Akshaykumar
-
చంద్రయాన్-3 పై సినిమా.. ఫస్ట్ ఛాయిస్ ఆ హీరోనే
ప్రపంచ వ్యాప్తంగా ఆందరి దృష్టి చంద్రయాన్-3 మీదే ఉంది. భారతీయులందరి గుండెల్లో ఆనందాలు నింపుతూ.. చంద్రయాన్-3 చందమామ దక్షిణ ధ్రువంపై దిగుతుంటే.. కొన్ని కోట్ల మంది ప్రజలు ఆనందంతో తిలకించారు. నేడు గర్వంగా భారతీయ జెండాను చంద్రమండలంపై ఎగురువేశాం అనే ఆనందం వెనుక ఎంతో శ్రమతో పాటు కన్నీళ్లు,ఉద్వేగం ఇముడుకొని ఉన్నాయి. ఇదంతా ఒక సినిమాగా మన కళ్లుకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేస్తే అది నిజంగా అద్భుతమే అని చెప్పవచ్చు. (ఇదీ చదవండి: జాబిల్లిపై ఇండియా జయకేతనం.. టాలీవుడ్ స్టార్స్ విషెస్) గతంలో చంద్రయాన్-2 వైఫల్యాలను గుర్తుచేసుకుంటూ మన ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించిన చంద్రయాన్-3లో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చంద్రుడి మీది విక్రమ్ ల్యాండర్ దిగింది. చంద్రయాన్-2 నుంచి చంద్రయాన్-3 విజయం వరకు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. వాటిని ఇస్రో శాస్త్రవేత్తలు ఎలా అదిగమించారో తెలుపుతూ ఒక సినిమాగా తీసి భారతీయులకు చూపించాలని పలువురు నెటిజన్లు కోరుతున్నారు. ఇలాంటి ఆసక్తకరమైన సినిమాలు తీయాలంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ అనే చెప్పవచ్చు. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ఆయన ఫ్యాన్స్‌తో పాటు పలువురు నెటిజన్లు కూడా చంద్రయాన్ 3 బయోపిక్ తీయమని డిమాండ్ చేస్తున్నారు. దేశంలో ఏదైనా సెన్సేషన్ సృష్టించిన ఘటన జరిగితే ఆ అంశంపై సినిమా తీయడం మేకర్స్‌కు అలవాటే... బాలీవుడ్లో బయోపిక్ సినిమా తీయాలంటే మొదట వినిపించే పేరు అక్షయ్ కుమార్.... ఇప్పటికే ఆయన మిషన్ మంగల్, రామసేతు,కేసరి,OMG వంటి విభిన్న చిత్రాలతో మెప్పించాడు. దీంతో చంద్రయాన్-3 సినిమా తీస్తే ఆయన మాత్రమే న్యాయం చేయగలడని ఆయన ఫ్యాన్స్ తెలుపుతున్నారు. ప్రధాని మోదీతో అక్షయ్ కుమార్‌కు మంచి అనుబంధమే ఉంది. అందులో ఆయన ప్రధానిగా ఉన్న సమయంలోనే చంద్రయాన్-3 విజయవంతం అయింది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్‌ను అక్షయ్ తెరకెక్కిస్తారని పలువురు అంటున్నారు. -
పది రోజుల్లో రూ. 150 కోట్లు
ముంబై : ఖిలాడీ అక్షయ్ కుమార్, కరీనా కపూర్ల గుడ్‌న్యూస్ మూవీ బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ దబంగ్ 3 నుంచి పోటీ ఎదురైనా పదిరోజుల్లో ఈ మూవీ రూ. 150 కోట్లకు చేరువై నిర్మాతలకు గుడ్‌న్యూస్ పంచింది. 2019లో చివరి మూవీగా విడుదలైన ఈ సినిమా లాభాల పంట పండిస్తోంది. తొలి వారాంతంలో రూ. 65.99 కోట్లు రాబట్టిన గుడ్‌న్యూస్ రెండోవారంలో శుక్రవారం వరకూ రూ. 136 కోట్లు ఆర్జించింది. ఇక శనివారం రూ. 11.70 కోట్లు వసూలు చేసి రూ. 150 కోట్ల మార్క్‌కు చేరువైంది. దిల్జిత్ దొసాంజ్, కియారా అద్వానీ ఇతర ప్రధాన పాత్రలతో దర్శకుడు రాజ్ మెహతా తెరకెక్కించిన గుడ్‌న్యూస్ మూవీ ప్రేక్షకులు, సినీ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. -
రెండోసారి
‘హౌస్‌ఫుల్ 4’తో ఈ మధ్యనే థియేటర్స్‌లో సందడి చేశారు అక్షయ్ కుమార్, కృతీ సనన్. సాజిద్ నడియాడ్ వాలా నిర్మాణంలో ఫర్హాన్ సమ్జీ ఈ సినిమా రూపొందించారు. తాజాగా మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ కానుంది. సాజిద్ నడియాడ్వాలా నిర్మాణంలో అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కనున్న చిత్రం ‘బచ్చన్ పాండే’. తమిళంలో అజిత్ నటించిన ‘వీరమ్’ సినిమాకు ఇది హిందీ రీమేక్. ఫర్హాద్ సమ్జీ దర్శకుడు. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్గా కృతీ సనన్ నటించనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ‘ఈ క్రిస్మస్ని మరింత స్పెషల్‌గా మార్చడానికి కృతీసనన్ మాతో కలసి వస్తున్నారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ‘‘ఈ టీమ్‌తో మళ్లీ కలసి పని చేయడం థ్రిల్లింగ్‌గా ఉంది’’ అన్నారు కృతీసనన్. -
‘2.ఓ’ చూశాక...
రజనీకాంత్ పెద్ద హీరో అనందరికీ తెలుసు. ఆయన నటనకు వంక పెట్టలేం. కానీ, 2.0లో ఆయనెంత గొప్పగా నటించినా.. నచ్చడు! నవ్వించడానికి ప్రయత్నించినా.. నవ్వురాదు! రజనీకి మాత్రమే సాధ్యమయ్యే స్టైల్లో డైలాగ్స్ చెప్పినా అరవాలనిపించదు. త్రిడీలో రోబోగా ఆయనెన్నీ విన్యాసాలు చేసినా ఆకట్టుకోవు. ఎందుకంటే మనసంతా పక్షిరాజు (అక్షయ్‌కుమార్) పైనే ఉంటుంది. పక్షిరాజు మనుషుల్ని చంపుతున్నా కోపం రాదు. ఒకనొక సమయంతో పక్షిరాజు రోబోనూ చంపేస్తే బాగుండనిపిస్తుంది. సుక్ష్మంగా చెప్పాలంటే మన ఎమోషన్ పక్షిరాజుతో కలసి నడుస్తుంది. అందుకే రజనీ ఎంత గొప్పగా నటించినా నచ్చడు! నిజ జీవితంలో సెల్ఫోన్లు వాడొద్దంటే మనిషి వింటాడా? పక్షుల్ని చంపొద్దంటే ఆగుతాడా? అసలు పక్షిరాజు లాంటి వాడు భూమిపై వాలితే వదులుతాడా? వదలడు కాబట్టే ఈ క్రూర జంతువును నాశనం చేయడానికి, మనల్ని సరైన దారిలో పెట్టడానికి పక్షిరాజు లాంటి వాడు వస్తే బాగుండని ప్రతి ఆలోచనకూ అనిపిస్తుంది. అయితే అది సాధ్యమా?..కనుకే నిజ జీవితంలో మనం చేయలేనివి, చేయాలనుకున్నవి తెరపై చూసి మురిసిపోతాం. ఎదో సాధించామని గర్వపడతాం! నువ్వు బతకాలనుకున్న తీరు, నువ్వు ధ్వంసం చేయాలనుకున్న అన్యాయం, నువ్వు మరిచిపోవాలనుకున్న బాధలు సినిమాలో కనబడిప్పుడు లేదా పుస్తకంలో చదివినప్పుడు గుండెలో గడ్డ కట్టుకున్న భావోద్వేగాలు ఒక్కసారిగా పేలిపోతాయి. లోపలున్న అసంతృప్తులు పారిపోతాయి. మూడు గంటల్లో ఏదో ఒక్క పాత్ర.. అది కొన్ని క్షణాలు సాగినా సరే.. నీ ఉద్వేగానికి మరిచిపోలేని ఉద్దీపన కలిగిస్తే నా ఉద్దేశంలో అది సక్సెస్ అయినట్లే! అది సినిమా అయినా, కథ అయినా, కవితయినా! అది నిన్ను కొన్నాళ్లపాటు వెంటాడుతుంది. పక్షిరాజు అలాంటి ఎమోషనే! ఈ ఒక్క ఎమోషన్ చాలు సినిమా చూడటానికి! ఇంకా ‘ఆకలైతే చెయ్యిని నరుక్కుని తింటామా’ వంటి టెక్నాలజీకి చురకలంటించే అద్భుతమైన డైలాగ్స్ ఎన్నో ఉన్నాయి!! –తండ గణేశ్ -
2.ఓ టీజర్: చిట్టి మళ్లీ అదరగొట్టాడు
తలైవా అభిమానులకు వినాయక చవితి కానుకగా 2. ఓ టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్- సూపర్ స్టార్ రజనీ కాంత్‌ల కాంబినేషన్లో వచ్చిన ట్రెండ్ సెట్టర్ మూవీ రోబో. ఈ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిస్తున్న భారీ విజువల్ వండర్ చిత్రం 2.ఓ. రజనీ సరసన అమీజాక్సన్ జతకట్టగా.. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. భారత దేశంలో 75 మిలియన్ డాలర్ల(సుమారు 545 కోట్లు) బడ్జెట్‌తో తెరకెక్కిన తొలి విఎఫ్ఎక్స్ వండర్ అంటూ చిత్ర బృందం ప్రచారం చేసింది. వారు పేర్కొన్న విధంగానే గురువారం రీలీజ్ అయిన టీజర్ చూస్తే సగటు ప్రేక్షకుడు ముక్కున వేలేసుకోక తప్పదు. అబ్బురపరిచే గ్రాఫిక్స్, భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఈ టీజర్లో కనిపిస్తున్నాయి. రజనీ మరోసారి సైంటిస్ట్ అవతారం ఎత్తి చిట్టి (రోబో) రూపంలో అన్ని సమస్యలు తీర్చనున్నాడు. ఈ టీజర్లో శంకర్ తన మార్క్ చూపించాడు. అక్షయ్‌కుమార్ బయపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ టీజర్లోనే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టేశాడు. నవంబర్‌లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మూవీ యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. -
2. ఓ టీజర్ విడుదల
-
భళి భళి భళి రా భళి...
... సాహోరే బాహుబలి.. పాట ఎంత బాగుంటుందో కదా. ‘బాహుబలి–2’లోని ఈ పాటను తెర మీద చూస్తున్నప్పుడు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఇప్పుడు అక్షయ్ కుమార్ కూడా ‘బాహుబలి’గా మారనున్నారు. ఆశ్చర్యంగా ఉంది కదూ! ‘బాహుబలి’ బహు భాషల్లో విడుదలైంది కాబట్టి, హిందీలో రీమేక్ అయ్యే అవకాశం లేదు. మరి.. అక్షయ్‌కుమార్ ‘బాహుబలి’గా మారడం ఏంటి? అనుకుంటున్నారా? అసలు విషయం ఏంటంటే... అక్షయ్‌కుమార్ మెయిన్ లీడ్‌లో రూపొందిన ‘హౌస్‌ఫుల్’ చిత్రం గురించి తెలిసే ఉంటుంది. ఇప్పటివరకూ ఈ సినిమాకి సంబంధించిన మూడు భాగాలు వచ్చాయి. ఇప్పుడు ‘హౌస్‌ఫుల్ 4’ రూపొందనుంది. ఫస్ట్, సెకండ్ పార్ట్‌లకు దర్శకత్వం వహించిన సాజిద్ ఖాన్ నాలుగో భాగానికి దర్శకత్వం వహించనున్నారు. మూడో భాగం సాజిద్ ఫర్హాద్ దర్శకత్వంలో రూపొందింది. ‘హౌస్‌ఫుల్’ సిరీస్‌ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న సాజిద్ నడియాడ్వాలా ఫోర్త్ మూవీని త్వరలో ప్రారంభించాలనుకుంటున్నారు. ఈ చిత్రం ప్రజెంట్, పాస్ట్.. రెండు నేపథ్యాలలో రూపొందనుంది. పాస్ట్ స్టోరీ ‘బాహుబలి’ కాలంలో ఉంటుంది. అక్షయ్‌కుమార్ గుర్రపు స్వారీ. కత్తి యుద్ధం చేస్తారట. ‘బాహుబలి’ తారలు ఎలాంటి కాస్ట్యూమ్స్ వాడారో అలాంటివే డిజైన్ చేయిస్తున్నారట. ఆ ఎపిసోడ్ మొత్తం ‘బాహుబలి’ని తలపించేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటివరకూ తమ సంస్థ నుంచి వచ్చిన అన్ని కామెడీ ఎంటర్టైనర్స్కన్నా సాజిద్ నడియాడ్వాలా ఈ ఎంటర్టైనర్ని ఎక్కువ బడ్జెట్లో తీయనున్నారు. మరి.. ‘బాహుబలి’లా అంటే.. హయ్యస్ట్ బడ్జెట్ అవకుండా ఉంటుందా? -
చిట్టి... స్టిల్ ఎలైవ్!
యస్... చిట్టి ఇంకా బతికున్నాడు. ‘రోబో’లో రచ్చ రంబోలా చేశాడు. గుర్తుందా? ఆ చిట్టీనే! ఇప్పుడు మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ! అసలు చావడానికి చిట్టి మనిషయితేగా... రోబో! మరి, రోబో చావడం ఏంటి? అనొచ్చు. ఎంత రోబో అయినా... మనిషికున్న ఫీలింగ్స్ చిట్టీకి ఉన్నాయి కదా! ‘రోబో’ ఎండింగ్లో తనకు తానుగా బాడీలో పార్టులను విప్పేసుకుంటుంది చిట్టి. ‘రోబో’కి సీక్వెల్‌గా వస్తున్న ‘2.0’లో చిట్టీని మళ్లీ ఎలా తీసుకొస్తున్నారో? ప్రస్తుతానికి న్యూ లుక్‌ని మాత్రం చూపించారు దర్శకుడు శంకర్. యస్... ‘2.0’లో చిట్టి న్యూ లుక్కునే మీరు చూస్తున్నారిప్పుడు! ఫేస్ పెద్దగా మారలేదు గానీ... కాస్ట్యూమ్స్ సూపరున్నాయి. ఫ్యాన్స్‌కి మాంచి కిక్కిచ్చిందీ లుక్. రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో సుమారు 450 కోట్ల బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా పాటలు ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. సినిమాను వచ్చే ఏడాది జనవరి 25న విడుదల చేస్తామని చిత్రనిర్మాణ సంస్థ ప్రకటించింది. అయితే... పాటలు విడుదలైన తర్వాత సినిమా విడుదల ఏప్రిల్ 13కు వాయిదా వేశారనే వార్తలొచ్చాయి. వీటిపై రజనీ గానీ, చిత్రబృందం గానీ స్పందించలేదు. మరి, సినిమా ఎప్పుడు విడుదలవుతుందో? హిందీ హీరో అక్షయ్‌కుమార్ యాంటీ హీరోగా, బ్రిటన్ బ్యూటీ అమీ జాక్సన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. -
విలన్ కాదు!
అవును.. రజనీకాంత్ ‘2.0’లో అక్షయ్ కుమార్ విలన్ కాదట. మరి.. లుక్ చూస్తే దయా దాక్షిణ్యాలు లేకుండా అడ్డం వచ్చినవాళ్లను కిరాతకంగా చంపేసేలా కనిపిస్తున్నాడు కదా అనే డౌట్ రావొచ్చు. అలా సందేహించడం తప్పు కాదు. అయితే అసలు విషయం ఏంటంటే.. అక్షయ్‌ది ‘యాంటీ హీరో’ రోల్. అంటే.. మంచి కోసం చెడు చేస్తారు కదా? ఆ టైప్ అన్నమాట. సినిమా చూసేటప్పుడు మనం డా. రిచర్డ్ (సినిమాలో అక్షయ్ కుమార్ పాత్ర పేరు) పాయింటాఫ్ వ్యూలో ఆలోచిస్తే, అతను చేసేవన్నీ కరెక్ట్‌గానే అనిపిస్తాయట. పర్యావరణానికి హాని కలిగించే టెక్నాలజీని అంతం చేయాలనుకుంటాడట రిచర్డ్. పైగా అతను ఏ హక్కుల కోసం పోరాడతాడో అవన్నీ సమంజసంగానే ఉంటాయట. ఇలాంటి క్యారెక్టర్లు ఉన్నప్పుడు హీరోతో పాటు యాంటీ–హీరో కూడా గెలవాలనుకుంటాం. కానీ, ఫైనల్‌గా గెలిచేది హీరోనే కదా. మరి.. ఈ హీరో–యాంటీ హీరో రోల్స్‌ని చిత్రదర్శకుడు శంకర్ ఎలా డీల్ చేసి ఉంటారన్నది ఆసక్తికరం. ఇప్పటికే అక్షయ్ లుక్ బయటికొచ్చింది. గురువారం మరో ఫొటో రిలీజైంది. ఇక్కడ మీరు చూస్తున్నది ఆ ఫొటోయే. జనవరిలో ‘2.0’ని విడుదల చేయాలనుకుంటున్నారు. వాయిదా పడిందని రెండు –మూడు రోజులుగా వార్తలొస్తున్నాయి. మరి.. జనవరిలో వస్తుందా? వెయిట్ అండ్ సీ. అన్నట్లు... ఈ పాత్రకు ముందు అక్షయ్ పాత్రకు ముందు కమల్‌హాసన్‌ని తీసుకున్నారు. నటుడిగా ఆయనకున్న పేరుని దృష్టిలో పెట్టుకుని యాంటీ హీరో రోల్‌ని పాజిటివ్ షేడ్స్‌తోనే రాశారట. ఆ తర్వాత అక్షయ్ సీన్లోకి వచ్చారు. అక్షయ్‌కి ఉన్న పేరు కూడా తక్కువేం కాదు. అందుకే అవుట్ అండ్ అవుట్ విలన్‌గా చూపించాలనుకోలేదని సమాచారం. -
సూపర్‌స్టార్ వెనక్కి వెళతాడా?
...లేదా వెళ్తున్నాడా? ముంబయ్, చెన్నైలలో ఇప్పుడిదే హాట్ టాపిక్! సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘2.0’ను మొన్న వెళ్లిన దీపావళికి విడుదల చేయాలనుకున్నారు. అయితే... భారీ ప్రొడక్షన్, గ్రాఫిక్ వర్క్ వల్ల వాయిదా వేసి వచ్చే జనవరి 25న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు ఆ తేదీకి కూడా ‘2.0’ రావడం కష్టమేనంటున్నారు. ఎందుకంటే... వచ్చే జనవరి 26న ‘2.0’లో విలన్‌గా నటించిన అక్షయ్‌కుమార్ హీరోగా చేసిన హిందీ సినిమా ‘ప్యాడ్మాన్’ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు ప్రకటించారు. జనవరి 25న ‘2.0’ వస్తే... అక్షయ్ తన సినిమాను ఎందుకు విడుదల చేస్తారు? ‘2.0’ వెనక్కి వెళ్తుందని అతనికి తెలిసింది కాబట్టే... ‘ప్యాడ్మాన్’ను రెడీ చేశారనేది ముంబయ్, చెన్నైలలో హాట్ టాపిక్. తమిళ నూతన సంవత్సరాది (ఏప్రిల్ 13న) సందర్భంగా ‘2.0’ విడుదల చేయాలనుకుంటున్నారనేది తాజా సమాచారం. ఏమవుతుందో? ‘2.0’తో సూపర్‌స్టార్ వెనక్కి వెళతాడో? లేదో? చూద్దాం!! -
ఏంజిల్ వచ్చిన వేళ!
మలయాళ కుట్టి అసిన్ గుర్తున్నారా? అదేనండీ.. ‘అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి’, ‘శివమణి’, ‘లక్ష్మీ నరసింహా’.. ఇలా తెలుగులో చాలా సినిమాలు చేశారు కదా!. ‘గజిని’ హిందీ రీమేక్ ద్వారా బాలీవుడ్‌కి పరిచయమైన ఈ భామ ఉత్తరాది ఇంటి కోడలైన విషయం కూడా గుర్తుండే ఉంటుంది. మైక్రోమ్యాక్స్ మొబైల్స్ సంస్థ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మ, అసిన్‌ల పెళ్లి గతేడాది జనవరిలో జరిగింది. ఈ దంపతులకు మంగళవారం పాప పుట్టింది. ‘‘మా ఇంటికి ఏంజిల్ వచ్చిన వేళ మా ఆనందాన్ని మీతో పంచుకుంటున్నాం’’ అని రాహుల్ శర్మ పేర్కొన్నారు. కాగా, బాలీవుడ్లో అసిన్‌కి ఉన్న మంచి స్నేహితుల్లో హీరో అక్షయ్ కుమార్ ఒకరు. రాహుల్–అసిన్‌లు లవ్‌లో పడ్డప్పుడు ఈ హీరోగారు సపోర్ట్ చేశారు. పెళ్లప్పుడు కూడా దగ్గరున్నారు. అసిన్ తల్లయిన సందర్భంగా అక్షయ్ స్వయంగా వెళ్లి, పాపను ఎత్తుకుని, శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంకో విషయం ఏంటంటే... నేడు (గురువారం) అసిన్ బర్త్‌డే. పుట్టినరోజుకి ఒకరోజు ముందు తల్లి కావడం... మొత్తం మీద అసిన్, రాహుల్ ఇంట రెండు పండగలు. -
మనిషే కాదు... మాట కూడా!
వార్నీ!! గోళ్లేంట్రా... అంత పొడుగున్నాయ్? పక్షులకు ఉన్నట్టు! గోళ్లు కాదు... కళ్లు చూశావా! ఆ రంగు ఏంటో... కనుబొమలేమో పక్షి ఈకల్లాగున్నాయ్? ఎంతైనా శంకర్ డిఫరెంట్‌గా ఆలోచిస్తాడ్రా. సిన్మాలో క్యారెక్టర్ ఎలాగుంటుందో? – రజనీకాంత్ ‘2.0’లో విలన్ అక్షయ్‌కుమార్ లుక్ లీకయినప్పుడు, తర్వాత అఫీషియల్‌గా విడుదల చేసినప్పుడూ... పబ్లిక్‌లో ఫుల్ డిస్కషన్! అంత డిఫరెంట్‌గా అక్షయ్ బర్డ్‌మ్యాన్ లుక్‌ను దర్శకుడు శంకర్ డిజైన్ చేశారు మరి. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే... మనిషి లుక్కే కాదు, మాట కూడా అంతే డిఫరెంట్. ఆస్కార్ అవార్డు గ్రహీత రసూల్ పూకుట్టి ‘2.0’కి సౌండ్ డిజైనర్. కొన్ని వారాలుగా విలన్ వాయిస్ ఎలా ఉండాలనే విషయమై డిస్కస్ చేస్తున్నారు. డైలాగులకు మామూలుగానే డబ్బింగ్ చెప్పించి, తర్వాత సౌండ్ ఎన్హాన్స్మెంట్ టెక్నాలజీ ద్వారా వాయిస్‌ని ఛేంజ్ చేస్తారట! ఆ వాయిస్ ఎలా ఉండబోతుందో... ట్రైలర్లో వినిపిస్తారేమో! హిందీలో తన పాత్రకు అక్షయ్ స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. తెలుగు, తమిళ భాషల్లో డబ్బింగ్ ఆర్టిస్ట్ చేత చెప్పించాలనుకుంటున్నారు. ఒక్క పాటే... పది రోజులు తీశారు ఒక్కటంటే ఒక్క పాటే ఉంటుందట.. ‘2.0’లో రజనీకాంత్, అమీ జాక్సన్ మధ్య! అంటే.. డ్యూయెట్ అన్నమాట. మిగతావన్నీ సిట్యువేషనల్ లేదా మాంటేజ్ సాంగ్స్ అట! ఆ ఒక్క పాటను పది రోజులు తీశారు. మామూలుగానే శంకర్ సినిమాల్లో సాంగులు భారీగా ఉంటాయి. మరి, పది రోజులు తీశారంటే... ఏ రేంజ్లో ఉంటుందో! నిన్నటితో ఆ పాట చిత్రీకరణ పూర్తయింది. సుమారు 450 కోట్ల బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ‘2.0’కి ఏఆర్ రెహమాన్ స్వరకర్త. ఈ శుక్రవారం దుబాయ్‌లో పాటల్ని విడుదల చేయనున్నారు. -
అదిరేటి డ్రస్ మీరేస్తే..
తమిళసినిమా: హీరోలు జిగేల్ మనే దుస్తులు ధరిస్తే అబ్బా బాగుంది కదా అంటాం. అదే హీరోయిన్లు ధరిస్తే వావ్ అదుర్స్ అంటాం. ఇక స్టార్ డైరెక్టర్ శంకర్ చిత్రాల్లో ఆహా అంటూ అబ్బుర పరచే అంశాలు చాలానే ఉంటాయి. శంకర్ చిత్రాల్లో సన్నివేశాలు గ్రాండ్గానూ, పాటలు రసరమ్యంగా, లొకేషన్ సుందరంగా ఉంటాయి. ఇక హీరోహీరోయిన్ల డ్రస్ అదుర్స్ అనిపించేలా ఉంటాయి. ఆయన చిత్రీకరణలో కొత్తదనం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. భారీ తనం గురించి ఇక చెప్పనక్కర్లేదు. టోటల్‌గా బ్రహ్మాండానికి మారు పేరు శంకర్ చిత్రాలు అంటారు. తాజాగా శంకర్ దర్శకత్వం వహిస్తున్న 2.ఓ చిత్రంలోనూ ఇలాంటి కనువిందు చేసే అంశాలు చాలానే ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే శంకర్ ఇంతకు ముందు తెరకెక్కించిన చిత్రాలన్నిటి కంటే భారీ బడ్జెట్లో రూపొందుతున్న చిత్రం 2.ఓ. సూపర్‌స్టార్ రజనీకాంత్, ఎమీజాక్సన్ జంటగా నటిస్తున్న ఇందులో బాలీవుడ్స్టార్ అక్షయ్‌కుమార్ విలన్‌గా విజృంభించనున్నారు. చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇతర హంగులు దిద్దుకుంటోంది. 2.ఓ చిత్రం కోసం ఒక్క పాటను చిత్రీకరించాల్సి ఉంది.ఆ పాటను త్వరలోనే బ్రహ్మాండంగా చిత్రీకరించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ పాటలో రజనీకాంత్, ఎమీజాక్సన్ ధరించే దుస్తులను రెడీ చేస్తున్నారు. తనకోసం సిద్ధం చేసిన దుస్తులు ట్రైల్ వేసి చూసుకోవడానికి నటి ఎమీజాక్సన్ ఇటీవల చెన్నైకి వచ్చింది. ఆ డ్రస్ చూడగానే వావ్ అదుర్స్ అంటూ అచ్చెరువు చెందిందట. దటీజ్ శంకర్ అందుకే ఆయన చిత్రాలు అంత గ్రాండ్‌గా ఉంటాయని దర్శకుడిని పొగడ్తల్లో ముంచేసిందట. అంతేకాదు ఆ డ్రస్ ధరించి చూసుకుని తెగ ముచ్చట పడిపోయిందట. ఆ అదిరేటి డ్రస్‌తో ఎప్పుడెప్పుడు –2.ఓ చిత్ర పాటలో నటించేద్దామా అని తహతహలాడుతోందట. ఇక ఎమీని ఆ డ్రస్‌లో చూసి కుర్రకారు ఎంతగా కిర్రెక్కిపోతారో. జనవరిలో ఈ చిత్రం తెరపైకి రానుంది. -
తండ్రిగా అక్షయ్ గర్వపడ్డవేళ..
విశాఖపట్నం: అంతర్జాతీయ నౌకాదళాల ప్రదర్శన(ఐఎఫ్ఆర్)లో చోటు చేసుకున్న ఓ సంఘటన ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‌ను గర్వ పడేలా చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సరదాగా తన కుమారుడు ఆర్నవ్ చెవి పట్టుకొని మంచి బాలుడు అని అనడం తండ్రిగా గర్వపడే విషయమని నటుడు అక్షయ్ కుమార్ పేర్కొన్నారు. మోదీ, ఆర్నవ్ చెవిని పట్టుకొన్న ఫోటోను తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. తనకు కూడా ఇది మరచిపోలేని సంఘటన అని, వేల పదాలకుండే విలువ నిజంగా ఈ దృశ్యానికుందని తల్లి ట్వింకిల్ కన్నా ట్విట్ చేశారు. ఐఎఫ్ఆర్-2016 బ్రాండ్ అంబాసిడర్‌గా అక్షయ్ కుమార్ ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు, ఐఎఫ్ఆర్-2016లో అత్యంత ముఖ్య ఘట్టం.. నౌకాదళ పాటవాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శనివారం సమీక్షించారు. త్రివిధ దళాల అధిపతి హోదాలో రాష్ట్రపతి ఈ సమీక్ష చేశారు. సంప్రదాయబద్ధమైన 21 తుపాకులతో గౌరవ వందనం స్వీకరించిన తరువాత రాష్ట్రపతి యుద్ధనౌక ఐఎన్ఎస్ సుమిత్రను అధిరోహించారు. అందులో పయనిస్తూ సముద్రజలాల్లో లంగరు వేసి ఉన్న 100 యుద్ధ నౌకల సామర్థ్యాన్ని సమీక్షించారు. వాటిలో భారత యుద్ధ నౌకలు 71 కాగా మిగిలినవి విదేశీ యుద్ధ నౌక లు. ఐఎన్ఎస్ సుమిత్ర తమ చెంతకు రాగానే యుద్ధ నౌకల్లో ఉన్న నౌకాదళాల అధికారులు, సిబ్బంది రాష్ట్రపతికి గౌరవ వందనం సమర్పించారు. Proud moment in a father's life, when the Prime Minister pulls your son's ear in jest & calls him a good boy ;) pic.twitter.com/0NWRyDtWh6 — Ranjit Katiyal (@akshaykumar) February 6, 2016 When a picture is truly worth a thousand words.. #BigMoment https://t.co/WCXzdlaK52 — Twinkle Khanna (@mrsfunnybones) February 6, 2016 -
'దర్శకత్వం చేసే ఉద్దేశం లేదు'
ముంబయి : బాలీవుడ్ ఇండస్ట్రీలో సరదాగా ఉంటూ రెండు దశాబ్దాలుగా ప్రేక్షకుల్ని అలరిస్తున్న నటుడు అక్షయ్ కుమార్. నటుడిగా, నిర్మాతగా ఉండటానికే తాను ఇష్టపడతానని చెప్పాడు. ఫేమస్ కొరియోగ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవా డైరెక్షన్ చేసిన తన లేటెస్ట్ మూవీ 'సింగ్ ఈజ్ బ్లింగ్' ప్రమోషన్స్‌లో భాగంగా ఈ చిత్ర యూనిట్ ఓ చాట్ సెషన్ నిర్వహించారు. ఓ అభిమాని సంధించిన ప్రశ్నకు అక్షయ్ ఆశ్చర్యానికి లోనయ్యాడట. దర్శకత్వం ఎప్పుడు చేస్తారని ఈ చాట్ సెషన్లో వచ్చిన ఓ ప్రశ్నకు బదులుగా.. నాకు దర్శకత్వ చేసే ఉద్దేశం లేదన్నాడు. తాను ప్రస్తుతం నటుడిగా, నిర్మాతగా సంతృప్తిగా ఉన్నానంటూ నవ్వేశాడు అక్షయ్. ఈ ఏడాది ఇది విడుదలవుతున్న తన నాలుగో మూవీ 'సింగ్ ఈజ్ బ్లింగ్' అన్నాడు. ఈ మూవీ యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్ అని అక్షయ్ చెప్పాడు. తన ప్రతి మూవీలోనూ ఏదో వైవిధ్యం అక్షయ్ ప్రదర్శిస్తానని ఈ ఏడాది విడుదలైన ఆయన మూవీలను చూస్తే అర్థమవుతుంది. తాను దర్శకత్వం వహించాలని అభిమానులు కోరుకుంటున్నందుకు వారికి ధన్యావాదాలు తెలిపాడు. ప్రభుదేవాతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి మరో అభిమాని అడిగిన ప్రశ్నకు.. మా కాంభినేషన్ ఎప్పుడూ సూపర్బ్. అతనికి ఏం కావాలో అదే తెరపై చూపిస్తాడంటూ ప్రభుదేవా గురించి చెప్పుకొచ్చాడు. 2012లో మా కాంబినేషన్లో 'రౌడీ రాథోడ్' మూవీ వచ్చిందని అక్షయ్ గుర్తుచేశాడు. -
అక్షయ్ సినిమాలో సోనాక్షి ఐటంసాంగ్