
సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్, అక్షయ్ కుమార్ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న భారీ విజువల్ వండర్ 2.ఓ. శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన రోబో చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై రోజుకో వార్త అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తాజాగా ఈ సినిమా బడ్జెట్‌కు సంబంధించిన వార్త ఒకటి కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
తాజాగా ఈ సినిమాకు బడ్జెట్‌కు సంబంధించిన చిత్రయూనిట్ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. భారత దేశంలో 75 మిలియన్ డాలర్ల(సుమారు 545 కోట్లు) బడ్జెట్‌తో తెరకెక్కిన తొలి విఎఫ్‌ఎక్స్ వండర్ అంటూ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ముందుగా 200 కోట్ల బడ్జెట్ అంటూ ప్రారంభించిన 2.ఓ తరువాత 400 కోట్లకు చేరింది.తాజా సినిమా 545 కోట్లకు పైగా ఖర్చు చేసినట్టుగా చిత్రయూనిట్ ప్రకటించటంతో ప్రేక్షకులతో పాటు సినీ వర్గాలు కూడా అవాక్కవుతున్నారు. వినాయక చవితి సందర్భం టీజర్‌ను రిలీజ్ చేస్తున్న 2.ఓ టీం సినిమాను నవంబర్ నెలాఖరున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment