుకొచ్చింది. అదేంటంటే... ఈ సినిమాను అండర్ వాటర్‌లో షూట్ చేస్తారట. అద్భుతమైన శక్తులు ఉండే సముద్ర జీవిగా హృతిక్ కనిపిస్తారట. అంటే క్రిష్‌గా గాల్లో విన్యాసాలు చేసిన హృతిక్ ఇప్పుడు నీటిలో అద్భుతాలు చేస్తారన్నమాట. ఆల్రెడీ శంకర్ ఈ కథను హృతిక్‌కు చెప్పడం, హృతిక్ ఓకే చెప్పడం కూడా జరిగిపోయాయట. ‘క్రిష్ 4’ చిత్రాన్ని హృతిక్, ‘ఇండియన్ 2’ చిత్రాన్ని శంకర్ పూరి ్తచేసుకున్న తర్వాత ఈ సినిమాకు కొబ్బరికాయ కొడతారట. అంటే ఇంకా బోలెడు టైమ్ ఉందని చెప్పుకోవచ్చు. ఈ సంగతి ఇలా ఉంచితే.. హృతిక్ రోషన్ నటించిన తాజా చిత్రం ‘సూపర్ 30’ని జూలై 26న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇంతకుముందు ఈ చిత్రం విడుదలను గతేడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది జనవరి 25కి మార్చారు. ఇప్పుడు జూలైకి వాయిదా వేశారు. అంటే... కంగనా రనౌత్‌కు, హృతిక్ రోషన్‌కు బాక్సాఫీస్ పోటీ లేనట్లే. ఎందుకంటే కంగనా నటించిన ‘మణికర్ణిక: ఝాన్సీ రాణి’ చిత్రం ఈ నెల 25న విడుదల కానున్న సంగతి తెలిసిందే. -
హృతిక్ వెనక్కి తగ్గాడా..!
బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్, కంగనా రనౌత్‌ల మధ్య ఉన్న వైరం గురించి తెలిసిందే. అయితే కొత్త ఏడాదిలో ఈ ఇద్దరు వెండితెర మీద తలపడేందుకు రెడీ అవుతున్నట్టుగా వార్తలు వినిపించాయి. హృతిక్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సూపర్ 30, కంగనా లీడ్ రోల్లో నటించిన మణికర్ణిక సినిమాలు రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ అయ్యేందుకు రెడీ అయ్యాయి. అయితే సూపర్ 30 చిత్ర దర్శకుడు వికాస్‌పై మీటూ ఆరోపణల కారణంగా సినిమా షూటింగ్ ఆలస్యమైంది. దీంతో అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ కావటం కష్టమన్న టాక్ వినిపిస్తోంది. మణికర్ణిక నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా చివరి దశకు చేరుకోవటంతో అనుకున్నట్టుగా జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రావటం కన్ఫామ్ అయ్యింది. దీంతో భారీ చర్చకు దారి తీసిన హృతిక్, కంగనా పోటి తెర మీద చూసే అవకాశాన్ని ప్రేక్షకుల మిస్ అయినట్టే అంటున్నారు విశ్లేషకులు. -
తగిన చర్యలు తీసుకోవాలి
ప్రస్తుతం వికాస్ బాల్ దర్శకత్వంలో హృతిక్ రోషన్ హీరోగా నటించిన ‘సూపర్ 30’ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో వికాస్‌పై వచ్చిన లైంగిక దాడుల ఆరోపణలకు హృతిక్ స్పందించారు. ‘‘ఇలాంటి ఆరోపణలు ఎదురైన వారితో కలసి పని చేయడం అసాధ్యం. అయితే ఈ ఆరోపణలకన్నా ముందే మా సినిమా పూర్తయింది. నేను వేరే షూటింగ్ నిమిత్తం వేరే చోట ఉండటంతో పూర్తి స్థాయి సమాచారం నా దగ్గర లేదు. ‘సూపర్ 30’ సినిమా నిర్మాతలను నిజానిజాలేంటో నిర్ధారణ చేసుకోమని, కఠినమైన చర్యలు తీసుకోమని కోరాను. బయట వాళ్లకు తెలియకుండా కాదు అందరికీ తెలిసే వి«ధంగానే చర్యలు చేపట్టాలి. నేరం రుజువైన వాళ్లందరూ శిక్షింపబడాలి. వేధింపులకు గురైనవాళ్లందరు బయటకు వచ్చి మాట్లాడగలిగే ధైర్యాన్ని మనమివ్వాలి’’ అని హృతిక్ ట్వీట్ చేశారు. -
‘సూపర్ 30 ఆనంద్ ఓ మోసగాడు’
పట్నా : బిహార్‌కు చెందిన గణిత ఉపాధ్యాయుడు, సూపర్ 30 ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకుడు ఆనంద్ కుమార్‌కు గువాహటి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఫ్రీగా కోచింగ్ ఇస్తానంటూ ఈశాన్య భారతదేశ విద్యార్థులను ఆనంద్ కుమార్ మోసం చేశారంటూ ఐఐటీ గువాహటికి చెందిన నలుగురు విద్యార్థులు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. వీరి తరపున కోర్టుకు హాజరైన లాయర్ అశోక్ సరాఫ్ తన వాదనలు వినిపిస్తూ...‘ ఐఐటీ బాబాగా పేరొందిన ఆనంద్ కుమార్ ఫ్రీగా కోచింగ్ ఇస్తానంటూ ఈశాన్య భారతదేశ విద్యార్థులను ఆకర్షించారు. కానీ రామానుజం స్కూల్ ఆఫ్ మాథమెటిక్స్‌లో చేరిన తర్వాత వారి నుంచి 33 వేల రూపాయలు వసూలు చేశారు. అలాగే ఆయన రాంగ్ గైడెన్స్ వల్ల ఎంతో మంది ఐఐటీ ఆశావహులు చాలా నష్టపోయారని’ ఆరోపించారు. దీంతో విద్యార్థులు దాఖలు చేసిన పిల్‌పై విచారణకు హాజరు కావాలంటూ శుక్రవారం ఆనంద్ కుమార్‌కు నోటీసులు జారీ చేసింది. కాగా పట్నా కేంద్రంగా ఆనంద్ కుమార్ ‘సూపర్ 30’ కోచింగ్ సెంటర్‌ను నిర్వహిస్తున్నారు. ఈ ఇనిస్టిట్యూట్‌లో ఎటువంటి లాభం ఆశించకుండా విద్యార్థులకు శిక్షణనిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 14 ఏళ్ల కిందట కుమార్ స్థాపించిన సూపర్ 30, 2010లో తొలిసారిగా వార్తల్లో నిలిచింది. ఆ ఏడాది ఐఐటీ-జేఈఈలో కుమార్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన మొత్తం 30 మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఇది అంతర్జాతీయ మీడియాను కూడా ఆకర్షించింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో ఆనంద్ కుమార్ బయోపిక్ తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సూపర్ 30 అనే టైటిల్‌ను ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. -
హక్కుదారుడే రాజు
‘రాజు కుమారుడు రాజు అవుతాడన్నది పాత మాట. ఎవరికి హక్కు ఉంటుందో వారే రాజు అవుతాడు’ అన్నది కొత్త మాట అంటున్నారు హృతిక్ రోషన్. ఈ డైలాగ్ కొట్టింది ‘సూపర్ 30’ సినిమా కోసమే అని తెలిసే ఉంటుంది. బీహార్ లెక్కల మాంత్రికుడు ఆనంద్ కుమార్ జీవితం ఆధారంగా ‘సూపర్ 30’ తెరకెక్కుతోంది. హృతిక్‌రోషన్ టైటిల్ రోల్లో వికాస్బాలీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, సాజిద్ నడియాడ్వాలా, ఫాంటమ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం రిలీజ్ చేసింది. లెక్కల జీనియస్ ఆనంద్ కుమార్లా మారిపోయిన హృతిక్ లుక్ సూపర్ అంటున్నారు ఆయన ఫ్యాన్స్. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 25న రిలీజ్ కానుంది. -
సూపర్ 30 ఫస్ట్‌లుక్ లాంచ్
ముంబై : బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో ప్రముఖ గణిత శాస్త్రవేత్త ఆనంద్ కుమార్ బయోపిక్‌గా తెరకెక్కుతున్న సూపర్ 30 సినిమా ఫస్ట్‌లుక్ విడుదలైంది. టీచర్స్ డే సందర్భంగా బుధవారం తన ట్విటర్, ఇన్స్టాగ్రామ్ పేజీలో ఫస్ట్ లుక్ పోస్టర్‌ను హృతిక్ రోషన్ షేర్ చేశారు. ఈ పోస్టర్లో హృతిక్ గుబురుగడ్డంతో సీరియస్ లుక్‌లో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు. మ్యాథమేటిక్ ఫార్ములాతో పోస్టర్‌ను డిజైన్ చేసినట్టు కనిపిస్తుండగా పోస్టర్ కింద ‘అబ్ రాజా కా బేటా రాజా నహీ బనేగా’ అనే క్యాప్షన్ సినిమాపై ఆసక్తి రేపుతోంది. బిగ్ స్క్రీన్‌పై హృతిక్ తొలిసారిగా రియల్ లైఫ్ క్యారెక్టర్‌ను పోషిస్తుండటంతో మూవీపై అంచనాలు రెట్టింపయ్యాయి. వికాస్ భల్ దర్శకత్వంలో సాజిద్ నడియాద్వాలాకు చెందిన నడియాద్వాలా గ్రాండ్సన్ ఎంటర్టైన్మెంట్, ఫాంటమ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సూపర్ 30 వచ్చే ఏడాది జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంకా ఈ మూవీలో మృణాల్ ఠాకూర్, టీవీ నటుడు నందిష్ సింగ్ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీ కంగనా రనౌత్ మణికర్ణిక, ఇమ్రాన్ హష్మిల ఛీట్ ఇండియాలతో తలపడనుంది. -
సూపర్ 30కి మద్దతుగా తేజస్వీ యాదవ్
పట్నా : విద్యార్థుల ఫలితాల విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలు ఎదురుకొంటున్న ప్రముఖ మ్యాథ్స్ నిపుణుడు ఆనంద్ కుమార్‌కు పలువురు ప్రముఖులు బాసటగా నిలిచారు. తొలుత బీజేపీ ఎంపీ శత్రుఘ్న సిన్హా, కుమార్‌కు మద్దతుగా నిలిచారు. ‘మూక దాడులు మరో రూపం దాల్చాయి. ఈ సారి బాధితుడు మన ‘సూపర్ 30’ హిరో కుమార్. నిజమైన మ్యాథ్స్ నిపుణుడైన కుమార్ ఎంతో మందికి రోల్ మోడల్‌గా నిలిచారు. అతని సేవలు బిహార్‌కు, భారత్‌కు గర్వకారణమ’ని శత్రుఘ్న సిన్హా కొనియాడారు. తాజాగా బిహార్ ప్రతిపక్షనేత తేజస్వీ యాదవ్ కూడా ఈ ఆరోపణలను ఖండించారు. కుమార్‌ని సోమవారం అతని ఇంట్లో కలిసిన తేజస్వీ ట్విటర్లో తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ‘కుమార్ సమాజంలోని వెనుకబడిన వర్గం నుంచి వచ్చారు. ఆర్ధికంగా, సామాజికంగా వెనుకబడిన వారికి అండగా నిలిచారు. వారి మెరుగైన భవిష్యత్ కోసం పాటుపడుతూ.. తాను కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. కానీ నియంతృత భావాలు కలిగిన ఓ వర్గం అతని పేరును చెడగొట్టేలా అసత్యాలను ప్రచారం చేస్తోంది. కుమార్‌కు గౌరవ సూచికగా.. బాలీవుడ్లో అతని బయోపిక్ తెరకెక్కుతోంద’ని పేర్కొన్నారు. పట్నా కేంద్రంగా కుమార్ ‘సూపర్ 30’ కోచింగ్ సెంటర్‌ను నిర్వహిస్తున్నారు. ఈ ఇనిస్టిట్యూట్‌లో ఎటువంటి లాభం ఆశించకుండా విద్యార్థులకు శిక్షణనిస్తున్నారు. 14 ఏళ్ల కిందట కుమార్ స్థాపించిన సూపర్ 30 2010లో తొలిసారిగా వార్తలో నిలిచింది. ఆ ఏడాది ఐఐటీ-జేఈఈలో కుమార్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన మొత్తం 30 మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఇది అంతర్జాతీయ మీడియాను కూడా ఆకర్షించింది. ఇటీవల కుమార్ మాట్లాడుతూ.. ఈ ఏడాది సూపర్ 30కి చెందిన 26 మంది ఐఐటీ-జేఈఈకి అర్హత సాధించినట్టు తెలిపారు. దీనిపై అభ్యంతరం తెలిపిన సూపర్ 30కి చెందిన ఓ విద్యార్థి కుమార్ తప్పడు ప్రచారం చేసుకున్నట్టు ఆరోపించాడు. సూపర్ 30కి చెందిన ముగ్గురు విద్యార్థులు మాత్రమే ఎగ్జామ్‌లో అర్హత సాధించారని, ఇతర ఇనిస్టిట్యూట్లకు చెందిన వారిని కూడా కుమార్ ఆ జాబితాలో చేర్చాడని తెలిపాడు. కాగా కుమార్ జీవితం ఆధారంగా హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు తెలుస్తోంది. -
కంగనా వర్సెస్ హృతిక్!
స్వాతంత్య్ర సమరయోధుల్లో ఝాన్సీ లక్ష్మిభాయ్ ముఖ్యులు. ఆమె జీవితం ఆధారంగా రూపొందిన సినిమా ‘మణికర్ణిక’. ‘ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’ అనేది ట్యాగ్‌లైన్. కంగనా రనౌత్ టైటిల్ రోల్ చేశారు. క్రిష్ దర్శకత్వం వహించారు. దేశభక్తికి సంబంధించిన చిత్రం కావడంతో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం రిలీజ్ కానుందన్న వార్తలు వచ్చాయి. కానీ ‘మణికర్ణిక’ సినిమాను వచ్చే ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారన్నది తాజా ఖబర్. ఇదే రోజున హృతిక్ రోషన్ తొలిసారి నటిస్తోన్న బయోపిక్ ‘సూపర్ 30’ రిలీజ్‌కు రెడీ అవుతోంది. వికాశ్ బాల్ దర్శకత్వం వహిస్తున్నారు. బీహార్ గణిత శాస్త్రవేత్త ఆనంద్‌కుమార్ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. మరి.. ‘మణికర్ణిక, సూపర్ 30’ సినిమాలు ఒకే రోజున థియేటర్స్‌లోకి వస్తాయా? లేక ఏదో ఒక చిత్రం వాయిదా పడుతుందా అన్న విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. -
రజనీ వర్సెస్ హృతిక్!
