susmitha sen
-
'పెళ్లైతే చేసుకుంటా.. కానీ మాజీ బాయ్‌ఫ్రెండ్స్‌తో'.. హీరోయిన్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్, మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ పరిచయం అక్కర్లేని పేరు. గతేడాది తాలి, ఆర్య-3 వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులను అలరించింది. అయితే ఇప్పటి వరకు పెళ్లి చేసుకోని ప్రపంచసుందరి చాలాసార్లు డేటింగ్ రూమర్స్ వినిపించాయి. అంతే కాదు.. ఐపీఎల్ మాజీ ఛైర్మన్‌తో లలిత్ మోదీతో కొంత కాలం సుష్మిత డేటింగ్లో ఉన్న సంగతి తెలిసిందే. గతేడాది దీపావళి సందర్భంగా సుస్మిత తన మాజీ ప్రియుడు రోహ్మాన్ షాల్‌తో కనిపించింది. 2022లోనే వీరిద్దరికీ బ్రేకప్ అయినప్పటికీ.. చాలా సందర్భాల్లో జంటగా కనిపించారు. దీంతో మరోసారి సుస్మిత సేన్‌పై పెళ్లి వార్తలొచ్చాయి. దీంతో మరోసారి వ్యక్తిగత విషయాలతో వార్తల్లో నిలిచింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె తన పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. మీ లైఫ్‌లో బ్రేకప్ అయినప్పుడు ప్రశ్నించగా.. సుస్మిత తనదైన శైలిలో సమాధానాలిచ్చింది. సుస్మిత మాట్లాడుతూ..'నా జీవితం తెరిచిన పుస్తకం లాంటిది. నేను చాలా నిజాయితీగా, నిర్భయంగా జీవిస్తున్నా. గౌరవం అనేది మన జీవితంలో ఒక అంశం మాత్రమే కాదు. అది మీరంటే ఏంటో నిర్ణయిస్తుంది. కాబట్టి మనం తీసుకునే నిర్ణయాలు బాధపెట్టాయా? లేదా ద్రోహం చేశాయా? లేదా మీరు మనం ఏదైనా తప్పు చేశామా? అన్నవి నేను పెద్దగా పట్టించుకోను. జీవితంలో ఎదురయ్యే వాటి నుంచి పాఠాలు నేర్చుకోవడం.. ముందుకు సాగడమేనని' చెప్పుకొచ్చింది. ఒకవేళ మీరు పెళ్లి చేసుకుంటే.. మాజీలతో స్నేహితులుగా ఉండగలరా? అని యాంకర్ ప్రశ్నించారు. దీనిపై సుస్మిత మాట్లాడుతూ..'కచ్చితంగా వారితో ఫ్రెండ్లీగానే ఉంటాను. కానీ కాస్తా కష్టంగానే ఉంటుందని భావిస్తున్నా. చాలా మంది తమ మాజీలతో అలానే ఉంటారు. కానీ ఇక్కడ వారితో లిమిట్స్ ఉంటాయా అనే విషయమైతే తెలియదు. కానీ అది సాధ్యమే. ఇలాంటివీ నేను చూశాను కూడా. ఎందుకంటే ప్రస్తుతం నా జీవితంలో సంతోషంగా ఉన్నా. పెళ్లి చేసుకోవడానికి కావాల్సింది సరైన సమయం, కారణం కాదు. నాకు తగినట్లుదా సరైన వ్యక్తి దొరికితే కచ్చితంగా పెళ్లి చేసుకుంటా' అని తెలిపింది. సుస్మితా సేన్ రిలేషన్స్ సుస్మిత సేన్ మొదట బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడాతో డేటింగ్లో ఉన్నారు. ఆ తర్వాతమోడల్ రోహ్మన్ షాల్‌తో 2018 నుండి 2021 వరకు మూడేళ్ల పాటు ప్రేమాయణం కొనసాగించారు. ఆ తర్వాతవ్యాపారవేత్త, ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. -
లలిత్ మోడీతో ప్రేమాయణం.. సుస్మితా సేన్ క్లారిటీ!
బాలీవుడ్ హీరోయిన్ సుస్మితా సేన్ ఇటీవలే ఆర్య -3 వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం ఈ సిరీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుండగా.. అభిమానుల నుంచి విశేష ఆదరణ దక్కించుకుంటోంది. ఈ వెబ్ సిరీస్‌ను రామ్ మాధ్వని దర్శకత్వంతో తెరకెక్కించారు. అయితే తాజాగా ఇంటర్వ్యూకు హాజరైన సుస్మితా సేన్ ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. ప్రముఖ వ్యాపారవేత్త, మాజీ ఐపీఎల్ ఛైర్మన్ లలిత్ మోడీతో తన ప్రేమయాణం గురించి నోరు విప్పింది. (ఇది చదవండి: కావాలయ్యా సాంగ్.. తమన్నా స్టెప్పు చెండాలం అంటూ నటుడి విమర్శలు) మీకు లలిత్ మోడీని పెళ్లి చేసుకోవాలనుకున్నారా ప్రశ్నించగా?..'నేను ఎవరినైనా పెళ్లి చేసుకోవాలనుకంటే చేసుకుంటా. అంతే కానీ ఇలా ప్రయత్నించను. ఇష్టముంటే చేసుకుంటా అంతే. తనపై వచ్చిన మీమ్స్ చూస్తే చాలా ఫన్నీగా అనిపించాయి. మీరు ఎవరినైనా గోల్డ్ డిగ్గర్ అని పిలిచేముందు వాస్తవాలు తెలుసుకోండి. నేను బంగారం కంటే ఎక్కువగా వజ్రాలను ఇష్టపడతాను. మన నిశ్శబ్దంగా ఉంటే మౌనాన్ని బలహీనతగా భావిస్తారు. అందుకే వారికి తెలియజేయడానికి నేను ఒక పోస్ట్ పెట్టవలసి వచ్చింది.' అని అన్నారు. కాగా.. ఇటీవలే దీపావళి సందర్భంగా సుస్మిత తన మాజీ ప్రియుడు రోహ్మాన్ షాల్‌తో కనిపించింది. వీరిద్దరూ 2022లో బ్రేకప్ అయినప్పటికీ.. చాలా సందర్భాల్లో జంటగా కనిపించారు. దీపావళి సందర్భంగా సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. View this post on Instagram A post shared by Sushmita Sen (@sushmitasen47) -
నా జీవితంలో చేసిన చెత్త పని అదే: స్టార్ హీరో కామెంట్స్ వైరల్!
మాన్సూన్ వెడ్డింగ్ హాలీవుడ్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన నటుడు రణదీప్ హుడా. ఆ తర్వాత పలు బాలీవుడ్ చిత్రాలతో స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఈ రోజు రణ్‌దీప్ 47వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. అయితే అప్పట్లో మాజీ మిస్ యూనివర్స్, సుస్మితాసేన్‌తో డేటింగ్లో ఉండడం అందరినీ దృష్టని ఆకర్షించింది. బాలీవుడ్లో వీరిద్దరి రిలేషన్ హాట్ టాపిక్‌గా మారింది. 2006 నుంచి దాదాపు మూడేళ్ల పాటు డేటింగ్ ఈ జంట వార్తల్లో నిలిచారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రణదీప్ హుడా సుస్మితాసేన్‌తో రిలేషన్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆమెతో బ్రేకప్ కావడంపై రణ్‌దీప్ స్పందించారు. (ఇది చదవండి: మూడేళ్ల గ్యాప్, అయినా తగ్గేదేలే.. రెమ్యునరేషన్ డబుల్..) రణ్‌దీప్ హుడా మాట్లాడుతూ..' నేను 'మిస్ యూనివర్స్ సుస్మితా సేన్‌తో రిలేషన్లో లేను. అంతే కాదు ఆమెపై నాకు ఏ విధంగానూ ఫీలింగ్స్ లేవు. సుస్మిత సేన్ జీవితంలోకి నేను వెళ్లకూడదని కోరుకున్నందున.. నా జీవితంలో కేవలం ఒక థియేటర్ రిహార్సల్‌ను మాత్రమే కోల్పోయాను. నా విలువల పరంగా ఇది నేను చేసిన చెత్త పని అని భావించా. కానీ ఆమెతో బ్రేకప్ కావడం నాకు మంచే జరిగింది. ఎందుకంటే నేను పెద్ద స్టార్‌ను కూడా కాదు. కొన్నిసార్లు తాము అనుకున్న సొంత మార్గాల్లోనే వెళ్లడం ఉత్తమమైన పని. ఆ తర్వాతే నేనేంటో నాకు తెలుసొచ్చింది.' అని అన్నారు. అయితే సుస్మితా సేన్‌తో బ్రేకప్ తర్వాత కెరీర్లో బిజీగా మారిపోయారు. రణదీప్ హుడా ప్రస్తుతం 'స్వతంత్ర వీర్ సావర్కర్', 'లాల్ రంగ్ 2' చిత్రాలతో బిజీగా ఉన్నారు. మరోవైపు, సుస్మితా సేన్ ఇటీవలే విడుదలైన 'తాలీ' వెబ్ సిరీస్‌తో ప్రశంసలు అందుకుంటోంది. ఈ సిరీస్‌లో ట్రాన్స్‌జెండర్స్ హక్కుల కోసం పోరాడే పాత్రలో కనిపించింది. (ఇది చదవండి: అప్పు ఎగ్గొట్టిన స్టార్ హీరో.. వేలానికి ఖరీదైన విల్లా!) -
ఆ నలుగురు స్టార్ హీరోయిన్స్.. సినిమాలే కాదు.. ఆ రంగంలోనూ తగ్గేదేలే!
బాలీవుడ్ హీరోయిన్లు రెమ్యూనరేషన్ విషయంలో హీరోలకు ఏ మాత్రం తీసిపోరు. జవాన్ చిత్రంలో నటిస్తోన్న దీపికా పదుకొణె భారీగానే పారితోషికం అందుకోనుంది. సినిమాలతో పాటు మరోవైపు యాడ్స్‌లో నటిస్తూ కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారు. గ్లామర్ ఫీల్డ్ వారికి సాధారణంగానే ఆదరణ ఓ రేంజ్లో ఉంటుంది. అలాంటి వ్యక్తులు నటనతో పాటు బిజినెస్‌పై దృష్టి సారిస్తున్నారు. సినిమాలతో పాటు వ్యాపారం రంగంలో రాణిస్తూ ఆదాయాన్ని మరింత పెంచుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ అగ్ర తారలు చేస్తున్న వ్యాపారాలపై ఓ లుక్కేద్దాం. బాలీవుడ్ టాప్ హీరోయిన్లు బిజినెస్‌లో కూడా జోరు కొనసాగిస్తున్నారు. కొంతమంది నటీమణులు సైడ్ బిజినెస్ చేస్తూ పారిశ్రామికవేత్తలు కూడా రాణిస్తున్నారు. ఈ నటీమణులు తమ సైడ్ బిజినెస్ ద్వారా కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారు. ఆదిపురుష్ భామ కృతి సనన్: ఇటీవలే డార్లింగ్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్‌లో నటించింది. పలు భాషల్లో తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రాలను అందించిన నటి కృతి సనన్ ఇటీవలే తన సోదరి నూపూర్‌తో కలిసి సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించింది. కాగా.. కృతి సనన్ నిర్మాణ సంస్థ పేరు బ్లూ బటర్‌ఫ్లై ఫిల్మ్స్. తాను ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించి సినిమాలు చేస్తున్నానంటూ సోషల్ మీడియాలో ఓ ఫోటో షేర్ చేసింది. ఇదే ప్రొడక్షన్ హౌస్‌లో దో పట్టి సినిమా నిర్మిస్తుండగా.. ఈ సినిమాలో నటి కాజోల్ కూడా నటిస్తోంది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. సీనియర్ నటి సుస్మితా సేన్ సుస్మితా సేన్: మరో బాలీవుడ్ సీనియర్ నటి సుస్మితా సేన్ మంచి నటి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె జ్యువెలరీ బ్రాండ్‌ను కలిగి ఉన్నారు. అంతే కాకుండా తంత్ర ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ హౌస్‌కు యజమాని కూడా ఉన్నారు. సుస్మితకు అనేక హోటళ్లు, రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. 2022 ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం సుస్మితా సేన్ బిజినెస్ టర్నోవర్ విలువ రూ.74 కోట్లుగా ఉన్నట్లు సమాచారం. విరాట్ భార్య అనుష్క శర్మ అనుష్క శర్మ: బాలీవుడ్లో ఎన్నో హిట్ చిత్రాలను అందించిన నటీమణులలో అనుష్క శర్మ ఒకరు. అనుష్క తన సొంత ప్రొడక్షన్ హౌస్ కూడా ప్రారంభించింది. ఆమె ప్రొడక్షన్ హౌస్ అమెజాన్, నెట్‌ఫ్లిక్స్‌తో పెద్ద ఒప్పందాలు కుదుర్చుకుంది. అనుష్కకు నుష్ అనే డ్రెస్ బ్రాండ్ వ్యాపారం కూడా ఉంది. విరాట్ కోహ్లీని పెళ్లి చేసుకున్న అనుష్క.. సినిమాల్లో కంటే బిజినెస్‌లోనే బాగా రాణిస్తోంది. దీపికా పదుకొణె బాలీవుడ్లోనే కాకుండా హాలీవుడ్లో కూడా ఎన్నో సినిమాలు చేసిన స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె. తాజాగా ఆమె షారూక్ ఖాన్ సరసన జవాన్ చిత్రంలో కనిపించనుంది. 'ఆల్ అబౌట్ యు' అనే దుస్తుల బ్రాండ్‌ను నడుపుతోంది. అంతే కాకుండా 'లైవ్ లవ్ లాఫ్ ఫౌండేషన్' వ్యవస్థాపకురాలు కూడా. ఓ కథనం ప్రకారం దీపికా పదుకొణె బిజినెస్ నికర విలువ రూ.498 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నలుగురు బాలీవుడ్ హీరోయిన్స్‌తో పాటు.. బాలీవుడ్, టాలీవుడ్, శాండల్‌వుడ్, కోలీవుడ్ సహా ఇతర సినీ రంగాలకు చెందిన పలువురు నటీమణులు సైతం.. సొంతంగా సైడ్ బిజినెస్‌లు చేస్తూ రెండు చేతులతో భారీగా సంపాదిస్తున్నారు. -
'అదే వారి బలం.. అందుకే ప్రాణాంతకమైనా జయించారు'
ప్రస్తుత పోటీ ప్రపంచంలో సినీరంగంలో రాణించడమంటే మాటలు కాదు. పైగా హీరోయిన్లు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవటం అంతా ఈజీ కాదు. ఎంత టాలెంట్ ఉన్న కూడా అదృష్టం కలిసి రాకపోతే ఈ రంగంలో గుర్తింపు దక్కడం కష్టమే. అంతే కాకుండా కెరీర్ సాఫీగా సాగుతుందనుకునేలోపే ఊహించని సంఘటనలు మరింత వెనక్కి లాక్కెళ్తాయి. అవకాశాలు అందే సమయంలో అనుకోని పరిణామాలతో దాదాపు కెరీర్ ముగిసేంతా పరిస్థితి ఎదురవుతుంది. కానీ అలాంటి సమయంలోనే మనం పట్టుదలగా ఉండాలి. ఆ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మనోధైర్యం కోల్పోకూడదు. అలా ప్రాణాంతక వ్యాధుల బారిన పడి కోలుకున్న హీరోయిన్ల పేర్లు ఇట్టే వేళ్లమీద లెక్కపెట్టొచ్చు. జీవితంలో అత్యంత గడ్డుకాలాన్ని అధిగమించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన హీరోయిన్లు కొందరే ఉన్నారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా విజయం సాధించిన ఆ తారలపై ప్రత్యేక కథనం. మయోసైటిస్‌ను జయించిన సమంత సమంత సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరు. గతంలో మయోసైటిస్ వ్యాధి బారిన పడిన సామ్ ఆ తర్వాత కోలుకుని కెరీర్లో మళ్లీ బిజీ అయిపోయింది. మయోసైటిస్ బారిన పడిన సమయంలో అత్యంత క్లిష్ట పరిస్థితులను అనుభవించింది. మానసికంగా, శారీరకంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. మనోధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు సాగుతున్నారు సమంత. మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి సోకినా.. ధైర్యంగా నిలబడి ఎదుర్కొంది. ప్రస్తుతం రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్న సిటాడెల్ వెబ్ సిరీస్‌ను సెట్స్ మీదకు తీసుకొచ్చింది. ఆ తర్వాత విజయ్‌దేవరకొండ ‘ఖుషీ’ చిత్రంలోనూ సామ్ నటించనుంది. గతంలో మయోసైటిస్ గురించి సామ్ మాట్లాడుతూ.. 'ఎదుటి వాళ్లు ఎంతగా కష్టపడుతున్నారు.. జీవితంలో ఎంత పోరాడుతున్నారు.. అనేది మీకు ఎప్పటికీ తెలియదు.. అందుకే కాస్త దయతో మెలగండి’అని సామ్ చెప్పుకొచ్చింది. మీరు చూపిస్తున్న ప్రేమ, అనుబంధం నాకు మరింత మనోబలాన్ని, ఆ సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తోందంటూ ఎమోషనలైంది సామ్. అందువల్లే బయటపడ్డా: సుస్మితాసేన్ ఇటీవల మాజీ మిస్‌వరల్డ్, నటి సుస్మితాసేన్ ఇటీవల తీవ్ర గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. ఆమెకు వైద్యులు యాంజియోప్లాస్టీ చేసి, స్టంట్ వేశారు. ఆ తర్వాత ఆమె కోలుకున్నారు. ఇటీవలే ఓ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు సుస్మితాసేన్. ఆమె మాట్లాడూతూ.. 'ఇటీవల నేను తీవ్ర గుండెపోటుకు గురయ్యా. ప్రధాన రక్తనాళం 95 శాతం మూసుకుపోయింది. వైద్యులు నా కోసం ఎంతో శ్రమించారు. నా కోసం ప్రార్థనలు చేసిన వారందరికీ ధన్యవాదాలు. ఇటీవల ఎక్కువగా గుండెపోటు కేసులు నమోదు కావడాన్ని గమనిస్తున్నాం. దయచేసి వ్యాయామాలు చేయండి. నా విషయంలో వ్యాయామాలు చేయడం ఉపయోగపడింది. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నా. నీ హృదయాన్ని ఎప్పుడూ సంతోషంగా, ధైర్యంగా ఉంచు. కష్టకాలంలో అది నీకు అండగా నిలుస్తుంది. మా నాన్న సుబీర్సేన్ నాకు చెప్పిన ఈ మాటలే నాకు స్ఫూర్తి' అంటూ చెప్పుకొచ్చింది సుస్మితా సేన్. ఆత్మవిశ్వాసంతో గెలిచా: హంసా నందిని అత్తారింటికి దారేది, ఈగ, మిర్చి సినిమాల్లో తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటి హంసానందిని. చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఏడాదిన్నర పాటు క్యాన్సర్‌తో పోరాడి గెలిచింది. గతంలో ఆమె ఎదుర్కొన్న కష్టాలను వివరించింది. క్యాన్సర్ నుంచి కోలుకున్న హంసానందిని ప్రస్తుతం సినిమాలతో బిజీ అయిపోయింది. గతంలో హంసా మాట్లాడుతూ..' వైద్య పరీక్షల్లో నాకు వంశపారంపర్య రొమ్ము క్యాన్సర్ ఉందని తేలింది. జన్యు పరివర్తన కారణంగా భవిష్యత్తులో మళ్లీ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పొంచి ఉందని డాక్టర్లు చెప్పారు. అయినా కూడా నేను అధైర్యపడలేదు. ఆత్మవిశ్వాసంతోనే ఆ మహమ్మారిని గెలిచా.' అంటూ చెప్పుకొచ్చింది. క్యాన్సర్‌తో పోరాడిన సోనాలిబింద్రే ‘మురారి’, ‘ఖడ్గం’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’, ‘శంకర్‌దాదా ఎమ్‌బీబీఎస్’ వంటి పలు తెలుగు హిట్ చిత్రాల్లో నటించిన భామ సోనాలి బింద్రే. సోనాలిబింద్రే క్యాన్సర్ మహమ్మారితో పోరాడి గెలిచింది. అమెరికాలో క్యాన్సర్‌కు చికిత్స చేయించుకుని మళ్లీ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. ఆ కష్టం సమయంలో తనకు ఎదురైన అనుభవాలను వివరించింది. మనిషి తన జీవితం ఎన్నో పాఠాలు నేర్పిస్తుందని.. క్యాన్సర్‌తో పోరాడి దాని నుంచి బయటపడినందుకు సంతోషంగా ఉన్నా.' అంటూ చెప్పుకొచ్చింది. రెండుసార్లు జయించిన మమతా మోహన్‌దాస్ రెండు సార్లు(2010, 2013) కేన్సర్ బారిన పడి నటి మమత మోహన్ దాస్. ధైర్యంగా,ఆత్మవిశ్వాసం కోల్పోకుండా చికిత్స చేయించుకొని కోలుకుంది. ఇటీవలే మరో అరుదైన చర్మ వ్యాధి బారిన పడినట్లు వెల్లడించింది. ‘విటిలిగో(బొల్లి)’ వ్యాధి సోకిందని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. క్యాన్సర్ సమయంలో తాను పడిన కష్టాలను గతంలో ఆమె వివరించింది. క్యాన్సర్‌కు గురికావడంతో నా కలలన్నీ చెదిరిపోయాయని వెల్లడించింది. ఏడేళ్లు పోరాడి ఆ మహమ్మారిని జయించానని తెలిపింది. అమ్మానాన్నలు,స్నేహితుల ధైర్యంతోనే క్యాన్సర్‌పై గెలిచానని చెప్పుకొచ్చింది. అలాగే గతంలో సీనియర్ హీరోయిన్లు మనీషా కొయిరాల, గౌతమి కూడా క్యాన్సర్‌ను జయించిన వారిలో ఉన్నారు. -
'ఆమె కల వెండితెర.. విధిరాత కామాటిపుర'
ప్రముఖ బాలీవుడ్ నటి సుస్మితాసేన్ శ్రీగౌరి సావంత్ బయోపిక్ ‘తాలి’లో నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది సేన్. ‘రకరకాల కారణాల రీత్యా ఈ ప్రాజెక్ట్ నాకు ప్రత్యేకం. పోరాట స్ఫూర్తి మూర్తీ భవించిన గౌరీ సావంత్‌ను ప్రపంచానికి పరిచయం చేసే పాత్రలో నటించడం కంటే గొప్ప విషయం ఏముంటుంది’ అని తన మనసులోని భావాన్ని బయటపెట్టింది సుస్మితా సేన్. ఇంతకీ ఎవరీ గౌరీ సావంత్? ఆమె వెనకున్న కథేంటో తెలుసుకుందాం. కొన్ని సంవత్సరాల క్రితం.. బాలీవుడ్ వెండితెర కలలను నిజం చేసుకోవడానికి ముంబైలోకి అడుగు పెట్టింది సితార. 21 ఏళ్ల సితార కలలు ఆవిరైపోవడానికి ఎంతో కాలం పట్టలేదు. కొందరు చేసిన మోసం వల్ల ముంబైలోని ఖరీదైన స్టూడియోల్లో భారీ లైట్ల వెలుగులో ఉండాల్సిన సితార.. కామాటిపుర చీకటి లోయల్లో పడిపోయింది. సెక్స్‌వర్కర్‌గా జీవితాన్ని నరకప్రాయం చేసుకుంది. దీంతో కొంత కాలానికి ఆమె తల్లి కూడా అయింది. రెండు లక్షలకు బిడ్డను అమ్ముకుని..: ‘నా బిడ్డను సమాజం ఎంత ఈసడించుకుంటుందో, ఎన్ని రకాలుగా అవమానపరుస్తుందో’ అనే భయంతో పిల్లలు లేని దంపతులకు పాపను రెండు లక్షలకు అమ్ముకుంది. ఆ తరువాత.. తట్టుకోలేని బాధ. ఆ డబ్బును తీసుకువెళ్లి ఒక ఆలయ నిర్మాణానికి విరాళంగా ఇచ్చింది. ఇలాంటి సితారాలు చాలామంది ఉంటారు. గౌరీ సావంత్ లాంటి వాళ్లు మాత్రం చాలా తక్కువగా ఉంటారు. సితార లాంటి వాళ్ల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి కంకణం కట్టుకుంది ట్రాన్స్‌జెండర్ గౌరీ సావంత్. సెక్స్వర్కర్లలకు అండగా నిలవాలన్నదే తన ఆశయం. సెక్స్‌వర్కర్ల పిల్లల ఆలనా పాలనా గాలిలో దీపంలా మారింది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఈ నేపథ్యంలో వారి కోసం భద్రతనిచ్చే ఆశ్రమాన్ని కట్టాలనుకుంది గౌరీ. కల బాగానే ఉందిగానీ, డబ్బులు ఎక్కడివి! ‘సంకల్పం మంచిదైనప్పుడు డబ్బులు వెదుక్కుంటూ వస్తాయట. చూద్దాం’ అనుకుంది. మిలాప్ ఫండ్ రైజింగ్ వెబ్సైట్, కౌన్ బనేగా కరోడ్‌పతి టీవీషో మొదలైన వాటి ద్వారా తన కల సాకారమైంది. ‘అజిచ ఘర్’ పేరుతో నిర్మించిన ఇల్లు యాభై మందికి పైగా సెక్స్‌వర్కర్ల పిల్లలకు ఆశ్రయమిస్తోంది. భద్రంగా వారి ఆలనా పాలనా చూసుకుంటోంది. ట్రాన్స్జెండర్ల యోగక్షేమాల కోసం ‘సఖీ చార్ చౌగీ’ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించి ఎంతోమందికి అండగా నిలబడింది గౌరీ సావంత్. గణేశ్ పేరుతో పెరిగి.. పద్నాలుగేళ్లకే: గతంలోకి వెళితే.. నాగ్‌పూర్‌లో పుట్టి గణేశ్ పేరుతో పెరిగింది. తన నడక, మాట తీరువల్ల లెక్కలేనన్ని అవమానాలు ఎదుర్కొంది. మరోవైపు తల్లి చనిపోయింది. తండ్రి పోలీస్ అధికారి. తన వల్ల తండ్రిని తక్కువ చేసి చూడకూడదని పద్నాలుగేళ్ల వయసులో ఇల్లు విడిచి వెళ్లిపోయింది. ఎన్ని అవమానాలు ఎదుర్కొందో. ఎన్ని కష్టాలు పడిందో. అయితే వాటి వల్ల తాను మానసికంగా బలపడిందే తప్ప ఏరోజూ వెనకడుగు వేయలేదు. సుప్రీంకోర్టులో పిటిషన్: 2014లో గౌరీ పేరు జాతీయ మీడియాను ఆకర్షించింది. అప్పుడు తాను ఒక చారిత్రక అడుగు వేసింది. ట్రాన్స్జెండర్ల పిల్లలను దత్తత తీసుకునే హక్కు కోసం సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. ఆమె గాయత్రి అనే అమ్మాయిని దత్తత తీసుకుంది. గాయత్రి తల్లి ఎయిడ్స్‌తో చనిపోయింది. గతంలో వచ్చిన ఒక దక్షిణాది చిత్రంలో గౌరీ పాత్ర కనిపించింది. అయితే అందులో కల్పన ఎక్కువగా ఉంది. గౌరీ పాత్రపై ‘తాలి’ పేరుతో పూర్తిస్థాయిలో బయోపిక్ రావడం అనేది ఇదే మొదటిసారి. చిన్న చిన్న విషయాలకే డిప్రెషన్ బారిన పడుతున్న వారికి గౌరి బయోపిక్ కచ్చితంగా ధైర్యాన్నిస్తుంది. పోరాటస్ఫూర్తిని కలిగిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. -
ట్రాన్స్‌జెండర్‌గా సుష్మితా సేన్.. మద్దతుగా నిలిచిన గౌరీ సావంత్
ప్రముఖ బాలీవుడ్ నటి సుష్మితా సేన్ ట్రాన్స్‌జెండర్‌గా నటిస్తోంది. 'తాలి' అనే వెబ్‌సిరీస్ కోసం ఆమె ప్రముఖ ట్రాన్స్‌జెండర్ యాక్టివిస్ట్ గౌరీ సావంత్ పాత్రను పోషిస్తోంది. తాజాగా ఈ వెబ్‌సిరీస్ ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల కాగా.. ఇందులో ఆమె ఆకుపచ్చని చీరలో నుదిటిపై ఎర్రటి తిలకంతో బోల్డ్లుక్లో కనిపించింది. ఆమె పాత్రపై నెగెటివ్ కామెంట్లు రావడంతో తాజాగా గౌరీ సావంత్ స్పందించింది. ట్రాన్స్‌జెండర్‌గా నటిస్తున్న ఆమె నిర్ణయాన్ని సోషల్ మీడియాలో కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. ఈ విషయంలో సుస్మితా సేన్‌కు మద్దతుగా నిలిచింది. నిజమైన ట్రాన్స్‌జెండర్‌గా నటిస్తే బాగుంటుందన్న నెటిజన్లు కామెంట్లను ఆమె తప్పబట్టింది. గౌరీ సావంత్ ఇన్‌స్టాగ్రామ్‌లో నిర్మాత అఫీఫా నదియాడ్వాలా సయ్యద్, సుస్మితా సేన్‌తో కలిసి ఉన్న ఫోటోను పంచుకున్నారు. ఆమె తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'మేము అసలైన స్త్రీలం… ఇప్పుడు మీరు ఇందులో నా పాత్రను పోషించబోతున్నారు. ఇది సమాజంలో మీకు గొప్ప గౌరవాన్నిఇస్తుంది. మీ ధైర్యానికి సెల్యూట్.' అంటూ సుస్మితా సేన్‌ను కొనియాడింది. ఈ పోస్ట్‌పై సుస్మితా సేన్ స్పందిస్తూ.. 'నువ్వు స్వచ్ఛమైన శక్తివి గౌరీ!!! నీవు శక్తివంతమైన ఉదాహరణగా ఉన్నందుకు ధన్యవాదాలు! మిమ్మల్ని, మీ సమాజాన్ని ఎల్లప్పుడు గౌరవిస్తాం.' అంటూ రాసుకొచ్చింది. మరాఠీ చిత్రనిర్మాత రవి జాదవ్ దర్శకత్వం వహిస్తున్న వెబ్ సిరీస్ 'తాలీ'. ఇందులో గౌరీ జీవిత ప్రయాణం, పోరాటాలను ఆరు ఎపిసోడ్లుగా తెరకెక్కిస్తున్నారు. సోహమ్ రాక్‌స్టార్ ఎంటర్టైన్మెంట్, మినీ ఫిల్మ్స్ ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. కాగా గౌరీ సావంత్ ముంబైకి చెందిన ట్రాన్స్‌జెండర్ యాక్టివిస్ట్. గణేష్‌గా పుట్టి ఆ తర్వాత లింగమార్పిడి చేయించుకున్న గౌరీ సావంత్ 2013లో ట్రాన్స్‌జెండర్స్‌ని కూడా పురుషులు, మహిళలు లాగే ఓ ప్రత్యేక కేటగిరి కల్పించాలని పిటిషన్ దాఖలు చేసింది. దీన్ని విచారించిన సుప్రీంకోర్టు ట్రాన్స్‌జెండర్స్‌ని థర్డ్‌జెండర్‌గా గుర్తిస్తూ 2014లో తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Shreegauri Sawant (@shreegaurisawant) -
సుష్మితా సేన్ లైవ్ వీడియోలో మాజీ బాయ్‌ఫ్రెండ్.. లలిత్ ఎక్కడ?
Sushmita Sen Parties With Her Ex Boyfriend Rohman Shawl: గత కొద్ది రోజులుగా మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్ వార్తల్లో ప్రధానంగా నిలుస్తూ వస్తోంది. సుష్మితా సేన్ తనతో డేటింగ్లో ఉందని వ్యాపారవేత్త, ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ జులై 14న సాయంత్రం సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. లలిత్‌తో సుష్మితా డేటింగ్ చేయడాన్ని పలువురు విమర్శిస్తే, కొంతమంది ఆమెకు మద్దుతుగా నిలిచారు. ఇదిలా ఉంటే వారు డేటింగ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసినప్పటి నుంచి వీరిద్దరూ ఏం చేసిన హాట్ టాపిక్‌గా మారింది. అయితే తాజాగా లలిత్ మోది ఎక్కడా అంటూ సుష్మితా సేన్‌పై ప్రశ్నల వర్షం కురింపించారు నెటిజన్లు. సుష్మితా సేన్ తల్లి సుభ్రా సేన్ ఆగస్టు 8న పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ వీడియోను పోస్ట్ చేసింది సుష్మితా సేన్. ఈ వీడియోలో సుష్మితా సేన్ ఎక్స్ బాయ్‌ఫ్రెండ్ రోహ్మాన్ షా దర్శనమిచ్చాడు. ఇది చూసిన నెటిజన్లు 'లలిత్ ఎక్కడ?', 'ఎక్కడ మోది?' అంటూ ప్రశ్నించారు. ఈ వీడియోలో సుష్మితా కూతుళ్లతో మాట్లాడుతూ కనిపించాడు రోహ్మాన్ షా. అలాగే సుష్మితా సేన్ లైవ్‌లో కనిపించమని అందరిని కోరినప్పుడు రోహ్మాన్ మాత్రం దూరంగా ఉండటాన్ని గమనించవచ్చు. కాగా తనకంటే 15 ఏళ్లు చిన్నవాడైన మోడల్ రోహ్మన్ షాతో సుష్మితా సేన్ మూడేళ్లు డేటింగ్ చేసిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Nikhil Rao (@bg0260) View this post on Instagram A post shared by Lalit Modi (@lalitkmodi) -
3 సార్లు పెళ్లి వరకు.. దేవుడు దయతో బయటపడ్డ: స్టార్ హీరోయిన్
Sushmita Sen Says Why She Never Get Married Till Now: మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హిందీ చిత్రసీమలో స్టార్ హీరోయిన్గా వెలుగొందిన సుస్మితా 'ఆర్య' వెబ్ సిరీస్‌తో మరోసారి తన మార్క్ చూపించింది. అంతకుముంచి ఇటీవల కాలంలో తన బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్ వార్తలతో మరింత పాపులర్ అయింది. తాజాగా ట్వింకిల్ ఖన్నా హోస్ట్ చేస్తున్న 'ట్వీక్ ఇండియా: ది ఐకాన్స్' కార్యక్రమంలో వివాహ బంధం గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది సుస్మితా సేన్. 'అదృష్టవశాత్తు నేను చాలా ఆసక్తికరమైన వ్యక్తులను కలుసుకున్నాను. కానీ నేను ఎప్పుడూ పెళ్లి చేసుకోకపోవడానికి ఏకైక కారణం వారు నిరాశ చెందటమే. దీనికి నా పిల్లలకు ఎలాంటి సంబంధం లేదు. నా పిల్లలతో నాకు ఎప్పుడు మంచి సాన్నిహిత్యమే ఉండేది. నా జీవితంలో వచ్చిన ప్రతి ఒక్కరిని ముక్తకంఠంతో అంగీకరించారు. ప్రతి ఒక్కరికీ సమానమైన ప్రేమ, గౌరవాన్ని ఇచ్చారు. ఇది చాలా సంతోషమైన విషయం. నిజానికి నేను సుమారు మూడు సార్లు పెళ్లి చేసుకునే పరిస్థితి ఏర్పడింది. మూడు సార్లు వివాహ బంధానికి అతి దగ్గరగా వెళ్లాను. కానీ ఆ దేవుడు నన్ను రక్షించాడు. వారి జీవితంలో జరిగిన విషయాలను నేను మీకు చెప్పలేను. కానీ దేవుడు నన్ను, నా పిల్లలను కాపాడుతున్నాడు. అతను ఎలాంటి చెడు బంధంలోకి వెళ్లనివ్వడు' అని సుస్మితా సేన్ తెలిపింది. చదవండి: ఫ్రెండ్‌తో బెడ్ షేర్.. అబార్షన్.. ఎలాంటి పశ్చాత్తాపం లేదు: నటి నగ్నంగా విజయ్ దేవరకొండ.. ఫొటో వైరల్ సుస్మితా సేన్ గతేడాది మోడలైన బాయ్‌ఫ్రెండ్ రోహ్మాన్తో బ్రేకప్ చేసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా సుస్మితా సేన్‌కు ఇద్దరు కుమార్తెలు. 2000 సంవత్సరంలో రెనీని, 2010లో అలీసాను దత్తత తీసుకుంది. 1994లో మిస్ యూనివర్స్ కిరీటాన్ని కైవసం చేసుకున్న సుస్మితా సేన్ 1996లో వచ్చిన 'దస్తక్' చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. తర్వాత బీవీ నెంబర్ 1, డు నాట్ డిస్టర్బ్, మై హూ నా, మైనే ప్యార్ క్యూ కియా, తుమ్కో నా భూల్ పాయేంగే, నో ప్రాబ్లమ్ వంటి చిత్రాలతో పాటు ఆర్య, ఆర్య 2 వెబ్ సిరీస్‌లో నటించి మెప్పించింది. చదవండి: నా రిలేషన్ గురించి దాచాలనుకోవట్లేదు: శ్రుతి హాసన్ తొలిసారిగా మోహన్ బాబు, మంచు లక్ష్మీల కాంబినేషన్.. View this post on Instagram A post shared by Sushmita Sen (@sushmitasen47) -
వారిద్దరు విడిపోయారా?!
మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ సోదరుడు రాజీవ్ సేన్ వైవాహిక బంధంలో కలతలు రేగినట్లు బీ-టౌన్లో టాక్ వినిపిస్తోంది. రాజీవ్, అతని భార్య చారు అసోపాల మధ్య దూరం పెరిగిందని, వారు విడిగా ఉంటున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. సోషల్ మీడియా అకౌంట్ల నుంచి దంపతులిద్దరు ఒకరినొకరు అన్‌ఫాలో కావడం సహా పెళ్లి ఫొటోలు డెలిట్ చేయడంతో వీటికి మరింత బలం చేకూరింది. కాగా గతేడాది జూన్‌లో మోడల్ రాజీవ్ సేన్, టీవీ నటి చారు అసోపా వివాహం గోవాలో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. (అవును.. మేం విడిపోయాం: నటి) ఈ క్రమంలో పెళ్లి జరిగిన ఆరు నెలల తర్వాత వీరి బంధం బీటలు వారినట్లు గతంలో ప్రచారం జరిగింది. ఈ విషయంపై ఇటీవల స్పందించిన రాజీవ్.. ‘‘ఇలాంటి వార్తలు ఎలా పుట్టుకొస్తాయో తెలియదు’’అంటూ విడాకుల విషయాన్ని ఖండించాడు. అంతేగాక తన భార్యతో కలిసి దిగిన ఇన్‌స్టాలో షేర్ చేసి వదంతులకు చెక్ పెట్టాడు. అయితే తాజాగా రాజీవ్ సోషల్ మీడియా అకౌంట్ల నుంచి పెళ్లి ఫొటోలు డెలిట్ చేయడం, చారు సైతం తన పేరు నుంచి రాజీవ్ ఇంటిపేరును తొలగించుకోవడంతో ఈ స్టార్ జంట మరోసారి వార్తల్లోకెక్కారు. ఈ నేపథ్యంలో రాజీవ్, చారుతో గొడవపడి ఢిల్లీకి వెళ్లిపోయాడని, తన అకౌంట్ల నుంచి ఆమెను బ్లాక్ చేశాడని గాసిప్‌రాయుళ్లు కథనాలు అల్లేస్తున్నారు. -
మురిపాల సముద్రం
సుస్మితా సేన్ తన పదేళ్ల చిన్న కూతురు అలీసాకు ఎప్పటికీ మర్చిపోలేని బర్త్ డే గిఫ్టును అందించారు. ఇటీవల అలీసా పుట్టిన సందర్భంగా ఆ చిన్నారిని మాల్దీవులకు తీసుకెళ్లి హిందూ మహాసముద్రంలో స్కూబా డైవింగ్ చేయించారు. ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టి, ‘‘నా కూతురు తన ఐదవ ఏట నుంచీ స్కూబా డైవింగ్ చేస్తానని అడుగుతోంది. నేనే తనకు మరింత వయసు రావడం కోసం ఆగాను’’ అని కామెంట్ పెట్టారు. డైవింగ్‌కి ముందు సుస్మిత అలీసాపై ఎన్ని ముద్దు మురిపాలు కురిపించారో చూడ్డం కోసమైనా ఈ వీడియోను చూడాల్సిందే. సుస్మితకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు రీనీ వయసు పందొమ్మిదేళ్లు. సుస్మిత వివాహం చేసుకోలేదు. ఇద్దరూ దత్త పుత్రికలు. -
24 ఏళ్లకే మాతృత్వాన్ని అనుభవించా..
