Super 30 Heroine Mrunala Tjakur About Her Boyfriend and Break Up - Sakshi
Sakshi News home page

Mrunal Thakur: నేను ఆ టైప్‌ కాదు, నటినని నా బాయ్‌ఫ్రెండ్‌ వదిలేశాడు

Feb 13 2022 5:16 PM | Updated on Feb 13 2022 7:22 PM

Super 30 Heroine Mrunala Tjakur About Her Boyfriend And Break Up - Sakshi

ప్రముఖ బుల్లితెర నటి మృణాల్‌ ఠాకూర్‌ సూపర్‌ 30 సినిమాతో హీరోయిన్‌గా మారింది. తొలి సినిమాతోనే ఏకంగా బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌ సరసన నటించే చాన్స్‌ కొట్టేసింది. సూపర్‌ 30 మంచి విజయం సాధించడంతో ఆమె వరస అవకాశాలు అందుకుంటోంది. ఈ క్రమంలో ఆమె హందీ జెర్సీలో కథానాయికగా నటించింది. తెలుగు హీరో నాని జెర్సీ రిమేక్‌ ఇది. ఇందులో షాహిద్‌ కపూర్‌ హీరో. ఇదిలా ఉంటే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు రెడీ అవుతోంది. ఈ క్రమంలో హీరోయిన్‌ మృణాల్‌ మూవీ ప్రమోషన్లో భాగంగా ఇంటర్య్వూలతో బిజీగా ఉంది.

చదవండి: నాన్న పీస్‌ డేని చెడగొట్టే మిషన్‌లో బిజీ, సితార పోస్ట్‌ వైరల్‌

తాజాగా ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆమె మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. తన వ్యక్తిగత విషయాలను పంచుకుంది. ‘చిన్న వయసులోనే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. మానసిక ఒత్తికి గురయ్యా. ఒకానోక సందర్భాల్లో చచ్చిపోవాలనే ఆలోచనలు కూడా నన్ను వెంటాడేవి’ అంటూ చెప్పుకొచ్చింది. తన ప్రేమ, బ్రేకప్‌పై ఆమె స్పందించింది. ‘పెళ్లి, పిల్లలు కాకుండా నాకు ఏదైనా కొత్తగా చేయాలనే తపన ఉండేది. కెరీర్‌ పరంగా ఉన్నత స్థాయిలో ఉండాలనేది నా కోరిక. ఈ క్రమంలో నాకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నాను. ఇప్పుడిలా నటిగా మీ ముంద్దు నిలిచాను.

చదవండి: రవితేజపై ఖిలాడి డైరెక్టర్‌ రమేశ్‌ వర్మ భార్య షాకింగ్‌ కామెంట్స్‌, ఈ వివాదం మరింత ముదరనుందా?

గ్లామర్‌ ఫీల్డ్‌ నా ఆలోచనలకు సరిపోతాయనే నటనను ఎంచుకుని ముందుకు నడిచాను. ఇప్పుడు నటిగా మీ అందరి అభిమానాన్ని పొందుతున్’ అని చెపపింది. అయితే ‘ఇదే.. ఫీల్డ్‌ నా బ్రేకప్‌కు కారణమైంది. 7 నెలల క్రితం నా బాయ్‌ఫ్రెండ్‌ వదిలేశాడు. దానికి కారణంగా నాకు షాకింగ్‌గా అనిపించింది. నటిననే కారణంగానే అతడు నన్ను వదిలేసి పారిపోయాడు’ అని చెప్పింది. ఎందుకంటే ‘నేను ప్రమించే వ్యక్తి సంప్రదాయా కుటుంబానికి చెందినవాడు. పద్దతులు, కట్లుబాట్లను బాగా ఫాలోతాడు. కొన్నాళ్లుగా ఒకరినినొకరం ప్రమించుకున్నాం. కానీ నేను ఉన్న ఫీల్డ్‌ నచ్చలేదని అతడు నన్ను వదిలేసి వెళ్లిపోయాడు. కానీ అతనిపై నాకేం కోపం లేదు. ఎందుకంటే మేమిద్దరం సర్ది చెప్పుకొని రిలేషన్‌లో ముందుకు వెళ్లినా పెళ్లి తర్వాత తరచూ మా మనస్పర్థలు రావోచ్చు’ అని పేర్కొంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement