లండన్‌లో ఎంగేజ్‌మెంట్‌ పార్టీ | Amy Jackson To Get Engaged To Her BF On This Date | Sakshi
Sakshi News home page

లండన్‌లో ఎంగేజ్‌మెంట్‌ పార్టీ

Apr 12 2019 3:35 AM | Updated on Apr 12 2019 3:35 AM

Amy Jackson To Get Engaged To Her BF On This Date - Sakshi

అమీ జాక్సన్‌

బాయ్‌ఫ్రెండ్‌ జార్జి పనాయోట్టుతో ఎంగేజ్‌మెంట్‌ చేసుకొని కొత్త సంవత్సరాన్ని స్టార్ట్‌ చేశారు అమీ జాక్సన్‌. జోంబియాకు హాలీడేకు వెళ్లిన ఈ జంట తమ నిశ్చితార్థ వేడుకను స్నేహితులు, కుటుంబ సభ్యులు లేకుండానే కానిచ్చేశారు. పెళ్లికి ముహూర్తం పెట్టేలోపే తల్లి కాబోతున్నాను అని ఈ మధ్య షాక్‌ ఇచ్చారు అమీ. ఆ సంగతలా ఉంచితే మే 5న లండన్‌లో ఎంగేజ్‌మెంట్‌ పార్టీ సెలబ్రేట్‌ చేసుకోనుందట ఈ జంట. క్లోజ్‌ ఫ్రెండ్స్, ఇండస్ట్రీ ఫ్రెండ్స్‌ను మాత్రమే ఈ వేడుకకు ఆహ్వానిస్తున్నారట. ‘‘మా ఎంగేజ్‌మెంట్‌తోపాటు 2019 సమ్మర్‌ను స్టార్ట్‌ చేసేందుకు ఏర్పాటు చేస్తున్న పార్టీకు మిమ్మల్ని అందర్నీ ఆహ్వానిస్తున్నాం’’ అంటూ పార్టీ ఇన్విటేషన్‌లో పేర్కొన్నారు అమీ, జార్జి. ప్రెగ్నెన్సీ గురించి అమీ మాట్లాడుతూ– ‘‘అదో సర్‌ప్రైజ్‌లా వచ్చింది. మేం ప్లాన్‌ చేయలేదు. కానీ ప్రెగ్నెన్సీ మా ఇద్దర్నీ దగ్గర చేసింది. ఇదివరకూ మేం దగ్గరగానే ఉన్నాం కానీ ఇదో డిఫరెంట్‌ క్లోజ్‌నెస్‌’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement