
‘2.0’ అనగానే సినీ లవర్స్ అందరూ.. ఫస్ట్ అడిగే క్వశ్చన్ మూవీ రిలీజ్ ఎప్పుడు? అని. కానీ రిలీజ్ డేట్ విషయంలో మూవీ యూనిట్ ‘అదిగో పులి ఇదిగో పులి..’ అన్న విధంగా డేట్స్ మార్చుతోంది. రజనీకాంత్, అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ ముఖ్య తారలుగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘2.0’. ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన ‘యందిరన్’ (తెలుగులో ‘రోబో’) చిత్రానికి సీక్వెల్ అయిన ‘2.0’ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. అయితే అనుకున్నట్లుగా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాలేకపోతోంది. 2015లో సెట్స్‌మీదకు వెళ్లిన ‘2.0’ చిత్రాన్ని తొలుత 2017 దీపావళికి రిలీజ్ చేద్దాం అనుకున్నారు. ఆ తర్వాత ఏవో గ్రాఫిక్స్ ప్రాబ్లమ్స్ కారణంగా 2018 జనవరి 25న మూవీ రిలీజ్ పక్కా అన్నారు. కానీ ఆ పక్కా లెక్క తప్పి ఈ ఏడాది సమ్మర్‌కి సెకండ్ రోబో రెడీ అన్నారు. అబ్బే.. ఈసారీ రెడీ కాలేదు. లేటెస్ట్‌గా ఈ ఏడాది దీపావళికి ‘2.0’ రిలీజ్ అన్న వార్తలు వచ్చాయి.
ఇప్పుడు వాటిలో కూడా నిజం లేదని తెలుస్తోంది. వచ్చే ఏడాది రిపబ్లిక్ డేకి ‘2.0’ రిలీజ్ కానుందని కొత్త వార్తలు పుట్టుకొస్తున్నాయి. మరి.. ఈ వార్తలో నిజం ఎంతన్నది చిత్రబృందమే చెప్పాలి. ఒకవేళ ‘2.0’ చిత్రం వచ్చే ఏడాది రిపబ్లిక్ డేకి రిలీజ్ ఫిక్స్ అయితే, ఈ ఏడాది నవంబర్‌ని కాదనుకుని రిపబ్లిక్ డేకి కర్ఛీప్ వేసిన హృతిక్ రోషన్ ఏం చేస్తాడన్న విషయం ఇప్పుడు బీటౌన్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. ఎందుకంటే ఆయన తొలిసారి నటిస్తున్న బయోపిక్ ‘సూపర్ 30’ చిత్రాన్ని ఆ రోజునే రిలీజ్ చేయనున్నట్లు ఇదివరకే చిత్రబృందం అనౌన్స్ చేసింది. వికాస్ బాల్ దర్శకత్వంలో బీహార్ గణిత శాస్త్రవేత్త ఆనంద్‌కుమార్ జీవితం ఆధారంగా ‘సూపర్ 30’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. రిపబ్లిక్ వీక్‌లో గతంలో విడుదలైన హృతిక్ చిత్రాలు ‘అగ్నిపథ్, కాబిల్’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టాయి. సో... హృతిక్‌కు ఇది సెంటిమెంట్ కూడా. మరి.. బాక్సాఫీస్ వద్ద రజనీ వర్సెస్ హృతిక్ నిజమవుతుందా? తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment