2.0
-
సుప్రీంకోర్టు మొబైల్ యాప్ 2.0 ప్రారంభం
న్యూఢిల్లీ: ఆండ్రాయిడ్ వెర్షన్ 2.0 మొబైల్ అప్లికేషన్‌ను సుప్రీంకోర్టు బుధవారం ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా కోర్టు కార్యకలాపాలను న్యాయమూర్తులు, న్యాయవాదులు, కేంద్ర శాఖల నోడల్ అధికారులు రియల్ టైమ్‌లో వీక్షించవచ్చు. గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సూచించారు. ఐఓఎస్ వెర్షన్ మరో వారం రోజుల్లో అందుబాటులోకి వస్తుందన్నారు. యాప్‌లో లాగిన్ కావడం ద్వారా సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని తెలిపారు. కేసులు, ఉత్తర్వులు, తీర్పులు, పెండింగ్ కేసుల స్థితిగతులను తెలుసుకొనేందుకు వీలవుతుందని చెప్పారు. ఇదీ చదవండి: ఎంసీడీ.. ఆప్, బీజేపీ మధ్య అధికార పోరుకు కొత్త వేదిక -
‘జులన్‌కు ఘనంగా వీడ్కోలు ఇస్తాం’
కాంటర్బరి: వరుసగా రెండు మ్యాచ్‌ల విజయాలతో 2–0తో సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత మహిళల జట్టు ఇక ఏ ఒత్తిడి లేకుండా ఆఖరి పోరు ఆడుతుందని కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తెలిపింది. ‘తొలి మ్యాచ్ గెలిచిన మాకు రెండో మ్యాచ్ కీలకమైంది. ఇందులో గెలిచి సిరీస్ సాధించాలనే పట్టుదలతో ఆడాం. అనుకున్నది సాధించాం. ఎన్నో ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ గడ్డపై సిరీస్ సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇక మాకు లార్డ్స్‌లో జరి గే ఆఖరి మ్యాచ్ నామమాత్రమైంది. అక్కడ ఏ బెంగ లేకుండా ఆడేయొచ్చు. అంతేకాదు... దిగ్గజ సీమ ర్ జులన్ గోస్వామి కెరీర్లో ఆఖరి మ్యాచ్ కాబట్టి విఖ్యాత లార్డ్స్ మ్యాచ్ మాకిపుడు ప్రత్యేకమైంది. మా పేసర్‌కు విజయంతో వీడ్కోలు ఇస్తాం’ అని హర్మన్ మ్యాచ్ ముగిసిన అనంతరం పేర్కొంది. ఇంగ్లండ్ గడ్డపై 23 ఏళ్ల తర్వాత... భారత అమ్మాయిల జట్టు బుధవారం జరిగిన రెండో వన్డేలో 88 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టుపై జయభేరి మోగించింది. తద్వారా 2–0తో ఇంగ్లండ్ గడ్డపై 23 ఏళ్ల తర్వాత వన్డే సిరీస్ గెలిచింది. చివరి సారిగా 1999లో అక్కడ సిరీస్ నెగ్గింది. బుధవారం జరిగిన పోరులో మొదట భారత్ 5 వికెట్ల నష్టానికి 333 పరుగుల భారీస్కోరు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (111 బంతుల్లో 143 నాటౌట్; 18 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆఖరి దాకా చెలరేగింది. హర్లీన్ డియోల్ (72 బంతుల్లో 58; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), స్మృతి మంధాన (51 బంతుల్లో 40; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. తర్వాత ఇంగ్లండ్ 44.2 ఓవర్లలో 245 పరుగుల వద్ద ఆలౌటైంది. వ్యాట్ (58 బంతుల్లో 65; 6 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించగా, కాప్సీ (39; 6 ఫోర్లు), కెప్టెన్ అమీ జోన్స్ (39; 3 ఫోర్లు, 1 సిక్స్) మెరుగ్గా ఆడారు. రేణుక సింగ్ (4/57) చావుదెబ్బ తీయగా, హేమలత 2 వికెట్లు పడగొట్టింది. రేపు లార్డ్స్‌లో ఆఖరి వన్డే జరుగుతుంది. -
రజనీకాంత్ 2.O అక్కడ అట్టర్‌ప్లాప్
దేశంలోనే అతిపెద్ద సూపర్‌హిట్ సినిమాలైన నిలిచిన రాజమౌళి ‘బాహుబలి-2’, శంకర్ ‘2.O’కు చైనాలో మాత్రం డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. చైనా మార్కెట్లో పాగా వేయాలన్న ఈ రెండు సినిమాల ఆశలు అడియాసలయ్యాయి. రజనీకాంత్, అక్షయ్‌కుమార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 2.O భారత్‌లోని బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లు రాబట్టింది. హిందీ, తమిళం, తెలుగు వెర్షన్లలో ఈ సినిమా హిట్‌గా నిలిచింది. కానీ, సెప్టెంబర్ 6వ తేదీన చైనాలో విడుదలైన ఈ సినిమాకు చేదు ఫలితం ఎదురైంది. ఎంతగా ఈ సినిమాకు ప్రచారం చేసినా.. చైనా బాక్సాఫీస్ వద్ద తొలివారం ఈ సినిమా కేవలం రూ. 22 కోట్లు వసూలుచేసింది. బాహుబలి-2 సినిమాకు కూడా చైనాలో ఇదే తరహా ఫలితం ఎదురైన సంగతి తెలిసిందే. 2018 మేలో భారీ ఎత్తున విడుదలైన ఈ సినిమా చైనాలో తొలివారం రూ. 52 కోట్లు మాత్రమే వసూలు చేసి చతికిలపడింది. విజువల్ వండర్స్‌గా తెరకెక్కిన ఈ సినిమాలు చైనా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టలేకపోయాయి. బలమైన కథ కలిగిన భారత సినిమాలకు మాత్రం చైనీయులు బ్రహ్మరథం పడుతున్నారు. భజరంగీ భాయ్‌జాన్, దంగల్, అంధాధూన్, సీక్రెట్ సూపర్ స్టార్, ఇంగ్లిష్ మీడియాం వంటి బలమైన కథాకథనాలతో కూడిన సినిమాలు చైనాలో సంచలన వసూళ్లు రాబట్టిన సంగతి తెలిసిందే. -
ఆస్ట్రేలియాలో మందుబాబుల కోసం 2.ఓ సినిమా
కాన్బెర్రా : ఆస్ట్రేలియా పోలీసులు మందుబాబుల్లో మార్పుకోసం సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన 2.ఓ చిత్ర సన్నివేశాన్ని చూపిస్తున్నారు. రజనీకాంత్‌కే కాదు, ఆయన నటించిన చిత్రాలకు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ఉందన్న విషయం తెలిసిందే. జపాన్, కెనడా, మలేషియా, సింగపూర్ దేశాల్లో రజనీకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఆస్ట్రేలియాలోనూ ఆయన చిత్రాల ప్రభావం ఉందని తెలిసింది. వివరాలు చూస్తే.. ఇటీవల దక్షిణ ఆస్ట్రేలియాలోని టోర్ఫీ ప్రాంత పోలీసులు రాత్రుల్లో వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. మందుబాబులను అరెస్ట్ చేసి కేసులు నమోదు చేయడం లేదు. బదులుగా వారికి మద్యం సేవించడం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తున్నారు. అందుకు పోలీసులు రజనీ నటించిన 2.ఓ చిత్రంలోని సన్నివేశాలను అధికారిక పూర్వకంగా వినియోగిస్తున్నారు. వాహన తనిఖీల్లో ఒక వ్యక్తిని టెస్ట్ చేయగా.. అతను 0.341 ఆల్కాహాల్ సేవించినట్లు గుర్తిస్తారు. అంత మద్యం సేవించిన వారు శస్త్ర చికిత్సలో ఉన్నవారికి, కోమాలో ఉన్న వ్యక్తికి సమానం అని సన్నివేశంలో ఉంది. ఈ సన్నివేశాన్ని చూపిస్తూ మందుబాబులకు పోలీసులు అవగాహనను కల్పిస్తున్నారు. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవడంతో రజనీకాంత్ అభిమానులు ఇతర మందుబాబుల్లో మార్పు తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలెట్టారు. -
అమీ జాక్సన్ నిశ్చితార్ధం
ముంబై : రజనీకాంత్ 2.ఓలో యంతరలోకపు సుందరిగా అలరించిన అమీ జాక్సన్ త్వరలో వైవాహిక బంధంలో అడుగుపెట్టనున్నారు. నూతన సంవత్సరం తొలిరోజున నిశ్చితార్ధం జరుపుకున్నట్టు వెల్లడించారు. బ్రిటన్‌కు చెందిన వ్యాపారవేత్త జార్జ్ పనయటోతో జాంబియాలో ఎంగేజ్మెంట్ జరిగినట్టు తెలిపారు. ఎంగేజ్మెంట్ రింగ్‌తో బాయ్‌ఫ్రెండ్‌తో కలిసిఉన్న ఫోటోను అభిమానుల కోసం సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేశారు. ఏడాది తొలిరోజున మన జీవితం ప్రారంభవుతోంది..అత్యంత సంతోషంగా తనను ఉంచుతున్నందుకు ధన్యవాదాలు అంటూ ఆమె తన బాయ్‌ఫ్రెండ్‌ను ఉద్దేశిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. తెలుగులో ఎవడు, అభినేత్రి చిత్రాల్లో మెప్పించిన అమీ జాక్సన్ 2.ఓలో నటనకు గాను పలువురి ప్రశంసలు దక్కించుకున్నారు. -
రెండో సీఎంకి నా ఛాయిస్ ఆయనే!
సాక్షి, తమిళసినిమా: స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన సూపర్‌హిట్ సినిమాలకు వరుసగా సీక్వెల్స్ వస్తున్నాయి. ఇప్పటికే రోబో సీక్వెల్ 2.ఓ వచ్చింది. త్వరలో భారతీయుడు సీక్వెల్ కూడా రాబోతోంది. మరి ‘ఒకే ఒక్కడు’ సినిమాకు కూడా సీక్వెల్ వస్తే.. అందులో ముఖ్యమంత్రి పాత్ర ఎవరు పోషిస్తారంటే.. ‘నా ఫస్ట్ ఛాయిస్ విజయ్‌నే’ అంటున్నారు శంకర్. ఆయన తాజా చిత్రం ‘2.ఓ’ ఇటీవల విడుదలై ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లను కొల్లగొడుతోంది. ఈ విషయాన్ని ఈ సినిమా కథానాయకుడు రజనీకాంత్ ఆదివారం రాత్రి తన తాజా చిత్రం పేట ఆడియో ఆవిష్కరణ సందర్భగా స్వయంగా చెప్పారు. దర్శకుడు శంకర్ ప్రస్తుతం కమల్‌హాసన్ కథానాయకుడిగా ఇండియన్- 2 చిత్రాన్ని తెరకెక్కించడంలో బిజీగా ఉన్నారు. ఈ నెల 14న ఈ చిత్రం ప్రారంభం కానున్నట్లు సమాచారం. కాగా, ఓ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన శంకర్.. మీ తదుపరి చిత్రం ఏంటన్న ప్రశ్నకు ముదల్వర్ (ఒకే ఒక్కడు) చిత్రానికి సీక్వెల్ చేసే ఆలోచన ఉందని తెలిపారు. ముదల్వర్ చిత్రాన్ని శంకర్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించారు. ముదల్వర్- 2లో హీరోగా ఎవరిని ఎంపిక చేయనున్నారన్న ప్రశ్నకు రజనీ, కమల్‌లలో ఒకరు నటించడానికి సిద్ధమంటే వారితోనే చేస్తానన్నారు. అయితే, స్క్రిప్ట్ యువ హీరోను డిమాండ్ చేస్తే తన ఫస్ట్ ఛాయిస్ ఇళయదళపతి విజయ్నేనని చెప్పారు. ఇండియన్- 2 చిత్రం పూర్తయిన తరువాతనే ముదల్వర్- 2 గురించి చర్చిస్తానని తెలిపారు. కాగా ఇంతకుముందు శంకర్, విజయ్‌ల కాంబినేషన్లో నన్భన్ (స్నేహితుడు) చిత్రం రూపొందింది. అయితే ఆ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేదు. -
రాజకీయాలపై రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, చెన్నై: త్వరలో రాజకీయాల్లోకి వచ్చేందుకు సూపర్‌స్టార్ రజనీకాంత్ సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి.. వచ్చే ఎన్నికల్లో పాల్గొనేందుకు ఆయన క్షేత్రస్థాయిలో సన్నాహాలు చేస్తున్నట్టు కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రజనీకాంత్ ఆదివారం ఈ అంశంపై స్పందించారు. ‘రాజకీయాల్లోకి వస్తే నేను నేనుగానే ఉంటా. నేటి రాజకీయ నాయకుల్లాగా మారిపోను’ అని హామీ ఇచ్చారు. రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకురావటమే తన లక్ష్యమని చెప్పారు. తన జీవితం వేరు, సినిమాలు వేరు అని, రెండు కలిస్తే ఎలా ఉంటుందో అనేద ప్రశ్న అని చెప్పారు. రజనీ తాజాగా నటించిన ‘2.వో’ సినిమా సక్సెస్‌ఫుల్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. -
తలైవా మానియా..బంపర్ ఆఫర్
ఫస్ట్ డే..ఫస్ట్ షో..ఎలాగైనా చూసెయ్యాలి...ఇదీ సూపర్‌స్టార్ రజనీకాంత్ అభిమానుల కోరిక. మరి అలాంటిది ఎప్పటినుంచో ఉత్కంఠగా చూస్తున్న ప్రముఖ దర్శకుడు శంకర్, రజనీ, బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్, సంగీత దర్శకుడు ఏఆర్ రహ్మాన్‌ల గ్రేట్ కాంబినేషన్లో వస్తున్న సినిమా థియేటర్లను పలకరిస్తోంటే.. ఇక ఆ సందడే వేరు. ఆఫీసులకు సెలవుపెట్టి మరీ మూవీకి చెక్కెయ్యాల్సిందే. అదీ తలైవా మానియా. ఈ నేపథ్యంలోనే కోయంబత్తూరుకు చెందిన ఒక స్కిల్ డెవలప్మెంట్ సంస్థ తన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. దీంతో బాస్ అంటే వీడేరా అంటూ..ఉద్యోగులు థియేటర్లకు పరుగులు తీయడంలో అతిశయోక్తి ఏముంది... విషయం ఏమిటంటే... కోయంబత్తూరులోని గెట్ సెట్ గో అనే సంస్థ తన ఉద్యోగులకు 2.ఓ మూవీ విడుదల సందర్భంగా నవంబరు 29న అధికారిక సెలవు దినంగా ప్రకటించేసింది. పనినుంచి మీకు ఊరట. 2.0 మోడ్ ఆన్..ఛలో థియేటర్స్ అంటూ ఉద్యోగులకు ఒక లేఖ రాసింది. అంతేకాదు..ఈ మూవీకి వెళ్లాలనుకునేవారికి మొదటి రోజు టికెట్లను కూడా ఉచితంగా అందిస్తామంటూ బంపర్ ఆఫర్ ఇచ్చింది. పనిలో పనిగా తలైవా, పద్మవిభూషణ్ సూపర్ స్టార్ రజనీకాంత్ సార్.. శంకర్ సర్, ప్రతినాయకుడుగా ఖిలాడీ అక్షయ్ కుమార్, ఇతర నటీనటులు, సంగీత దర్శకుడు ఎఆర్ రహ్మాన్తోపాటు, చిత్ర యూనిట్ మొత్తంపై ప్రశంసలు కురిపించింది. కాగా ప్రపంచవ్యాప్తంగా 10వేల స్క్రీన్లలో రిలీజవుతోంది. ముఖ్యంగా దేశీయంగా బాహుబలి-2 రికార్డులను తిరగరాస్తూ వేల థియేటర్లను రోబో చిట్టి పలకరిస్తున్న సంగతి తెలిసిందే. -
‘రోబో 2.0’పై టెల్కోల అభ్యంతరం
న్యూఢిల్లీ: అనేక అవరోధాలను అధిగమించి రిలీజ్‌కు సిద్ధమవుతున్న రోబో సీక్వెల్ 2.0 సినిమాకు ఈసారి టెల్కోల రూపంలో సమస్యలు వచ్చిపడ్డాయి. మొబైల్ ఫోన్లు, టవర్లు ఆరోగ్యానికి చేటు చేస్తాయన్న అర్థం వచ్చేలా ఈ సినిమా ట్రైలర్లు ఉన్నాయంటూ టెలికం సంస్థల సమాఖ్య సీవోఏఐ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. సినిమా కంటెంట్ టెల్కోల ప్రతిష్టకు భంగం కలిగించేదిగా ఉందంటూ ఆరోపించింది. ఈ నేపథ్యంలో సినిమాకు ఇచ్చిన సర్టిఫికేషన్‌ను ఉపసంహరించాలంటూ సెన్సార్ బోర్డు (సీబీఎఫ్సీ)ని కోరాయి. మొబైల్ ఫోన్లు, టవర్ల ద్వారా వచ్చే విద్యుదయస్కాంత తరంగాలు .. ఇటు పర్యావరణానికి అటు మానవాళితో పాటు పక్షులు తదితర జీవరాశులకు హానికరమన్న భావన కలిగించేలా ఈ సినిమా ట్రైలర్స్ ఉన్నాయని సీవోఏఐ ఆరోపించింది. ఎలాంటి శాస్త్రీయ ఆధారాల్లేకుండా మొబైల్ టవర్లు, ఫోన్లపై అవాస్తవాలను ప్రచారం చేయడం ద్వారా ఇవి ప్రజల్లో భయాందోళనలు కలిగించే ప్రమాదముందని పేర్కొంది. ఈ నేపథ్యంలో సీబీఎఫ్సీ తమ అభ్యర్ధనపై నిర్ణయం తీసుకునే దాకా టీజర్, ట్రైలరుతో పాటు తమిళ వెర్షన్‌కి ఇచ్చిన సర్టిఫికేషన్‌ను తక్షణమే ఉపసంహరించాలని కోరుతున్నట్లు సీవోఏఐ డైరెక్టర్ జనరల్ రాజన్ ఎస్ మాథ్యూస్ తెలిపారు. స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా రూపొందిన ఈ భారీ బడ్జెట్ సినిమా ఈ నెల 29న విడుదల అవుతోంది. -
2.ఓపై సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు
సాక్షి, న్యూఢిల్లీ : ఎస్ శంకర్ అద్భుత సృష్టిగా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొంది మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న రజనీకాంత్, అక్షయ్‌కుమార్‌ల 2.ఓపై వివాదం అలుముకుంది. ఈ మూవీలో మొబైల్ ఫోన్, టవర్లు, మొబైల్ సేవలపై చిత్ర రూపకర్తలు అశాస్ర్తీయ ప్రచారం చేశారని సెల్యులార్ ఆపరేటర్ల సంఘం (సీఓఏఐ) ఫిర్యాదు చేసింది. ఈ సినిమాలో అక్షయ్‌కుమార్ పోషించిన పాత్ర ద్వారా మొబైల్ ఫోన్ వాడకందారులను పర్యావరణానికి పక్షులు, జంతువులకు రేడియేషన్‌తో హాని చేసే వారిలా దూషిస్తుంటారని పేర్కొంది. మొబైల్ ఫోన్లు, టవర్లు భూమిపై జీవరాశికి, మానవాళికి ప్రమాదకరమైనవిగా దుష్ర్పచారం సాగించారని సీబీఎఫ్‌సీతో పాటు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేస్తూ సీఓఏఐ లేఖ రాసింది. టీజర్, ట్రైలర్, ఇతర ప్రమోషనల్ వీడియోతో పాటు సినిమా తమిళ వెర్షన్‌కు ఇచ్చన సర్టిఫికేషన్‌ను తక్షణమే ఉపసంహరించాలని ఈ లేఖలో సెన్సార్ బోర్డుకు విజ్ఞప్తి చేసింది. ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైన కొద్ది గంటలకే ఈ ఫిర్యాదు వెలుగుచూడటం గమనార్హం. -
‘2.ఓ’ ప్రీ రిలీజ్ వేడుక
-
బాహుబలి అందుకే అంత సక్సెస్ అయింది : రజనీ
‘‘శంకర్‌గారు తెలుగు మాట్లాడటం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ‘రోబో’ సినిమా ఆడియో ఫంక్షన్లో ‘నాకు తెలుగు తెలీదు’ అని చెప్పి ఆయన ఇంగ్లీష్‌లో మాట్లాడారు. ఇప్పుడొచ్చి ఇంత బాగా తెలుగు మాట్లాడారు. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ మంచివాళ్లు. మమ్మల్ని చాలా అభిమానిస్తారు. తెలుగు భోజనం లోక ప్రసిద్ధి. తెలుగు మ్యూజిక్ ఆనందమైంది’’ అని రజనీకాంత్ అన్నారు. రజనీకాంత్, అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ ముఖ్య తారలుగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘2.ఓ’. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రాన్ని నిర్మాత ఎన్వీప్రసాద్ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 29న ఈ చిత్రం విడు దలవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రజనీకాంత్ మాట్లాడుతూ– ‘‘రోబో’ సినిమా చేసినప్పుడు ఒక రీల్ త్రీడీలోకి మార్చి, ఆ తర్వాత మొత్తం సినిమా త్రీడీలోకి మార్చాలనుకున్నాం. ఒక రీల్ త్రీడీలోకి కన్వర్ట్ చేశాక శంకర్‌గారు డిసైడ్ చేశారు. త్రీడీలో కచ్చితంగా చేద్దాం. కానీ, త్రీడీ చేయాలని సినిమా చేస్తే బాగుండదు.. దానికి సరైన కథ కుదరాలి. అప్పుడు ఆలోచిస్తా అన్నారు. నాలుగేళ్ల ముందు నన్ను కలిసి త్రీడీ సినిమా చేద్దామన్నారు. మంచి కథ కుదిరిందని నాకు అర్థం అయింది. ఆయనతో నేను సినిమా చేశాను కాబట్టి ఇది సాధ్యమా? అనే అనుమానం నాకు రాలేదు. ఆయనొక మెజీషియన్. ‘బాహుబలి’ సినిమా అంత పెద్ద సక్సెస్‌కి కారణం ఫస్ట్ కథ. దానికి తగ్గుట్టు గ్రాండ్ లుక్. ఆ రెండు బాగా కుదిరాయి కాబట్టి అంతపెద్ద సక్సెస్ అయింది. ‘2.ఓ’ కూడా అంతే. త్రీడీ టెక్నాలజీ.. దానికి తగ్గ కథ. ఈ రెండు చక్కగా కుదిరినందు వల్ల ఈ సినిమా వందశాతం పెద్ద సక్సెస్ అవుతుందని నమ్మకం ఉంది. శంకర్‌కి కావాల్సినవన్నీ ఇచ్చిన సుభాస్కరన్‌గారికి హ్యాట్సాఫ్. ఈ సినిమాకి ప్రమోషన్ అక్కర్లేదు.. ప్రసాద్‌గారు ఊరికే డబ్బు దుబారా చేస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమాపై అంచనాలు ఎక్కడో ఉన్నాయి. సినిమా ఎప్పుడు వస్తుందా అని వేచి చూస్తున్నారు. టికెట్ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులే ఈ చిత్రాన్ని ప్రమోట్ చేస్తారని నేను చెన్నైలోనే చెప్పా. 1975లో నా తొలి సినిమా ‘అపూర్వ రాగంగల్’ చూడాలని ఎంత ఆత్రుతగా ఉన్నానో.. 43ఏళ్ల తర్వాత ఈ ‘2.ఓ’ చూడాలని అంతే ఆత్రుతగా ఉన్నా. ట్రైలర్లో మీరు చూసింది జస్ట్ శాం్యపిల్సే. ఆశ్చర్యపోయే అంశాలన్నీ సినిమాలో ఉన్నాయి. మన ఇండియన్ సినిమా ఇండస్ట్రీకే ‘2.ఓ’ పెద్ద వెలుగు. దానికి శంకర్, ఆయన యూనిట్, నిర్మాత, అక్షయ్‌గారి ఎఫర్ట్.. అన్నీ కలిపి కచ్చితంగా ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని నాకు నమ్మకం ఉంది. శంకర్‌గారు చెప్పినట్టు ఈ సినిమాని త్రీడీలో చూస్తే ఆ అనుభూతి వేరుగా ఉంటుంది. మీలాగా నేను కూడా 29వ తేదీ కోసం వేచి చూస్తున్నా’’ అన్నారు. నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘2.ఓ’ ని ప్రసాద్‌గారు, మేము, యూవీ క్రియేషన్స్ కలిసి తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నాం. రెండు రోజులకు ముందు విడుదలైన పాట తర్వాత ఈ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ఆన్లైన్లోనే తెలిసిపోతోంది. ‘2.ఓ’ వన్ ఆఫ్ ది ఇండియన్ బెస్ట్ ఫిల్మ్ కాబోతోంది’’ అన్నారు. నిర్మాత ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘సూపర్‌స్టార్ రజనీకాంత్‌గారు గ్రేట్ ఆర్టిస్ట్. అక్షయ్ కుమార్‌కూడా ఈ మధ్య వరుస హిట్లు అందుకున్నారు. ఇటీవల ఆయన సినిమాలు పబ్లిక్‌లో మంచి అవేర్నెస్ తీసుకొచ్చాయి. ఇండియాగర్వించదగ్గ గ్రేట్ డైరెక్టర్ శంకర్‌గారి గురించి చెప్పక్కర్లేదు. ఆయన నాలుగేళ్లు రాత్రి, పగలు కష్టపడి ‘2.ఓ’ సినిమాని సృష్టించారు. సుభాస్కరన్‌గారు అంత గొప్పగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఓ ఇండియన్ సినిమాని ప్రపంచస్థాయి సినిమాగా మార్చేందుకు వీరు నలుగురూ కృషి చేశారు. ఈ నెల 29నుంచి దీపావళి పండుగ ప్రారంభం అవుతుంది. సంక్రాంతి తర్వాత కూడా ఈ దీపావళి కొనసాగుతుంది. తొలిసారి రియల్ త్రీడీలో ఈ సినిమా అద్భుతంగా తెరకెక్కించారు. యూనిట్ కష్టానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చి, ఇదొక ప్రపంచస్థాయి సినిమా అవ్వాలని ఆశిస్తున్నా. ఈ సినిమాని మేం గర్వంగా తెలుగులోకి తీసుకొస్తున్నాం. మీరు(శంకర్), రాజమౌళిగారు, రాజు హిర్వాణీగార్ని ప్రపంచ వ్యాప్తంగా గుర్తు పెట్టుకునేటట్లు ఇటువంటి ఎన్నో మంచి చిత్రాలు ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు. శంకర్ మాట్లాడుతూ– ‘‘ఇలా నడిస్తే ఎలా ఉంటది? అన్న నా ఊహే ‘2.ఓ’. ఇదొక ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్, థ్రిల్లర్. మంచి భావోద్వేగంతో పాటు, సామాజిక కథ ఉంది. ఇదొక పెద్ద టీమ్ వర్క్. నటీనటులు, వేలమంది టెక్నీషియన్స్ చాలా కష్టపడి ఈ సినిమా చేశారు. ఢిల్లీలో 47డిగ్రీల ఉష్ణోగ్రతలో చిత్రీకరించిన క్లైమాక్స్ కోసం రజనీగారు చాలా కష్టపడ్డారు. రెహమాన్‌గారు ఆరు నెలల కిందే నేపథ్య సంగీతం స్టార్ట్ చేశారు. ఆయన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చూస్తే ‘బ్లాక్ పాంథర్, స్పైడర్ మేన్’ చూసినట్టు ఉంటుంది. ఈ క్రెడిట్ మెయిన్‌గా నిర్మాత సుభాస్కరన్‌గారికి ఇవ్వాలి. ఇక ఇండియన్ ఫిల్మ్‌కి ఇంతపెద్దగా ఎవరూ ఖర్చు పెట్టరు. కానీ, సినిమాపై ఉన్న ప్యాషన్‌తో ఇంత గ్రాండ్‌గా తీసినందుకు థ్యాంక్స్. మా టీమ్‌కి ఎంత ఎగై్జట్‌మెంట్ ఉందో అదే ఎగై్జట్‌మెంట్ ప్రేక్షకులకూ ఉంటుంది. ఇలాంటి సినిమాని మీడియా కూడా సపోర్ట్ చేస్తే మన దేశంలో కూడా ‘2.ఓ’ లాంటి సినిమా చేయొచ్చని ప్రపంచానికి చాటిచెప్పవచ్చు’’ అన్నారు. అక్షయ్ కుమార్ మాట్లాడుతూ– ‘‘2.ఓ’ నాకు ఒక సినిమా కాదు. శంకర్ ప్రిన్సిపల్‌గా ఉన్న స్కూల్‌కి వెళ్లినట్లు ఉంది. ఇండస్ట్రీలో 28 ఏళ్లుగా ఉంటూ నేర్చుకున్నదానికంటే ‘2.ఓ’ చిత్రంతో నేర్చుకున్నదే ఎక్కువ. బిగ్గెస్ట్ సూపర్‌స్టార్ రజనీకాంత్సార్కి విలన్‌గా నటించడం గౌరవంగా ఫీల్ అవుతున్నాను. రజనీకాంత్‌గారు సింపుల్లైన్లో కూడా మ్యాజిక్ చేయగలరు. ఎలానో నాకు తెలీదు. ఆయనతో నటించే అవకాశంతో పాటు ఈ సినిమాలో భాగమయ్యే అవకాశం ఇచ్చిన శంకర్‌కి థ్యాంక్స్. నిర్మాత సుభాస్కరన్ బాగా ఖర్చు పెట్టారు. నేను కూడా ఇంకా సినిమా చూడలేదు. రిలీజ్ కోసం ప్రేక్షకుల్లా నేను కూడా ఎదురుచూస్తున్నాను’’ అన్నారు. హైదరాబాద్‌లో ‘2.ఓ’ సినిమా ప్రమోషన్లో పాల్గొన్న శంకర్ ఇంటర్వ్యూ విశేషాలు... ► నాలుగేళ్ల ‘2.ఓ’ ప్రయాణం ముగిసింది. సినిమా రిలీజవుతోంది. ఈ ఫీలింగ్ ఇప్పుడు ఎలా ఉంది? సినిమాని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో? ఎంత ఎంజాయ్ చేస్తారో అని ఎదురుచూస్తున్నా. ► ఈ సినిమా టెక్నాలజీ, బడ్జెట్ పెరగడం గురించి..? స్క్రిప్ట్ డిమాండ్ మేరకే త్రీడీ టెక్నాలజీ వాడాం. కొత్తగా డిజైన్ చేయాలనుకున్నాం. అందుకు కొంత ఖర్చు పెట్టక తప్పదు. ట్రైలర్లో కనిపించిన సెల్మెన్, బర్డ్.. అన్నీ సెటప్‌నే. వాటిని డిజైన్ చేయడానికి చాలా టైమ్ పట్టింది. బడ్జెట్ కూడా పెరిగింది. క్రియేట్ చేసిన క్యారెక్టర్స్‌లో ఎమోషన్స్‌ని సిల్వర్‌స్క్రీన్‌పై చూపించడం చాలెంజింగ్‌గా అనిపించింది. ► ‘2.ఓ’ కథాంశం పెద్దగా బయటకు రాలేదు? ఫస్ట్ నన్ను నేను ఒక ఆడియన్‌గా భావించి థియేటర్‌కి వెళతాను. ఓ ప్రేక్షకునిగా సినిమాను నేను ఎలా ఎంజాయ్ చేయాలనుకుంటానో అలాంటి అనుభవాన్నే నా సినిమా చూస్తున్నవారికి ఇవ్వాలన్నది నా ఆలోచన. అందుకే సినిమాలో కోర్ సబ్జెక్ట్‌ను రివీల్ చేయలేదు. చేస్తే ఆడియన్స్ సర్ప్రైజ్ మిస్ అవు తారు. అందుకే ట్రైలర్లో ఎక్కువ కథ చెప్పలేదు. ► మేకింగ్ వీడియోలో అక్షయ్ కష్టం కనిపించింది. ఆయనతో వర్క్ చేయడం ఎలా అనిపించింది? అక్షయ్ కుమార్ కమిట్మెంట్, డెడికేషన్, డిసిప్లేన్ సూపర్. ప్రతిరోజూ 3–4 గంటలు వర్క్ చేయాల్సిందే. కేవలం మేకప్ తీయడానికే గంటన్నర పట్టేది. ప్రోస్థటిక్ మేకప్, టీత్, పెద్ద బరువు ఉన్న డ్రెస్‌లు వేసుకున్నారు. మండు వేసవిలోనూ షూటింగ్లో పాల్గొన్నారు. అందుకే ఆయన్ని విలన్‌గా అనుకోలేదు. ఆయన క్యారెక్టర్లో షేడ్స్ ఉంటాయి. అవి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ► రజనీగారితో ‘రోబో’ కి పని చేసారు? ఇప్పుడు ‘2.ఓ’కి.. ఎమైనా డిఫరెంట్‌గా అనిపించిందా? ప్రతి సినిమాకు రజనీగారు కష్టపడతారు. ఆయన ఏం చేసినా ఎట్రాక్టివ్‌గా ఉంటుంది. ఒక స్టైల్, ఫన్, పెర్ఫార్మెన్స్..అన్నీ ఉంటాయి. ► ‘రోబో’ కి సీక్వెల్ ఆలోచన ఎప్పుడొచ్చింది? ‘రోబో’ సినిమాకి సీక్వెల్ ఉంటే బాగుటుందని ఆడియన్స్ అనుకున్నారు. కరెక్ట్ స్టోరీ కుదరాలని నేను అనుకున్నాను. సెకండ్ పార్ట్‌పై అంచనాలతో వచ్చిన ఆడియన్స్ నిరుత్సాహపడకూడదు. 5 సంవత్సరాల క్రితం ఓ స్ట్రీట్‌లో చాలా సెల్‌ఫోన్స్ కనిపించాయి నాకు. అప్పుడే ‘2.ఓ’ ఐడియా వచ్చింది. ► ‘2.ఓ’ లో ఐశ్వర్యారాయ్‌ని ఎందుకు తీసుకోలేదు? ‘రోబో’ లో ట్రయాంగిల్ లవ్‌స్టోరీ ఉంది. కానీ ‘2.ఓ’ డిఫరెంట్ స్టోరీ. సైంటిస్ట్, చిట్టి, రోబో 2.0 క్యారెక్టర్లు ఉన్నాయి. స్టోరీ డిమాండ్ చేయలేదు. కానీ, ఐశ్వర్యారాయ్ క్యారెక్టర్ రిఫరెన్స్ సినిమాలో కనిపిస్తుంది. ► తర్వాతి ప్రాజెక్టులు ఏంటి? కమల్‌హాసన్‌తో ‘ఇండియన్ 2’ సినిమా చేయబోతున్నాను. ఇందులో బాలీవుడ్, సౌత్ స్టార్స్ ఉంటారు. డిసెంబరులో షూటింగ్ స్టార్ట్ చేస్తాం. -
‘యంతర లోకపు సుందరివే’ సాంగ్ కోసం ఎంత ఖర్చు?
20 కోట్ల బడ్జెట్ అంటే ఓ ఆరేడు చిన్న సినిమాలు తీయొచ్చు. కానీ ‘2.ఓ’ సినిమాలో ‘యంతర లోకపు సుందరివే’ సాంగ్ కోసం 20 కోట్లు ఖర్చు చేశారని వార్తలు వస్తున్నాయి. రెండు రోబోల మధ్య సాగే ఈ రొమాంటిక్ పాటకు బాస్కో మార్టిస్ కొరియోగ్రఫీ చేశారు. ఈ సాంగ్ గురించి ఆయన మాట్లాడుతూ– ‘‘2.ఓ’, ‘ఐ’ సినిమాలకంటే ముందు ‘ఎందిరిన్’ (తెలుగులో ‘రోబో’) సినిమాకు నేను శంకర్‌తో కలిసి వర్క్ చేయాల్సింది. కుదర్లేదు. విక్రమ్ హీరోగా వచ్చిన ‘ఐ’ సినిమాకు శంకర్‌తో కలిసి వర్క్ చేశాను. అందులో ‘పూలనే కునుకేయమంట’ అనే సాంగ్‌ను చైనాలో దాదాపు 30 రోజులు షూట్ చేశాం. ఇప్పుడు ‘2.ఓ’ సినిమాలోని ‘యంతర లోకపు...’ సాంగ్‌ను పది రోజులు షూట్ చేశాం. ఈ ఒక్క సాంగ్ కోసమే నాలుగు డిఫరెంట్ సెట్స్‌ను రూపొందించడం జరిగింది. విదేశాల నుంచి డ్యాన్సర్స్‌ను తెప్పించాం’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘ఈ సాంగ్‌ను కొరియోగ్రఫీ చేసే సమయంలో మేజర్‌గా రెండు విషయాల గురించి ఆలోచించాం. ఒకటి.. రోబో జంట మధ్య రొమాంటిక్ ఫ్లేవర్‌ను స్క్రీన్ పైకి అద్భుతంగా తీసుకురావడం, రెండు.. రజనీకాంత్‌గారి ఏజ్ అండ్ వాకింగ్ స్టైల్. కానీ ఒక్కటంటే ఒక్క స్టెప్‌ను కూడా మార్చమని రజనీకాంత్‌సార్ చెప్పలేదు. రిహార్సల్స్‌లో చూపించిన ఎనర్జీనే సెట్లో రిపీట్ చేసి అందర్నీ ఆశ్యర్యపరచారు. అమీ జాక్సన్ కూడా డ్యాన్స్ అదరగొట్టింది. పెట్టిన ఖర్చుకు, వెచ్చించిన సమయానికి తగిన ఫలితం ఈ సాంగ్‌కు దక్కుతాయన్న నమ్మకం ఉంది’’ అని పేర్కొన్నారు. రజనీకాంత్, అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ ముఖ్య తారలుగా శంకర్ దర్శకత్వంలో దాదాపు 550 కోట్ల భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. -
ఈ నెలాఖరు నుంచి రజనీ వారోత్సవాలు
తమిళసినిమా: ఈ నెలాఖరు నుంచి రజనీకాంత్ వారోత్సవాలు మొదలవుతున్నాయి. ఆయన అభిమానులకు ఇక సినిమాల పండగే. ఒకవైపు రజనీ రాజకీయ ఆరంగేట్రం గురించి చర్చ జరుగుతుండగా.. మరోవైపు ఆయన సినిమాలు వరుసబెట్టి వస్తుండటంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. సూపర్‌స్టార్ నటించిన కాలా చిత్రం కాస్త నిరాశ పరచినా, దాన్ని మరిపించేందుకు వరుసగా రెండు భారీ చిత్రాలు వస్తున్నాయి. రజనీకాంత్, శంకర్ కాంబినేషన్లో భారీ చిత్రం 2.వో.. ఈ నెల 29న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇక, రజనీ మరో చిత్రం ‘పేట’ కూడా వెనువెంటనే వచ్చేందుదకు సిద్ధమవుతోంది. యువ దర్శకుడు కార్తీక్‌సుబ్బరాజ్ తెరకెక్కించిన ఈ సినిమాలో రజనీకి జంటగా నటి త్రిష, సిమ్రాన్ నటించారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను యమ స్పీడ్‌గా జరుపుకుంటోంది. ఈ చిత్ర సింగిల్ ట్రాక్‌ను డిసెంబర్ 3న, రెండో సింగిల్ ట్రాక్‌ను అదే నెల 7న విడుదల చేయనున్నారు. ఇక రజనీ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 9న ఆడియో విడుదల చేస్తున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు కార్తీక్‌సుబ్బరాజ్ ట్విటర్లో వెల్లడించారు. ఈ సినిమా సంక్రాంతికి తెరపైకి రానుందని గతంలో చిత్రవర్గాలు వెల్లడించినా, ఆ తరువాత చిత్రం వాయిదా పడే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. పేట పొంగల్‌కు రావడం ఖాయమని తాజాగా కార్తీక్‌సుబ్బరాజు స్పష్టం చేశారు. 2.వో శంకర్ స్టైల్ విజువల్ ట్రీట్ అయితే పేట రజనీ స్టైల్ ట్రీట్‌గా ప్రేక్షకులను అలరించనుంది. మొత్తానికి రజనీ అభిమానులకు ఈ నెల 29 నుంచి పొంగల్ వరకు పండగే పండగన్న మాట. -
విజువల్ వండర్
దాదాపు 560 కోట్ల భారీ బడ్జెట్.. 3000 మంది వీఎఫ్ఎక్స్ టెక్నీషియన్స్.. 250 వీఎఫ్ఎక్స్ షాట్స్‌తో విజువల్ వండర్‌గా తెరకెక్కింది ‘2.0’. అంతేనా? పూర్తి స్థాయి 3డీ టెక్నాలజీతో, 4డీ సౌండ్ టెక్నాలజీతో రూపొందిన తొలి భారతీయ సినిమాగా రికార్డ్ సృష్టించింది ‘2.0’. శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన చిత్రం ‘2.0’. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించారు. ఈ సినిమాను తెలుగులో ఎన్వీ ప్రసాద్ ఈ నెల 29న రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రం మేకింగ్ వీడియో, ట్రైలర్, సాంగ్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్రబృందం మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాతో ఇండియన్ సినిమా అంతర్జాతీయ స్థాయికి చేరుతుంది. సినిమా ఇంత బాగా రావడానికి ముఖ్య కారణం నిర్మాతల సహకారమే. ఎంతో మంది టెక్నీషియన్స్ శ్రమించారు. ఆల్రెడీ విడుదలైన పాటలకు, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. 29న సరికొత్త అనుభవాన్ని ప్రేక్షకులు పొందుతారు’’ అని పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహమాన్, కెమెరా: నీరవ్ షా. -
‘2.ఓ’ స్టిల్స్
-
అంచనాలు పెంచేస్తున్న ‘2.ఓ’ స్టిల్స్
ఇండియన్ సిల్వర్ స్ర్కీన్‌ను షేక్ చేయడానికి రజనీకాంత్ ‘2.ఓ’ సిద్దమైంది. స్టార్ డైరెక్టర్ శంకర్ హాలీవుడ్ స్థాయిలో సృషించిన ఈ విజువల్ వండర్ ఈ నెల 29న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. అక్షయ్‌కుమార్ నెగటీవ్ రోల్లో నటిస్టున్న ఈ చిత్రంలో రజనీ సరసన అమీజాక్సన్ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో టీజర్, ట్రైలర్ రూపంలో చిత్ర యునిట్ అభిమానులకు రుచి చూపించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేయడానికి చిత్ర బృందం సినిమాకు సంబంధించిన స్టిల్స్‌ను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తున్నాయి. ఆ లుక్ వెనుక ఇంత శ్రమనా.. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్లో అక్షయ్ కుమార్ రాక్షస రూపంలో అందరినీ భయపెట్టే ప్రయత్నం చేశాడు. అయితే అక్షయ్ లుక్స్ అన్నీ గ్రాఫిక్స్ ద్వారా క్రియేట్ చేశారని రూమర్స్ వస్తున్న తరుణంలో అక్షయ్ కుమార్ ఓ వీడియోను షేర్ చేశారు. ఇది కేవలం టెక్నికల్ వండర్ మాత్రమే కాదు, దీని వెనుక ఎంతో శ్రమ దాగి ఉందని ఆయన తెలిపారు. ఇక ఆ వీడియోలో మేకప్ బృందం, టెక్నీషియన్స్ గంటల తరబడి శ్రమించి అక్షయ్‌కు ఆ లుక్‌ను తీసుకొచ్చారు. అక్షయ్ షేర్ చేసిన మేకింగ్ వీడియో తెగ వైరల్ అవుతోంది. -
‘2.ఓ’ అక్షయ్ కుమార్ మేకప్ మేకింగ్ వీడియో
-
లేట్ అయినా కరెక్ట్‌గా రావాలి.. వస్తే కొట్టాలి
సూపర్ స్టార్ రజనీకాంత్ తనదైన శైలిలో ఎంతో స్టైల్‌గా, కాన్ఫిడెంట్‌గా అన్న మాటలివి. కొట్టాలంటే.. హిట్‌ని ఉద్దేశించి అంటున్నా అని ఆయన సరదాగా అన్నారు. కొన్ని మాటలు మాట్లాడుతున్నప్పుడు ఉద్వేగానికి గురయ్యారు కూడా. ఉదాహరణకు ‘2.0’ చేస్తున్నప్పుడు నాకు ఆరోగ్యం బాగా లేక ‘ఇక నా వల్ల కాదు శంకర్’ అనే మాటలను. ‘నా తల్లీతండ్రి, దైవం అయినా మా అన్నయ్య, అప్పుడప్పుడు నా తప్పులను మన్నించిన మా అన్నయ్య ఈ వేడుకకు రావడం ఆనందంగా ఉంది’ అని మాటలను వేదిక సాక్షిగా అన్నప్పుడు రజనీకాంత్ కళ్లు చెమర్చడం విశేషం. సూపర్‌స్టార్ రజనీకాంత్, గ్రేట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్ నిర్మించిన చిత్రం. సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో ఎన్వీ ప్రసాద్ విడుదల చేస్తున్నారు. పూర్తిగా త్రిడీ ఫార్మాట్లో చిత్రీకరణ జరుపుకున్న తొలి భారతీయ సినిమా ‘2.0’ కావడం విశేషం. ఈ చిత్రానికి 4డి ఫార్మాట్లో సౌండ్ డిజైన్ చేయడం మరో విశేషం. ఈ నెల 29న ‘2.0’ని విడుదల చేస్తున్న సందర్భంగా చెన్నైలో 4డి ట్రైలర్‌ను విడుదల చేశారు. ఆత్మవిశ్వాసం పోయింది ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ – ‘‘సుభాస్కరన్కి, శంకర్‌కి అడ్వా¯Œ్స కంగ్రాట్స్. శంకర్‌ని నమ్మి నిర్మాత 600 కోట్లు పెట్టారు. అంతేగానీ నన్నో, అక్షయ్కుమార్నో నమ్మి కాదు. ఆడియ¯Œ్స ఎక్స్పెక్టేషన్, నిర్మాతల ఎక్స్పెక్టేషన్ని ఎప్పుడూ రీచ్ అవుతూనే ఉన్నారు శంకర్. కొన్నిసార్లు తప్పి ఉండవచ్చు. అయినా అతను మెజీషియన్. ఏదో రూ.600కోట్లు పెట్టినంత మాత్రాన ఈ సినిమా హిట్ అని నేను చెప్పడం లేదు. అందరూ కష్టపడతారు. అయినా అన్నిసార్లు వర్కవుట్లు కావు. కొన్నిసార్లు ఏవో మేజిక్‌లు వర్కవుట్లు అవుతాయి. ఈ సినిమాలో అలాంటి మేజిక్‌లున్నాయి. ఈ సినిమాకు ప్రమోషన్ తక్కువగా ఉందని కొందరు అంటున్నారు. కానీ ఇలాంటి సినిమాలకు ప్రమోషన్ అవసరంలేదు. ఈ సినిమా విడుదలైన తర్వాత ప్రతి ఒక్కరూ ఈ సినిమాను ప్రమోట్ చేస్తారు. మంచికి తోడుగా ఉండే మీడియా తప్పకుండా ఎంకరేజ్ చేస్తారు. పర్యావరణాన్ని, సొసైటీని మోడ్రన్ టెక్నాలజీ ఎలా స్పాయిల్ చేస్తుందో ఇందులో చాలా బాగా చెప్పారు. శంకర్‌గారు ఏమనుకున్నారో దాన్ని తీయగల సత్తా ఆయనకుంది. అందుకే ఆయన కథ చెప్పినప్పుడు ‘ఇదెలా వర్కవుట్ అవుతుంది?’ అని అడగలేదు. ఎవరు నిర్మిస్తున్నారు? అని మాత్రం అడిగాను. ‘శివాజీ’ చేసేటపుడు ఆ సినిమాకు అనుకున్న బడ్జెట్ కన్నా రెట్టింపయింది. కానీ ఆ సినిమాకు అంత కన్నా ఎక్కువ మొత్తం కలెక్షన్లు వచ్చాయి. ‘రోబో’ తీయాలనుకున్నప్పుడు ‘శివాజీ’ ఎంత కలెక్ట్ చేసిందో అంత బడ్జెట్‌తో చేస్తాం..పెట్టింది వస్తే చాలన్నారు సన్ పిక్చర్స్ వాళ్లు.. దానికన్నా 20–30 పర్సెంట్ బడ్జెట్ ఎక్కువయింది. అయినా రెండింతలు వసూలు చేసింది. ‘రోబో’ కలెక్ట్ చేసినంత ఈ సినిమాకు వస్తే చాలు అని ‘2.0’ మొదలుపెట్టాం. అందుకే ముందు రూ. 300కోట్లు అనుకున్నాం. ఇప్పుడు డబుల్ అయింది. తప్పకుండా అంతకు డబుల్ కలెక్ట్ చేస్తుంది. ‘కబాలి’ ఒక షెడ్యూల్ చేసిన తర్వాత నాకు ఆరోగ్యం బాగా లేకుండాపోయింది. ‘2.0’ కోసం 5 రోజులు షూట్ చేశా. 7, 8 రోజులైంది. అప్పటికే నాకు ఆత్మవిశ్వాసం పోయింది. ‘నేను జస్టిఫై చేయలేను. ఖర్చుపెట్టిందంతా ఇచ్చేస్తాను. నేను చేయలేను’ అని శంకర్‌ని పిలిచి చెప్పా. ‘మీరు జస్ట్ అలా రండి. మీరు కన్ను చూపించండి.. మిగిలింది మొత్తం మనం చేద్దాం’ అన్నారు. 