2.ఓ టీజర్‌: చిట్టి మళ్లీ అదరగొట్టాడు | Rajinikanth 2 o Teaser Released | Sakshi
Sakshi News home page

Published Thu, Sep 13 2018 9:55 AM | Last Updated on Thu, Sep 13 2018 6:55 PM

Rajinikanth 2 o Teaser Released - Sakshi

తలైవా అభిమానులకు వినాయక చవితి కానుకగా 2. ఓ టీజర్‌ను  చిత్ర బృందం విడుదల చేసింది. సౌత్‌ స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌- సూపర్‌ స్టార్ రజనీ కాంత్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ట్రెండ్‌ సెట్టర్‌ మూవీ రోబో. ఈ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిస్తున్న భారీ విజువల్‌ వండర్‌ చిత్రం 2.ఓ. రజనీ సరసన అమీజాక్సన్‌ జతకట్టగా.. అక్షయ్‌ కుమార్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.

భారత దేశంలో 75 మిలియన్‌ డాలర్ల(సుమారు 545 కోట్లు) బడ్జెట్‌తో తెరకెక్కిన తొలి విఎఫ్‌ఎక్స్‌ వండర్‌ అంటూ చిత్ర బృందం ప్రచారం చేసింది. వారు పేర్కొన్న విధంగానే గురువారం రీలీజ్‌ అయిన టీజర్‌ చూస్తే సగటు ప్రేక్షకుడు ముక్కున వేలేసుకోక తప్పదు. అబ్బురపరిచే గ్రాఫిక్స్‌, భారీ ప్రొడక్షన్‌ వ్యాల్యూస్‌ ఈ టీజర్‌లో కనిపిస్తున్నాయి. రజనీ మరోసారి సైంటిస్ట్‌ అవతారం ఎత్తి చిట్టి (రోబో) రూపంలో అన్ని సమస్యలు తీర్చనున్నాడు. ఈ టీజర్‌లో శంకర్‌ తన మార్క్‌ చూపించాడు. అక్షయ్‌కుమార్‌ బయపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహ్మాన్‌ టీజర్‌లోనే బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ అదరగొట్టేశాడు. నవంబర్‌లో ఈ సినిమాను రిలీజ్‌ చేసేందుకు మూవీ యూనిట్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement