
‘‘మేడ ఎక్కి గట్టిగా అరచి చెప్పాలని చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాను. మదర్స్‌డే రోజు పంచుకోవడం కంటే ఇంకో మంచి రోజు ఉండదనుకుంటున్నాను’’ అంటూ తల్లి కాబోతున్నారని అనౌన్స్ చేశారు నటి అమీజాక్సన్. ఈ ఏడాది ప్రొఫెషనల్‌గా కంటే పర్సనల్‌గా ఎక్కువ మూమెంట్స్‌ను ఎంజాయ్ చేస్తున్నారామె. న్యూ ఇయర్ రోజు జీవితంలో కొత్త ప్రయాణాని ్న మొదలుపెట్టారు. 6 ఏళ్లుగా డేటింగ్ చేస్తున్న బాయ్‌ఫ్రెండ్ జార్జి పనాయోటుతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు.
ఇప్పుడు తల్లి కాబోతున్నాననీ, అక్టోబర్‌లో డెలివరీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. వివాహం కాకుండానే తల్లి కావడం, ఆ విషయాన్ని ఆనందంగా షేర్ చేసుకోవడం విశేషం. అమీజాక్సన్ తన బేబీ బంప్‌ను చూపిస్తూ బాయ్‌ఫ్రెండ్‌తో దిగిన స్టిల్‌ను షేర్ చేసి ‘‘అప్పుడే ఈ ప్రపంచంలో అందరికంటే నిన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. ప్రపంచంలో ఉన్న స్వచ్ఛమైన ప్రేమ. (బిడ్డను ఉద్దేశిస్తూ). పుట్టబోయే బిడ్డ కోసం నేను, జార్జ్ ఎదురుచూస్తున్నాం’’ అని పేర్కొన్నారు. వీరి వివాహం 2020లో జరగనుంది. ఆమె చివరిగా ‘2.0’ చిత్రంలో కనిపించారు.
Comments
Please login to add a commentAdd a comment