![Amy Jackson Gets Engaged And Shares Pic With George Panayiotou - Sakshi](/styles/webp/s3/article_images/2019/01/2/amy-jackson.jpg.webp?itok=sAS7V6PN)
ముంబై : రజనీకాంత్ 2.ఓలో యంతరలోకపు సుందరిగా అలరించిన అమీ జాక్సన్ త్వరలో వైవాహిక బంధంలో అడుగుపెట్టనున్నారు. నూతన సంవత్సరం తొలిరోజున నిశ్చితార్ధం జరుపుకున్నట్టు వెల్లడించారు. బ్రిటన్‌కు చెందిన వ్యాపారవేత్త జార్జ్ పనయటోతో జాంబియాలో ఎంగేజ్‌మెంట్ జరిగినట్టు తెలిపారు. ఎంగేజ్‌మెంట్ రింగ్‌తో బాయ్‌ఫ్రెండ్‌తో కలిసిఉన్న ఫోటోను అభిమానుల కోసం సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేశారు.
ఏడాది తొలిరోజున మన జీవితం ప్రారంభవుతోంది..అత్యంత సంతోషంగా తనను ఉంచుతున్నందుకు ధన్యవాదాలు అంటూ ఆమె తన బాయ్‌ఫ్రెండ్‌ను ఉద్దేశిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. తెలుగులో ఎవడు, అభినేత్రి చిత్రాల్లో మెప్పించిన అమీ జాక్సన్ 2.ఓలో నటనకు గాను పలువురి ప్రశంసలు దక్కించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment