amijakson
-
అతిథి పాత్రలో ఐశ్వర్య?
‘ఎందిరిన్’ సినిమాలో చిట్టి (రోబో) ఐశ్వర్యా రాయ్‌ని గాఢంగా ప్రేమించాడు. ఇప్పుడు ‘2.0’ సినిమా కోసం మళ్లీ చిట్టి వస్తున్నాడు. పనిలో పనిగా తన గార్ల్‌ఫ్రెండ్‌ని కూడా చూసుకునే అవకాశం చిట్టికి ఉందట. అదేనండీ.. ‘2.0’ సినిమాలో ఐశ్వర్యా రాయ్ కూడా ఓ గెస్ట్ రోల్లో కనిపించబోతున్నారని చెబుతున్నాం. శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్, అక్షయ్‌కుమార్, అమీ జాక్సన్ ముఖ్యతారలుగా నటించిన సినిమా ‘2.0’. 2010లో వచ్చిన ‘ఎందిరిన్’ (తెలుగులో ‘రోబో’) సినిమాకు ఇది సీక్వెల్ అన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో తొలి పార్ట్‌లో హీరోయిన్గా నటించిన ఐశ్వర్యా రాయ్ సీక్వెల్లో ఓ గెస్ట్ రోల్ చేశారని తాజా కోలీవుడ్ టాక్. ఆ సంగతలా ఉంచితే.. ఇటీవల విడుదల చేసిన టీజర్లో అక్షయ్ కుమార్‌కు స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉందని ఆయన ఫ్యాన్స్ ఫీలయ్యారట. అందుకే అక్షయ్ కుమార్‌కు సంబంధించిన ఓ చిన్న టీజర్‌ను రిలీజ్ చేయాలని దర్శక–నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారని వినికిడి. ఇలా చేస్తే నార్త్‌లో కూడా ‘2.0’ సినిమాకు మంచి పబ్లిసిటీ వచ్చే అవకాశం కూడా ఉందనే ఆలోచనలో ఉన్నారట. దాదాపు 500 కోట్లతో లైకాప్రొడక్షన్స్ నిర్మించిన ‘2.0’ సినిమా ఈ ఏడాది నవంబర్ 29న విడుదల కానున్న సంగతి తెలిసిందే. -
అమీ ఆగయా
‘ది విలన్’ సినిమా కోసం బెంగళూరులో ల్యాండ్ అయ్యారు హీరోయిన్ అమీ జాక్సన్. ప్రేమ్ దర్శకత్వంలో శివరాజ్‌కుమార్, సుదీప్, అమీ జాక్సన్ ముఖ్య తారలుగా రూపొందుతోన్న కన్నడ సినిమా ‘ది విలన్’. శ్రీకాంత్, మిథున్ చక్రవర్తి కీలక పాత్రల్లో కనిపిస్తారు. శ్రీకాంత్‌ది విలన్ రోల్ అని సమాచారం. మిథున్ చక్రవర్తికి కన్నడంలో ఇది తొలి చిత్రం. ఇటీవలే ఇద్దరు హీరోలు శివరాజ్ కుమార్, సుదీప్‌లకు వేరు వేరుగా టీజర్స్‌ను కట్ చేశారు. ప్రస్తుతం బెంగళూరులో జరుగుతోన్న ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్లో జాయిన్ అయ్యారు అమీ జాక్సన్. సాంగ్ షూట్ జరుగుతోంది. ఈ సినిమాను ఆగస్టు చివరి వారంలో రిలీజ్ చేయాలనుకుంటున్నారట. -
2.0 @ 29.11.18
ఎప్పటినుంచో సినీ ప్రేమికులు ఎదురుచూస్తోన్న సినిమాల్లో ‘2.0’ చిత్రం ఒకటి. ఇప్పటికే చాలా సార్లు ఈ సినిమా వాయిదా పడ్డ విషయం తెలిసిందే. ఇప్పుడు చిత్రబృందం కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటింటించింది. రజనీకాంత్, అక్షయ్ కుమార్, అమీజాక్సన్ ముఖ్య తారలుగా శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన సినిమా ‘2.0’. 2010లో శంకర్ దర్శకత్వంలోనే వచ్చిన ‘యందిరిన్’ చిత్రానికి సీక్వెల్ ఇది. ఈ సినిమాను ముందుగా గత ఏడాది దీపావళికి రిలీజ్ చేయాలనుకున్నారు. కుదరకపోవడంతో ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా విడుదలచేయాలనుకున్నప్పటికీ వీలుపడలేదు. అలాగే ఈ ఏడాది వేసవిలో రిలీజ్ చేయనున్నట్లు లైకా ప్రొడక్షన్స్ సంస్థ ప్రకటించిన విజువల్ ఎఫెక్ట్స్ పెండింగ్ ఉండటం వల్ల ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఇప్పుడు ‘2.0’ చిత్రబృందం సినిమాను ఈ ఏడాది నవంబర్‌లో విడుదల చేయాలని నిర్ణయించింది. ‘‘అందరికీ హాయ్. చివరిగా మూవీ ఫైనల్ కాపీని ఇవ్వడానికి విజువల్ ఎఫెక్ట్స్ డీల్ చేస్తోన్న కంపెనీలు ఓ డెలివరీ డేట్‌ను చెప్పారు. సినిమాను ఈ ఏడాది నవంబర్ 29న రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు డైరెక్టర్ శంకర్. ఈసారైనా చెప్పిన తేదీకి సినిమా రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. -
రాముడా? రావణుడా?
రెండు సంవత్సరాలు పూర్తయ్యాయి కన్నడలో ‘ది విలన్’ సినిమా షూటింగ్‌కు కొబ్బరికాయ కొట్టి. ఇప్పుడు గుమ్మడికాయ కొట్టే టైమ్ వచ్చింది. ఆల్రెడీ టాకీపార్ట్‌ను కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా టీమ్ ప్రజెంట్ సాంగ్స్‌ను షూట్ చేసే పనిలో పడింది. శివరాజ్‌కుమార్, సుదీప్, అమీజాక్సన్ ముఖ్య తారలుగా రూపొందుతున్న సినిమా ‘ది విలన్’. రామ్ ఆర్ రావణ్ అనేది ఉపశీర్షిక. ఈ సినిమాలో టాలీవుడ్ నటుడు శ్రీకాంత్, బాలీవుడ్ నటుడు మిధున్ చక్రవర్తి కీలక పాత్రలు చేస్తున్నారు. రీసెంట్గా హీరో శివరాజ్ కుమార్‌పై ఓ మాస్ సాంగ్‌ను షూట్ చేశారు. ఈ సాంగ్‌తో ఈ సినిమాలో శివరాజ్‌కుమార్ వంతు చిత్రీకరణ పూర్తయ్యింది. ‘‘శివన్న డ్యాన్సింగ్ ఎనర్జీ సూపర్. నగేశ్ మాస్టర్ కంపోజ్ చేశారు’’ అన్నారు దర్శకుడు ప్రేమ్. ఆల్రెడీ హీరోల లుక్స్ రిలీజ్ అయ్యాయి. ఈ నెల 28న టీజర్‌ను రిలీజ్ చేయాలనుకుంటున్నారట. -
స్క్రీన్ టెస్ట్
1. నటుడు విశాల్ హీరో కాకముందు ఓ ప్రముఖ హీరో దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు. ఎవరా హీరో? ఎ) విక్రమ్ బి) అర్జున్ సి) భాగ్యరాజా డి) విజయ్ కాంత్ 2. నాని నటించిన ‘మజ్ను’ ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన హీరోయిన్ ఎవరో కనుక్కోండి? ఎ) అనూ ఇమ్మాన్యుయేల్ బి) అనుపమా పరమేశ్వరన్ సి) రుక్షార్ థిల్లన్ డి) నివేథా థామస్ 3. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ‘కెరటం’ అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు. తనకు బ్రేక్ ఇచ్చిన సినిమా మాత్రం ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’. ఆ బ్రేక్ ఇచ్చిన దర్శకుడెవరు? ఎ) గౌతమ్ పట్నాయక్ బి) సురేందర్ రెడ్డి సి) మేర్లపాక గాంధీ డి) సుబ్బారెడ్డి 4. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకొని పోలీసులకు దొరికిన బాలీవుడ్ నటుడెవరో కనుక్కోండి? ఎ) ఆమిర్ ఖాన్ బి) సల్మాన్ ఖాన్ సి) సొహైల్ ఖాన్ డి) అర్భాజ్ ఖాన్ 5. ‘నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు’... అనే పాట ‘చందమామ’ సినిమాలోనిది. ఈ పాట రచయితెవరో తెలుసా? ఎ) రామజోగయ్య శాస్త్రి బి) అనంత శ్రీరామ్ సి) చంద్రబోస్ డి) వనమాలి 6. ఎన్టీఆర్, అంజలీదేవి, జమున నటించిన ‘సతీ అనసూయ’ చిత్రానికి సంగీతదర్శకుడెవరో కనుక్కోండి? ఎ) ఎస్.రాజేశ్వరరావు బి) కె.వి. మహదేవన్ సి) ఘంటసాల డి) పెండ్యాల 7. 2012వ సంవత్సరానికి ఫోర్బ్ ్స ఇండియా సెలబ్రిటీ టాప్ 100 లిస్టు్టలో 66వ స్థానాన్ని సంపాదించిన టాలీవుడ్ హీరో ఎవరై ఉంటారో ఓ లుక్కేయండి? ఎ) ప్రభాస్ బి) జూనియర్ ఎన్టీఆర్ సి) అల్లు అర్జున్ డి) రామ్ చరణ్ 8. అనురాగ్ బసు దర్శకత్వం వహించిన బాలీవుడ్ చిత్రం ‘బర్ఫీ’ ద్వారా తెలుగు నుండి బాలీవుడ్‌కు షిఫ్ట్ అయిన హీరోయిన్ ఎవరో కనిపెట్టండి? ఎ) ఇలియానా బి) తమన్నా సి) రకుల్ ప్రీత్‌సింగ్ డి) పూజా హెగ్డే 9. ఓ నాటకంలో నటించటానికి సావిత్రి దుగ్గిరాల వెళ్లినప్పుడు ఓ ఇంట్లో బస చేశారు. ఆ ఇంట్లో ఉన్న అమ్మాయిని ఆమె సినిమా ఇండస్ట్రీకి రమ్మన్నారు. ఆమె చెన్నై వెళ్లి, చాలా పెద్ద హీరోయిన్ అయ్యారు. ఎవరా హీరోయిన్? ఎ) విజయనిర్మల బి) అంజలీదేవి సి) దేవిక డి) జమున 10. జూన్ 10న హీరో బాలకృష్ణ పుట్టినరోజు. అదే రోజున మరో అగ్ర దర్శకుని పుట్టినరోజు కూడా. ఎవరా దర్శకుడు? ఎ) బి.గోపాల్ బి) శ్రీను వైట్ల సి) ఈవీవీ సత్యనారాయణ డి) జంధ్యాల 11. వెంకటేశ్ నటించిన ‘బొబ్బిలి రాజా’ చిత్ర సంగీత దర్శకుడెవరో తెలుసా? ఎ) ఇళయ రాజా బి) చక్రవర్తి సి) యం.యం. కీరవాణి డి) కోటి 12. ‘మదరాస పట్టణం’ సినిమా ద్వారా స్క్రీన్‌కి పరిచయమయ్యారీ భామ. ‘ఎవడు’ చిత్రం ద్వారా తెలుగుకి పరిచయమయ్యారు. ఎవరా హీరోయిన్? ఎ) అమీ జాక్సన్ బి) అమలాపాల్ సి) ఆండ్రియా డి) అంజలి 13. యోగా గురువు భరత్ ఠాగూర్ దగ్గర కొంత కాలం శిష్యరికం చేశారు ఈ హీరోయిన్. ఎవరామె? ఎ) భూమిక బి) అనుష్క సి) చార్మీ డి) ప్రియమణి 14. 1985లో విడుదలైన వందేమాతరం’ సినిమాలో కథానాయకుడు ఎవరో చెప్పుకోండి చూద్దాం? ఎ) భానుచందర్ బి) సుమన్ సి) రాజశేఖర్ డి) వినోద్‌కుమార్ 15. విప్లవ చిత్రాల దర్శకుడు ఆర్.నారాయణ మూర్తి తన మొదటి సినిమా నుండి ఈ రోజు వరకు అలాంటి చిత్రాల్లోనే నటించారు. ఆయన మొదటి సినిమా ఏదో చెప్పుకోండి? ఎ) దండోరా బి) అర్ధరాత్రి స్వతంత్రం సి) అడవి దివిటీలు డి) ఎర్ర సైన్యం 16. ఆ హీరో ఇప్పటివరకూ 15 సినిమాలు చేశారు. లవర్ బోయ్ ఇమేజ్ ఉన్న ఆ హీరో ఎవరు? ఎ) రామ్ బి) నాని సి) తరుణ్ డి) మనోజ్ 17. ‘కబాలి, కాలా’ చిత్రాల దర్శకుడు పా.రంజిత్ గతంలో ‘మద్రాస్’ అనే సినిమాకు దర్శకత్వం వహించారు. అందులో నటించిన హీరో? ఎ) కార్తీ బి) సూర్య సి) సిద్ధార్ధ్ డి) విశాల్ 18. బిగ్ బాస్ సీజన్ వన్ 70 రోజుల పాటు సాగింది. ఇప్పుడు మొదలయ్యే సీజన్ 2 షో ఎన్ని రోజుల పాటు ఉంటుందో తెలుసా? ఎ) 74 రోజులు బి) 85 రోజులు సి) 93 రోజులు డి) 106 రోజులు 19. ఈ ఫొటోలోని చిన్నారిని గుర్తుపట్టండి? ఎ) కంగనా రనౌత్ బి) కత్రినాకైఫ్ సి) స్నేహా ఉల్లాల్ డి) సోనమ్ కపూర్ 20 . ఈ ఫొటోలో ఉన్నది ప్రముఖ దర్శక–నిర్మాత. ఆయనెవరో గుర్తుపట్టండి? (ఆయనో ప్రముఖ హీరో తండ్రి ) ఎ) అక్కినేని బి) వీబీ రాజేంద్రప్రసాద్ సి) ఎన్టీఆర్ డి) డి. రామానాయుడు మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) బి 2) ఎ 3) సి 4) డి 5) బి 6) సి 7) బి 8) ఎ 9) డి 10) సి 11) ఎ 12) ఎ 13) బి 14) సి 15) బి 16) ఎ 17) ఎ 18) డి 19) బి 20) బి నిర్వహణ: శివ మల్లాల -
రీ–ఎంట్రీతో వినిపించబోతున్నారు
‘ఇడియట్, శివమణి’ సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు బెంగళూరు బ్యూటీ రక్షిత. 2007లో దర్శకుడు ప్రేమ్‌తో పెళ్లి జరగడంతో సినిమాలకు స్వస్తి చెప్పేశారామె. సిల్వర్ స్క్రీన్కు దూరం అయినప్పటికీ టెలివిజన్ షోలకు న్యాయ నిర్ణేతగా చేస్తున్నారు రక్షిత. ఆల్మోస్ట్ పదేళ్ల తర్వాత సిల్వర్ స్క్రీన్‌కి రీ–ఎంట్రీ ఇస్తున్నారు రక్షిత. కానీ ఈసారి రక్షిత కనిపించరు.. వినిపించబోతున్నారు. సుదీప్, శివరాజ్ కుమార్ హీరోలుగా భర్త ప్రేమ్ రూపొందిస్తున్న కన్నడ సినిమా ‘విలన్’లో హీరోయిన్ అమీ జాక్సన్ పాత్రకు డబ్బింగ్ చెప్పబోతున్నారట. ‘‘ప్రేమ్‌తో వర్క్ చేయడం అంత సులువేం కాదు. అతను పర్ఫెక్షనిస్ట్. కొన్నికొన్ని సార్లు డైలాగ్‌ను 20 సార్లు చెప్పించేవారు. ఎంత పెద్ద డైలాగ్‌ని అయినా ముక్కలుగా కట్ చేసి చెప్పించరు. మొత్తం చెప్పాల్సిందే. ఎన్ని టేక్స్ అయినా ఆయనకు సంబంధం లేదు. గతంలో నా పాత్రలకు నేనే డబ్బింగ్ చెప్పాను. కానీ వేరే వాళ్లకు డబ్ చేయడం చాలా డిఫరెంట్‌గా ఉంది’’ అని పేర్కొన్నారు రక్షిత. -
డీఎన్ఏ టెస్ట్ ఓవర్!
మీ నాన్నగారి పేరు మీకు తెలుసు. మీ తాతగారి పేరు తెలుసు. మీ ముత్తాత పేరు అంటే కాస్త కష్టపడి తెలుసుకోవచ్చు. కానీ మీ ముత్తాత నాన్నగారి పేరేంటి? అని ఎవరైనా అడిగితే.. ఆలోచనలో పడతారు కదూ. ఫ్యామిలీ హిస్టరీ తెలుసుకోవాలనే ఆలోచన కూడా కలుగుతుంది కదూ. హీరోయిన్ అమీ జాక్సన్‌కు అలాంటి ఆలోచనే కలిగింది. తన ఫ్యామిలీ ట్రీ గురించి తెలుసుకోవాలనుకున్నా రామె. ఆల్రెడీ వై క్రోమోజోమ్ డీఎన్ఏ టెస్ట్ కూడా చేయించుకున్నారు. నాన్న వైపు పూర్వీకులను తెలుసుకోవాలనుకున్నప్పుడు ఈ టెస్ట్‌ను ప్రిఫర్ చేస్తారు. అమ్మవైపు పూర్వీకులను తెలుసుకోవాలనుకునేవారు మైటోకాండ్రియాల్ డీఎన్ఏ టెస్ట్ ప్రిఫర్ చేస్తారు. అమ్మానాన్న.. ఇద్దరి ఫ్యామిలీ హిస్టరీ గురించి తెలుసుకోవాలనుకుంటే ఆటోసోమల్ డీఎన్ఏ టెస్ట్ చేయించుకుంటారు. ఈ విషయంపై అమీ మాట్లాడుతూ– ‘‘నువ్వు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చావ్? అని కొత్తగా పరిచయమైన కొందరు నన్ను అడుగుతున్నారు. అప్పుడు నేను ఇంగ్లాండ్ అని చెప్పాను. ‘నువ్వు ఇంగ్లాండ్ అమ్మాయిలా లేవు. నీలో ఆ పోలికలు అంత స్పష్టంగా కనిపించడం లేదు’ అన్నారు. మా నాన్నమ్మ 1990లో పోర్చ్గల్లో ఉండేవారు. కానీ అంతకు ముందు ఏం జరిగిందో తెలీదు. ఇప్పుడు నా ఫ్యామిలీ గురించి తెలుసుకోవడం నాకు ముఖ్యం. మా నాన్నగారి వైపు వాళ్ల గురించి తెలుసుకోవాలనుంది. కష్టమని తెలుసు. కానీ ప్రయత్నం మొదలుపెట్టాను’’ అన్నారు. డీఎన్ఏ టెస్ట్ ప్రాసెస్ గురించి ఆమె మాట్లాడుతూ – ‘‘టెస్ట్ చేయించుకోవడం ఈజీ. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అధికారులకు సంబంధిత వివరాలను చెప్పాలి. వీటితోపాటు మన లాలాజలాన్ని అందజేయాలి. దీనిని వాళ్లు మిలియన్ల మంది డీఎన్ఏలతో పోల్చి చూస్తారు. కొన్ని వారాల తర్వాత ఫలితాలను చెబుతారు’’ అని చెప్పుకొచ్చారు. -
ఆరుగురు హీరోయిన్లు... ఒక హీరో
ఏకంగా ఆరుగురు గోపికలతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు స్టార్ హీరో శివరాజ్‌కుమార్. సుదీప్, శివరాజ్ కుమార్, అమీ జాక్సన్ ముఖ్య తారలుగా ప్రేమ్ దర్శకత్వంలో సీఆర్ మనోహర్ నిర్మిస్తోన్న మల్టీస్టారర్ మూవీ ‘ది విలన్’. ఆల్రెడీ సుదీప్ వంతు టాకీపార్ట్ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు శివరాజ్ కుమార్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందులో భాగంగానే.. అదిరిపోయే లెవల్లో శివరాజ్‌కుమార్‌పై ఓ ఇంట్రడక్షన్ సాంగ్‌ను ప్లాన్ చేశారు ప్రేమ్. ఈ సాంగ్‌లోనే ఆరుగురు హీరోయిన్లు కనిపిస్తారట. ఆల్రెడీ రచితా రామ్, శ్రద్ధా శ్రీనాథ్, రాధికా చేతన్‌లను ఈ సాంగ్ కోసం ఎంపిక చేశారని శాండిల్‌వుడ్ సమాచారం. మరో ముగ్గురి ఎంపిక జరుగుతోందట. అంతేకాదు.. ఈ సినిమాలో బాలీవుడ్ బాద్షా షారుక్‌ఖాన్ ఓ గెస్ట్ రోల్ చేస్తున్నారట. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఇందులో టాలీవుడ్ హీరో శ్రీకాంత్ విలన్ రోల్ చేస్తున్నారు. ‘ది విలన్’ మూవీ చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. వేసవిలో సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
హుహూ..!
‘హుహూ’...‘2.0’ టీజర్లో ఇదిగో ఇలాగే ఫినిషింగ్ టచ్ ఇచ్చారు రజనీకాంత్. అవునా! మరి..‘2.0’టీజర్‌ను అధికారికంగా రిలీజ్ చేయలేదు కదా! అంటే..నిజమే అధికారికంగా రిలీజ్ చేయకుండానే ‘2.0’ టీజర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్, అక్షయ్‌కుమార్, అమీజాక్సన్ ముఖ్య తారలుగా ఆల్మోస్ట్ 400 కోట్ల భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన చిత్రం ‘2.0’. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ గ్రాఫిక్స్ వర్క్ పెండింగ్ ఉండటం వల్ల వాయిదా వేశారు. కానీ ఇంతలోనే ఊహించని విధంగా ఆల్మోస్ట్ 90 సెకన్ల నిడివి ఉన్న ‘2.0’ టీజర్ సోషల్ మీడియాలో లీకైంది. ఈ లీకేజ్ పై రజనీకాంత్ కూతురు సౌందర్యా రజనీకాంత్ స్పందిస్తూ– ‘‘అధికారికంగా ప్రకటించడానికి ముందే ఆన్లైన్లో ఇలాంటివి లీక్ అవ్వడం సహించరానిది. ప్రొత్సహించకూడని విషయం. ఓన్లీ కొన్ని సెకన్ల ఎగై్జట్‌మెంట్ కోసం మూవీ యూనిట్ హార్డ్‌వర్క్‌ని, కష్టాన్ని, సెంటిమెంట్స్‌ను అగౌరవపరచడం సరికాదు. ఇది సిగ్గుపడ్సాలిన విషయం. పైరసీని ఆపండి. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ని దుర్వినియోగం చేయకండి’’ అని అన్నారామె. మరోవైపు లైకా ప్రొడక్షన్స్ సంస్థకు చెందిన ఓ ముఖ్య ప్రతినిధి బర్త్‌డే సందర్భంగా వీఐపీలకు ‘2.0’ టీజర్ స్పెషల్‌గా వేశారట. అక్కడి నుంచి ఈ ‘2.0’ టీజర్ లీకైందన్న వాదనలు మీడియాలో వినిపిస్తున్నాయి. ఈ సంగతి ఇలా ఉంచితే.. రజనీకాంత్ హీరోగా రూపొందిన ‘కాలా’ టీజర్ కూడా అధికారికంగా చెప్పిన సమయానికన్నా ముందే ఆన్లైన్లో లీకైన విషయం తెలిసిందే. ‘కాలా’ చిత్రాన్ని ఏప్రిల్ 27న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
ప్లీజ్... నన్ను బాధపెట్టొద్దు
.... అంటున్నారు కన్నడ హీరో సుదీప్. అసలేం జరిగిందంటే... ఈ హీరో ఫ్యాన్ ఒకరు చేతిపై ‘కిచ్చా’ అని పచ్చబొట్టు పొడిపించుకున్న విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న సుదీప్.. ‘‘ఫ్యాన్స్ ఇలా చేస్తున్నందుకు థ్యాంక్స్ చెప్పాలో లేక సారీ చెప్పాలో తెలియడం లేదు. నువ్వు ఆ పచ్చబొట్టు వేయించుకుంటున్నప్పుడు ఎంత బాధ భరించి ఉంటావో నేను అర్థం చేసుకోగలను (పచ్చబొట్టు పొడిపించుకున్న అభిమానిని ఉద్దేశిస్తూ). ఇలాంటివి చేసి మీరు బాధపడొద్దు. నన్ను బాధపెట్టొద్దు. నా సినిమా చూడడానికి ఫ్యాన్స్ టిక్కెట్స్ కొని, నన్ను సపోర్ట్ చేస్తే అదే చాలు. మనస్ఫూర్తిగా చెబుతున్నాను. నాపై అభిమానాన్ని చాటుకోవడానికి ఫ్యాన్స్ ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదు. అంతులేని మీ అభిమానానికి థ్యాంక్స్’’ అన్నారు సుదీప్. ఇక సినిమాల విషయానికొస్తే... ప్రేమ్ దర్శకత్వంలో శివరాజ్ కుమార్, సుదీప్, అమీ జాక్సన్ ముఖ్య తారలుగా రూపొందుతున్న చిత్రం ‘ది విలన్’. ‘‘వారం రోజుల తర్వాత శుక్రవారం ‘ది విలన్’ సినిమా సెట్లోకి ఎంటర్ అయ్యాను’’ అన్నారు సుదీప్. ప్రస్తుతం సుదీప్, అమీ పాల్గొనగా ఓ పాట చిత్రీకరిస్తున్నారు. ఇందులో అమీ పాత్ర కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుందట. ఈ సంగతి ఇలా ఉంచితే అజయ్‌వర్మ దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా రూపొందుతోన్న ‘నీరళి’ చిత్రంలో సుదీప్ కీ రోల్ చేస్తున్నారట. సుదీప్ కన్నడ సినిమాలు మలయాళంలో డబ్ అయ్యాయి. అయితే ఆయన చేయనున్న ఫస్ట్ స్ట్రైట్ మలయాళ మూవీ ఇది. -
చిట్టి ఆన్ ది వే
దీపావళికి(గతేడాది) వస్తున్నాం... జనవరి 25న వస్తున్నాం... అని ‘2.0’కి రెండు ముహూర్తాలు ఫిక్స్ చేశారు. రాలేదు. ఏప్రిల్‌లో మూడో ముహూర్తం ఉంది. ఈసారి రావడం పక్కా అని రజనీకాంత్ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. వచ్చే అవకాశం ఉందని ‘2.0’ యూనిట్ స్పీడ్ చూస్తే అనిపిస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల స్పీడు పెంచారట. ‘‘2.0 సినిమా టీజర్ పనులు లాస్ ఏంజెల్స్‌లో ఫుల్ స్వింగ్‌లో జరుగుతున్నాయి. సినిమాలో ఎక్కువ శాతం సీజీ వర్క్ ఉండటం మూలాన ఎక్కువ టైమ్ పడుతోంది. కంప్లీట్ అవ్వగానే టీజర్ విడుదల తేదీ చెబుతాం’’ అని చిత్రదర్శకుడు శంకర్ పేర్కొన్నారు. కాగా, ఈ చిత్రం ఆడియో వేడుకను దుబాయ్‌లో ఘనంగా నిర్వహించారు. టీజర్‌ను హైదరాబాద్‌లో, ఆ తర్వాత చెన్నైలో ట్రైలర్‌ను విడుదల చేయాలనుకుంటున్నారట. అత్యంత భారీ బడ్జెట్‌తో ‘రోబో’కి సీక్వెల్‌గా లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ విలన్‌గా కనిపిస్తారు. అమీ జాక్సన్ కథానాయిక. ఏప్రిల్ 14న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటు న్నారు. మరి.. వస్తుందా? అదే రోజు తమిళ సంవత్సరాది. తమిళ ప్రేక్షకులు రెండు పండగలు చేసుకుంటారా? వేచి చూద్దాం. -
అయినా మంచి భర్తే!
భార్య కాలికి దెబ్బతగిలి హస్పిటల్లో జాయిన్ అయితే.. ఏ భర్త అయినా చూడకుండా ఉంటాడా? పోనీ.. రెండేళ్లుగా ఇంటిని పట్టించుకోకపోవడమే కాకుండా.. ఒక్క పండగని కూడా ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి చేసుకోలేకపోతే.. ఆ భర్త ‘మంచివాడు’ అవుతాడా? కాదు కదా. అయినా ఇప్పుడు చెప్పబోతున్న దర్శకుడు ప్రేమ్ మాత్రం మంచివాడే. భార్యను పట్టించుకునే తీరిక అతనికి లేదు. ఫ్యామిలీతో పండగలు చేసుకునే ఖాళీ లేదు. ఎందుకలా? అంటే.. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘ది విలన్’ కోసం. శివరాజ్ కుమార్, సుదీప్, అమీజాక్సన్ ముఖ్య తారలుగా ప్రేమ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ది విలన్’. న్యూ ఇయర్ స్పెషల్‌గా టీజర్‌ను లాంచ్ చేయాలనుకున్నారు. కానీ గ్రాఫిక్స్ వర్క్స్ పెండింగ్ ఉండటం వల్ల వీలుపడలేదట. ఇందుకు ప్రేమ్∙సోషల్ మీడియాలో వివరణ ఇచ్చుకున్నారు. ఈ సినిమా గురించి మరిన్ని విశేషాలు చెప్పారాయన. ‘‘బ్యాలెన్స్ టాకీ పార్ట్‌ను, ఫోర్ సాంగ్స్‌ను ఫిబ్రవరి కల్లా కంప్లీట్ చేయాలనుకుంటున్నాం. ఇందుకోసం ఫోర్ డిఫరెంట్ స్టూడియోస్‌లో సెట్ వర్క్ స్టార్ట్ చేశాం. ఏప్రిల్ కల్లా కంప్లీట్ అవుతుందని అనుకుంటున్నాం. మల్టీస్టారర్ సినిమా కావడంతో రెండు టీజర్స్‌ను రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అంటూ తన పర్సనల్ లైఫ్ గురించి ప్రేమ్ మాట్లాడుతూ– ‘‘నా భార్య రక్షిత కాలికి గాయమైనప్పుడు నేను హస్పిటల్‌కి వెళ్లలేదు. ఇంట్లో పండగ సంబరాలు జరుపుకుని రెండేళ్లయింది. ఒక్కరోజు కూడా హాలీడే తీసుకోకుండా ‘ది విలన్’ సినిమా కోసం వర్క్ చేస్తున్నా’’ అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు చెప్పండి.. ప్రేమ్ మంచి భర్త అంటే ఒప్పుకుంటారు కదా. -
ఐ యామ్ సారీ!
... అని చెప్పారట హీరోయిన్ అమీ జాక్సన్. ఎందుకు చెప్పాల్సి వచ్చిందనేగా మీ డౌట్. అక్కడికే వస్తున్నాం. శివరాజ్ కుమార్, సుదీప్, అమీ జాక్సన్ కీలకపాత్రల్లో ‘ది విలన్’ అనే కన్నడ చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు కిరణ్‌కుమార్ (స్క్రీన్ నేమ్ ప్రేమ్). ఈ ఏడాది జూలైలో ఈ సినిమా షూట్‌ను స్టార్ట్ చేశారు. ఆ షూట్లో అమీ జాక్సన్ కూడా పాల్గొన్నారు. అయితే ఈ నెలలో మరో షెడ్యూల్‌ను ప్లాన్ చేశారట డైరెక్టర్ ప్రేమ్. ఆ షెడ్యూల్ షూట్ స్టార్ట్ కాకపోయే సరికి ఇండస్ట్రీలో ఈ సినిమాపై రూమర్లు వచ్చాయి. వీటిపై దర్శకుడు స్పందిచారు. ‘‘సినిమా లేట్ అవ్వడంలో నా ప్రమేయం ఏమీ లేదు. అమీ జాక్సన్ వీసా పాబ్లమ్స్ వల్ల ఫిక్స్ చేసిన షెడ్యూల్ టైమ్‌కి రాలేనని చెప్పారు. ప్రాబ్లమ్ సాల్వ్ అయిన వెంటనే షూట్లో జాయిన్ అవుతానన్నారు. రాలేకపోయినందుకు ఆమె సారీ కూడా చెప్పారు. అలాగే హీరోలు శివరాజ్ కుమార్, సుదీప్‌లు బాగా సహకరిస్తున్నారు. షూటింగ్‌ను డిసెంబర్ కల్లా కంప్లీట్ చేద్దాం అనుకున్నాం. కానీ, ఇప్పుడు జనవరి ఎండింగ్ కల్లా కంప్లీట్ చేస్తాం’’ అని పేర్కొన్నారు ప్రేమ్. -
పక్షులకు అంకితం!
దర్శకుడు శంకర్‌కి పక్షులంటే అంత ప్రేమ ఎందుకో మరి! ‘2.0’లో అక్షయ్‌కుమార్ పాత్రను పక్షి ప్రేమికుడి (బర్డ్ లవర్)గా రూపొందించిన ఆయన, పక్షులకు అంకితం ఇస్తూ ఓ పాటను కూడా రాయించారట! రజనీ కాంత్ హీరోగా లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా కోసం సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మొత్తం మూడు పాటలను స్వరపరిచారు. అందులో ఓ పాట చిట్టి రోబో (రజనీకాంత్), లేడీ రోబో (అమీ జాక్సన్) మధ్య చిత్రీకరించారు. మరో పాట ఏ సందర్భంలో వస్తుందనేది పక్కన పెడితే.. ముచ్చటగా మూడోది అక్షయ్‌కుమార్ ఇంట్రడక్షన్లోనూ, పక్షులపై అతనికి ఎంత ప్రేమ ఉందో తెలిపే సన్నివేశాల్లోనూ మాంటేజ్ సాంగ్‌గా వస్తుందట! త్వరలో ఈ పాటను విడుదల చేస్తారట!! కన్ఫ్యూజన్... కన్ఫ్యూజన్! వచ్చే ఏడాది జనవరి 25న ‘2.0’ విడుదలవుతుందా? లేదా? ఇండస్ట్రీలోనూ, రజనీకాంత్ అభిమానుల్లోనూ ఇంకా కన్ఫ్యూజన్ క్లియర్ కాలేదు. ఎందుకంటే... విడుదల తేదీపై ఎన్ని వార్తలొస్తున్నా చిత్రబృందంలో ఎవరూ స్పందించడం లేదు. దీనికి తోడు విజువల్ ఎఫెక్ట్స్ పనులు ఇంకా పూర్తవలేదనే కొత్త వార్త తెరపైకి వచ్చింది. అంతే కాదు... ముందుగా ప్రకటించినట్టు ఈ నెల 22న హైదరాబాద్‌లో టీజర్నీ, రజనీకాంత్ బర్త్‌డే గిఫ్టుగా డిసెంబర్ 12న చెన్నైలో ట్రయిలర్నీ విడుదల చేయడం కష్టమేనని చెన్నై కోడంబాక్కమ్‌లో ఓ వార్త గుప్పుమంది. బయట బోల్డంత గందరగోళం నెలకొంటే... శంకర్ అండ్ కో కామ్‌గా ఉండే బదులు, కొంచెం క్లారిటీ ఇచ్చేస్తే పోలా!! -
చిట్టి... స్టిల్ ఎలైవ్!
యస్... చిట్టి ఇంకా బతికున్నాడు. ‘రోబో’లో రచ్చ రంబోలా చేశాడు. గుర్తుందా? ఆ చిట్టీనే! ఇప్పుడు మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ! అసలు చావడానికి చిట్టి మనిషయితేగా... రోబో! మరి, రోబో చావడం ఏంటి? అనొచ్చు. ఎంత రోబో అయినా... మనిషికున్న ఫీలింగ్స్ చిట్టీకి ఉన్నాయి కదా! ‘రోబో’ ఎండింగ్లో తనకు తానుగా బాడీలో పార్టులను విప్పేసుకుంటుంది చిట్టి. ‘రోబో’కి సీక్వెల్‌గా వస్తున్న ‘2.0’లో చిట్టీని మళ్లీ ఎలా తీసుకొస్తున్నారో? ప్రస్తుతానికి న్యూ లుక్‌ని మాత్రం చూపించారు దర్శకుడు శంకర్. యస్... ‘2.0’లో చిట్టి న్యూ లుక్కునే మీరు చూస్తున్నారిప్పుడు! ఫేస్ పెద్దగా మారలేదు గానీ... కాస్ట్యూమ్స్ సూపరున్నాయి. ఫ్యాన్స్‌కి మాంచి కిక్కిచ్చిందీ లుక్. రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో సుమారు 450 కోట్ల బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా పాటలు ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. సినిమాను వచ్చే ఏడాది జనవరి 25న విడుదల చేస్తామని చిత్రనిర్మాణ సంస్థ ప్రకటించింది. అయితే... పాటలు విడుదలైన తర్వాత సినిమా విడుదల ఏప్రిల్ 13కు వాయిదా వేశారనే వార్తలొచ్చాయి. వీటిపై రజనీ గానీ, చిత్రబృందం గానీ స్పందించలేదు. మరి, సినిమా ఎప్పుడు విడుదలవుతుందో? హిందీ హీరో అక్షయ్‌కుమార్ యాంటీ హీరోగా, బ్రిటన్ బ్యూటీ అమీ జాక్సన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. -
రాణీగారి కథలో శిబానీ...
... దండేకర్! పేరు కొత్తగా ఉంది కదూ! పేరుతో పాటు శిబానీ దండేకరూ తెలుగు ప్రేక్షకులకు కొత్తే. సల్మాన్ ఖాన్ ‘సుల్తాన్’, తాప్సీ ‘నామ్ షబానా’లతో పాటు కొన్ని హిందీ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశారీమె. కొన్ని హిందీ టీవీ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఇప్పుడీ ముంబై బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు హాట్ హాట్ క్యారెక్టర్లో కనువిందు చేయనున్నారు. తమన్నా ముఖ్యతారగా నీలకంఠ దర్శకత్వంలో నిర్మాత మను కుమారన్ హిందీ హిట్ ‘క్వీన్’ని తెలుగులో అదే పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. హిందీలో కంగనా రనౌత్ చేసిన పాత్రను తెలుగులో తమన్నా చేస్తున్నారు. లీసా హెడెన్ చేసిన విజయలక్ష్మీ పాత్రను శిబానీ దండేకర్ చేయనున్నారు. యాక్చువల్లీ... లీసా పాత్రకు ముందు అమీ జాక్సన్‌ని అనుకున్నారు. అమీ ఆల్మోస్ట్ ‘యస్’ అన్నారు. అయితే... ఈలోపు అమెరికన్ టీవీ సిరీస్ ‘సూపర్ గాళ్’లో చాన్స్ వచ్చింది. మరోపక్క ‘క్వీన్’ షూటింగ్ లేట్ కావడంతో సిన్మా నుంచి తప్పుకున్నారు. ఇప్పుడా పాత్రకు శిబానీను సెలక్ట్ చేశారు. రాణీగారి (‘క్వీన్’) కథలో విజయలక్ష్మీ పాత్ర ఎక్కువే. తెలుగు–మలయాళ ‘క్వీన్’ రీమేక్స్‌లో శిబా, తమిళ–కన్నడ ‘క్వీన్’ రీమేక్స్‌లో హిందీ నటి ఎలీ ఎవరామ్ నటించనున్నారు. -
స్క్రీన్ టెస్ట్
► ఈ నటుని అసలు పేరు కొచ్చర్ల దయారత్నం. కె. బాలచందర్ తొలి కోడి కూసింది’ సినిమా కోసం ఆయన పేరు మార్చారు? ఆ నటుడెవరు? ఎ) రఘువరన్ బి) ప్రకాశ్‌రాజ్ సి) జీవా డి) రమేశ్ అరవింద్ ► రియల్ లైఫ్ కపుల్ అయిన కృష్ణ, విజయనిర్మల రీల్‌పై అన్నా చెల్లెళ్లుగా నటించిన సినిమా పేరేంటి? ఎ) బొమ్మలు చెప్పిన కథ బి) అల్లూరి సీతారామరాజు సి) పండంటి కాపురం డి) సాక్షి ► బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్‌తో కలిసి ‘మెన్ ఎగైనెస్ట్ రేప్ అండ్ డిస్క్రిమినేషన్’ (మర్ద్) అని ఒక క్యాంపైన్ నిర్వహించారు? ఈ క్యాంపైన్‌కి తన వాయిస్ వినిపించిన తెలుగు టాప్ హీరో ఎవరు? ఎ) ప్రభాస్ బి) నాని సి) మహేశ్‌బాబు డి) రామ్‌చరణ్ ► గౌతమ్ ఘోష్ దర్శకత్వం వహించిన ‘మాభూమి’ చిత్రం ద్వారా పరిచయమైన ఈ సహాయనటి తర్వాత కాలంలో చాలా పేరు తెచ్చుకున్నారు? ఆమె ఎవరై ఉంటారు? ఎ) సుద బి) తెలంగాణ శకుంతల సి) అల్లరి సుభాషిణి డి) ప్రగతి ► ‘వినవే బాల నా ప్రేమ గోల..’ అంటూ ఈ నటుడు పాడిన పాటను ఇప్పటికీ ప్రేమికులు పాడుకుంటూనే ఉంటారు? ఈ పాట పడిన నటుడెవరు? ఎ) రమణారెడ్డి బి) రేలంగి సి) పద్మనాభం డి) రాజనాల ► ‘అబ్బాయిగారు’లో వెంకటేశ్ సవతి తల్లిగా నటించిన జయచిత్ర కథానాయికగా నటించిన తొలి తెలుగు సినిమా? ఎ) భారతంలో ఒక అమ్మాయి బి) యవ్వనం కాటేసింది సి) చిల్లరకొట్టు చిట్టెమ్మ డి) సోగ్గాడు ► తెలుగు ‘ప్రేమఖైదీ’లో హరీష్ హీరో. అదే సినిమా హిందీ రీమేక్‌లో కూడా అతనే హీరో. హిందీ సినిమాలో అతనితో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ బాలీవుడ్ నటితర్వాత చాలా పెద్ద స్టార్ అయ్యారు? ఆమె ఎవరు? ఎ) మాధురీ దీక్షిత్ బి) కరీనా కపూర్ సి) కరిష్మా కపూర్ డి) టబు ► ‘కష్టపడకుండా ఏదీ రాదు, కష్టపడకుండా వచ్చింది ఏదీ ఉండదు’ అని రజనీకాంత్ ఏ సినిమాలో చెప్తాడు? ఎ) భాష బి) అరుణాచలం సి) నరసింహా డి) శివాజి ► దర్శక మేధావి ‘జెంటిల్మెన్ శంకర్’ ఏం చదువుకున్నారో తెలుసా? ఎ) మెకానికల్ ఇంజనీర్ బి) లా సి) లెదర్ టెక్నాలజీ డి) టక్స్‌టైల్ డిజైనింగ్ ► శ్రుతీహాసన్ ట్విట్టర్ ఐడీ ఏంటో కనుక్కోండి? ఎ) @యువర్స్ ట్రూలీ శ్రుతి బి) @ శ్రుతీహాసన్ సి) @ మీ శ్రుతీహాసన్ డి) @ శ్రుతీ సేస్ ► 2009లో ‘మిస్ టీన్ వరల్డ్’ టైటిల్ నెగ్గిన హీరోయిన్ ఎవరో తెలుసా? ఎ) ఐశ్వర్యా రాయ్ బి) సుస్మితా సేన్ సి) అమీ జాక్సన్ డి) ఆండ్రియా ► అంతస్తులు చిత్రంలో ‘దులపర బుల్లోడా దుమ్ము దులపర బుల్లోడా’అంటూ హుషారెత్తించిన కథానాయిక ఎవరో గుర్తున్నారా? ఎ) జమున బి) బి. సరోజా దేవి సి) భానుమతి డి) కృష్ణకుమారి ► ‘ఇంతేనయా తెలుసుకోవయా, ఈ లోకం ఇంతేనయా’ అనే పాట రాసిన రచయిత ఎవరు? ఎ) దాశరథి బి) వేటూరి సుందర రామ్మూర్తి సి) సముద్రాల డి) ఘంటసాల ► మహా శక్తిమాన్’ అనే హిందీ త్రీడి ఫిలిమ్‌కి దర్శకత్వం వహించింది ఓ ప్రముఖ తెలుగు కెమేరామేన్? ఆయనెవరు? ఎ) వి.యస్.ఆర్. స్వామి బి) ఎస్. గోపాల్‌రెడ్డి సి) జయనన్ విన్సెంట్ డి) జయరామ్ ► దర్శక–నిర్మాతగుణశేఖర్ దర్శకత్వం వహించిన మొదటి సినిమా ఏంటో తెలుసా? ఎ) సొగసు చూడతరమా బి) రామాయణం సి) లాఠీ డి) చూడాలని ఉంది ► పరుచూరి బ్రదర్స్ రచయితలుగా ఏ హీరోతో ఎక్కువ సినిమాలకు పనిచేశారు? ఎ) కృష్ణ బి) బాలకృష్ణ సి) చిరంజీవి డి) నాగార్జున ► యం.యం. కీరవాణి ఏ సంగీత దర్శకుని దగ్గర శిష్యరికం చేశారో చెప్పుకోండి చూద్దాం? ఎ) కేవీ మహదేవన్ బి) ఇళయరాజా సి) యం.ఎస్. విశ్వనాథన్ డి) చక్రవర్తి ► ఎన్టీఆర్, ఛాయాదేవి ఉన్న ఈ స్టిల్ ఏ సినిమాలోనిది? ఎ) కన్యాశుల్కం బి) శకుంతల సి) విజయం మనదే డి) మంగళసూత్రం ► నటుడు మంచు విష్ణు ఏ క్రీడలో యూనివర్సిటీ కెప్టెన్‌గా వ్యవహరించారు? ఎ) వాలీబాల్ బి) బాస్కెట్‌బాల్ సి) క్రికెట్ డి) హాకి ► ఈ క్రింది ఫోటోలోని బాలుణ్ణి గుర్తుపట్టారా? ఎవరతను? ఎ) అక్కినేని నాగేశ్వరరావు బి) అక్కినేని నాగార్జున సి) కాంతారావు డి) హరనాథ్‌బాబు మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) సి 2) ఎ 3) సి 4) బి 5) బి 6) డి 7) సి 8) సి 9) ఎ 10) బి 11) సి 12) సి 13) ఎ 14 ) ఎ 15) సి 16) ఎ 17) డి 18) ఎ 19) బి 20) ఎ -
సూపర్‌స్టార్ వెనక్కి వెళతాడా?
...లేదా వెళ్తున్నాడా? ముంబయ్, చెన్నైలలో ఇప్పుడిదే హాట్ టాపిక్! సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘2.0’ను మొన్న వెళ్లిన దీపావళికి విడుదల చేయాలనుకున్నారు. అయితే... భారీ ప్రొడక్షన్, గ్రాఫిక్ వర్క్ వల్ల వాయిదా వేసి వచ్చే జనవరి 25న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు ఆ తేదీకి కూడా ‘2.0’ రావడం కష్టమేనంటున్నారు. ఎందుకంటే... వచ్చే జనవరి 26న ‘2.0’లో విలన్‌గా నటించిన అక్షయ్‌కుమార్ హీరోగా చేసిన హిందీ సినిమా ‘ప్యాడ్మాన్’ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు ప్రకటించారు. జనవరి 25న ‘2.0’ వస్తే... అక్షయ్ తన సినిమాను ఎందుకు విడుదల చేస్తారు? ‘2.0’ వెనక్కి వెళ్తుందని అతనికి తెలిసింది కాబట్టే... ‘ప్యాడ్మాన్’ను రెడీ చేశారనేది ముంబయ్, చెన్నైలలో హాట్ టాపిక్. తమిళ నూతన సంవత్సరాది (ఏప్రిల్ 13న) సందర్భంగా ‘2.0’ విడుదల చేయాలనుకుంటున్నారనేది తాజా సమాచారం. ఏమవుతుందో? ‘2.0’తో సూపర్‌స్టార్ వెనక్కి వెళతాడో? లేదో? చూద్దాం!! -
ఇతరులపై బురద చల్లొద్దు!
దుబాయ్‌లోని బుర్జ్ అల్ అరబ్ టవర్స్ దగ్గర బుర్జ్ పార్క్ ప్రాంగణమంతా శుక్రవారం రాత్రి ఐదు నిమిషాల పాటు ప్రేక్షకుల ఈలలు, చప్పట్లతో మార్మోగింది. సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన రోబోటిక్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘2.0’ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతోందక్కడ. సుమారు పన్నెండు వేలమంది వీక్షకుల్లో కొందరికి రజనీకాంత్ ఏం చెప్పారో అర్థం కాలేదు. కాసేపటి తర్వాత పక్కవాళ్లను అడిగితే... జరిగిన సంగతి వివరించారు. మేటర్ ఏంటంటే... ‘నేను ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టే’– సూపర్‌స్టార్ తెలుగులో డైలాగ్ చెప్పారు. రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ సుమారు 400 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ‘2.0’ పాటల్ని శుక్రవారం విడుదల చేశారు. చిత్రసంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ మొత్తం మూడు పాటలకు లైవ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అయితే.. మూడింటిలో సినిమాలో ఒక్కటే ఉంటుంది. తెలుగు, తమిళ్, హిందీ... మూడు భాషల పాటల్నీ ఇదే కార్యక్రమంలో విడుదల చేశారు. తెలుగు ఆడియోకి హీరో రానా, తమిళ్‌కి ఆర్.జె. బాలాజీ, హిందీకి దర్శక–నిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఈ వేడుకలో మిగతా ఇద్దరూ రజనీని ప్రశ్నలు అడగ్గా... ‘నేను ప్రశ్నలు అడిగేంతవాణ్ణి కాదు సార్. తెలుగువాళ్ల కోసం తెలుగులో ఒక్క డైలాగ్ చెప్పండి. మీరు ఏ డైలాగ్ చెప్పినా అందంగానే ఉంటుంది’ అని రానా కోరారు. అప్పుడు ‘నేను ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టే’ డైలాగ్ చెప్పారు. అనంతరం రజనీకాంత్ మాట్లాడుతూ– ‘‘భగవంతుడి కృప–కరుణ, ప్రేక్షకుల ఆశీస్సుల వల్లే ఇన్నేళ్లు నటుడిగా కొనసాగాను. కెరీర్ స్టార్టింగ్‌లో డబ్బు, పేరు, ప్రఖ్యాతులు సంతోషాన్నిస్తాయి. ఓ స్థాయికి వచ్చిన తర్వాత అవేవీ సంతోషాన్ని ఇవ్వవు. కానీ, వాటిని కావాలనుకుంటాం. అవి లేకుంటే దురదృష్టంగా భావిస్తాం. ఇలాంటివి తలచుకుంటే నవ్వొస్తుంది. ఇక, నా అభిమానులకు నేను చెప్పేది ఒక్కటే... ఎవరి సినిమాకు ఎలాంటి టాక్ వచ్చినా, సోషల్ మీడియాలో ఆ సినిమాపై చెడు ప్రచారం చేయొద్దు. ఇతరులపై బురద చల్లొద్దు. ఇతరులపై బ్యాడ్ పబ్లిసిటీ కోసం సోషల్ మీడియాను ఉపయోగించవద్దు. నేటి యువతరం మన సంస్కృతి, సంప్రదాయాలను ఆస్వాదించాలి. పాశ్చాత్య మోజులో పడి మన సంస్కృతి, సంప్రదాయాలను మరువడం విచారకరం’’ అన్నారు. ‘2.0’లో విలన్‌గా నటించిన హిందీ హీరో అక్షయ్‌కుమార్ మాట్లాడుతూ– ‘‘దక్షిణాదిలో ఇతరుల ప్రతిభను గౌరవిస్తూ, అందరితో కలసి సమిష్టిగా వర్క్ చేస్తారు. ఈ సినిమా చిత్రీకరణ జరిగినన్ని రోజులూ నేను కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉన్నా. నేనెప్పుడూ ఇటువంటి గొప్ప, పెద్ద సినిమాలో నటించే చాన్స్ వస్తుందని ఊహించలేదు. రజనీతో నటించే ఈ చాన్స్ ఇచ్చిన శంకర్ సార్‌కి థ్యాంక్స్’’ అన్నారు. దర్శకుడు శంకర్ మాట్లాడుతూ– ‘‘డిల్లీలో 40 డిగ్రీల టెంపరేచర్లో 12 కిలోల సూట్ వేసుకుని రజనీ సార్ ఎంతో ఉత్సాహంగా నటించారు. అలాగే, ఓ సీన్ కోసం నాలుగు గంటలు భూమిలో పూడ్చిన బాక్సులో ఉన్నారు. ఆయన ఎనర్జీ మాకెంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. సినిమా కోసం ఆయన పడిన శ్రమ ప్రతి సన్నివేశంలోనూ కనిపిస్తుంది. ఆయనెప్పుడూ ప్రయోగాలకు సిద్ధమే’’ అన్నారు.‘‘నా భర్తను చూస్తుంటే గర్వంగా ఉంది. ‘2.0’ కోసం ఆయన పడిన కష్టానికీ, చూపించిన అంకితభావానికీ సెల్యూట్’’ అన్నారు రజనీ సతీమణి లత. ఈ వేడుకలో ‘2.0’ హీరోయిన్ అమీ జాక్సన్, తెలుగు నిర్మాత డి. సురేశ్‌బాబు, రజనీ కుటుంబ సభ్యులు ధనుష్, ఐశ్వర్య, సౌందర్య తదితరులు పాల్గొన్నారు. -
బాబా ధ్యానం కోసం ఆశ్రమం
‘‘నిజ జీవితంలో నటించమని ఎవరూ నాకు డబ్బులివ్వరు. అందుకే చాలా సింపుల్‌గా ఉంటా’’ – దుబాయ్‌లో జరిగిన ‘2.0’ ప్రెస్మీట్లో రజనీ ‘‘రజనీ సార్ ఎక్కువగా మెడిటేషన్ చేస్తారు. ఆయన్నుంచి నాకది అలవాటైంది’’ ..‘2.0’ ప్రెస్మీట్లో అమీ జాక్సన్ మాసిన గడ్డం... తలపాగా... సాదాసీదా బట్టలు... బెంగళూరులోని రాఘవేంద్రస్వామి మందిరంలో ఓ ముసలతను ధ్యానం చేస్తున్నారు. ప్రతిరోజూ ఆ మందిరానికి వచ్చే ఒకామె ఆయన్ను చూశారు. దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత చూస్తే... ముసలతను మందిరంలో తిరుగుతూ కనిపించారు. అతని దగ్గరకు వెళ్లి... పది రూపాయల నోటును చేతిలో పెట్టారు. అతను తీసుకునేంతవరకూ ఆమె వదల్లేదు. నవ్వుతూ నోటును తీసుకుని, రెండు చేతులూ జోడించి ఆమెకు నమస్కరించాడతను. కాసేపటికి, మందిరం బయటకు వస్తుండగా, ముసలతను మెర్సిడీస్ బెంజ్ కారు ఎక్కుతూ కనిపించారు. వెంటనే పరిగెత్తుకుంటూ అతని దగ్గరకు వెళ్లిన మహిళ.. ‘‘అయ్యా! నన్ను క్షమించండి. మిమ్మల్ని ఇన్సల్ట్ చేయాలనే ఉద్దేశం నాకు లేదు. మీ బట్టలు చూసి లైఫ్‌లో కష్టాలు పడుతున్నారనుకుని డబ్బులు ఇచ్చా. ఐయామ్ సారీ. క్షమించి నా డబ్బులు తిరిగి ఇచ్చేయండి. ఐయామ్ సారీ’’ అన్నారు. అప్పుడు పెట్టుడు గడ్డం, తలపాగాతో ఉన్న ముసలతను ఏం చెప్పారో తెలుసా? ‘‘అమ్మా... ఇందులో మీ తప్పేం లేదు. ‘యూ ఆర్ నథింగ్. యూ ఆర్ నాట్ స్పెషల్. నా ముందు ప్రతి ఒక్కరూ సమానమే’ అని సృష్టికర్త ఎవరో ఒకరి ద్వారా మళ్లీ మళ్లీ నాకు గుర్తు చేస్తున్నాడు. మళ్లీ మళ్లీ ఇదే సందేశం పంపిస్తున్నాడంతే. థ్యాంక్స్’’ అని నమస్కరించి అక్కణ్ణుంచి కారులో వెళ్లిపోయారు. బెంజ్ కారులో వచ్చి, పది రూపాయల ధర్మం స్వీకరించిన ముసలతను ఎవరో కాదు... రజనీకాంత్. పైన చెప్పిన సంఘటన వాస్తవంగా జరిగినదే. రాఘవేంద్రుడి భక్తుడు రజనీకాంత్‌కి రాఘవేంద్ర స్వామి అంటే ఎంత భక్తి అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన 100వ సినిమాగా ‘శ్రీ రాఘవేంద్ర’ వచ్చిందంటే... కారణమదే! రజనీ రాఘవేంద్రస్వామితో పాటు పరమహంస యోగానందనూ ఫాలో అవుతారు. ఆయన రాసిన ఆధ్యాత్మిక పుస్తకాలను చదువుతారు. రీల్ లైఫ్‌లో సూపర్ స్టార్ కానీ, రియల్‌గా మాత్రం ‘సింపుల్ మేన్’. రజనీకాంత్ ఎంత నిరాడంబరంగా జీవిస్తారో చెప్పడానికి పై సంఘటన ఒక ఉదాహరణ మాత్రమే. ఓ సూపర్‌స్టార్ సామాన్య జీవితం గడపడమనేది సాధారణ విషయం కాదు. రజనీకి మాత్రమే అది సాధ్యం! నటుడిగా ఆయన ఎంత ఎత్తుకి ఎదిగినా... మనిషిగా మామూలు గానే ఉంటారు. అందుకే, ప్రతి ఏడాది హిమాల యాలు వెళ్లొస్తారు. అదీ సామాన్య మనిషిగా, ఎలాంటి హంగామాలు లేకుండా చాలా నిరాడంబరంగా! ఇప్పుడు ఏకంగా హిమాలయాల్లో ఓ ఆశ్రమాన్ని నిర్మిస్తున్నారాయన. హిమాలయాల్లో హోమ్ యస్... హిమాలయాల్లోనే రజనీ ఓ హోమ్ కట్టిస్తున్నారు! అవునా... ఎంతవుతుందో? సుమారు కోటి రూపాయలు! అంత ఖర్చుపెట్టి అక్కడ ఇల్లు కడుతున్నారా! ఎవరి కోసం? ప్రజలందరి కోసం! రజనీకాంత్‌లా మెడిటేషన్ చేయాలనుకునే వాళ్లందరూ బస చేయడం కోసం. ఎన్నో ఏళ్లుగా రజనీకాంత్ హిమాలయాలకు వెళ్లొస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజులు అక్కడ మెడిటేషన్ చేసి, తిరిగొస్తారు. ఈ క్రమంలో రజనీకి చెన్నై న్యాయవాది వి. విశ్వనాథన్, బెంగళూరు వ్యాపారవేత్త వీఎస్ హరి, ఢిల్లీకి చెందిన శ్రీధర్ రావు, వీఎస్ మూర్తి పరిచయమయ్యారు. 2002 నుంచి ఈ ఐదుగురూ హిమాలయాలకు వెళ్లొస్తున్నారు. ఇంకొకటి... వీళ్లందరూ పరమహంస యోగానంద భక్తులు, అనుచరులు. పరమహంస యోగానంద ‘యోగోద సత్సంగ సంఘం’ (వైఎస్ఎస్)ను స్థాపించి ఈ ఏడాదికి వందేళ్లు. ‘వైఎస్ఎస్’ శతవార్షికోత్సవం సందర్భంగా ఐదుగురు స్నేహితులూ హిమాలయల్లో (కొండలకు దగ్గరలో) ‘శ్రీ బాలాజీ ఆశ్రమం గురు శరణ్’ పేరుతో ఓ ఆశ్రమం (మెడిటేషన్ హౌస్) నిర్మించాలని నిర్ణయించుకున్నారు. ఆల్రెడీ ఆశ్రమం కన్స్ట్రక్షన్ మొదలైంది. ఇందులో మెడిటేషన్ చేయాలనుకునే భక్తులందరికి ఉచితంగా వసతి కల్పించనున్నారు. ఈసారి రజనీ హిమాలయాలకు వెళ్లినప్పుడు... ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ఈ ఆశ్రమానికి వెళతారేమో? వాళ్ల దేవుడి (రజనీ) దర్శనం దొరుకుతుందని!! బాబాకి ముందు... ఆ తర్వాత రజనీకాంత్ నటించి, నిర్మించిన ‘బాబా’ చూసే ఉంటారు. అందులో పాత్ర కొంతవరకూ ఆయన రియల్ లైఫ్‌కి దగ్గరగా ఉంటుందట. ‘బాబా’లో హీరోలా... రజనీ కూడా కెరీర్ స్టార్టింగ్‌లో మందు, సిగరెట్స్ తాగేవారట. తర్వాత ఆయనలో మార్పు వచ్చిందని అంటుంటారు. ‘బాబా’ తర్వాత మందు, సిగరెట్స్ మానేశారు. దుబాయ్‌లో ‘2.0’ టీమ్ సందడి! ‘నాన్నా... నిన్నటి వరకూ ఓ లెక్క, ఈ రెండు రోజులూ ఒక లెక్క’ అన్నట్లుగా గురు, శుక్రవారాల్లో దుబాయ్‌కి కొత్త కళ వచ్చింది. మరి, సూపర్‌స్టార్ రజనీకాంత్ ఎంటరైతే ఆ మాత్రం కళ ఉండదా? ఇంకా చిత్రకథానాయిక అమీ జాక్సన్, విలన్‌గా నటించిన అక్షయ్‌కుమార్, చిత్రదర్శకుడు శంకర్, సంగీతదర్శకుడు ఎ.ఆర్. రెహమాన్... ఇలా ‘2.0’ టీమ్ ఆడియో వేడుక కోసం దుబాయ్ వెళ్లారు. బుర్జ్ పార్క్‌లో ఈ రోజు ‘2.0’ ఆడియో వేడుక జరుగుతుంది. నిన్న దుబాయ్ టవర్స్ ‘బుర్జ్ అల్ అరబ్’లో చిత్రబృందం అంతర్జాతీయ మీడియాతో సమావేశమైంది. ఈ సమావేశానికి హోటల్ నుంచి ‘బుర్జ్ అల్ అరబ్’కి రజనీ అండ్ కో హెలికాప్టర్లో వెళ్లారు. రజనీకాంత్, అమీ జాక్సన్ తదితరులకు అక్కడివారు రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛాలను అందజేశారు. రజనీతో ఇష్టంగా ఫొటోలు దిగారు. నేడు ఈ సినిమా ఆడియో వేడుక జరగనుంది. రజనీ పాట... రానా మాట! అత్యంత భారీగా జరగనున్న ఈ ఆడియో వేడుకకు రానా హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. రానా స్పాంటేనియస్‌గానూ మాట్లాడి, షోను రక్తి కట్టించగలరు. అందుకే అతన్ని హోస్ట్ చేయమని అడిగి ఉంటారని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తెలుగు హోస్ట్‌గా రానా వ్యవహరిస్తారు. తమిళ్‌కి ఆర్జే బాలాజీ హోస్ట్. ‘‘భారతీయ సినిమా చరిత్రలో భారీ సినిమా ‘2.0’. దుబాయ్‌లో జరగనున్న ఈ చిత్రం ఆడియో రిలీజ్ వేడుకకు హోస్ట్‌గా చేస్తున్నా’’ అని రానా ఆనందం వ్యక్తం చేశారు. -
మనిషే కాదు... మాట కూడా!
వార్నీ!! గోళ్లేంట్రా... అంత పొడుగున్నాయ్? పక్షులకు ఉన్నట్టు! గోళ్లు కాదు... కళ్లు చూశావా! ఆ రంగు ఏంటో... కనుబొమలేమో పక్షి ఈకల్లాగున్నాయ్? ఎంతైనా శంకర్ డిఫరెంట్‌గా ఆలోచిస్తాడ్రా. సిన్మాలో క్యారెక్టర్ ఎలాగుంటుందో? – రజనీకాంత్ ‘2.0’లో విలన్ అక్షయ్‌కుమార్ లుక్ లీకయినప్పుడు, తర్వాత అఫీషియల్‌గా విడుదల చేసినప్పుడూ... పబ్లిక్‌లో ఫుల్ డిస్కషన్! అంత డిఫరెంట్‌గా అక్షయ్ బర్డ్‌మ్యాన్ లుక్‌ను దర్శకుడు శంకర్ డిజైన్ చేశారు మరి. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే... మనిషి లుక్కే కాదు, మాట కూడా అంతే డిఫరెంట్. ఆస్కార్ అవార్డు గ్రహీత రసూల్ పూకుట్టి ‘2.0’కి సౌండ్ డిజైనర్. కొన్ని వారాలుగా విలన్ వాయిస్ ఎలా ఉండాలనే విషయమై డిస్కస్ చేస్తున్నారు. డైలాగులకు మామూలుగానే డబ్బింగ్ చెప్పించి, తర్వాత సౌండ్ ఎన్హాన్స్మెంట్ టెక్నాలజీ ద్వారా వాయిస్‌ని ఛేంజ్ చేస్తారట! ఆ వాయిస్ ఎలా ఉండబోతుందో... ట్రైలర్లో వినిపిస్తారేమో! హిందీలో తన పాత్రకు అక్షయ్ స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. తెలుగు, తమిళ భాషల్లో డబ్బింగ్ ఆర్టిస్ట్ చేత చెప్పించాలనుకుంటున్నారు. ఒక్క పాటే... పది రోజులు తీశారు ఒక్కటంటే ఒక్క పాటే ఉంటుందట.. ‘2.0’లో రజనీకాంత్, అమీ జాక్సన్ మధ్య! అంటే.. డ్యూయెట్ అన్నమాట. మిగతావన్నీ సిట్యువేషనల్ లేదా మాంటేజ్ సాంగ్స్ అట! ఆ ఒక్క పాటను పది రోజులు తీశారు. మామూలుగానే శంకర్ సినిమాల్లో సాంగులు భారీగా ఉంటాయి. మరి, పది రోజులు తీశారంటే... ఏ రేంజ్లో ఉంటుందో! నిన్నటితో ఆ పాట చిత్రీకరణ పూర్తయింది. సుమారు 450 కోట్ల బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ‘2.0’కి ఏఆర్ రెహమాన్ స్వరకర్త. ఈ శుక్రవారం దుబాయ్‌లో పాటల్ని విడుదల చేయనున్నారు. -
24తో వస్తున్న సూర్య
నటుడు సూర్య 24తో వస్తానంటున్నారు. ఏమిటి అర్థం కాలేదా? సూర్య తదుపరి చిత్ర టైటిల్ ఇదే. అంజాన్ చిత్రం నిరాశపరచినా ప్రస్తుతం మాస్ చిత్రంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు సూర్య. ఈ చిత్రంలో నయనతార, ఎమిజాక్సన్ అంటూ ఇద్దరు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేస్తున్న సూర్యను దర్శకుడు వెంకట్ ప్రభు చాలా డిఫరెంట్‌గా చూపిస్తున్నారట. మాస్ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. తాజాగా సూర్య వేగాన్ని పెంచేశారు. చిత్రం తరువాత చిత్రం అంగీకరించే ఈయన ఈసారి ఏకంగా మూడు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. వాటిలో మలయాళ దర్శకుడు విక్రమన్ కెకుమార్, పి.రంజిత్, హరి చిత్రాలున్నాయి. మాస్ చిత్రం తరువాత సూర్య విక్రమన్ కె.కుమార్ దర్శకత్వంలో నటించనున్నారు. ఇటీవల తెలుగులో మనం అనే సూపర్‌హిట్ చిత్రాన్ని ఇచ్చిన విక్రమన్ కె.కుమార్ సూర్య కోసం సూపర్ కథను వండుతున్నారట. ఈ చిత్రానికి 24 అనే టైటిల్‌ను ఖరారు చేశారు. దీనికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్ సంగీత బాణీలందించడానికి రెడీ అవుతున్నారు. చిల్లును ఒరు కాదల్ చిత్రం తరువాత సూర్య ఏఆర్ రెహ్మాన్ కలయిక లో తెరకెక్కనున్న చిత్రం 24 . అయితే ఈ చిత్రంలో సూర్యకు జంటగా నటించే ఆ లక్కీ హీరోయిన్ ఎవరన్నది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే అంటున్నారుు యూనిట్ వర్గాలు.