‘2.0’ అనగానే సినీ లవర్స్ అందరూ.. ఫస్ట్ అడిగే క్వశ్చన్ మూవీ రిలీజ్ ఎప్పుడు? అని. కానీ రిలీజ్ డేట్ విషయంలో మూవీ యూనిట్ ‘అదిగో పులి ఇదిగో పులి..’ అన్న విధంగా డేట్స్ మార్చుతోంది. రజనీకాంత్, అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ ముఖ్య తారలుగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘2.0’. ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన ‘యందిరన్’ (తెలుగులో ‘రోబో’) చిత్రానికి సీక్వెల్ అయిన ‘2.0’ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. అయితే అనుకున్నట్లుగా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాలేకపోతోంది. 2015లో సెట్స్‌మీదకు వెళ్లిన ‘2.0’ చిత్రాన్ని తొలుత 2017 దీపావళికి రిలీజ్ చేద్దాం అనుకున్నారు. ఆ తర్వాత ఏవో గ్రాఫిక్స్ ప్రాబ్లమ్స్ కారణంగా 2018 జనవరి 25న మూవీ రిలీజ్ పక్కా అన్నారు. కానీ ఆ పక్కా లెక్క తప్పి ఈ ఏడాది సమ్మర్‌కి సెకండ్ రోబో రెడీ అన్నారు. అబ్బే.. ఈసారీ రెడీ కాలేదు. లేటెస్ట్గా ఈ ఏడాది దీపావళికి ‘2.0’ రిలీజ్ అన్న వార్తలు వచ్చాయి. ఇప్పుడు వాటిలో కూడా నిజం లేదని తెలుస్తోంది. వచ్చే ఏడాది రిపబ్లిక్ డేకి ‘2.0’ రిలీజ్ కానుందని కొత్త వార్తలు పుట్టుకొస్తున్నాయి. మరి.. ఈ వార్తలో నిజం ఎంతన్నది చిత్రబృందమే చెప్పాలి. ఒకవేళ ‘2.0’ చిత్రం వచ్చే ఏడాది రిపబ్లిక్ డేకి రిలీజ్ ఫిక్స్ అయితే, ఈ ఏడాది నవంబర్‌ని కాదనుకుని రిపబ్లిక్ డేకి కర్ఛీప్ వేసిన హృతిక్ రోషన్ ఏం చేస్తాడన్న విషయం ఇప్పుడు బీటౌన్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. ఎందుకంటే ఆయన తొలిసారి నటిస్తున్న బయోపిక్ ‘సూపర్ 30’ చిత్రాన్ని ఆ రోజునే రిలీజ్ చేయనున్నట్లు ఇదివరకే చిత్రబృందం అనౌన్స్ చేసింది. వికాస్ బాల్ దర్శకత్వంలో బీహార్ గణిత శాస్త్రవేత్త ఆనంద్‌కుమార్ జీవితం ఆధారంగా ‘సూపర్ 30’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. రిపబ్లిక్ వీక్‌లో గతంలో విడుదలైన హృతిక్ చిత్రాలు ‘అగ్నిపథ్, కాబిల్’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టాయి. సో... హృతిక్‌కు ఇది సెంటిమెంట్ కూడా. మరి.. బాక్సాఫీస్ వద్ద రజనీ వర్సెస్ హృతిక్ నిజమవుతుందా? తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే. -
ఆ సినిమా కోసం సన్నబడ్డ హృతిక్
ముంబై : సినిమాలో తన పాత్రకు తగ్గట్టు శరీరాకృతిని మలుచుకునే కొద్దిమంది భారతీయ నటుల్లో బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ రోషన్ ఒకరు. 2012లో వచ్చిన అగ్నిపత్ సినిమా కోసం దాదాపు 30కిలోల బరువు పెరిగారాయన. ఆ తర్వాత వచ్చిన క్రిష్3, బ్యాంగ్ బ్యాంగ్ చిత్రాల్లో ఆయా పాత్రలకు అనుగుణంగా మారిపోయారు. హృతిక్ కొత్త సినిమా సూపర్30 సినిమాకు సంబంధించిన ఫోటో ఒకటి ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. ఆయన సూపర్30 సినిమా సెట్లో దిగిన ఈ ఫోటోలో పూర్తిగా సన్నబడిన లుక్‌లో యుక్త వయస్కుడిలా కనిపిస్తున్నారు. గణిత ఉపాధ్యాయుడి నిజ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బిహార్‌కు చెందిన మ్యాథ్స్ టీచర్ ఆనంద్ కుమార్ పాత్రలో హృతిక్ కనిపించనున్నారు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు వికాస్ బాహ్లా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది వరకే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని స్టిల్స్ లీకై సోషల్‌మీడియాలో వైరలైన విషయం తెలిసిందే. ఈ సినిమాలో పూర్తిగా డీగ్లామర్ పాత్రలో కనిపించనున్నారు హృతిక్. 2019 జనవరిలో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు దర్శకనిర్మాతలు. -
క్రిష్-4: తండ్రితో హృతిక్ విభేదాలు!
హృతిక్ రోషన్ హీరోగా నటించిన 'క్రిష్'కి అభిమానులు కాని వారుండరు. 2006లో వచ్చిన ఆ చిత్రం హిందీలోనే కాదు.. తెలుగులోనూ అనువాద రూపంలో మంచి విజయం సాధించింది. తరువాత వచ్చిన 'క్రిష్ 3' (2013) కూడా మంచి విజయమే సాధించింది. ఇప్పుడు ఈ సిరీస్‌లో నాలుగో భాగం వస్తున్న విషయం తెలిసిందే. అయితే గత చిత్రాల కంటే భారీగా ‘క్రిష్ 4′ ను రూపొందించాలన్నది హృతిక్ ఆలోచిస్తున్నాడట. యాక్షన్ సన్నివేశాలు, గ్రాఫిక్స్ భారీ ఎత్తున ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాకి సంబంధించిన విషయాల్లో తండ్రి రాకేశ్ రోషన్ సలహాను హృతిక్ పాటించడం లేదట. ఈ సినిమాకి సంబంధించి హృతిక్‌కి కొన్ని ఆలోచనలు ఉన్నాయట. ఏఏ ఆర్టిస్టులను తీసుకోవాలి. ఎలాంటి గ్రాఫిక్స్‌ను వాడాలని అనే విషయాలను హృతిక్యే చూసుకుంటున్నాడట. ఎలాంటి విజువల్ ఎఫెక్ట్ సినిమాలో పెట్టాలనే అంశాన్ని కూడా అతనే చూసుకుంటున్నాడట. తండ్రి రాకేశ్ రోషన్ కంటే హృతిక్ కే నేటితరం ప్రేక్షకులపై మంచి అవగాహన ఉంది. ఎలాంటి గ్రాఫిక్స్ సన్నివేశాలయితే ప్రేక్షకులకు నచ్చుతాయో హృతిక్ బాగా తెలుసు. అందుకే సినిమా సంబంధించిన విషయాల్లో తండ్రి మాట వినడం లేదని బాలీవుడ్ సర్కిల్లో వినిపిస్తోంది. ఏదేమైనా భారీ హంగులతో 2020లో క్రిష్-4 సినిమాను విడుదల చేయాలని తండ్రీ-కొడుకులు ఆరాటపడుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం హృతిక్ రోషన్ ‘సూపర్ 30’ సినిమాలో నటిస్తున్నారు. ప్రముఖ గణిత శాస్త్రజ్ఞుడు, ఉపాధ్యాయుడు ఆనంద్ కుమార్ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రమిది. -
‘ఆ పాత్రకు ఆయనే న్యాయం చేయగలడు’
బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ రోషన్ నటిస్తున్న తాజా చిత్రం ‘సూపర్30’. గణిత ఉపాధ్యాయుడి నిజ జీవిత ఆధారంగా తెరకెక్కుతోంది ఈ చిత్రం. బీహార్‌లోని ఆనంద్ కుమార్ అనే మ్యాథ్స్ టీచర్ తన విద్యార్థులకు ఐఐటీ దిశగా శిక్షణనిచ్చేవాడు. ఆయన విద్యార్థులందరూ ఐఐటీలోనే చదువుతున్నారు. అయితే అంతటి మేధావి ఆ స్థాయికి చేరుకున్న ప్రయాణాన్ని సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై ఆనంద్‌కుమార్ మాట్లాడుతూ...‘ఎనిమిదేళ్ల క్రితం రచయిత సంజీవ్ దత్తా నా వద్దకు వచ్చాడు. సూపర్ 30 పేరుతో మీ గురించి సినిమా తీయాలనుకుంటున్నాను అని చెప్పాడు. హృతిక్ నా పాత్రను పోషించడం చాలా ఆనందంగా ఉంది. తనను నేను కలిసాను. నా పాత్రకోసం తను పడే కష్టాన్ని చూశాను. నేను క్లాస్‌రూంలో చెప్పిన వీడియోలను చూస్తున్నాడు. నా పాత్రపై పట్టు సాధించేందుకు చాలా శ్రమిస్తున్నాడు. హృతిక్ నా పాత్రను చాలా బాగా చేస్తున్నాడు. ఈ పాత్రకు ఆయనే న్యాయం చేయగలడు’ అని తెలిపాడు. వచ్చే ఏడాది జనవరి 25న సూపర్30 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. -
అప్పడాలమ్మా.. అప్పడాలు!
కావాలనుకుంటే కాళ్ల ముందుకొచ్చి ఆగుతాయి కార్లు. అనుకుంటే అకాశయానం ఈజీ. ఫిక్స్ అయితే చార్టెడ్ ఫ్లైట్‌లో సింగిల్‌గా ఫ్లై అవ్వగలడు. కానీ.. గల్లీ గల్లీ తిరిగి అప్పడాలు అమ్ముతున్నారు హృతిక్ రోషన్. డబ్బులు కోసం ఎండను కూడా లెక్క చేయకుండా చెప్పులరిగేలా సైకిల్ సవారీ చేస్తున్నారు బస్‌స్టాండ్‌లో. అతనికెందుకంత కష్టం? అంటే కాదు ఇష్టం. యాక్టింగ్ అంటే ప్యాషన్. బిహారీ గణిత శాస్త్రవేత్త ఆనంద్‌కుమార్ జీవితం ఆధారంగా హిందీలో దర్శకుడు వికాశ్ బాల్ రూపొందిస్తున్న చిత్రం ‘సూపర్ 30’. ఆనంద్‌కుమార్ పాత్రలో హృతిక్ రోషన్ నటిస్తున్నారు. నిజజీవితంలో ఆనంద్‌కుమార్ ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి అప్పడాలు అమ్మారు. ఆ సన్నివేశాలనే చిత్రీకరిస్తున్నారు. ఇప్పుడు అర్థమైంది కదా. హృతిక్ అప్పడాలు అమ్మింది సినిమా కోసమని. ఆరడగుల అందగాడు హృతిక్ రోషన్ ఫొటోలో చూస్తున్నట్లుగా సిల్వర్ స్క్రీన్‌పై కనిపించడం ఇదే తొలిసారి. గోల్డెన్ స్పూన్‌తో పుట్టిన హృతిక్ రియల్ లైఫ్‌లో కూడా ఇలా కనిపించలేదు. సో.. ఈ గెటప్‌లో ఆకట్టుకోవడంతో పాటు నటనతో మెస్మరైజ్ చేస్తారని ఊహించవచ్చు. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 25న విడుదల చేయాలనుకుంటున్నారు. -
అప్పడాలు అమ్ముకుంటున్న హీరో?
జైపూర్ : నగరాల్లోని బస్టాప్‌ల్లో, కూడళ్లలో అప్పడాలు, పిండివంటలు అమ్ముకుంటూ చాలామంది కనిపిస్తారు. వారిని చాలామంది పట్టించుకోరు. అవసరముంటే వారి వద్దకు వెళ్లి కొంటారు. అంతే.. కానీ జైపూర్‌లో ఇలా అప్పడాలు అమ్మిన ఓ వ్యక్తి ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఎవరూ గుర్తుపట్టలేనంతగా మారిపోయి.. పాత్రలో ఒదిగిపోయిన అతని ఫొటోలు చూసి నెటిజన్లు విస్మయపోతున్నారు. ఇంతకు ఆ వ్యక్తి ఎవరంటే.. బాలీవుడ్ గ్రీకుదేవుడు హృతిక్ రోషన్. ఆయన తాజాగా నటిస్తున్న సినిమా ‘సూపర్ 30’.. బిహార్‌కు చెందిన ప్రముఖ గణిత ఉపాధ్యాయుడు ఆనంద్‌కుమార్ జీవిత చరిత్ర ఆధారంగా వికాస్ బల్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్లో భాగంగా హృతిక్ ఇలా ఎవరూ గుర్తుపట్టనంతగా మారిపోయి.. జైపూర్‌లోని కూడళ్లలో సైకిల్ మీద అప్పడాల బుట్ట పెట్టుకొని.. వీధి, వీధి తిరిగి అమ్మాడు. సైకిల్ మీద అప్పడాలు అమ్ముతూ అతను వీధుల్లో తిరిగినా ఎవరూ గుర్తుపట్టలేదు. తాజాగా సోషల్ మీడియాలో లీకైన ఈ ఫొటోలు హల్చల్ చేస్తున్నాయి. పాత్రలోకి సంపూర్ణంగా లీనమై నటించడంలో హృతిక్‌కు హృతికే సాటి అంటూ అభిమానులు కొనియాడుతున్నారు. -
సూపర్ 100
వారణాసి వెళ్లారు హృతిక్ రోషన్. వారం రోజులు అక్కడే ఉంటారట. పర్సనల్ లైఫ్ కోసం కాదు. ప్రొఫెషనల్ లైఫ్ కోసం. బీహార్ గణిత శాస్త్రవేత్త, సూపర్ 30 వ్యవస్థాపకుడు ఆనంద్‌కుమార్ జీవితం ఆధారంగా విశాల్ బాల్ దర్శకత్వంలో హృతిక్ రోషన్ హీరోగా రూపొందుతున్న సినిమా ‘సూపర్ 30’. గత నెల 22న ఆరంభమైన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వారణాసిలో జరుగుతోంది. ఇందులో హృతిక్ రోషన్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ లుక్‌కి మంచి స్పందన లభిస్తోంది. సినిమా టైటిల్‌ని మార్చి సూపర్ 100 అని లుక్‌ని హృతిక్ అభిమానులు ప్రశంసిస్తున్నారు. బీహార్, పాట్నా బ్యాక్‌డ్రాప్ సీన్స్‌ని అక్కడ తీయడంతో పాటు ముంబైలో తయారు చేయించనున్న బీహార్, పాట్నా సెట్స్‌లోనూ తీయాలనుకుంటున్నారట. మే కల్లా ఈ చిత్రాన్ని కంప్లీట్ చేసి, తన ఇద్దరు కుమారులతో హాలిడేస్‌ను ఎంజాయ్ చేయడానికి ప్లాన్ చేశారట హృతిక్. ఈ ట్రిప్ తర్వాతనే సిద్ధార్ధ్ ఆనంద్ దర్శకత్వంలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్, వాణీ కపూర్ ముఖ్య తారలుగా రూపొందనున్న సినిమా షూటింగ్ మొదలవుతుందని బీటౌన్ టాక్. ‘సూపర్ 30’ని వచ్చే ఏడాది జవనరి 25న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్ హీరోయిన్గా నటించనున్నారట. -
క్లాస్‌కి వేళాయెరా
బుక్స్ ముందు పెట్టుకుని మ్యాథ్స్ థియరమ్స్తో కుస్తీ పడుతున్నాడు బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్. అంతలోనే బెల్ మోగింది. ఇంకేముంది? చేతికున్న గడియారంవైపు ఓ లుక్కేసి క్లాస్‌కి బయలుదేరాడు. బీహార్ గణిత శాస్త్రజ్ఞుడు ఆనంద్‌కుమార్ బయోపిక్ ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘సూపర్ 30’. విశాల్బాల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హృతిక్ రోషన్ టైటిల్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణను సోమవారం స్టార్ట్ చేశారు. ‘‘పవిత్రమైన వసంత పంచమి రోజున సరస్వతి పూజతో ‘సూపర్ 30’ సినిమా జర్నీని స్టార్ట్ చేశాం. మొదటిసారిగా టీచర్ పాత్ర చేస్తున్నాను. నేను చేస్తున్న ఈ ప్రయత్నానికి ఆ దేవత ఆశీర్వాదాలు ఉంటాయని ఆశిస్తున్నాను’’ అని హృతిక్ రోషన్ పేర్కొన్నారు. ఈ ఏడాది నవంబర్‌లో చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
సూపర్ 30 అరుదైన రికార్డు
- ఐఐటీ జేఈఈ ఫలితాల్లో మరోసారి హవా - శిక్షణ పొందిన అందరూ అర్హతసాధించారు పట్నా: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్(ఐఐటీ-జేఈఈ) అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాల్లో సూపర్ 30 సంస్థ మరోసారి సాహో అనిపించింది. బిహార్‌లోని పట్నా కేంద్రంగా నడిచే ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందిన 30 మంది విద్యార్థుల్లో నూటికి నూరుశాతం మంది జేఈఈ అర్హత సాధించి అరుదైన రికార్డు సృష్టించారు. వీరంతా అట్టడుగు వర్గాలకు చెందిన వారే కావడం గమనార్హం. సరైన అవకాశాలు కల్పిస్తే పేద కుటుంబాల పిల్లలు కూడా ఐఐటీలలో సీట్లు సాధించగలరని మరోసారి నిరూపితమైందని అన్నారు సూపర్ 30 వ్యవస్థాపకుడు ఆనంద్ కుమార్. 2002లో ప్రారంభించిన సూపర్ 30 విద్యా సంస్థ ద్వారా ఏటా 30 మంది పేద విద్యార్థులను ఎంపిక చేసి వారికి ఉచితంగా ఐఐటీ-జేఈఈ కోచింగ్‌తోపాటు భోజన, వసతి సౌకర్యాలను కల్పిస్తున్నారు. ఏయేటికాయేడు అత్యుత్తమ ఫలితాలు సాధిస్తోన్న సూపర్30ని ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ ‘ద బెస్ట్ ఆఫ్ ఆసియా 2010’ జాబితాలో పొందుపర్చడం తలిసిందే. గతేడాది 30 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వగా 28 మంది జేఈఈలో అర్హత సాధించారు. సీట్ల సంఖ్య పెంచుతాం: ఆనంద్‌కుమార్ ఆదివారం ఐఐటీ-జేఈఈ ఫలితాలు వెల్లడైన అనంతరం ఆనంద్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ‘సరైన సహకారం అందిస్తే పేద, అణగారిన వర్గాలకు చెందిన పిల్లలు సైతం అద్భుతాలు సృష్టించగలని సూపర్ 30 ద్వారా ఎన్నో ఏళ్లుగా నిరూపిస్తున్నాం. అలాంటి మట్టిలోమాణిక్యాలు ఇంకా ఎందరో ఉన్నారు. అలాంటి వాళ్ల కోసమే సీట్ల సంఖ్య పెంచాలనే నిర్ణయానికి వచ్చాం. తద్వారా ఇప్పటికంటే మరింత మందికి సేవలు అందించినట్లవుతుంది’ అని ఆనంద్ కుమార్ చెప్పారు. -
సూపర్ 30
హీరో హృతిక్ రోషన్ 30 మంది మెరికల్లాంటి పేద విద్యార్థుల కోసం గాలిస్తున్నారట. వాళ్లందర్నీ ఐఐటీ సంస్థల్లో జాయిన్ చేయాలనుకుంటున్నారట. అందుకు వారందరూ రాయబోయే ఎంట్రన్స్ ఎగ్జామ్‌కు తానే గైడ్‌గా ఉండాలని డిసైడ్ అయ్యారని బాలీవుడ్ సమాచారం. కానీ, ఇదంతా రియల్ లైఫ్‌లో అనుకుంటే పొరపాటే. ఎందుకంటే హృతిక్ ఇదంతా చేయబోయేది రీల్ లైఫ్‌లో. మ్యాటర్ ఏంటంటే ప్రముఖ మేథమ్యాటిషియన్ ఆనంద్‌కుమార్ బయోపిక్‌లో హృతిక్ నటించబోతున్నారని బాలీవుడ్ టాక్. ఈ సినిమాకు ‘సూపర్ 30’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారట. ‘క్వీన్’, ‘షాందార్’ వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వికాస్ బాల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. 2002లో బీహార్‌లోని పాట్నాలో ‘సూపర్ 30’ ప్రోగ్రామ్‌ను స్టార్ట్ చేసిన ఆనంద్‌కుమార్ ఎందరో పేద విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్పి, వాళ్లందరూ ఇండియాలోని ప్రముఖ ఐఐటీ సంస్థల్లో అడ్మిషన్ పొందేలా కృషి చేశారు. -
సూపర్30 విజయగాథపై పుస్తకం
భోపాల్ : బడుగు, బలహీన వర్గాలకు చెందిన ఎంతో మంది ప్రతిభావంతులైన విద్యార్థులను ఐఐటీయన్లుగా తీర్చిదిద్దుతున్న పట్నాలోని ‘సూపర్30’ ఇన్స్టిట్యూట్ విజయగాథ త్వరలో పుస్తకరూపం దాల్చనుంది. గణితవేత్త ఆనంద్‌కుమార్ స్థాపించిన ఈ సంస్థ గురించి కెనడాకు చెందిన సైకియాట్రిస్ట్ డాక్టర్ బిజు మాథ్యూ ఓ పుస్తకం రాయనున్నారు. గ్లోబల్ మెయిల్ న్యూస్పేపర్లో ప్రచురితమైన ఆర్టికల్ ద్వారా సూపర్30 సంస్థ గురించి తెలుసుకున్నానని సైకియాట్రిస్ట్ సదస్సులో పాల్గొనడానికి వచ్చిన మాథ్యూ తెలిపారు. ఆనంద్‌కుమార్ సంకల్పాన్ని చూసిన తర్వాత సూపర్30పై ’రామానుజన్ స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్’ పేరుతో ఓ పుస్తకాన్ని రాయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. -
సూపర్ 30పై విదేశీ సినిమా
పాట్నా: సూపర్-30 ఈ పేరు మీరు వినే వింటారుగా.. ఈ మధ్యకాలంలో చాలాసార్లు విశిష్ఠ స్థానంతో వార్తల్లోకి వచ్చిన పేరిది. బీహార్‌లో ఆనంద్ కుమార్ నిర్వహిస్తున్న ఐఐటీ-జేఈఈ కోచింగ్ ఇన్స్టిట్యూటే సూపర్-30. నిరుపేదలైన విద్యార్థులకు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా కోచింగ్నిచ్చి ఖరగ్‌పూర్ వంటి దేశంలోనే ప్రముఖ ఐఐటీలకు పేదరికంలో ఉన్న మేధావులను తరలించే సంస్థ. ఈ సంస్థ నిర్వహిస్తున్న గొప్పపనులకు ముగ్దుడైపోయి.. పాస్కల్ ప్లిస్సన్ అనే ఓ ప్రెంచి డైరెక్టర్ ఏకంగా 'ది బిగ్ డే' అనే చిత్రం తీశాడు. మొత్తం 90 నిమిషాలతో దీనిని రూపొందించాడు. ఇప్పటికే ఈ చిత్రం తాలుకు ఫొటోలు, వీడియో క్లిప్పులు పలు టీవీల్లో, యూట్యూబ్‌లో కూడా కనువిందుచేస్తున్నాయి. ఈ చిత్రాన్ని వచ్చే నెలలో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ చిత్రంలో ప్రపంచంలోని నాలుగు ప్రత్యేక కథలు ఇమిడి ఉన్నాయి. ఇందులో ఒక కథ సూపర్ 30లో కోచింగ్ తీసుకొని ప్రస్తుతం ధన్‌బాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్‌లో విద్యనభ్యసిస్తున్న నిధిజా అనే అమ్మాయిది. ఆమె 2014లో జేఈఈ సాధించింది. ఇప్పుడు నిదిజాను, సూపర్ 30 వ్యవస్థాపకుడు ఆనంద్‌కుమార్‌ను, ఆమె తల్లిదండ్రులను ఫ్రాన్స్‌లో జరిగే చిత్రానికి సంబంధించిన ఓ కార్యక్రమానికి హాజరుకావల్సిందిగా డైరెక్టర్ పాస్కల్ ఆహ్వానించాడు. ఈ సందర్భంగా ఆనంద్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ చిత్రాన్ని బీహార్‌లో షూటింగ్ చేస్తుంటే గతంలో చూశానని, ఇప్పుడు విడుదల కానుండటంతో ఆశ్చర్యంగా ఉందని చెప్పారు. నిధి చాలా కష్టపడి పైకొచ్చిన అమ్మాయి అని, అలాంటి అమ్మాయి కథ కూడా ఇందులో ఉండటం గర్వించదగిన విషయమని తెలిపారు. కష్టాలు, కన్నీళ్ల మధ్య ఉన్న నలుగురు చిన్నారులు స్వయం కృషితో ఎలా విజయం సాధించారనేదే 'ది బిగ్ డే' అని తెలిపారు. -
'గెలిచాం.. కానీ అసలైన సాయం ఇప్పుడు కావాలి'
పాట్నా: డబ్బు ఉన్నవాళ్లకు చదువుండదు.. చదువొచ్చేవాళ్లకు డబ్బుండదు అనేది ఒక నానుడి. అయితే, డబ్బున్నవాడు అది అయిపోవడంతో ఆగిపోతాడేమోగానీ.. చదువున్నవాడు మాత్రం డబ్బు హెచ్చుతగ్గలవల్ల ఆగిపోడూ.. ఓ ప్రవాహంలా ముందుకు వెళుతూనే ఉంటాడు. అందుకోసం అనువైన మార్గాలు శోధిస్తాడు. సిగ్గు, బిడియం అనేది దరిచేరనీయరు.. ఎందుకంటే వారి లక్ష్యం ముందు ఇవన్నీ పూచిక పుల్లలు. బీహార్‌లోని మ్యాథమేటిషియన్ అనంద్ కుమార్ ప్రతి ఏటా దాదాపు 30 మంది నిరుపేద పిల్లలకు రూపాయి తీసుకోకుండా ఐఐటీ కోచింగ్ ఇస్తున్నారు. కోచింగ్ తీసుకున్న వారంతా ఫలితాల్లో మెరుస్తున్నారు. అయితే, ఫలితాల్లో తమను విజయం వరిస్తుందన్న సంతోషం కన్నా.. ఫలితాల అనంతరం కౌన్సెలింగ్ ఉంటుంది.. అందుకు భారీ స్థాయిలో ఫీజులు కట్టాల్సి ఉంటుంది. అసలే రెక్కాడితే డొక్కాడని తమ తల్లిదండ్రులు అంతమొత్తం ఎలా ఇవ్వాగలరనే ఆందోళన బాగా వేదిస్తోంది. దీంతో ఎలాగైన తమ కలను నెరవేర్చుకోవాలని, దేశంలోని విశిష్ట ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదవాలని ఆశపడుతున్నారు. దీంతో వారు తమ పరిస్థితిని ఏమాత్రం తడుముకోకుండా వివరిస్తూ మాకు సాయం చేయండి అంటూ వేడుకుంటున్నారు. ఇలాసాయం కోరుతున్న వారిలో కొందరిని ఉదాహరణగా తీసుకుంటే.. దనంజయ్ కుమార్ (18) అనే విద్యార్థి సూపర్ కంప్యూటర్ 30లో శిక్షణ తీసుకొని ఐఐటీ ర్యాంకు సాధించాడు. అతడు ఇప్పుడు ఖరగ్‌పూర్ ఐఐటీ కౌన్సెలింగ్‌కు హాజరు కావాలంటే కనీసం 45 వేలు ఫీజు కట్టాలి. పోనీ బ్యాంకులను అడుగుదామా అంటే ప్రవేశం పత్రాన్ని తీసుకొచ్చాకే బ్యాంకులు లోన్ ఇస్తాయి. తన తండ్రి నెలకు సంపాధించేది కేవలం మూడువేల రూపాయలు. కానీ ఇంట్లో ఉంది మాత్రం ఎనిమిది మంది. వీటితో వారందరిని పోషించడమే కష్టం. అలాంటిది 45 వేలు కౌన్సెలింగ్ ఫీజు చెల్లించడమంటే సాధారణమైన విషయం కాదు. ఈ నేపథ్యంలో ధనంజయ్ కుమార్ తనను ఆదుకొని తన కల నెరవేర్చరూ అంటూ వేడుకుంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల మధ్యే మాదేపూర్ నుంచి సుజిత్ కుమార్, నలందా నుంచి ప్రేమ్ పాల్, ససరాం నుంచి శరవణ్ అనే విద్యార్థులంతా తమకు ఆర్థిక సాయం చేసి విద్యను కొనసాగించేలా ఆదుకోండంటూ కోరుతున్నారు.