Mrunal Thakur Reacts To Trolls About Her Sister Role In Pippa Movie, Deets Inside - Sakshi
Sakshi News home page

Mrunal Thakur: హీరోయిన్‌ అయితే అలాంటి పాత్రలు చేయొద్దా?: ట్రోలర్స్‌కు మృణాల్‌ ఘాటు రిప్లై

Published Tue, Dec 6 2022 1:24 PM | Last Updated on Tue, Dec 6 2022 1:49 PM

Mrunal Thakur About Her Sister Role in Pippa Movie - Sakshi

‘సీతారామం’ మూవీతో తెలుగు తెరకు పరిచయమైన మరాఠి బ్యూటీ మృణాల్‌ ఠాకుర్‌. ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌ హిట్‌తో ఆమె ఒక్కసారిగా స్టార్‌ హీరోయిన్‌ జాబితాలో చెరిపోయింది. అందం, అభినయం, తనదైన నటనతో తొలి చిత్రంతోనే ఎంతో ప్రేక్షక ఆదరణ పొందిన ఆమెకు ప్రస్తుతం తెలుగులో వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఈ  నేపథ్యంలో ఆమె రీసెంట్‌గా ఇచ్చిన ఓ ఇంటర్య్వూలో తాను హిందిలో పిప్పా అనే సినిమా చేస్తున్నానని, అందులో తనది హీరోకి చెల్లెలి పాత్ర అని చెప్పింది.

అయితే ఆ నటుడు ఎవరో కాదు బాలీవుడ్‌ యంగ్‌ హీరో ఇషాన్‌ ఖట్టర్‌. యుద్ధం నేపథ్యంలో తెరకెక్కబోయే ఈ చిత్రంలో తన పాత్ర నచ్చడంతో ఒకే చెప్పానని తెలిపింది. అయితే అది తెలిసి కొందరు ఎందుకు ఈ పాత్ర ఒప్పుకున్నారు? ఇప్పుడు సోదరిగా చేసిన మీరు ఇకపై ఆ హీరో పక్కన నటించరా? అంటూ తనని సోషల్‌ మీడియా వేదికగా విమర్శిస్తున్నారని చెప్పింది. ఈ సందర్భంగా ఆమె ట్రోల్స్‌పై స్పందిస్తూ అసహనం వ్యక్తం చేసింది.  

‘‘హీరోయిన్లు.. హీరోయిన్లుగానే చెయ్యాలా? సోదరి, భార్య, తల్లి లాంటి క్యారెక్టర్స్ చేయకూడదా? ఇలాంటి మూస పద్దతిని మనం బ్రేక్ చేసినప్పుడే మనలోని సత్తా ఏంటో తెలుస్తుంది. కెరీర్‌లో వెనక్కి తిరిగిచూసుకుంటే.. ఓ గొప్ప పాత్ర మిస్ చేసుకున్నాననే బాధ ఉండోద్దు. అందుకే ఈ పాత్ర నచ్చడంతో సోదరి రోల్‌ అయిన ఒకే చేశాను’ అంటూ ఘాటుగా ట్రోలర్స్‌కు కౌంటర్‌ ఇచ్చింది. ఇక పిప్పా సినిమా బ్రిగేడియర్ మోహతా రాసిన ‘ది బర్నింగ్ చాఫీస్’ అనే పుస్తకం ఆధారంగా రూపొందుతోంది.

చదవండి: 
తొలిసారి ​కాస్టింగ్‌ కౌచ్‌పై స్పందించిన కీర్తి సురేశ్‌
కన్నడలో రష్మికపై బ్యాన్‌! ‘శ్రీవల్లి’ ఏమన్నదంటే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement