అలా కనిపించడం చాలా కొత్తగా అనిపించింది: సీతారామం బ్యూటీ | Mrunal Thakur Crazy Comments About Her Role In Pippa Movie | Sakshi
Sakshi News home page

Mrunal Thakur: ఈ చిత్రంలో భాగం కావడం నా అదృష్టం: మృణాల్

Published Sat, Nov 11 2023 7:14 AM | Last Updated on Sat, Nov 11 2023 10:22 AM

Mrunal Thakur Crazy Comments About Her Role In Pippa Movie - Sakshi

సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ వరుస సినిమాలతో బిజీగా ఉంది. నాని సరసన హాయ్ నాన్న చిత్రంలో నటిస్తోన్న ముద్దుగుమ్మ.. తాజాగా పిప్పా అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రాన్ని రాజా మీనన్ దర్శకత్వంలో తెరకెక్కించగా..  ప్రియాంషు పైన్యులి, ఇషాన్‌ ఖట్టర్‌ కీలక పాత్రలు పోషించారు. రోనీ స్క్రూవాలా, సిద్ధార్థ్‌ రాయ్‌ కపూర్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 10న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన మృణాల్ ఈ మూవీపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఈ మూవీలో నటించడం పట్ల గర్వంగా ఉందని తెలిపింది. ఈ సినిమాలో వైద్య విద్యార్థి, క్రిప్టోగ్రాఫర్‌ అయిన రాధ పాత్రలో మృణాల్ కనిపించింది.

మృణాల్‌ ఠాకూర్ మాట్లాడుతూ...' ఈ చిత్రంలో రాధ పాత్రకు ప్రాణం పోసినందుకు గర్వంగా ఉంది. ఒక అమ్మాయి పాత్రకు ప్రాముఖ్యతనిచ్చిన ఈ చిత్రంలో భాగం కావడం నా అదృష్టం. తన తోబుట్టువులతో కలిసి యుద్ధంలో పాల్గొనే అమ్మాయిగా నేను  కనిపించడం చాలా కొత్తగా అనిపించింది. ఈ చిత్రానికి నా మనసులో ప్రత్యేక స్థానం ఉంటుంది.' అని అన్నారు. కాగా.. ఈ చిత్రాన్ని 1971లో జరిగిన ఇండో-పాకిస్థాన్‌ యుద్ధంలో తన తోబుట్టువులతో కలిసి భారతదేశం కోసం పోరాడిన కెప్టెన్‌ బలరామ్‌ సింగ్‌ మెహతా జీవితం ఆధారంగా తెరకెక్కించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement