
Amy Jackson: హీరోయిన్ అమీ జాక్సన్ తన ప్రియుడితో తెగదెంపులు చేసుకుందట. అతడితో ఏడడుగులు నడవకముందే వారి మధ్య ఉన్న బంధాన్ని తెంచేసుకుందట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. బ్రిటీష్ నటి, మోడల్ అమీ జాక్సన్.. జార్జ్ పనాయిటోను ప్రేమించింది. అతడే సర్వస్వం అనుకున్న ఈ భామ జార్జ్‌ను పెళ్లాడాలనుకుంది. ఈ మేరకు 2019 మేలో వీరి నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ కరోనా కారణంగా పెళ్లి వాయిదా పడింది.
అయితే వీరి ప్రేమకు ప్రతీకగా అదే ఏడాది సెప్టెంబర్‌లో మగబిడ్డకు జన్మనిచ్చింది అమీ జాక్సన్. పెళ్లి కాకముందే తల్లైన అమీ జాక్సన్ తన కొడుకుతో పాటు కాబోయే భర్తతో కలిసి దిగిన ఫొటోలను తరచూ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకునేది. అయితే ఏమైందో ఏమో కానీ ఈ హీరోయిన్ సడన్‌గా తన ప్రియుడితో కలిసి దిగిన ఫొటోలన్నింటినీ తొలగించింది.
దీంతో అమీ జాక్సన్ పెళ్లికి ముందే కాబోయే భర్తతో తెగదెంపులు చేసుకుందని వార్తలు వెలువడుతున్నాయి. ఉన్నట్లుండి ఇలా పిక్స్ డిలీట్ చేయడం చూస్తుంటే వీరు విడిపోయారని, ఇక వీరి పెళ్లి జరగడం కష్టమేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కాగా 2010లో 'మద్రాసుపట్నం' సినిమాతో హీరోయిన్‌గా కెరీర్ ఆరంభించిన అమీ జాక్సన్ తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లోనూ నటించింది. 'ఐ', 'రోబో 2.0' సినిమాలతో ప్రేక్షకులకు మరింత చేరువైంది.
Comments
Please login to add a commentAdd a comment