Jersey Actress Mrunal Thakur Opens Up On Body-Shaming, Recalls Being Called Matka - Sakshi
Sakshi News home page

Mrunal Thakur: బాడీ షేమింగ్‌ చేశారు, మట్కా అని పిలిచేవారు: జెర్సీ హీరోయిన్‌

Published Sun, Apr 24 2022 11:37 AM | Last Updated on Sun, Apr 24 2022 5:51 PM

Mrunal Thakur About Body Shaming, Troll Calls Her Matka - Sakshi

షాహిద్‌ కపూర్‌, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటించిన చిత్రం జెర్సీ. తెలుగు జెర్సీకి రీమేక్‌గా తెరకెక్కిన ఈ మూవీ హిందీలో మంచి వసూళ్లు రాబడుతోంది. షాహిద్‌, మృణాల్‌ నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. ఇప్పుడు చప్పట్లు కొడుతున్నవాళ్లే గతంలో తనను విమర్శించారంటోంది మృణాల్‌ ఠాకూర్‌.

'నేను బరువు తగ్గడం ప్రారంభిస్తే ముందు నా ముఖం చిన్నగా అయిపోతుంది, ఆ తర్వాత శరీరం పై భాగం, ఆ తర్వాత కింది భాగం సన్నగా అవుతూ వస్తుంది. ఇప్పుడలానే ఉన్నాను. నా శరీరాకృతి చూసి చాలామంది కుండ(మట్కా)లా ఉన్నావు అనేవారు. ఎంతో బాధేసేది. నటిగా ఫిట్‌గా ఉండటం అత్యవసరం అనిపించింది. కానీ ఓసారి అమెరికా వెళ్లినప్పుడు చాలామంది నన్ను ఇండియన్‌ కర్దాషియన్‌ అని పిలిచారు. నాలాంటి శరీర సౌష్ఠవం కోసం ఎక్కువ మొత్తంలో డబ్బులు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. అప్పుడు నాకు ఎక్కడ లేని ధైర్యం వచ్చింది. ఈ ట్రోల్స్‌ నన్నేమీ చేయలేవన్న నమ్మకం కలిగింది. అప్పటి నుంచి నా ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నాను' అని చెప్పుకొచ్చింది.

చదవండి 👉 ఆచార్యలో ఫస్టాఫ్‌ హీరో నేను, సెకండాఫ్‌ హీరో చరణ్‌

సీనియర్‌ నటుడు చక్రవర్తి కన్నుమూత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement