'అందంగా లేవు.. లావు తగ్గాలన్నారు'.. మృణాల్‌పై బాడీషేమింగ్ కామెంట్స్! | Mrunal Thakur Reveals Photographer Once Called Her Village Girl, Opens Up About Body Shaming - Sakshi
Sakshi News home page

Mrunal Thakur: 'ఈ పల్లెటూరు అమ్మాయి ఎవరు?'.. దారుణంగా కామెంట్స్ చేశారన్న మృణాల్!

Feb 9 2024 7:39 PM | Updated on Feb 9 2024 8:36 PM

Mrunal Thakur Reveals Photographer Once Called Her Village Girl - Sakshi

సీతారామం సినిమాతో క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ  మృణాల్‌ ఠాకూర్‌. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్‌ నటిస్తోంది. బుల్లితెర నుంచి వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ మొదట మరాఠీ చిత్రాల్లో నటించింది, ఆ తర్వాత హిందీ చిత్రాల్లో నటించింది. అక్కడ పెద్దగా ఆకట్టుకోలేకపోయినా టాలీవుడ్‌ సీతారామం చిత్రం ద్వారానే ఫేమ్ వచ్చింది. ఆ చిత్రం సక్సెస్‌ మృణాల్‌ ఠాగూర్‌ను ఒక్కసారిగా మార్చేసింది. ఇటీవల నాని సరసన నటించిన 'హాయ్‌ నాన్న' చిత్రం హిట్‌ కూడా ఈమె ఖాతాలో పడింది. అయితే తాజాగా ఓ  ఇంటర్వ్యూకు హాజరైన మృణాల్ ఇండస్ట్రీలో ఎదుర్కొన్న ఇబ్బందులను పంచుకుంది. తాను బాడీ షేమింగ్‌కు గురయ్యానని వెల్లడించింది. ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం. 

అయితే ముఖ్యంగా బాలీవుడ్‌ చిత్రాల్లో నటించే రోజుల్లో ఇబ్బందులకు గురైనట్లు తెలిపింది. నాకు నటించేందుకు అవకాశాలు ఇచ్చినప్పటికీ.. మరొకరితో పోలుస్తూ మీరు వారిలా చేయలేదంటూ కామెంట్స్ చేశారని పేర్కొంది. అందుకే నేను అక్కడే స్థిరపడాలని అనుకోలేదని చెప్పుకొచ్చింది.  అంతేకాదు.. తాను తల్లి, సోదరి లాంటి పాత్రలు చేసేందుకు కూడా భయం లేదని తెలిపింది. 

గతంలో ఓ ఈవెంట్‌లో పాల్గొన్నప్పుడు తన బాడీని ఉద్దేశించి కామెంట్స్ చేశారని మృణాల్ ఠాకూర్ తెలిపింది. 'మీరు అస్సలు సెక్సీగా లేరు' అని అన్నారని వెల్లడించింది. మీరు చేసిన పాత్ర సెక్సీగా ఉందని.. కానీ మీరు ఆ పాత్రకు అంత దగ్గరగా కనిపించలేదని దారుణంగా మాట్లాడారని పేర్కొంది. ఓ ఫోటోగ్రాఫర్ నా పాత్రను చూడకుండానే కామెంట్ చేశాడు. మరాఠీలో మాట్లాడుతూ.. ఈ పల్లెటూరి అమ్మాయి ఎవరు? అని కామెంట్ చేశాడని తెలిపింది. కానీ ఆ తర్వాత అతను నాకు క్షమాపణ చెప్పాడని వివరించింది.  

నేను ఏదైనా ప్రాజెక్ట్‌లో నటించే సమయంలో తనలాగే ఉండేందుకు ఇష్టపడతానని మృణాల్ తెలిపింది. అప్పుడే ఆ పాత్రను సులభంగా చేయగలనని వెల్లడించింది. ఓ సాంగ్ చేసినప్పుడు కొందరు ఏకంగా తనను బరువు తగ్గమని కూడా సలహా ఇచ్చారని పేర్కొంది. దీనికి బదులిస్తూ నా శరీర బరువుతో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు.. మీరు ఎందుకు ఫీలవుతున్నారు? కాస్తా గట్టిగానే ఇచ్చిపడేశానని వివరించింది. ఈ విధంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో బాడీ షేమింగ్‌కు గురైన అనుభవాలను సీతారామం బ్యూటీ పంచుకుంది. 

ఇక సినిమాల విషయాకొనిస్తే గతేడాది నాని సరసన హాయ్ నాన్నతో హిట్ కొట్టింది. కొత్త ఏడాదిలో విజయ్ దేవరకొండతో కలిసి ఫ్యామిలీ స్టార్‌ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.  గతేడాది  సౌత్‌తో పాటు బాలీవుడ్‌లో జెర్సీ, పిప్పా వంటి చిత్రాలలో మృణాల్ ఠాకూర్ నటించిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఏఆర్‌ మురుగదాస్‌ శివకార్తికేయన్‌ హీరోగా నటించనున్న ఈ చిత్రంలో మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా నటించనున్నట్లు చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీంతో పాటు ప్రముఖ టాలీవుడ్‌ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్‌ నిర్మించనున్న చిత్రంలో కూడా మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా నటించే విషయంపై చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement