రాణీగారి కథలో శిబానీ... | Shibani Dandekar excited to shoot 'Queen' remakes | Sakshi
Sakshi News home page

రాణీగారి కథలో శిబానీ...

Nov 4 2017 1:48 AM | Updated on Nov 4 2017 1:48 AM

Shibani Dandekar excited to shoot 'Queen' remakes - Sakshi

... దండేకర్‌! పేరు కొత్తగా ఉంది కదూ! పేరుతో పాటు శిబానీ దండేకరూ తెలుగు ప్రేక్షకులకు కొత్తే. సల్మాన్‌ ఖాన్‌ ‘సుల్తాన్‌’, తాప్సీ ‘నామ్‌ షబానా’లతో పాటు కొన్ని హిందీ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశారీమె. కొన్ని హిందీ టీవీ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఇప్పుడీ ముంబై బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు హాట్‌ హాట్‌ క్యారెక్టర్‌లో కనువిందు చేయనున్నారు. తమన్నా ముఖ్యతారగా నీలకంఠ దర్శకత్వంలో నిర్మాత మను కుమారన్‌ హిందీ హిట్‌ ‘క్వీన్‌’ని తెలుగులో అదే పేరుతో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.

హిందీలో కంగనా రనౌత్‌ చేసిన పాత్రను తెలుగులో తమన్నా చేస్తున్నారు. లీసా హెడెన్‌ చేసిన విజయలక్ష్మీ పాత్రను శిబానీ దండేకర్‌ చేయనున్నారు. యాక్చువల్లీ... లీసా పాత్రకు ముందు అమీ జాక్సన్‌ని అనుకున్నారు. అమీ ఆల్మోస్ట్‌ ‘యస్‌’ అన్నారు. అయితే... ఈలోపు అమెరికన్‌ టీవీ సిరీస్‌ ‘సూపర్‌ గాళ్‌’లో చాన్స్‌ వచ్చింది. మరోపక్క ‘క్వీన్‌’ షూటింగ్‌ లేట్‌ కావడంతో సిన్మా నుంచి తప్పుకున్నారు. ఇప్పుడా పాత్రకు శిబానీను సెలక్ట్‌ చేశారు. రాణీగారి (‘క్వీన్‌’) కథలో విజయలక్ష్మీ పాత్ర ఎక్కువే. తెలుగు–మలయాళ ‘క్వీన్‌’ రీమేక్స్‌లో శిబా, తమిళ–కన్నడ ‘క్వీన్‌’ రీమేక్స్‌లో హిందీ నటి ఎలీ ఎవరామ్‌ నటించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement