వార్నీ!! గోళ్లేంట్రా... అంత పొడుగున్నాయ్? పక్షులకు ఉన్నట్టు! గోళ్లు కాదు... కళ్లు చూశావా! ఆ రంగు ఏంటో... కనుబొమలేమో పక్షి ఈకల్లాగున్నాయ్? ఎంతైనా శంకర్ డిఫరెంట్‌గా ఆలోచిస్తాడ్రా. సిన్మాలో క్యారెక్టర్ ఎలాగుంటుందో? – రజనీకాంత్ ‘2.0’లో విలన్ అక్షయ్‌కుమార్ లుక్ లీకయినప్పుడు, తర్వాత అఫీషియల్‌గా విడుదల చేసినప్పుడూ... పబ్లిక్‌లో ఫుల్ డిస్కషన్! అంత డిఫరెంట్‌గా అక్షయ్ బర్డ్‌మ్యాన్ లుక్‌ను దర్శకుడు శంకర్ డిజైన్ చేశారు మరి.
లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే... మనిషి లుక్కే కాదు, మాట కూడా అంతే డిఫరెంట్. ఆస్కార్ అవార్డు గ్రహీత రసూల్ పూకుట్టి ‘2.0’కి సౌండ్ డిజైనర్. కొన్ని వారాలుగా విలన్ వాయిస్ ఎలా ఉండాలనే విషయమై డిస్కస్ చేస్తున్నారు. డైలాగులకు మామూలుగానే డబ్బింగ్ చెప్పించి, తర్వాత సౌండ్ ఎన్‌హాన్స్‌మెంట్ టెక్నాలజీ ద్వారా వాయిస్‌ని ఛేంజ్ చేస్తారట! ఆ వాయిస్ ఎలా ఉండబోతుందో... ట్రైలర్‌లో వినిపిస్తారేమో! హిందీలో తన పాత్రకు అక్షయ్ స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. తెలుగు, తమిళ భాషల్లో డబ్బింగ్ ఆర్టిస్ట్ చేత చెప్పించాలనుకుంటున్నారు.
ఒక్క పాటే... పది రోజులు తీశారు
ఒక్కటంటే ఒక్క పాటే ఉంటుందట.. ‘2.0’లో రజనీకాంత్, అమీ జాక్సన్ మధ్య! అంటే.. డ్యూయెట్ అన్నమాట. మిగతావన్నీ సిట్యువేషనల్ లేదా మాంటేజ్ సాంగ్స్ అట! ఆ ఒక్క పాటను పది రోజులు తీశారు. మామూలుగానే శంకర్ సినిమాల్లో సాంగులు భారీగా ఉంటాయి. మరి, పది రోజులు తీశారంటే... ఏ రేంజ్‌లో ఉంటుందో! నిన్నటితో ఆ పాట చిత్రీకరణ పూర్తయింది. సుమారు 450 కోట్ల బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ‘2.0’కి ఏఆర్ రెహమాన్ స్వరకర్త. ఈ శుక్రవారం దుబాయ్‌లో పాటల్ని విడుదల చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment