ఎన్ని సినిమాలు చేశామన్నది ముఖ్యం కాదు, ఎంత మంచి సినిమాలు చేశామన్నదే పాయింటు అంటోంది మృణాల్ ఠాకూర్. మొదట్లో సీరియల్స్‌లో నటించిన ఈ బ్యూటీ ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ సినిమాల్లోకి వచ్చింది. సీతారామం సినిమాతో ఈమె దశ తిరిగి స్టార్ హీరోయిన్‌గా రాణిస్తోంది. అయినా తనకు బాలీవుడ్‌లో పెద్ద సినిమాల్లో అవకాశాలు రావడం లేదట!
విసిగిపోయా..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ.. 'నాకు బాలీవుడ్‌లో రొమాంటిక్ సినిమాలు రావడం లేదు. బహుశా నేనింకా అక్కడంత ఫేమస్ కాలేదేమో! చాలా సినిమా ఆఫర్లు వస్తున్నాయి. కానీ అందులో మంచి ప్రేమకథా చిత్రం ఒక్కటీ లేదు. ఆ తరహా చిత్రాలు చేయాలనుంది. కానీ నేను దర్శకుల చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయాను. నన్ను నేను నిరూపించుకునే క్రమంలో అలసిపోయాను. ఇక ఛాన్సులు రావడమనేది సహజంగా జరిగిపోవాలంతే! మనమంతా చిన్నప్పటినుంచి ఈ ప్రేమ, రొమాంటిక్ సినిమాలు చూస్తూ పెరిగాం.
ఇష్టం లేదంటారు కానీ..
సడన్‌గా ఆ జానర్‌లో సినిమాలు రావడం ఆగిపోయాయి. ప్రతి ఒక్కరూ రొమాన్స్ అంటే ఇష్టం లేదన్నట్లుగా నటిస్తారు, కానీ దొంగచాటుగా అలాంటి చిత్రాలే చూస్తారు. హాయ్ నాన్న, సీతారామం అందరి అభిప్రాయాలను మార్చేశాయి. ఇతర భాషల్లో కూడా అలాంటి సినిమాలు వస్తే చేయాలనుంది. ఏవి పడితే అవి కాకుండా నా పాత్రకు ప్రాధాన్యమున్న చిత్రాలే చేయాలనుకుంటున్నాను' అని చెప్పుకొచ్చింది. కాగా మృణాల్ ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటిస్తోంది.
చదవండి: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్‌బాస్ బ్యూటీ.. ప్రియుడితో కలిసి..
Comments
Please login to add a commentAdd a comment