ఇషాన్ ఖట్టర్, మృణాల్ ఠాకూర్, ప్రియాంన్షు పైనూలి, సోనీ రజ్దానా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం పిప్పా. ఈ చిత్రాన్ని రాజా కృష్ణమేనన్ దర్శకత్వంలో తెరకెక్కించారు. రోన్ని స్క్రూవాలా, సిద్ధార్థ్‌రాయ్‌కపూర్ ఈ సినిమాను నిర్మించారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందించిన ఈ చిత్రం.. నవంబర్ 10న అమెజాన్ ప్రైమ్ వేదికగా రిలీజైంది.
(ఇది చదవండి: అలాంటి పాత్రల్లో నటించను.. అదే నా కోరిక : మృణాల్ ఠాకూర్)
ఈ దీపావళికి ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజైన సినిమా ఇదే కావడం విశేషం. ఓటీటీలో అలరిస్తోన్న ఈ మూవీ ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ దక్కించుకుంది. అమెజాన్ ప్రైమ్‌లో ఇండియావ్యాప్తంగా నంబర్‌వన్ ప్లేస్‌లో కొనసాగుతోంది. అంతే కాకుండా రజినీకాంత్ జైలర్ మూవీని వెనక్కి నెట్టింది.
పిప్పా అసలు కథేంటంటే..
ఇషాన్ ఖట్టర్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం యుద్ధం నేపథ్యంలో తెరకెక్కించారు. బంగ్లాదేశ్‌ను ఆక్రమించుకుని ఈస్ట్ పాకిస్తాన్ చేయాలనుకున్న పాక్ దురుద్దేశాన్ని భారతసైన్యం అడ్డుకుంటుంది. అదే సమయంలో బంగ్లాదేశ్‌లో పాకిస్తాన్ చేసిన దారుణాలను తెరపై చక్కగా చూపించారు. బంగ్లా విముక్తి కోసం ఉద్యమించిన వారితో పాటు సామాన్యులను సైతం అతి దారుణంగా హత్య చేసి, మహిళలు, పిల్లలను బందీలుగా చేసుకుంటూ ఉంటుంది పాకిస్తాన్. మరోవైపు ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే ఉన్నా.. మానవత్వంతో ఆలోచించి బంగ్లా నుంచి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వచ్చిన లక్షల మంది శరణార్థులకు భారత్ ఆశ్రయం కల్పిస్తుంది. ఇది సహించలేని పాకిస్థాన్ భారత్‌పై పలుచోట్ల బాంబు దాడులు చేస్తుంది. పాకిస్తాన్ సైన్యం దారుణాల నుంచి భారత ఆర్మీ ఎలా రక్షించిందనే విషయాన్ని వెండితెరపై చక్కగా ఆవిష్కరించారు.
(ఇది చదవండి: చిల్డ్రన్స్ డే స్పెషల్.. ఓటీటీలో పిల్లలకు ఇష్టమైన చిత్రాలు!)
Congrats team Pippa ..Happy Diwali everyone🌼 @roykapurfilms @RajaMenon #MrunalThakur @IshaanKhattar #lyricistshellee and team pippa EPI pic.twitter.com/9sg62Qc8xY
— A.R.Rahman (@arrahman) November 12, 2023
Comments
Please login to add a commentAdd a comment