12 నుంచి 14 కేజీల బరువు ఉన్న బాడీ సూట్ వేసుకోవాలి. అది వద్దన్నారు. కానీ నేనే.. ఆ బాడీ సూట్ వేసుకుంటా అని అన్నాను. ‘కబాలి’ కోసం మలేసియాకి వెళ్లినప్పుడు ఆరోగ్యం ఇంకా చాలా పాడయింది. అప్పుడు డాక్టర్ నాలుగైదు నెలలు రెస్ట్ కావాలన్నారు. ఆ విషయం నిర్మాత సుభాస్కరణ్‌కు తెలిసి మా ఇంటికి వచ్చి ‘నాలుగు నెలలు కాదు, నాలుగు సంవత్సరాలు వెయిట్ చేస్తా. నాకు డబ్బులు కాదు. మీతో సినిమా ముఖ్యం’ అని అన్నారు. అలాంటి ఒక ఫ్రెండ్ దొరకడం అంటే.. ఓ కోహినూర్ డైమండ్ దొరికినట్టే. ఈ సినిమా చాలా లేట్ అయింది. ఎందుకు లేట్ అయింది అని చాలా మంది అడిగారు. కానీ కాస్త లేట్ అయినా, కరెక్ట్‌గా రావాలి. వస్తే, ష్యూర్‌గా కొట్టాలి. మేం హిట్ కొడుతున్నాం. శంకర్, రాజమౌళి, రాజ్‌కుమార్ హిరానీ లాంటివారు జెమ్స్ ఆఫ్ ఇండస్ట్రీ’’ అన్నారు. టన్నుల కొద్దీ కష్టపడ్డాం శంకర్ మాట్లాడుతూ – ‘‘ఇలా జరిగితే ఎలా ఉంటుంది’ అనే ఊహే ఈ కథ. సినిమా అనేదాన్ని కూడా దాటి... త్రీడీ, 4డీ అనే కొత్త అనుభవం ఉంటుంది. సుభాస్కరన్ లేకపోతే ఈ సినిమా లేదు. ఈ సినిమాకు గొప్ప బలం రజనీకాంత్‌గారు. ఈ సినిమా ప్రారంభించినప్పుడు రజనీసార్‌కి కాస్త అనారోగ్యంగా ఉంది. ఢిల్లీలో యాక్షన్ డైరెక్టర్లు, వీఎఫ్ ఎక్స్ డైరెక్టర్లు, అక్షయ్ కుమార్, చాలా మంది కార్పెంటర్లు, జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. దాదాపు ఆరు నెలల ముందే ప్లాన్ చేసుకున్న షెడ్యూల్ అది. దాదాపు 500–1000 మంది అక్కడ ఉన్నారు. ఆ సమయంలో రజనీకి అనారోగ్యంగా ఉన్నప్పటికీ 47 డిగ్రీల ఎండ, 12 కిలోల బరువు సూట్ వేసుకుని క్లైమాక్స్ చేశారు. ఒక రోజైతే ఆయనకు దెబ్బ తగిలింది కూడా నాకు తెలియదు. ఎవరో వచ్చి చెప్పారు. ఆయన్ని కూర్చోపెట్టి.. ప్యాంట్ కాస్త పైకి తీసి చూస్తే రెండు ఇంచ్‌లు తెగిన విషయం తెలిసింది. ఇలాంటి డెడికేషన్ వల్లనే ఆయన సూపర్‌స్టార్ అయ్యారు. అక్షయ్‌గారు ఈ సినిమాకు పడ్డంత కష్టం ఏ సినిమాకీ పడి ఉండరు. రెహమా¯Œ మళ్లీ మళ్లీ మ్యూజిక్ చేస్తూనే ఉన్నారు. ఈ సినిమాకు చేసిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అంతా పాటల్లాగానే ఉన్నాయి. వేలమంది టన్నుల కొద్దీ కష్టపడి చేసిన చిత్రమిది. మీడియా సపోర్ట్ చేస్తే, మన ఊరిలోనూ ఇలాంటి సినిమాలను చేయగలం అని ప్రపంచానికి చెప్పగలం. ఈ సినిమా కథను రాసేటప్పుడు ఇది త్రీడీలో తీస్తేనే బావుంటుందని అనుకున్నా. సౌండ్ మాత్రం 4 డీలో ఉండాలని అనుకున్నా. నా ఎన్నో ఏళ్ల కల అది. మామూలుగా మనం సినిమా చూసేటప్పుడు చుట్టుపక్కల నుంచి, పై నుంచి స్పీకర్ల ద్వారా శబ్దాలను వినొచ్చు. కానీ కాళ్ల కింద కూడా స్పీకర్లు ఉంటే... నేల మీద జరిగే అంశాలకు కూడా సౌండ్ కల్పిస్తే బావుంటుందని ఆశించాను. రసూల్ పూకుట్టి కూడా దానికి ఎంతగానో సహకరించారు’’ అని అన్నారు. ‘‘2డీలో సినిమా తీసి త్రీడీకి మారిస్తే అంత నాణ్యత కనిపించదు. అలాగని త్రీడీలో తీయడం కూడా సులభం కాదు. చాలా కష్టతరమైన అంశం’’ అన్నారు కెమెరామేన్ నీరవ్ షా . అక్షయ్ కుమార్ మాట్లాడుతూ – ‘‘రజనీసార్, శంకర్‌సార్, రెహమాన్‌గారితో కలిసి ‘2.0’లో నా పేరు కూడా ఉండటం ఆనందంగా ఉంది. ఈ సినిమాకోసం నన్ను అప్రోచ్ అయిన టీమ్‌కి ధన్యవాదాలు. ఈ సినిమా వల్ల నేను చాలా నేర్చుకున్నా. శంకర్ నా దృష్టిలో సైంటిస్ట్. మూడున్నర గంటలు కూర్చుని మేకప్ చేసుకోవడం, గంటన్నర దాన్ని తీయడానికి కేటాయించడం మరచిపోలేను’’ అని అన్నారు. ఎ.ఆర్.రెహమాన్ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాలో ముందు మేం పాటలు లేవనుకున్నాం. కేవలం బ్యాగ్రౌండ్ స్కోరే అనుకున్నాం. కానీ ఇప్పుడు నాలుగు పాటలున్నాయి. ఇందిరలోకం.. అనే పాటకోసం దాదాపు 12, 13 ట్యూన్ల తర్వాత శంకర్‌గారు ఈ ట్యూన్ సెలక్ట్ చేశారు. ముందు రీ–రికార్డింగ్‌ని కీబోర్డ్, కంప్యూటర్స్‌లో కంపోజ్ చేశాం. నెల రోజుల క్రితం 100 మంది ఆర్కెస్ట్రా లండన్‌లో, ముంబైలో 40 మంది, చెన్నైలో ఇంకొంతమందితో చేశాం. నాకు రజనీకాంత్‌గారు చాలా రకాలుగా స్ఫూర్తినిచ్చారు. చిన్నతనం నుంచి సంగీత రంగంలో ఉండటం వల్ల నేను 40 ఏళ్లప్పుడు రిటైర్ కావాలని అనుకున్నా. అప్పుడే ‘రోబో’ సినిమా చేస్తున్నా. ఆ సెట్‌కి వెళ్లి రజనీకాంత్‌గారిని చూశాక, ఆఫ్ సెట్, ఆన్ సెట్ ఆయన్ని చూశాక నా మనసు మారింది. ఇవాళ నేను సంగీత రంగంలో ఉండటమే గొప్ప కటాక్షంగా భావిస్తున్నా. ‘2.0’కి పనిచేసిన అను భవం 8 సినిమాలు చేసినట్టు అనిపిస్తోంది’’ అని అన్నారు. రసూల్ పూకుట్టి మాట్లాడుతూ – ‘సాఫ్ట్వేర్ డెవలపర్స్ సాయం మర్చిపోలేం. ధ్వని విషయంలో చోటుచేసుకున్న చారిత్రాత్మక విషయానికి ఈ ప్రదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రత్యక్ష సాక్షులు. ఇంత గొప్ప అచీవ్మెంట్లో భాగం కావడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి, కన్నడ నటులు ఉపేంద్ర, శివరాజ్కుమార్లతో పాటు పలువురు ప్రముఖులు అడిగిన ప్రశ్నలను స్క్రీన్‌పై డిస్ప్లే చేయగా, చిత్రబృందం సమాధానాలిచ్చింది. అలాగే నటుడు కమల్‌హాసన్ వీడియో ద్వారా తన అభినందనలు తెలిపారు. -
2.ఓ ట్రైలర్ లాంచ్
-
రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
భారతీయ సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 2.ఓ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. భారీ విజువల్స్ గ్రాఫిక్స్‌తో రూపొందించిన ఈ ట్రైలర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ ట్రైలర్ లాంచింగ్ సందర్భంగా హీరో రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షూటింగ్ సందర్భంగా మానసికంగా శారీరకంగా చాలా శ్రమపడాల్సి వచ్చిందన్నారు. ‘దాదాపు 12 కేజీల సూట్‌వేసుకొని షూటింగ్ చేయటం కష్టమనిపించింది. అదే సమయంలో 3డీలో తెరకెక్కిస్తున్న కారణంగా ఒక్కే షాట్ 8, 9 సార్లు తీయాల్సి వచ్చేది. ఓ దశలో ఇక సినిమా చేయలేనని శంకర్‌తో చెప్పేశా. కానీ శంకర్ మీరే ఈ సినిమా చేయాలి, చేయగలరని నన్ను ఒప్పించారని’ తెలిపారు. ‘నిర్మాత శుభకరన్ కూడా ఎంతో సహకరించారు. షూటింగ్ మొదలు పెట్టిన కొద్ది రోజులకే నా ఆరోగ్యం దెబ్బతింది. దీంతో షూటింగ్ చాలా ఆలస్యమైంది. అప్పుడు నిర్మాత నాలుగు నెలలు కాదు నాలుగు సంవత్సరాలైనా మీరు రెస్ట్ తీసుకోండి మీ ఆరోగ్యం ముఖ్యం అన్నారు. వారి సహకారం వల్లే సినిమా ఇంత బాగా వచ్చిందన్నా’రు రజనీ. ఈ సినిమా తరువాత శంకర్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుదంటారన్న రజనీ.. అక్షయ్‌నో నన్నో నమ్మి రూ. 600 కోట్లు పెట్టుబడి పెట్టలేదు, కేవలం శంకర్‌ను నమ్మి మాత్రమే నిర్మాత ఇంత ఖర్చు పెట్టారని తెలిపారు. అంతేకాదు శంకర్ ఇండియన్ స్పిల్ బర్గ్, జేమ్స్ కామరన్ అని ఆకాశానికి ఎత్తేశారు. శంకర్, రాజమౌళి, రాజ్‌కుమార్ హిరాణీ లాంటి వారు జెమ్స్ ఆఫ్ ఇండియన్ సినిమా అన్నారు రజనీ. -
2.ఓ ట్రైలర్ వచ్చేసింది!
భారతీయ సినీ రంగంలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన 2.ఓ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. రోబోకు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌ను చెన్నైలో జరిగిన భారీ ఈవెంట్లో రిలీజ్ చేశారు. 3డీ వర్షన్ ట్రైలర్‌ను కూడా పలు థియేటర్లలో ప్రదర్శించనున్నారు. హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్‌తో రూపొందిన ఈ ట్రైలర్ సినిమా మీద అంచనాలను మరింత పెంచేసింది. రజనీ యాక్షన్, అక్షయ్ లుక్, రోబో అమీ జాక్సన్ గ్లామర్ ఇలా అన్ని ట్రైలర్‌కు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తీసుకువచ్చాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి రోబో చిట్టిగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ప్రతినాయక పాత్రలో అలరించనున్నాడు. మరోసారి గ్రేట్ డైరెక్టర్ శంకర్ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పూర్తిస్థాయి 3డీ చిత్రంగా ఈ సినిమాను రూపొందించాడు. చాలా కాలం కిందటే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా గ్రాఫిక్స్ ఆలస్యం కావటంతో వాయిదా పడింది. ఈ నెల 29న 2.ఓ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
జస్ట్ మిస్
రజనీకాంత్, కమల్‌హాసన్... తమిళ సినిమాకు రెండు పిల్లర్స్ లాంటి యాక్టర్స్. ఎప్పుడో కెరీర్ తొలినాళ్లలో ఈ ఇద్దరు హీరోలు ‘అంతులేని కథ’, 16 వయదినిలే’ వంటి పలు బ్లాక్బాస్టర్ చిత్రాల్లో కలసి యాక్ట్ చేశారు. ఆ తర్వాత మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోలేదు ఈ సూపర్ స్టార్స్. రీసెంట్గా ఈ స్టార్స్ ఇద్దరూ కలసి నటించే చాన్స్ జస్ట్ మిస్ అయింది అంటున్నారు శంకర్. రజనీకాంత్ హీరోగా శంకర్ తెరకెక్కించిన చిత్రం ‘2.ఓ’. ఈ చిత్రంలో విలన్‌గా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించారు. కానీ తొలుత ఈ పాత్రకు హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్, ఆ తర్వాత బాలీవుడ్లో ఆమిర్ ఖాన్ పేర్లను పరిశీలించారనే టాక్ వినిపించింది. అయితే విలన్ పాత్రకు కమల్‌హాసన్ పేరును కూడా అనుకున్నారట దర్శకుడు శంకర్. ఆ పాత్ర కోసం కమల్‌ను సంప్రదించారని కూడా చెప్పుకొచ్చారు శంకర్. ఈ విషయాన్ని తెలియజేస్తూ– ‘‘2.ఓ’ కంటే ‘భారతీయుడు’ సీక్వెల్ మీద కమల్‌సార్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు. దాంతో కమల్‌సార్‌ని నటింపజేయాలనుకునే ఆలోచన విరమించుకున్నాను’’ అని అన్నారు శంకర్. -
అదిరే... అదిరే...
చిట్టి చేయబోయే సాహసాలను ఆల్రెడీ చిన్న శ్యాంపిల్‌లా గత నెలలో టీజర్ ద్వారా చూపించారు దర్శకుడు శంకర్. ఇప్పుడీ సీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌ను మరింత టీజ్ చేయడానికి సిద్ధమయ్యారు ‘2.ఓ’ చిత్రబృందం. రజనీకాంత్ హీరోగా శంకర్ తెరకెక్కించిన భారీ చిత్రం ‘2.ఓ’. 2010లో రిలీజ్ అయిన ‘రోబో’ చిత్రానికి ఇది సీక్వెల్. అక్షయ్ కుమార్ విలన్‌గా కనిపిస్తారు. దాదాపు 550 కోట్ల భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌ను శనివారం చెన్నైలో పలువురు ప్రముఖుల సమక్షంలో రిలీజ్ చేయనున్నారు. ట్రైలర్ అదిరిపోయేలా ఉందని టాక్. ఈ నెల 29న చిత్రం రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహమాన్. -
‘2.ఓ’ ట్రైలర్ రాబోతోంది!
ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్, ఇండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్ కాంబినేషన్ అంటే అదొక సెన్సేషనే. వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు రికార్డులు సృష్టించాయి. తాజాగా రోబోకు సీక్వెల్‌గా రాబోతోన్న 2.ఓ సినిమాపై ఇండియా వైడ్‌గా క్రేజ్ నెలకొంది. ఎన్నో వాయిదాల తరువాత నవంబర్ 29న విడుదల కానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు అంచనాలు నెలకొన్నాయి. త్రీడీ ఫార్మాట్లో రానున్న ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ప్రేక్షకుల దాహాన్ని తీర్చేందుకు ట్రైలర్‌తో చిత్రయూనిట్ సిద్దమవుతోంది. ఈ మూవీ ట్రైలర్‌ను నవంబర్ 3న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ ప్రధాన పాత్రల్లో నటించగా, ఏ ఆర్ రెహమాన్ సంగీతాన్ని సమకూర్చారు. -
పండగ ముందే వస్తోంది
‘రోబో’ సినిమాలో ‘చిట్టి’ రజనీకాంత్ దీపావళి పండగ రాక ముందే ‘హ్యాపీ దీపావళి’ అంటూ తనను పట్టుకోవడానికి వచ్చిన పోలీసులపై బులెట్స్ వర్షం కురిపిస్తాడు. ఈ సీక్వెల్ ద్వారా కూడా అలానే పండగ రాకముందే దీపావళి శుభాకాంక్షలు చెప్పడానికి రెడీ అవుతున్నారట. రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం ‘2.ఓ’. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ విలన్‌గా నటించారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రంలో అమీ జాక్సన్ కథానాయిక. ‘2.ఓ’ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఈ చిత్రం ట్రైలర్‌ను నవంబర్ 3న రిలీజ్ చేయడానికి చిత్రబృందం ప్లాన్ చే స్తోందట. దీపావళి పండక్కి ఐదారు రోజుల ముందే ట్రైలర్ వస్తే రజనీ అభిమానులు ముందే పండగ చేసుకుంటారని చెప్పొచ్చు. ఆల్రెడీ రిలీజ్ చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. విజువల్ ఎఫెక్ట్స్ ఆలస్యం కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం నవంబర్ 29న రిలీజ్ కానుంది. ప్రస్తుతం రజనీకాంత్ ‘పేట్టా’ సినిమా పూర్తి చేశారు. సంక్రాంతికి విడుదల కానుందని టాక్. -
వేలానికి ‘2.ఓ’
ఒక చిత్రాన్ని వేలంలో కొనుగోలు చేయడం అన్నది అరుదైన విషయం. ఇంతకు అలా ఒకటి రెండు చిత్రాలకు జరిగింది. తాజాగా ఆ పరిస్థితి సూపర్‌స్టార్ చిత్రానికి నెలకొందని తెలుస్తోంది. రజనీకాంత్ చిత్రం అంటేనే యమ క్రేజ్ ఉంటుంది. దానికి స్టార్ దర్శకుడు శంకర్ తోడైతే ఆ చిత్రం స్థాయే వేరుగా ఉంటుంది. ఇక నిర్మాణంలో భారీ స్థాయికి మారు పేరుగా నిలిచిన లైకా సంస్థ నిర్మాణం అయితే అంచనాలు ఆకాశాన్ని తాకుతాయని చెప్పనవసరం లేదు. ఆ చిత్రమే 2.ఓ. రజనీకాంత్, బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్‌కుమార్, నటి ఎమిజాక్సన్, ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు పనిచేస్తున్న చిత్రం 2.ఓ. దర్శకుడు శంకర్ అద్భుత ప్రతిభకు నిదర్శనంగా నిలవనున్న చిత్రం ఇది. సుమారు రూ.500 కోట్ల అత్యంత భారీ బడ్జెట్లో ఇండియాలోనే తొలి భారీ బడ్జెట్ చిత్రంగా 2.ఓ నమోదు కానుంది. ఈ చిత్రంలో గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ వంటి సాంకేతిక పరిజ్ఙానం హాలీవుడ్ చిత్రాలను తలదన్నేవిధంగా ఉంటుందంటున్నారు. చిత్రంలో గ్రాఫిక్స్ సన్నివేశాలకు అధిక ప్రాముఖ్యత ఉంటుందని, ప్రతి సన్నివేశం ప్రేక్షకులు అబ్బురపడేలా ఉంటుందని చిత్ర వర్గాలంటున్నారు. కాగా చిత్రాన్ని నవంబర్ 29న విడుదల చేయనున్నట్లు లైకా సంస్థ నిర్వాహకులు ఇది వరకే వెల్లడించారు. తాజాగా చిత్ర దర్శకుడు శంకర్ కూడా ఆ తేదీని ఖరారు చేస్తూ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇప్పుడి వరకూ 2.ఓ చిత్రంపై రకరకాల ప్రచారం జరుగుతూ వచ్చింది. తాజాగా చిత్రాన్ని కొనుగోలు చేయడానికి ఏరియాకు 10 మంది చొప్పున బయ్యర్లు పోటీ పడుతున్నారని సమాచారం. దీంతో చిత్ర వర్గాలు 2.ఓ చిత్రాన్ని వేలం పద్ధతిలో అమ్మకాలు జరపడానికి రెడీ అవుతున్నట్లు తాజా సమాచారం. కాగా రజనీకాంత్ నటిస్తున్న మరో చిత్రం పేట కూడా శుక్రవారంతో షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. త్రిష తొలిసారిగా రజనీకాంత్‌తో జతకడుతున్న చిత్రం పేట. దీన్ని వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. రజనీకాంత్ తదుపరి ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో నటించనున్నారనే ప్రచారం జోరందుకుంది. -
స్పీడు పెంచిన ‘చిట్టీ’
సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్, గ్రేట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ విజువల్ వండర్ 2.ఓ. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను నవంబర్ నెలాఖరున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు రిలీజ్ వాయిదా పడటంతో ఈ సారి ఎట్టి పరిస్థితుల్లో ఆలస్యం చేయకూడదని భావిస్తున్నారు చిత్రయూనిట్. ఇప్పటికే నిర్మాణానంతర కార్యక్రమాలు చివరిదశకు చేరుకోవటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచారు. ఇటీవల రిలీజ్ అయిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ రావటంతో తాజాగా నాలుగవ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. గ్రాఫిక్స్, షూటింగ్ కు సంబంధించి చిత్రయూనిట్ ఎంత శ్రమకు ఓర్చి సినిమాను తెరకెక్కించారో ఈ మేకింగ్ వీడియోలో చూపించారు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ప్రతినాయక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో అమీజాక్సన్ రజనీకి జోడిగా కనిపించనున్నారు. &rel=0 -
అతిథి పాత్రలో ఐశ్వర్య?
‘ఎందిరిన్’ సినిమాలో చిట్టి (రోబో) ఐశ్వర్యా రాయ్‌ని గాఢంగా ప్రేమించాడు. ఇప్పుడు ‘2.0’ సినిమా కోసం మళ్లీ చిట్టి వస్తున్నాడు. పనిలో పనిగా తన గార్ల్‌ఫ్రెండ్‌ని కూడా చూసుకునే అవకాశం చిట్టికి ఉందట. అదేనండీ.. ‘2.0’ సినిమాలో ఐశ్వర్యా రాయ్ కూడా ఓ గెస్ట్ రోల్లో కనిపించబోతున్నారని చెబుతున్నాం. శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్, అక్షయ్‌కుమార్, అమీ జాక్సన్ ముఖ్యతారలుగా నటించిన సినిమా ‘2.0’. 2010లో వచ్చిన ‘ఎందిరిన్’ (తెలుగులో ‘రోబో’) సినిమాకు ఇది సీక్వెల్ అన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో తొలి పార్ట్‌లో హీరోయిన్గా నటించిన ఐశ్వర్యా రాయ్ సీక్వెల్లో ఓ గెస్ట్ రోల్ చేశారని తాజా కోలీవుడ్ టాక్. ఆ సంగతలా ఉంచితే.. ఇటీవల విడుదల చేసిన టీజర్లో అక్షయ్ కుమార్‌కు స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉందని ఆయన ఫ్యాన్స్ ఫీలయ్యారట. అందుకే అక్షయ్ కుమార్‌కు సంబంధించిన ఓ చిన్న టీజర్‌ను రిలీజ్ చేయాలని దర్శక–నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారని వినికిడి. ఇలా చేస్తే నార్త్‌లో కూడా ‘2.0’ సినిమాకు మంచి పబ్లిసిటీ వచ్చే అవకాశం కూడా ఉందనే ఆలోచనలో ఉన్నారట. దాదాపు 500 కోట్లతో లైకాప్రొడక్షన్స్ నిర్మించిన ‘2.0’ సినిమా ఈ ఏడాది నవంబర్ 29న విడుదల కానున్న సంగతి తెలిసిందే. -
‘2. ఓ’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
వినాయక చవితి సందర్భంగా టీజర్‌ను్ రిలీజ్ చేసిన ‘2. ఓ’ చిత్రం బృందం దీపావళికి అభిమానులకు మరో కానుక ఇవ్వనున్నట్లు తెలిసింది. ‘2. ఓ’ ట్రైలర్‌ని దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు సమాచారం. చెన్నైలో జరిగే ఈ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమానికి చిత్ర బృందమంతా హాజరుకానున్నట్లు తెలిసింది. ఆ తర్వాత ‘2. ఓ’ రిలీజ్ డేట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. వినాయక చవితి సందర్భంగా ‘2. ఓ’ టీజర్‌ని తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో సెప్టెంబరు 13న విడుదల చేశారు. విడుదలైన 24 గంటల్లోనే మిలియన్ల వ్యూస్‌తో టీజర్ దూసుకుపోయిన సంగతి తెలిసిందే. తెలుగులో 5,069,230, తమిళ్లో 9,341,840, హిందీ 10,231,367 వ్యూస్ సాధించింది. దీంతో ‘చిట్టి’ మరోసారి మాయ చేయబోతున్నాడంటూ... టీజర్‌తోనే అదరగొట్టి అంచనాలు పెంచేస్తున్నాడంటూ తలైవా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో సుమారు 500 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ భారీ చిత్రంలో రజనీ సరసన అమీ జాక్సన్ హీరోయిన్గా నటిస్తుండగా.. బాలీవుడ్ యాక్షన్ ఖిలాడి అక్షయ్‌కుమార్ రజనీకి ధీటైన ప్రతినాయక పాత్రలో కనిపించనున్నారు. -
2.ఓ టీంకు డెడ్‌లైన్..!
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా 2.ఓ. ఇదే కాంబినేషన్లో రూపొందిన రోబో సినిమాకు సీక్వెల్‌గా దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ప్రతినాయక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా విడుదల ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడింది. ఇటీవల దర్శకుడు శంకర్ సినిమాను నవంబర్ నెలాఖరున రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే గ్రాఫిక్స్ వర్క్ ఇంకా పెండింగ్ ఉండటంతో నవంబర్‌లో కూడా రిలీజ్ అవుతుందా లేదా అన్న అనుమానాలు మొదలయ్యాయి. దీంతో చిత్రయూనిట్ అలర్ట్ అయినట్టుగా సమాచారం. మరోసారి వాయిదా పడితే సినిమా మీద నెగెటివ్ టాక్వస్తుందని భావిస్తున్న టీం ఎట్టి పరిస్థితుల్లో నవంబర్‌లో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందుకే గ్రాఫిక్స్ టీంకు అక్టోబర్ 15 కల్లా వర్క్ పూర్తి చేయాలని డెడ్‌లైన విధించినట్టుగా ప్రచారం జరుగుతోంది. మరి అనుకున్నట్టుగా ఈ సారైన 2.ఓ రిలీజ్ అవుతుందేమో చూడాలి. -
సూపర్ మజా
మా సినిమాలో మ్యాటర్ ఇది. విజువల్‌గా ఇలా ఉండబోతోంది, ఇలాంటి సీన్స్ ఉండబోతాయి అని ఆ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులను టీజర్ ద్వారా టీజ్ చేస్తుంటారు చిత్రబృందం. రోట్లో నూరుతున్న పచ్చడి రుచి ఎలా ఉండబోతోందో అని అమ్మమ్మ చూపించే శాంపిల్‌లా. అయితే ఆ టీజర్ మీద అంచనాలు అధికమైనప్పుడే అసలు తంటాలు ఏర్పడుతుంటాయి. రజనీకాంత్ లేటెస్ట్ భారీ బడ్జెట్ చిత్రం ‘2.ఒ’ కూడా అలాంటి చిరు నిరుత్సాహమే ఏర్పరిచిందని కొందరు అంటున్నారు. రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘2.ఒ’. అమీ జాక్సన్ కథానాయిక. అక్షయ్ కుమార్ విలన్. 2010లో రిలీజ్ అయిన ‘రోబో’ సినిమాకు ఇది సీక్వెల్. ఈ సినిమా రిలీజ్ పలు వాయిదాలు పడుతూ వస్తోంది. కారణం వీఎఫ్ఎక్స్. ఈ చిత్రాన్ని నవంబర్‌లో విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. వినాయక చవితి సందర్భంగా టీజర్ రిలీజ్ చేశారు. అంచనాలు భారీగా ఉండటంతో ఇంకా ఏదో ఎదురు చూశారు. త్రీడీ ఫార్మాట్లో ఈ చిత్రాన్ని తీశారు. ట్రైలర్‌ను కూడా ఆ ఫార్మాట్లోనే కొన్ని థియేటర్స్‌లో రిలీజ్ చేశారు. బిగ్ స్క్రీన్ మీద చూసిన కొందరు అద్భుతం అంటుంటే.. యూట్యూబ్‌లో వీక్షించిన వారిలో కొందరు ఆశించినంత లేదంటున్నారు. కానీ 3డీని చిన్న స్క్రీన్స్‌లో (మొబైల్స్, ల్యాప్టాప్స్)లో చూస్తే ఏముంటుంది మజా? 3డీ స్క్రీన్‌లో చూస్తేనే కదా సూపర్ మజా అంటున్నారు రజనీ అభిమానులు. పాయింటే కదా! -
దూసుకుపోతున్న 2.ఓ టీజర్
సూపర్ స్టార్ రజనీకాంత్, స్టార్ డైరెక్టర్ శంకర్ల కాంబినేషన్లో 2.ఓ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘రోబో’ మూవీకి సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ సినిమా టీజర్‌ను... వినాయక చవితి సందర్భంగా తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో సెప్టెంబరు 13న విడుదల చేశారు. విడుదలైన 24 గంటల్లోనే మిలియన్ల వ్యూస్‌తో టీజర్ దూసుకుపోతోంది. తెలుగులో 5,069,230 , తమిళ్లో 9,341,840, హిందీ 10,231,367 వ్యూస్ సాధించింది. దీంతో ‘చిట్టి’ మరోసారి మాయ చేయబోతున్నాడంటూ... టీజర్‌తోనే అదరగొట్టి అంచనాలు పెంచేస్తున్నాడంటూ తలైవా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో సుమారు 500 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ భారీ చిత్రంలో రజనీ సరసన అమీ జాక్సన్ హీరోయిన్గా నటిస్తుండగా.. బాలీవుడ్ యాక్షన్ ఖిలాడి అక్షయ్‌కుమార్ రజనీకి ధీటైన ప్రతినాయక పాత్రలో కనిపించనున్నారు. అబ్బురపరిచే గ్రాఫిక్స్, భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో విజువల్ వండర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను నవంబర్‌లో రిలీజ్ చేసేందుకు మూవీ యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. -
2.ఓ టీజర్: చిట్టి మళ్లీ అదరగొట్టాడు
తలైవా అభిమానులకు వినాయక చవితి కానుకగా 2. ఓ టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్- సూపర్ స్టార్ రజనీ కాంత్‌ల కాంబినేషన్లో వచ్చిన ట్రెండ్ సెట్టర్ మూవీ రోబో. ఈ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిస్తున్న భారీ విజువల్ వండర్ చిత్రం 2.ఓ. రజనీ సరసన అమీజాక్సన్ జతకట్టగా.. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. భారత దేశంలో 75 మిలియన్ డాలర్ల(సుమారు 545 కోట్లు) బడ్జెట్‌తో తెరకెక్కిన తొలి విఎఫ్ఎక్స్ వండర్ అంటూ చిత్ర బృందం ప్రచారం చేసింది. వారు పేర్కొన్న విధంగానే గురువారం రీలీజ్ అయిన టీజర్ చూస్తే సగటు ప్రేక్షకుడు ముక్కున వేలేసుకోక తప్పదు. అబ్బురపరిచే గ్రాఫిక్స్, భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఈ టీజర్లో కనిపిస్తున్నాయి. రజనీ మరోసారి సైంటిస్ట్ అవతారం ఎత్తి చిట్టి (రోబో) రూపంలో అన్ని సమస్యలు తీర్చనున్నాడు. ఈ టీజర్లో శంకర్ తన మార్క్ చూపించాడు. అక్షయ్‌కుమార్ బయపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ టీజర్లోనే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టేశాడు. నవంబర్‌లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మూవీ యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. -
2. ఓ టీజర్ విడుదల
-
‘2.ఓ’ బడ్జెట్ 500 కోట్లు దాటేసింది..!
సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్, అక్షయ్ కుమార్ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న భారీ విజువల్ వండర్ 2.ఓ. శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన రోబో చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై రోజుకో వార్త అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తాజాగా ఈ సినిమా బడ్జెట్‌కు సంబంధించిన వార్త ఒకటి కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఈ సినిమాకు బడ్జెట్‌కు సంబంధించిన చిత్రయూనిట్ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. భారత దేశంలో 75 మిలియన్ డాలర్ల(సుమారు 545 కోట్లు) బడ్జెట్‌తో తెరకెక్కిన తొలి విఎఫ్ఎక్స్ వండర్ అంటూ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ముందుగా 200 కోట్ల బడ్జెట్ అంటూ ప్రారంభించిన 2.ఓ తరువాత 400 కోట్లకు చేరింది.తాజా సినిమా 545 కోట్లకు పైగా ఖర్చు చేసినట్టుగా చిత్రయూనిట్ ప్రకటించటంతో ప్రేక్షకులతో పాటు సినీ వర్గాలు కూడా అవాక్కవుతున్నారు. వినాయక చవితి సందర్భం టీజర్‌ను రిలీజ్ చేస్తున్న 2.ఓ టీం సినిమాను నవంబర్ నెలాఖరున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
2.ఓ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
తలైవా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 2. ఓ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబరు 13న ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నట్లు 2. ఓ దర్శకుడు శంకర్ ట్విటర్ ద్వారా తెలియజేశారు. ‘సెప్టెంబరు 13న 2.ఓ టీజర్.. త్రీడీ వర్షన్లో చూడండి’ అంటూ మూవీ పోస్టర్‌ను ట్విటర్లో పోస్ట్ చేశారు. కాగా సూపర్ స్టార్ రజనీకాంత్, స్టార్ డైరెక్టర్ శంకర్ల కాంబినేషన్లో 2.ఓ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో సుమారు 500 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ భారీ చిత్రం ద్వారా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. 2.ఓలో రజనీకి ధీటైన ప్రతినాయక పాత్రలో ఆయన కనిపించనున్నారు. నవంబర్‌లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మూవీ యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. pic.twitter.com/90KX4Y7cXk — Shankar Shanmugham (@shankarshanmugh) September 7, 2018 -
దర్శకుడు శంకర్‌కు హైకోర్టు షాక్
సినిమా: స్టార్ డైరెక్టర్ శంకర్‌కు చెన్నై హైకోర్టు షాక్ ఇచ్చింది. రూ.10 వేలు జరిమానా విధించింది. వివరాల్లోకెళితే రజనీకాంత్ హీరోగా శంకర్ 2010లో తెరకెక్కించిన చిత్రం ఎందిరన్. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అయితే ఎందిరన్ చిత్ర కథ తనదంటూ రచయిత ఆరూర్ తమిళ్‌నాడన్ చెన్నై హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అందులో తన కథను అపహరించిన శంకర్ తనకు కోటి రూపాయలను నష్టపరిహారంగా చెల్లించేలా ఆదేశంచాల్సిందిగా కోరారు. ఈ పిటిషన్‌పై పలు మార్లు విచారణ జరిగింది. శంకర్ కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఆయన కోర్టుకు హాజరు కాకపోవడంతో న్యాయస్థానం ఆయనకు రూ.10 వేలు అపరాధం విధిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
2.ఓ టీజర్.. మళ్లీ కొత్త డేట్
సూపర్ స్టార్ రజనీకాంత్, గ్రేట్ డైరెక్టర్ శంకర్ల కాంబినేషన్లో రూపొందుతున్న భారీ చిత్రం 2.ఓ. లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ రిలీజ్‌కు ముహూర్తం కుదరటం లేదు. ఇప్పటికే చాలా సార్లు టీజర్ రిలీజ్‌పై వార్తలు వినిపించాయి. ఇటీవల ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా టీజర్ రిలీజ్ అవ్వటం కన్ఫామ్ అన్న ప్రచారం జరిగింది. కానీ ఆ రోజు కూడా టీజర్ రిలీజ్ కాలేదు. తాజాగా మరో డేట్ తెర మీదకు వచ్చింది. సెప్టెంబర్ 13న వినాయక చవితి సందర్భంగా టీజర్ ను రిలీజ్ చేసేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ డేట్ పై కూడా ఎలాంటి అధికారిక ప్రకటనా లేదు. దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ప్రతినాయక పాత్రలో నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను నవంబర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
రజనీ ‘2.O’కు మరో షాక్
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం 2.ఓకు మరో షాక్ తగిలింది. ఈ సినిమాకు సంబంధించిన బీబీసీ సంస్థ చేస్తున్న డాక్యుమెంటరీలోని 2 నిమిషాల మేకింగ్ వీడియో లీకైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. రజనీ, అమీ జాక్సన్‌లపై ఓ పాట చిత్రీకరణకు సంబంధించిన వీడియో క్లిప్ నెట్లో వైరల్ అయ్యింది. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది నవంబర్‌లో రిలీజ్ కానుంది. చాలా రోజుల క్రితమే రిలీజ్ కావాల్సి ఉన్నా విజువల్ ఎఫెక్ట్స్ ఆలస్యం కావటంతో సినిమా వాయిదా పడుతూ వస్తోంది. దీనికి తోడు లీకులు కూడా సినిమాకు ఇబ్బంది కరంగా మారాయి. గతంలో టీజర్ రిలీజ్ చేయాలని భావించినా అది కూడా ముందే లీకైపోవటంతో చిత్రయూనిట్ టీజర్ లాంచ్ ఆలోచనను వాయిదా వేశారు. -
స్టార్ డైరెక్టర్ @25
పెరంబూరు: అభిమాన ధనాన్ని మించింది లేదంటారు. అలాంటి శిష్యాభిమానంలో దర్శకుడు శంకర్ తడిచి ముద్దయ్యారు. ఇండియాలోని స్టార్ దర్శకుల్లో ఒకరిగా ఖ్యాతి గాంచిన దర్శకుడు శంకర్. జంటిల్మెన్ చిత్రంతో జనూన్ దర్శకుడిగా తమిళసినిమాకు పరిచయం అయ్యారు. ఈయన చిత్రాలన్నీ అద్భుతాలను ఆవిష్కరించినవే. శంకర్ తొలి చిత్రం జెంటిల్మెన్ 1997లో విడుదలైంది. దర్శకుడిగా ఆయన 25 వసంతాలను పూర్తి చేసుకున్నారన్నమాట. ఒక దర్శకుడిగా వరుస విజయాలను సాధిస్తూ రాణించడం ఆసాధారణమే. ఎన్ని చిత్రాలు చేశామన్నది కాకుండా ఎన్ని మంచి ప్రజాదరణ పొందిన చిత్రాలు అందించామన్నదే ముఖ్యంగా భావించేవారు శంకర్. ఆయన ఈ 25 ఏళ్లలో 12 చిత్రాలే చేశారు. ఆయన తాజా చిత్రం 2.ఓ ఎన్నో అద్భుతాలతో త్వరలో తెరపైకి రానుంది. తదుపరి కమలహాసన్ హీరోగా ఇండియన్– 2ను తెరకెక్కించడానికి సిద్ధం అవుతున్నారు. ఇక అసలు విషయం ఏమిటంటే దర్శకుడిగా ఆదివారం 25 వసంతాలను పూర్తి చేసుకున్న శంకర్‌ను ఆయన శిష్యులు అట్లీ, మాదేశ్, బాలాజీ శక్తివేల్, హోసిమిన్, వసంతబాలన్, అరివళగన్ అభిమానంతో సత్కరించారు. ఒక జ్ఞాపికను అందించి ఆయనతో ఫొటో కూడా దిగారు. ఈ మధుర క్షణాలను ఆస్వాదిస్తూ శంకర్ శిష్యుల అభిమానంలో తడిసి ముద్దయ్యాను. మీరు లేనిదే ఈ నా పయనం ఉండదు అని ట్విట్టర్లో పేర్కొన్నారు. -
‘2.ఓ’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం 2.ఓ. గతంలో ఇదే కాంబినేషన్లో తెరకెక్కిన రోబో చిత్ర కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రతినాయక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు పోస్టర్లు, మేకింగ్ వీడియోలను మాత్రమే రిలీజ్ చేసిన చిత్రయూనిట్ ఇంత వరకు టీజర్‌ను మాత్రం రిలీజ్ చేయలేదు. రిలీజ్ డేట్‌పై కూడా క్లారిటీ రావటంతో టీజర్ ఎప్పుడా అని అభిమానులు మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అభిమానుల అంచనాలు అందుకునే స్థాయి విజువల్ ట్రీట్‌తో ఆగస్టు 15న టీజర్‌ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట 2.ఓ టీం. అయితే ఈ విషయం చిత్రయూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. -
2.0 @ 29.11.18
ఎప్పటినుంచో సినీ ప్రేమికులు ఎదురుచూస్తోన్న సినిమాల్లో ‘2.0’ చిత్రం ఒకటి. ఇప్పటికే చాలా సార్లు ఈ సినిమా వాయిదా పడ్డ విషయం తెలిసిందే. ఇప్పుడు చిత్రబృందం కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటింటించింది. రజనీకాంత్, అక్షయ్ కుమార్, అమీజాక్సన్ ముఖ్య తారలుగా శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన సినిమా ‘2.0’. 2010లో శంకర్ దర్శకత్వంలోనే వచ్చిన ‘యందిరిన్’ చిత్రానికి సీక్వెల్ ఇది. ఈ సినిమాను ముందుగా గత ఏడాది దీపావళికి రిలీజ్ చేయాలనుకున్నారు. కుదరకపోవడంతో ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా విడుదలచేయాలనుకున్నప్పటికీ వీలుపడలేదు. అలాగే ఈ ఏడాది వేసవిలో రిలీజ్ చేయనున్నట్లు లైకా ప్రొడక్షన్స్ సంస్థ ప్రకటించిన విజువల్ ఎఫెక్ట్స్ పెండింగ్ ఉండటం వల్ల ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఇప్పుడు ‘2.0’ చిత్రబృందం సినిమాను ఈ ఏడాది నవంబర్‌లో విడుదల చేయాలని నిర్ణయించింది. ‘‘అందరికీ హాయ్. చివరిగా మూవీ ఫైనల్ కాపీని ఇవ్వడానికి విజువల్ ఎఫెక్ట్స్ డీల్ చేస్తోన్న కంపెనీలు ఓ డెలివరీ డేట్‌ను చెప్పారు. సినిమాను ఈ ఏడాది నవంబర్ 29న రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు డైరెక్టర్ శంకర్. ఈసారైనా చెప్పిన తేదీకి సినిమా రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. -
ఎట్టకేలకు రెడీ.. 2.0 రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేశారు!
ఎదురుచూపులకు ఎట్టకేలకు తెరపడనుంది. అభిమానులు ఎప్పుడెప్పుడా అని నిరీక్షిస్తున్న 2.0 సినిమా వచ్చే నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదల తేదీని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది నవంబర్ 29న సినిమాను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది. చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రోడక్షన్స్, చిత్ర దర్శకుడు శంకర్ ఈ మేరకు ట్విటర్లో తెలిపారు. రజనీకాంత్, అక్షయ్‌కుమార్ వంటి భారీ తారాగణంతో ‘రోబో’ సినిమాకు సీక్వెల్‌గా కళ్లు చెదిరే బడ్జెట్‌తో, భారీ సాంకేతిక హంగులతో 2.0 సినిమాను శంకర్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అయిన ఈ సినిమా గతంలోనే విడుదల కావాల్సి ఉంది. గతంలో పలు విడుదల తేదీలు ప్రచారంలో ఉన్నా.. వీఎఫ్ఎక్స్ వర్క్ కారణంగా సినిమా అనుకున్న తేదీ విడుదల కాలేదు. భారీ గ్రాఫిక్ వర్క్, వీఎఫ్ఎక్స్ టెక్నాలజీని ఈ సినిమా కోసం వాడటంతో చిత్రం పూర్తికావడానికి చాలా ఎక్కువ సమయమే పట్టింది. ఎట్టకేలకు వీఎఫ్ఎక్స్ కంపెనీ వీఎఫ్ఎక్స్ షాట్స్ డెలివరీ చేస్తామని హామీ ఇచ్చిందని, కాబట్టి నవంబర్ 29న ఈ సినిమాను విడుదల చేయబోతున్నామని శంకర్ ట్విటర్లో తెలిపారు. -
రజనీ వర్సెస్ హృతిక్!
‘2.0’ అనగానే సినీ లవర్స్ అందరూ.. ఫస్ట్ అడిగే క్వశ్చన్ మూవీ రిలీజ్ ఎప్పుడు? అని. కానీ రిలీజ్ డేట్ విషయంలో మూవీ యూనిట్ ‘అదిగో పులి ఇదిగో పులి..’ అన్న విధంగా డేట్స్ మార్చుతోంది. రజనీకాంత్, అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ ముఖ్య తారలుగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘2.0’. ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన ‘యందిరన్’ (తెలుగులో ‘రోబో’) చిత్రానికి సీక్వెల్ అయిన ‘2.0’ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. అయితే అనుకున్నట్లుగా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాలేకపోతోంది. 2015లో సెట్స్‌మీదకు వెళ్లిన ‘2.0’ చిత్రాన్ని తొలుత 2017 దీపావళికి రిలీజ్ చేద్దాం అనుకున్నారు. ఆ తర్వాత ఏవో గ్రాఫిక్స్ ప్రాబ్లమ్స్ కారణంగా 2018 జనవరి 25న మూవీ రిలీజ్ పక్కా అన్నారు. కానీ ఆ పక్కా లెక్క తప్పి ఈ ఏడాది సమ్మర్‌కి సెకండ్ రోబో రెడీ అన్నారు. అబ్బే.. ఈసారీ రెడీ కాలేదు. లేటెస్ట్గా ఈ ఏడాది దీపావళికి ‘2.0’ రిలీజ్ అన్న వార్తలు వచ్చాయి. ఇప్పుడు వాటిలో కూడా నిజం లేదని తెలుస్తోంది. వచ్చే ఏడాది రిపబ్లిక్ డేకి ‘2.0’ రిలీజ్ కానుందని కొత్త వార్తలు పుట్టుకొస్తున్నాయి. మరి.. ఈ వార్తలో నిజం ఎంతన్నది చిత్రబృందమే చెప్పాలి. ఒకవేళ ‘2.0’ చిత్రం వచ్చే ఏడాది రిపబ్లిక్ డేకి రిలీజ్ ఫిక్స్ అయితే, ఈ ఏడాది నవంబర్‌ని కాదనుకుని రిపబ్లిక్ డేకి కర్ఛీప్ వేసిన హృతిక్ రోషన్ ఏం చేస్తాడన్న విషయం ఇప్పుడు బీటౌన్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. ఎందుకంటే ఆయన తొలిసారి నటిస్తున్న బయోపిక్ ‘సూపర్ 30’ చిత్రాన్ని ఆ రోజునే రిలీజ్ చేయనున్నట్లు ఇదివరకే చిత్రబృందం అనౌన్స్ చేసింది. వికాస్ బాల్ దర్శకత్వంలో బీహార్ గణిత శాస్త్రవేత్త ఆనంద్‌కుమార్ జీవితం ఆధారంగా ‘సూపర్ 30’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. రిపబ్లిక్ వీక్‌లో గతంలో విడుదలైన హృతిక్ చిత్రాలు ‘అగ్నిపథ్, కాబిల్’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టాయి. సో... హృతిక్‌కు ఇది సెంటిమెంట్ కూడా. మరి.. బాక్సాఫీస్ వద్ద రజనీ వర్సెస్ హృతిక్ నిజమవుతుందా? తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే. -
ఇండియన్ 2కు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్
సంచలన విజయం సాధించిన ఇండియన్ (తెలుగులో భారతీయుడు) సినిమాకు సీక్వల్గా ఇండియన్ 2 సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. చాలా రోజుల క్రితమే ఈసినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. అయితే దర్శకుడు శంకర్... 2.ఓ పనుల్లో బిజీగా ఉండటం, కమల్ హాసన్ కూడా రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ప్రీ ప్రొడక్షన్ పనులు కాస్త నెమ్మదిగా సాగుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి సౌత్ ఫిలిం సర్కిల్స్‌లో హల్చల్ చేస్తోంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన అపరిచితుడు, నన్బన్ చిత్రాలకు తప్ప మిగతా అన్ని సినిమాలకు ఏఆర్ రెహమానే సంగీతమందించారు. కానీ ఇండియన్ 2కు మాత్రం రెహమాన్ పనిచేయటం లేదన్న ప్రచారం జరుగుతోంది. రెహమాన్ స్థానంలో ఈ సినిమాకు అనిరుధ్‌ను సంగీత దర్శకుడిగా ఫైనల్ చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే అనిరుధ్‌ను గోల్డెన్ ఛాన్స్ వరించినట్టే అంటున్నారు విశ్లేషకులు. మరి ఈ వార్తలపై చిత్రయూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి. రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన 2.ఓ షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. భారీ గ్రాఫిక్స్‌తో రూపొందుతుండటంతో ఈ సినిమా ఎప్పుడు విడుదలయ్యేది ఇంతవరకు ఫైనల్ చేయలేదు. 2.ఓ ఓ నిర్మాణాంతర కార్యక్రమాలతో పాటు ఇండియన్ 2 ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా కానిచ్చేస్తున్నాడు శంకర్. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమయ్యేది అధికారికంగా వెళ్లడించనున్నారు. -
ఐపీఎల్ ఫైనల్లో 2.ఓ సినిమా టీజర్?
సాక్షి, సినిమా: ఐపీఎల్ క్రికెట్ పోటీలు రసవత్తరంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సీఎస్కే (చెన్నై సూపర్ కింగ్స్) సెమీ ఫైనల్‌కి చేరింది. ఇంతకీ ఈ ఐపీఎల్‌కు 2.ఓ చిత్రానికి సంబంధం ఏమిటీ అనేగా మీ ఆలోచన. సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కాలా చిత్రం వచ్చే నెల 7న భారీ ఎత్తున విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. రజనీకాంత్ నటిస్తున్న మరో చిత్రం 2.ఓ. ఈ భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రం కాలా చిత్రం కంటే ముందుగా తెరపైకి రావాల్సి ఉండగా గ్రాఫిక్స్ కార్యక్రమాలు ఇంకా పూర్తి కాకపోవడంతో విడుదల అలస్యమైంది. అదే విధంగా చిత్ర టీజర్‌ను విడుదలకు చిత వర్గాలు ప్లాన్ చేస్తున్న సమయంలోనే అది కాస్తా లీక్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ అవడంతో చిత్ర యూనిట్‌కు షాక్‌కు గురైంది. దీంతో శంకర్ మరో టీజర్‌ను తయారు చేశారు. ఈ చిత్ర టీజర్‌ను ఈ నెల 27వ తేదీన ఐపీఎల్ ఫైనల్లో విడుదల చేయాలనుకుంటున్నట్లు ప్రచారం వైరల్ అవుతోంది. దీనికి సంబంధించి వారి నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు. వాస్తవానికి అలా సింపుల్‌గా 2.ఓ చిత్ర టీజర్‌ను విడుదల చేస్తారా? అన్నది అంతుచిక్కని ప్రశ్న. ఈ చిత్ర ప్రచారాన్ని భారీ ఎత్తున నిర్మించడానికి లైకా సంస్థ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. 2.ఓ చిత్ర టీజర్‌ను ఐపీఎల్ పైనల్ పోటీ వేదికగా జరిగే అవకాశం ఉందా? లేదా? అన్న విషయంలో క్లారిటీ రావాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. కెనడా బ్యూటీ ఎమీజాక్సన్ హీరోయిన్గా, బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్ కుమార్ విలన్‌గా నటించిన ఈ చిత్రాన్ని స్టార్ దర్శకుడు శంకర్ అద్భుతంగా చెక్కుతున్నారు. అభిమానులు ఎప్పుడెప్పుడు చూద్దామా! అని ఆసక్తితో ఎదురు చూస్తున్నారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాగా 2.ఓ చిత్రాన్ని ఆగస్ట్‌లో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. -
అదిరే యాక్షనట!
తమిళసినిమా: రజనీకాంత్ ఈ పేరే అభిమానులకు ఒక మంత్రం. సూపర్‌స్టార్ రాజకీయాల్లోకి రావాలని వారు జపం చేస్తున్నారు. ఎట్టకేలకు అభిమానుల తపం ఫలించింది. రజనీకాంత్ రాజకీయ పయనానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే సినీప్రియులు మాత్రం ఆయన నటించిన కాలా, 2.ఓ చిత్రాల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. గ్రాఫిక్స్ పనులు పూర్తికాకపోవడంతో ముందుగా తెరపైకి రావలసిని 2.ఓ వెనక్కు, ఆ తరువాత రావలసిన కాలా ముందుకు వస్తోంది. అన్నీ బాగుంటే ఈ శుక్రవారం కాలా చిత్రం ప్రేక్షకులకు విందు అయ్యేది. కోలీవుడ్ సమ్మె కారణంగా జూన్ 7వ తేదీకి వాయిదా పడింది. రజనీకాంత్‌తో పాటు ప్రముఖ బాలీవుడ్ నటుడు నానాపటేకర్, నటి హ్యూమ ఖురేషి, ఈశ్వరిరావు, అంజలిపటేల్, అరుంధతి, సాక్షి అగర్వాల్, సుకన్య సముద్రకని, సంపత్ ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రానికి పా.రంజిత్ దర్శకత్వం వహించారు. కబాలి తరువాత ఆయన రజనీకాంత్‌తో చేసిన రెండవ చిత్రం కాలా. సంతోష్ నారా యణన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రాన్ని నటుడు ధనుష్ తన వండర్‌బార్ ఫిలింస్ పతాకంపై నిర్మించారు. కాలా చిత్రం వ్యా పార పరంగా ఇప్పటికే ధనుష్‌కు భారీ లా భాలను అందించి పెట్టింది. తాజాగా శాటిలైట్ హక్కులను భారీ మొత్తంలో విజయ్ టీవీ దక్కించుకుందన్నదని సమాచారం. ఒక ఈ విషయం ఇలా ఉంటే రజనీకాంత్ మరో చిత్రానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రెగ్యులర్ వైద్య పరీక్షలకు అమెరికా వెళ్లిన రజనీకాంత్ చెన్నైకి తిరిగి రాగానే రాజకీయ పార్టీ ఏర్పాటు కార్యక్రయంతో పాటు, కొత్త చిత్ర షూటింగ్‌లోనూ పాల్గొననున్నారనే ప్ర చారం జరుగుతోంది. రజనీ కాంత్ కొత్త చిత్రానికి యువదర్శకుడు కార్తీక్‌సుబ్బరాజ్ దర్శకత్వం వహించనున్నాన్న విషయం తెలిసిందే. ఇది రాజకీయ నేపథ్యంలో సాగుతుందనే ప్రచారం జ రుగుతున్న విషయం తెలి సిందే. కొత్తగా వెలువడ్డ విషయం ఏమిటంటే ఇది అదిరే యాక్షన్ కథా చిత్రంగా ఉంటుందట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియడానికి ఎంతో దూరం లేదు. -
స్త్రీలకు చీరే సింగారం
తమిళసినిమా: స్త్రీలకు చీరే సింగారం. ఇలా అన్నది ఎవరో తెలుసా? ఇంగ్లిష్ బ్యూటీ ఎమీజాక్సన్. ఏమిటీ ఆశ్చర్యపోతున్నారా? కొందరి మాటలకు, చేతలకు అసలు సంబంధం ఉండదంటారు. ఈ ఇంగ్లాండ్ భామ అలాంటి వారిలో ముందుంటుందని చెప్పవచ్చు. మదరాసుపట్టణం చిత్రంతో కోలీవుడ్‌కు దిగుమతి అయిన ఈ బ్యూటీ తొలి చిత్రంతోనే తమిళ ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఆ తరువాత కొన్ని చిత్రాల్లో నటించినా శంకర్ దర్శకత్వం వహించిన ఐ చిత్రంలో అందాలను విచ్చలవిడిగా ఆరబోసింది. ఆ తరువాత పలు గ్లామరస్ ఫొటోలను ఇంటర్నెట్లో పోస్ట్ చేసి సంచలన నటిగా వార్తల్లోకెక్కింది. అదేమంటే తాను విదేశీ అమ్మాయిని మా కల్చర్ అంతే అంటూ ఎలాంటి తడబాటు లేకుండా బదులిచ్చేసింది. ప్రస్తుతం రజనీకాంత్‌కు జంటగా నటించిన 2.ఓ చిత్రం విడుదల కావలసి ఉండగా ఈ అమ్మడు యూరప్ దేశంలో సెటిల్ అవనున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చింది. తాజాగా ఈ బ్యూటీ చేసిన ట్విట్ ప్రేక్షకులకు మరో షాక్ అవుతోంది. అదేంటో చూద్దాం. స్త్రీలకు చీరలే సింగారం. సంప్రదాయబద్ధమైన ఆ దుస్తులే స్త్రీల్లో అణుకువను ప్రదర్శిస్తాయి.కొన్ని సమయాల్లో లెహన్కా దుస్తులు మహిళల అందాలను మెరుగుపరుస్తాయి. ఇకపోతే ఇండియా అంటే నా మనసులో ఎప్పుడూ ముఖ్యమైన స్థానం ఉంటుంది. ఇది లేటెస్ట్ ఎమీ ట్వీట్. నటి ఎమీ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది అయితే భారతీయ నారీ సంప్రదాయ చీరకట్టు ఇప్పుడు పాశ్చాత్య దేశాలను ఆకర్షిస్తుందన్నది గమనార్హం.