ఐపీఎల్‌ ఫైనల్‌లో 2.ఓ సినిమా టీజర్‌? | Rajinikanth 2.0 Teaser To Release On IPL 2018 Final Match | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ ఫైనల్‌లో 2.ఓ టీజర్‌?

Published Mon, May 21 2018 8:11 PM | Last Updated on Mon, May 21 2018 8:50 PM

Rajinikanth 2.0 Teaser To Release On IPL 2018 Final Match - Sakshi

సాక్షి, సినిమా: ఐపీఎల్‌ క్రికెట్‌ పోటీలు రసవత్తరంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సీఎస్‌కే (చెన్నై సూపర్‌ కింగ్స్‌) సెమీ ఫైనల్‌కి చేరింది. ఇంతకీ ఈ ఐపీఎల్‌కు 2.ఓ చిత్రానికి సంబంధం ఏమిటీ అనేగా మీ ఆలోచన. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా నటిస్తున్న కాలా చిత్రం వచ్చే నెల 7న భారీ ఎత్తున విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. రజనీకాంత్‌ నటిస్తున్న మరో చిత్రం 2.ఓ. ఈ భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రం కాలా చిత్రం కంటే ముందుగా తెరపైకి రావాల్సి ఉండగా గ్రాఫిక్స్‌ కార్యక్రమాలు ఇంకా పూర్తి కాకపోవడంతో విడుదల అలస్యమైంది. అదే విధంగా చిత్ర టీజర్‌ను విడుదలకు చిత వర్గాలు ప్లాన్‌ చేస్తున్న సమయంలోనే అది కాస్తా లీక్‌ అయ్యి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవడంతో చిత్ర యూనిట్‌కు షాక్‌కు గురైంది.

దీంతో శంకర్‌ మరో టీజర్‌ను తయారు చేశారు.  ఈ చిత్ర టీజర్‌ను ఈ నెల 27వ తేదీన ఐపీఎల్‌ ఫైనల్‌లో విడుదల చేయాలనుకుంటున్నట్లు ప్రచారం వైరల్‌ అవుతోంది. దీనికి సంబంధించి వారి నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు. వాస్తవానికి అలా సింపుల్‌గా 2.ఓ చిత్ర టీజర్‌ను విడుదల చేస్తారా? అన్నది అంతుచిక్కని ప్రశ్న. ఈ చిత్ర ప్రచారాన్ని భారీ ఎత్తున నిర్మించడానికి లైకా సంస్థ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. 2.ఓ చిత్ర టీజర్‌ను ఐపీఎల్‌ పైనల్‌ పోటీ వేదికగా జరిగే అవకాశం ఉందా? లేదా? అన్న విషయంలో క్లారిటీ రావాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.

కెనడా బ్యూటీ ఎమీజాక్సన్‌ హీరోయిన్‌గా, బాలీవుడ్‌ స్టార్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ విలన్‌గా నటించిన ఈ చిత్రాన్ని స్టార్‌ దర్శకుడు శంకర్‌ అద్భుతంగా చెక్కుతున్నారు. అభిమానులు ఎప్పుడెప్పుడు చూద్దామా! అని ఆసక్తితో ఎదురు చూస్తున్నారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాగా 2.ఓ చిత్రాన్ని ఆగస్ట్‌లో విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement