సెలబ్రిటీలతో కలిసి డ్యాన్స్ చేస్తున్నట్లు, వారితో కబుర్లాడుతున్నట్లు.. ఇలా రకరకాల ఎడిటింగ్ వీడియోలు సోషల్ మీడియాలో తరచూ దర్శనమిస్తుంటాయి. ఈక్రమంలోనే ఓ వ్యక్తి మృణాల్ ఠాకూర్‌తో కలిసి దీపావళి సెలబ్రేట్ చేసుకుంటున్నట్లు ఓ వీడియో ఎడిట్ చేసి సోషల్ మీడియా పోస్ట్ చేశాడు. ఫ్యామిలీ స్టార్ సినిమాలోని స్టిల్‌ను ఇక్కడ ఎడిట్ చేశారు. అందులో మృణాల్ అతడి చేతులు పట్టుకుని పటాసులు కాల్చినట్లుగా ఉంది.
ఏంటిదంతా?
ఇది చూసిన హీరోయిన్‌కు మొదట కోపం వచ్చిందట. కానీ తర్వాత అతడి నైపుణ్యానికి ఆశ్చర్యపోయానంటోంది. సదరు వ్యక్తి పోస్ట్ చేసిన వీడియో కింద.. బ్రదర్, ఎందుకిలా చేస్తున్నావు? ఇదంతా సరదా అనుకుంటున్నావేమో, కానీ కాదు అని ఆగ్రహం వ్యక్తం చేసింది. మళ్లీ కాసేపటికే మనసు మార్చుకుని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ వీడియో పోస్ట్ చేసింది.
మొదట ఖుషీ అయ్యా!
'ఓ వ్యక్తి చేసిన ఎడిట్ వీడియో చూసి మొదట ఖుషీగా ఫీలయ్యాను. అతడి పేజీ ఓపెన్ చేస్తే అందరు హీరోయిన్లతో కలిసున్నట్లుగా వీడియో ఎడిటింగ్స్ దర్శనమిచ్చాయి. అది చూసి బాధేసింది. కానీ అతడి ఎడిటింగ్ స్కిల్స్‌కు మెచ్చుకోవాల్సిందే! తన టాలెంట్‌ను సరైన వాటి కోసం ఉపయోగిస్తే బాగుండేది. ఎవరూ అతడిని తిట్టకండి. అతడు ఏదో దురుద్దేశంతో కాకుండా సరదా కోసం చేశాడేమో!' అని చెప్పుకొచ్చింది.
సినిమా
ఏదో ఒక రోజు అతడు పెద్ద సినిమాలకు సైతం ఎడిటింగ్ చేసే స్థాయికి ఎదగాలని మనసారా ఆకాంక్షించింది. ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ సన్ ఆఫ్ సర్దార్ 2 సినిమా చేస్తోంది. అలాగే పూజా మేరీ జాన్ మూవీలోనూ యాక్ట్ చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment