స్క్రీన్‌ టెస్ట్‌ | Paruchuri Brothers worked for more movies with Krishna | Sakshi
Sakshi News home page

స్క్రీన్‌ టెస్ట్‌

Published Tue, Oct 31 2017 12:27 AM | Last Updated on Tue, Oct 31 2017 12:27 AM

Paruchuri Brothers worked for more movies with Krishna

► ఈ నటుని అసలు పేరు కొచ్చర్ల దయారత్నం. కె. బాలచందర్‌ తొలి కోడి కూసింది’ సినిమా కోసం ఆయన పేరు మార్చారు? ఆ నటుడెవరు?
ఎ) రఘువరన్‌    బి) ప్రకాశ్‌రాజ్‌    సి) జీవా    డి) రమేశ్‌ అరవింద్‌

► రియల్‌ లైఫ్‌ కపుల్‌ అయిన కృష్ణ, విజయనిర్మల రీల్‌పై అన్నా చెల్లెళ్లుగా నటించిన సినిమా పేరేంటి?
ఎ) బొమ్మలు చెప్పిన కథ బి) అల్లూరి సీతారామరాజు   సి) పండంటి కాపురం డి) సాక్షి

► బాలీవుడ్‌ నటుడు ఫర్హాన్‌ అక్తర్‌తో కలిసి ‘మెన్‌ ఎగైనెస్ట్‌ రేప్‌ అండ్‌ డిస్క్రిమినేషన్‌’ (మర్ద్‌) అని ఒక క్యాంపైన్‌ నిర్వహించారు? ఈ క్యాంపైన్‌కి తన వాయిస్‌ వినిపించిన తెలుగు టాప్‌ హీరో ఎవరు?
ఎ) ప్రభాస్‌     బి) నాని సి) మహేశ్‌బాబు    డి) రామ్‌చరణ్‌

► గౌతమ్‌ ఘోష్‌ దర్శకత్వం వహించిన ‘మాభూమి’ చిత్రం ద్వారా పరిచయమైన ఈ సహాయనటి తర్వాత కాలంలో చాలా పేరు తెచ్చుకున్నారు? ఆమె ఎవరై ఉంటారు?
ఎ) సుద  బి) తెలంగాణ శకుంతల సి) అల్లరి సుభాషిణి  డి) ప్రగతి

► ‘వినవే బాల నా ప్రేమ గోల..’ అంటూ ఈ నటుడు పాడిన పాటను ఇప్పటికీ ప్రేమికులు పాడుకుంటూనే ఉంటారు? ఈ పాట పడిన నటుడెవరు?
ఎ) రమణారెడ్డి  బి) రేలంగి   సి) పద్మనాభం  డి) రాజనాల

► ‘అబ్బాయిగారు’లో వెంకటేశ్‌ సవతి తల్లిగా నటించిన జయచిత్ర కథానాయికగా నటించిన తొలి తెలుగు సినిమా?
ఎ) భారతంలో ఒక అమ్మాయి  బి) యవ్వనం కాటేసింది   సి) చిల్లరకొట్టు చిట్టెమ్మ   డి) సోగ్గాడు

► తెలుగు ‘ప్రేమఖైదీ’లో హరీష్‌ హీరో. అదే సినిమా హిందీ రీమేక్‌లో కూడా అతనే హీరో. హిందీ సినిమాలో అతనితో స్క్రీన్‌ షేర్‌ చేసుకున్న ఈ బాలీవుడ్‌ నటితర్వాత చాలా పెద్ద స్టార్‌ అయ్యారు? ఆమె ఎవరు?
ఎ) మాధురీ దీక్షిత్‌  బి) కరీనా కపూర్‌  సి) కరిష్మా కపూర్‌  డి) టబు

► ‘కష్టపడకుండా ఏదీ రాదు, కష్టపడకుండా వచ్చింది ఏదీ ఉండదు’ అని రజనీకాంత్‌ ఏ సినిమాలో చెప్తాడు?
ఎ) భాష    బి) అరుణాచలం  సి) నరసింహా    డి) శివాజి

► దర్శక మేధావి ‘జెంటిల్‌మెన్‌ శంకర్‌’ ఏం చదువుకున్నారో తెలుసా?
ఎ) మెకానికల్‌ ఇంజనీర్‌   బి) లా సి) లెదర్‌ టెక్నాలజీ   డి) టక్స్‌టైల్‌ డిజైనింగ్‌

► శ్రుతీహాసన్‌ ట్విట్టర్‌ ఐడీ ఏంటో కనుక్కోండి?
ఎ) @యువర్స్‌ ట్రూలీ శ్రుతి    బి) @ శ్రుతీహాసన్‌  సి) @ మీ శ్రుతీహాసన్‌   డి) @ శ్రుతీ సేస్‌

► 2009లో ‘మిస్‌ టీన్‌ వరల్డ్‌’ టైటిల్‌ నెగ్గిన హీరోయిన్‌ ఎవరో తెలుసా?
ఎ) ఐశ్వర్యా రాయ్‌    బి) సుస్మితా సేన్‌ సి) అమీ జాక్సన్‌    డి) ఆండ్రియా

► అంతస్తులు చిత్రంలో ‘దులపర బుల్లోడా దుమ్ము దులపర బుల్లోడా’అంటూ హుషారెత్తించిన కథానాయిక ఎవరో గుర్తున్నారా?
ఎ) జమున     బి) బి. సరోజా దేవి సి) భానుమతి     డి) కృష్ణకుమారి

► ‘ఇంతేనయా తెలుసుకోవయా, ఈ లోకం ఇంతేనయా’ అనే పాట రాసిన రచయిత ఎవరు?
ఎ) దాశరథి బి) వేటూరి సుందర రామ్మూర్తి సి) సముద్రాల డి) ఘంటసాల

► మహా శక్తిమాన్‌’ అనే హిందీ త్రీడి ఫిలిమ్‌కి దర్శకత్వం వహించింది ఓ ప్రముఖ తెలుగు కెమేరామేన్‌? ఆయనెవరు?
ఎ) వి.యస్‌.ఆర్‌. స్వామి  బి) ఎస్‌. గోపాల్‌రెడ్డి  సి) జయనన్‌ విన్సెంట్‌  డి) జయరామ్‌

► దర్శక–నిర్మాతగుణశేఖర్‌ దర్శకత్వం వహించిన మొదటి సినిమా ఏంటో తెలుసా?
ఎ) సొగసు చూడతరమా   బి) రామాయణం సి) లాఠీ  డి) చూడాలని ఉంది

► పరుచూరి బ్రదర్స్‌ రచయితలుగా ఏ హీరోతో ఎక్కువ సినిమాలకు పనిచేశారు?
ఎ) కృష్ణ  బి) బాలకృష్ణ  సి) చిరంజీవి  డి) నాగార్జున

► యం.యం. కీరవాణి ఏ సంగీత దర్శకుని దగ్గర శిష్యరికం చేశారో చెప్పుకోండి చూద్దాం?
ఎ) కేవీ మహదేవన్‌  బి) ఇళయరాజా  సి) యం.ఎస్‌. విశ్వనాథన్‌  డి) చక్రవర్తి

► ఎన్టీఆర్, ఛాయాదేవి ఉన్న ఈ స్టిల్‌ ఏ సినిమాలోనిది?
ఎ) కన్యాశుల్కం    బి) శకుంతల సి) విజయం మనదే   డి) మంగళసూత్రం

► నటుడు మంచు విష్ణు ఏ క్రీడలో యూనివర్సిటీ కెప్టెన్‌గా వ్యవహరించారు?
ఎ) వాలీబాల్‌  బి) బాస్కెట్‌బాల్‌  సి) క్రికెట్‌  డి) హాకి

► ఈ క్రింది ఫోటోలోని బాలుణ్ణి గుర్తుపట్టారా? ఎవరతను?
ఎ) అక్కినేని నాగేశ్వరరావు బి) అక్కినేని నాగార్జున సి) కాంతారావు డి) హరనాథ్‌బాబు

మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం     
10 సమాధానాల వరకూ చెప్పగలిగితే...  మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్‌
15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి
20 సమాధానాలూ చెప్పగలిగితే...   ఇంకోసారి ఈ క్విజ్‌ చదవకండి!

సమాధానాలు
1) సి  2) ఎ  3) సి  4) బి 5) బి  6) డి 7) సి  8) సి 9) ఎ 10)  బి  11)  సి  12) సి  13) ఎ  14 ) ఎ  15) సి  16) ఎ  17) డి  18) ఎ  19) బి  20) ఎ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement