George Panayiotou
-
ప్రియుడిని పెళ్లాడిన హీరోయిన్ అమీ జాక్సన్ (ఫొటోలు)
-
కొడుకు పుట్టిన రెండేళ్లకు ప్రియుడితో హీరోయిన్ బ్రేకప్!
Amy Jackson: హీరోయిన్ అమీ జాక్సన్ తన ప్రియుడితో తెగదెంపులు చేసుకుందట. అతడితో ఏడడుగులు నడవకముందే వారి మధ్య ఉన్న బంధాన్ని తెంచేసుకుందట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. బ్రిటీష్ నటి, మోడల్ అమీ జాక్సన్.. జార్జ్ పనాయిటోను ప్రేమించింది. అతడే సర్వస్వం అనుకున్న ఈ భామ జార్జ్‌ను పెళ్లాడాలనుకుంది. ఈ మేరకు 2019 మేలో వీరి నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ కరోనా కారణంగా పెళ్లి వాయిదా పడింది. అయితే వీరి ప్రేమకు ప్రతీకగా అదే ఏడాది సెప్టెంబర్‌లో మగబిడ్డకు జన్మనిచ్చింది అమీ జాక్సన్. పెళ్లి కాకముందే తల్లైన అమీ జాక్సన్ తన కొడుకుతో పాటు కాబోయే భర్తతో కలిసి దిగిన ఫొటోలను తరచూ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకునేది. అయితే ఏమైందో ఏమో కానీ ఈ హీరోయిన్ సడన్‌గా తన ప్రియుడితో కలిసి దిగిన ఫొటోలన్నింటినీ తొలగించింది. దీంతో అమీ జాక్సన్ పెళ్లికి ముందే కాబోయే భర్తతో తెగదెంపులు చేసుకుందని వార్తలు వెలువడుతున్నాయి. ఉన్నట్లుండి ఇలా పిక్స్ డిలీట్ చేయడం చూస్తుంటే వీరు విడిపోయారని, ఇక వీరి పెళ్లి జరగడం కష్టమేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కాగా 2010లో 'మద్రాసుపట్నం' సినిమాతో హీరోయిన్గా కెరీర్ ఆరంభించిన అమీ జాక్సన్ తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లోనూ నటించింది. 'ఐ', 'రోబో 2.0' సినిమాలతో ప్రేక్షకులకు మరింత చేరువైంది. -
మమ్మీ అమీ
నటి అమీ జాక్సన్ తల్లయ్యారు. సోమవారం ఆడపిల్లకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేశారు. ‘యాండ్రియాస్ (పాప పేరు).. మా ఏంజెల్. ఈ ప్రపంచానికి స్వాగతం’ అని క్యాప్షన్ చేస్తూ పాపతో దిగిన ఫొటోను షేర్ చేశారు. జార్జి పనయొట్టుతో అమీ జాక్సన్ కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. వీరి నిశ్చితార్థం కూడా అయింది. ఇంకా పెళ్లి కాలేదు. విశేషం ఏంటంటే ఇటీవలే మాకు బాబు పుడుతున్నాడంటూ ‘జెండర్ రివీలింగ్ పార్టీ’ కూడా ఏర్పాటు చేశారు అమీ. అయితే పాపకు జన్మనిచ్చారు. ‘ఎవడు, ఐ, 2.0’ సినిమాల్లో అమీ జాక్సన్ హీరోయిన్గా నటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. -
నా ఎంగేజ్మెంట్ స్వీట్ మెమొరీస్
నటి అమీ జాక్సన్, జార్జి పనాయొటు ఆదివారం ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఈ ఎంగేజ్మెంట్ పార్టీని ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలసి సెలబ్రేట్ చేసుకున్నారు. లండన్‌కు చెందిన బిజినెస్‌మేన్ జార్జి. ‘‘నమ్మశక్యంగా ఉంది. మా ఎంగేజ్మెంట్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ ఈవెంట్‌ను ఎంతో స్పెషల్‌గా మార్చిన ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరికీ థ్యాంక్స్’’ అన్నారు అమీ. ‘నా ఎంగేజ్మెంట్ స్వీట్ మెమొరీస్’ అంటూ కొన్ని ఫొటోలను కూడా షేర్ చేశారామె. ప్రస్తుతం అమీ జాక్సన్ ప్రెగ్నెంట్‌గా ఉన్న సంగతి తెలిసిందే. 2020లో వీరి వివాహం జరగనుంది. -
లండన్‌లో ఎంగేజ్మెంట్ పార్టీ
బాయ్‌ఫ్రెండ్ జార్జి పనాయోట్టుతో ఎంగేజ్మెంట్ చేసుకొని కొత్త సంవత్సరాన్ని స్టార్ట్ చేశారు అమీ జాక్సన్. జోంబియాకు హాలీడేకు వెళ్లిన ఈ జంట తమ నిశ్చితార్థ వేడుకను స్నేహితులు, కుటుంబ సభ్యులు లేకుండానే కానిచ్చేశారు. పెళ్లికి ముహూర్తం పెట్టేలోపే తల్లి కాబోతున్నాను అని ఈ మధ్య షాక్ ఇచ్చారు అమీ. ఆ సంగతలా ఉంచితే మే 5న లండన్‌లో ఎంగేజ్మెంట్ పార్టీ సెలబ్రేట్ చేసుకోనుందట ఈ జంట. క్లోజ్ ఫ్రెండ్స్, ఇండస్ట్రీ ఫ్రెండ్స్‌ను మాత్రమే ఈ వేడుకకు ఆహ్వానిస్తున్నారట. ‘‘మా ఎంగేజ్మెంట్తోపాటు 2019 సమ్మర్‌ను స్టార్ట్ చేసేందుకు ఏర్పాటు చేస్తున్న పార్టీకు మిమ్మల్ని అందర్నీ ఆహ్వానిస్తున్నాం’’ అంటూ పార్టీ ఇన్విటేషన్లో పేర్కొన్నారు అమీ, జార్జి. ప్రెగ్నెన్సీ గురించి అమీ మాట్లాడుతూ– ‘‘అదో సర్ప్రైజ్లా వచ్చింది. మేం ప్లాన్ చేయలేదు. కానీ ప్రెగ్నెన్సీ మా ఇద్దర్నీ దగ్గర చేసింది. ఇదివరకూ మేం దగ్గరగానే ఉన్నాం కానీ ఇదో డిఫరెంట్ క్లోజ్‌నెస్’ అన్నారు. -
కొత్త సంవత్సరం.. కొత్త ప్రయాణం
జీవితంలో సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించడానికి సంవత్సరంలో మొదటిరోజు ఎంచుకున్నారు అమీ జాక్సన్. తన బాయ్‌ఫ్రెండ్ జార్జ్ పణాయిట్టోతో జనవరి ఫస్ట్ రోజున ఎంగేజ్మెంట్ చేసుకున్నారీ బ్రిటీష్ బ్యూటీ. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తెలియజేశారు. జార్జ్, అమీ 2015 నుంచి రిలేషన్షిప్లో ఉన్నారు. కానీ... అలాంటిదేం లేదని చాలాసార్లు తప్పించుకునే ప్రయత్నాలు చేశారు అమీ జాక్సన్. గతేడాది వేలంటేన్స్ డే రోజు జార్జ్‌ను ప్రేమిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అప్పటినుంచి హాలిడే ట్రిప్స్‌లోనూ, పార్టీల్లోనూ తరచుగా కలుస్తూ, ఆ ఫొటోలు పోస్ట్ చేస్తున్నారు. రీసెంట్గా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కోసం గ్రాండ్ క్రిస్మస్ పార్టీని కూడా అరేంజ్ చేశారు. న్యూ ఇయర్ హాలీడే సందర్భంగా జాంబియా వెళ్లింది ఈ జంట. అక్కడే ఈ ఇద్దరూ రింగ్స్ మార్చుకున్నారు. ‘‘మా జీవితాల్లో సరికొత్త సాహస యాత్రను మొదలుపెట్టాం. ఐ లవ్ యూ జార్జ్. నన్నీ ప్రపంచంలోనే ఆనందమైన అమ్మాయిని చేసినందుకు థ్యాంక్స్’’ అని ఈ ఫొటోను పోస్ట్ చేశారు. త్వరలోనే గ్రాండ్ వెడ్డింగ్ పార్టీ ఏర్పాటు చేయనున్నారట అమీ, జార్జ్. -
అమీ జాక్సన్.. పెళ్లి బాజాలు..!
సాక్షి, హైదరాబాద్ : సౌత్ ఇండియన్ హీరోయిన్ అమీ జాక్సన్ డేటింగ్లో ఉన్నారా?. ఆమె ఇన్‌స్టా ఫొటోలు ఈ విషయాన్నే ధ్రువపరుస్తున్నాయి. బ్రిటిష్ రియల్ ఎస్టేట్ వ్యాపారి జార్జ్ పనయిటోతో అమీ ప్రేమలో ఉన్నట్లు సమాచారం. త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే ఊహాగానాలు కూడా సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. జార్జ్‌కు లగ్జరీ హోటల్స్ కూడా ఉన్నాయి. కాగా, రోబో 2.0లో అమీ నటిస్తున్న విషయం తెలిసిందే. The look of sheer joy after making it down the kids slope. G was not impressed 🙃 A post shared by Amy Jackson (@iamamyjackson) on Feb 12, 2018 at 9:51am PST