ముంబై : మాతృత్వం చాలా గొప్పదని, తాను 24 సంవత్సరాలకే అమ్మతనాన్ని అనుభవించానని మాజీ మిస్ యూనివర్స్ సుస్మితాసేన్ అన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఇద్దరు కూతుర్లతో గడిపే ఫోటోలను నిత్యం పోస్ట్ చేస్తూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకునే ఈ 43 ఏళ్ల బాలీవుడ్ నటికి ఇంతవరకూ పెళ్లికాలేదు. ఈమె 24 ఏళ్ల వయసులోనే రెనీ అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు. 2010లో అలీసా అనే మరో అమ్మాయిని దత్తత తీసుకున్నారు. సుస్మితాసేన్ ఇటీవల ఓ విలేకరికి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కుటుంబ విషయాలను పంచుకున్నారు. దత్తత తీసుకోవడం సహజ మాతృత్వానికి ఏ మాత్రం తక్కువకాదని, సహజబంధం పేగు బంధం ద్వారా కనెక్ట్ అయితే.. దత్తత బంధం హృదయంతో కనెక్ట్ అయి ఉంటుందని తెలిపారు. ‘24 సంవత్సరాల వయసులోనే నేను తెలివైన నిర్ణయం తీసుకున్నాను. కొందరు ఇది ప్రచారం కోసం తీసుకున్న నిర్ణయం అని, దాతృత్వం ఓ నటన అని విమర్శించారు. కానీ, నా దృష్టితో చూస్తే దత్తత అనేది సహజంగా పుట్టిన బంధానికి ఏమాత్రం తీసిపోదు. దత్తతతో నేను హృదయం నుంచి జన్మనిచ్చిన తల్లిని అయ్యాను. మాతృత్వం అనుభవించడాన్ని నేను ఏ రోజు కోల్పోలేదు. నా పిల్లలకి కూడా దత్తత అనే భావన లేదు. వారికి పుట్టుక రెండు రకాలని చెప్పాను. ఒకటి సహజంగా జరిగేది. అది ఒక జీవశాస్త్ర సంబంధమైనది. అందరూ ఎవరో ఒకరి కడుపు నుంచి పుడతారు. కాని మీరు నా హృదయం నుంచి పుట్టిన వారు, అందుకే నాకు ప్రత్యేకమైనవారు’ అని చెప్పానని తెలిపారు. సుస్మితాసేన్ ప్రస్తుతం మోడల్ రోహ్మన్ షాల్‌తో డేటింగ్లో ఉంది. వీరు వచ్చే శీతాకాలంలో పెళ్లిచేసుకోబోతున్నారని బాలీవుడ్ సమాచారం. -
పెళ్లికి వేళాయె
గత ఏడాది బాలీవుడ్లో పెళ్లి బాజా 70 ఎమ్ఎమ్ డీటీఎస్ సౌండ్‌లో మోగినట్లు మోగింది. బాలీవుడ్ కథానాయికలు ప్రియాంకా చోప్రా, దీపికా పదుకోన్, నేహా ధూపియాలతో పాటు మరికొందరు మెట్టినింట అడుగుపెట్టారు. తాజాగా సుస్మితాసేన్ పెళ్లి ఘడియలు దగ్గరపడ్డాయని తెలుస్తోంది. మోడల్ రోహమాన్ షా, సుస్మితా ప్రేమలో ఉన్నారనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ క్లోజ్‌గా ఉన్న ఫొటోలు నెటిజన్లకు బాగానే దర్శనమిస్తున్నాయి. త్వరలో ఈ ఇద్దరూ ఏడడుగులు వేయాలని నిర్ణయించుకున్నారట. ఈ ఏడాది నవంబర్‌లో పెళ్లి జరగనుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. రోహమాన్ షా వయసురీత్యా సుస్మితా కన్నా దాదాపు పదిహేనేళ్లు చిన్నవాడు కావడం విశేషం. -
చిత్రం చెప్పింది
ప్రేమలో ఉన్నవాళ్లంతా పెళ్లి చేసుకుంటారని చెప్పలేం. లవ్‌కి బ్రేకప్ చెప్పుకునే జంటలు ఉంటాయి. ఇప్పుడు అందాల తార సుస్మితా సేన్ తన బాయ్‌ఫ్రెండ్ రోహ్మన్తో లవ్‌కి కటీఫ్ చెప్పారన్నది కొందరి ఊహ. ఆ ఊహ తప్పని ఇక్కడున్న చిత్రం చెప్పింది. చిత్రం అంటే ఫొటో అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ఫొటోని స్వయంగా సుస్మితా సేన్ విడుదల చేశారు. రోహ్మన్తో కలసి తాను జిమ్ చేస్తున్న ఫొటోను ఆమె బయటపెట్టారు. ఈ ఫొటో చాలు.. ఈ ఇద్దరూ విడిపోలేదని చెప్పడానికి. మరి పెళ్లెప్పుడూ అంటే.. ఇద్దరూ చేసుకున్నప్పుడు. ఆ విషయం గురించి మౌనం వహిస్తున్న ఈ ఇద్దరూ పార్టీల్లో, రెస్టారెంటుల్లో.. ఇలా చాలా చోట్ల జాయింట్‌గా కనిపిస్తున్నారు. -
‘మిస్ వరల్డ్ చేతికి ముద్దు పెట్టి.. ఆల్ ది బెస్ట్..’
హరియణాకు చెందిన 20 ఏళ్ల ‘మిస్ ఇండియా’ మానుషి ఛిల్లర్.. మిస్ వరల్డ్ 2017 టైటిల్‌ను సాధించి భారతదేశ ఖ్యాతిని చాటి చెప్పింది. మిస్ వరల్డ్ మానుషి.. మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్‌ను విమానంలో కలిశారు. ఆమె మిస్ వరల్డ్ పోటీలకు రెడీ అవుతున్న సమయంలో వీరి కలయిక జరిగింది. ఈ బామలు ఇద్దరు కలిసి మాట్లాడుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో వారిద్దరూ మాట్లాడుకున్న తీరు అందరినీ ఆకర్షించింది. మానుషి.. ‘సుస్మితాను చూసి షాక్‌కు గురయ్యాను. ఆమె నన్ను అభిమానంతో’ పలకరించారు. అంతేకాక మానుషికి సుస్మితా సేన్ ఐడియాలిస్తూ.. ‘ మన వంతు ప్రయత్నాం మనం చేయాలి.. మిగతాది దేవుడి మీద భారం వేయాలని.. ఆల్ ది బెస్ట్’ అని చెబుతూ మానుషి చేతికి ముద్దు పెట్టిన వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. సుస్మితా సేన్ 1994 సంవత్సరంలోనే ఫెమినా మిస్ ఇండియా, మిస్ యూనివర్స్ టైటిల్‌లను కైవసం చేసుకున్నారు. ప్రపంచ అందగత్తెలంతా సొంతం చేసుకునేందుకు ఎంతగానే పరితపించే ప్రపంచ సుందరి కిరీటం 17 ఏళ్ల అనంతరం భారత్ వశమైంది. -
‘మిస్ వరల్డ్ చేతికి ముద్దు పెట్టి.. ఆల్ ది బెస్ట్..’
-
స్క్రీన్ టెస్ట్
► ఈ నటుని అసలు పేరు కొచ్చర్ల దయారత్నం. కె. బాలచందర్ తొలి కోడి కూసింది’ సినిమా కోసం ఆయన పేరు మార్చారు? ఆ నటుడెవరు? ఎ) రఘువరన్ బి) ప్రకాశ్‌రాజ్ సి) జీవా డి) రమేశ్ అరవింద్ ► రియల్ లైఫ్ కపుల్ అయిన కృష్ణ, విజయనిర్మల రీల్‌పై అన్నా చెల్లెళ్లుగా నటించిన సినిమా పేరేంటి? ఎ) బొమ్మలు చెప్పిన కథ బి) అల్లూరి సీతారామరాజు సి) పండంటి కాపురం డి) సాక్షి ► బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్‌తో కలిసి ‘మెన్ ఎగైనెస్ట్ రేప్ అండ్ డిస్క్రిమినేషన్’ (మర్ద్) అని ఒక క్యాంపైన్ నిర్వహించారు? ఈ క్యాంపైన్‌కి తన వాయిస్ వినిపించిన తెలుగు టాప్ హీరో ఎవరు? ఎ) ప్రభాస్ బి) నాని సి) మహేశ్‌బాబు డి) రామ్‌చరణ్ ► గౌతమ్ ఘోష్ దర్శకత్వం వహించిన ‘మాభూమి’ చిత్రం ద్వారా పరిచయమైన ఈ సహాయనటి తర్వాత కాలంలో చాలా పేరు తెచ్చుకున్నారు? ఆమె ఎవరై ఉంటారు? ఎ) సుద బి) తెలంగాణ శకుంతల సి) అల్లరి సుభాషిణి డి) ప్రగతి ► ‘వినవే బాల నా ప్రేమ గోల..’ అంటూ ఈ నటుడు పాడిన పాటను ఇప్పటికీ ప్రేమికులు పాడుకుంటూనే ఉంటారు? ఈ పాట పడిన నటుడెవరు? ఎ) రమణారెడ్డి బి) రేలంగి సి) పద్మనాభం డి) రాజనాల ► ‘అబ్బాయిగారు’లో వెంకటేశ్ సవతి తల్లిగా నటించిన జయచిత్ర కథానాయికగా నటించిన తొలి తెలుగు సినిమా? ఎ) భారతంలో ఒక అమ్మాయి బి) యవ్వనం కాటేసింది సి) చిల్లరకొట్టు చిట్టెమ్మ డి) సోగ్గాడు ► తెలుగు ‘ప్రేమఖైదీ’లో హరీష్ హీరో. అదే సినిమా హిందీ రీమేక్‌లో కూడా అతనే హీరో. హిందీ సినిమాలో అతనితో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ బాలీవుడ్ నటితర్వాత చాలా పెద్ద స్టార్ అయ్యారు? ఆమె ఎవరు? ఎ) మాధురీ దీక్షిత్ బి) కరీనా కపూర్ సి) కరిష్మా కపూర్ డి) టబు ► ‘కష్టపడకుండా ఏదీ రాదు, కష్టపడకుండా వచ్చింది ఏదీ ఉండదు’ అని రజనీకాంత్ ఏ సినిమాలో చెప్తాడు? ఎ) భాష బి) అరుణాచలం సి) నరసింహా డి) శివాజి ► దర్శక మేధావి ‘జెంటిల్మెన్ శంకర్’ ఏం చదువుకున్నారో తెలుసా? ఎ) మెకానికల్ ఇంజనీర్ బి) లా సి) లెదర్ టెక్నాలజీ డి) టక్స్‌టైల్ డిజైనింగ్ ► శ్రుతీహాసన్ ట్విట్టర్ ఐడీ ఏంటో కనుక్కోండి? ఎ) @యువర్స్ ట్రూలీ శ్రుతి బి) @ శ్రుతీహాసన్ సి) @ మీ శ్రుతీహాసన్ డి) @ శ్రుతీ సేస్ ► 2009లో ‘మిస్ టీన్ వరల్డ్’ టైటిల్ నెగ్గిన హీరోయిన్ ఎవరో తెలుసా? ఎ) ఐశ్వర్యా రాయ్ బి) సుస్మితా సేన్ సి) అమీ జాక్సన్ డి) ఆండ్రియా ► అంతస్తులు చిత్రంలో ‘దులపర బుల్లోడా దుమ్ము దులపర బుల్లోడా’అంటూ హుషారెత్తించిన కథానాయిక ఎవరో గుర్తున్నారా? ఎ) జమున బి) బి. సరోజా దేవి సి) భానుమతి డి) కృష్ణకుమారి ► ‘ఇంతేనయా తెలుసుకోవయా, ఈ లోకం ఇంతేనయా’ అనే పాట రాసిన రచయిత ఎవరు? ఎ) దాశరథి బి) వేటూరి సుందర రామ్మూర్తి సి) సముద్రాల డి) ఘంటసాల ► మహా శక్తిమాన్’ అనే హిందీ త్రీడి ఫిలిమ్‌కి దర్శకత్వం వహించింది ఓ ప్రముఖ తెలుగు కెమేరామేన్? ఆయనెవరు? ఎ) వి.యస్.ఆర్. స్వామి బి) ఎస్. గోపాల్‌రెడ్డి సి) జయనన్ విన్సెంట్ డి) జయరామ్ ► దర్శక–నిర్మాతగుణశేఖర్ దర్శకత్వం వహించిన మొదటి సినిమా ఏంటో తెలుసా? ఎ) సొగసు చూడతరమా బి) రామాయణం సి) లాఠీ డి) చూడాలని ఉంది ► పరుచూరి బ్రదర్స్ రచయితలుగా ఏ హీరోతో ఎక్కువ సినిమాలకు పనిచేశారు? ఎ) కృష్ణ బి) బాలకృష్ణ సి) చిరంజీవి డి) నాగార్జున ► యం.యం. కీరవాణి ఏ సంగీత దర్శకుని దగ్గర శిష్యరికం చేశారో చెప్పుకోండి చూద్దాం? ఎ) కేవీ మహదేవన్ బి) ఇళయరాజా సి) యం.ఎస్. విశ్వనాథన్ డి) చక్రవర్తి ► ఎన్టీఆర్, ఛాయాదేవి ఉన్న ఈ స్టిల్ ఏ సినిమాలోనిది? ఎ) కన్యాశుల్కం బి) శకుంతల సి) విజయం మనదే డి) మంగళసూత్రం ► నటుడు మంచు విష్ణు ఏ క్రీడలో యూనివర్సిటీ కెప్టెన్‌గా వ్యవహరించారు? ఎ) వాలీబాల్ బి) బాస్కెట్‌బాల్ సి) క్రికెట్ డి) హాకి ► ఈ క్రింది ఫోటోలోని బాలుణ్ణి గుర్తుపట్టారా? ఎవరతను? ఎ) అక్కినేని నాగేశ్వరరావు బి) అక్కినేని నాగార్జున సి) కాంతారావు డి) హరనాథ్‌బాబు మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) సి 2) ఎ 3) సి 4) బి 5) బి 6) డి 7) సి 8) సి 9) ఎ 10) బి 11) సి 12) సి 13) ఎ 14 ) ఎ 15) సి 16) ఎ 17) డి 18) ఎ 19) బి 20) ఎ -
ఫిట్‌గా తయారయ్యాను!
మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ సినిమాల్లో నటించి దాదాపు మూడేళ్లు పైనే అయ్యింది. కానీ, ఈ ఏడాది మాత్రం తన కెరీర్‌ని సీరియస్‌గా తీసుకున్నారామె. అందుకే, కొంచెం బరువు కూడా తగ్గారు. తను నటించబోయే రెండు సినిమాలను త్వరలో ప్రకటించబోతున్నారు సుస్మితా. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ -‘‘వాస్తవానికి ఓ ఏడాదిగా నేను సినిమాల్లో యాక్ట్ చేయాలనుకుంటున్నాను, అందుకే బరువు తగ్గాను. ఇంతకుముందులా ఫిట్‌గా తయారయ్యాను. ఈ ఏడాది వ్యక్తిగతంగా, వృత్తిపరంగా నాకు చాలా బాగుంటుందనే నమ్మకం ఉంది. అందుకే, 2014 నాదే అని ధీమాగా చెబుతున్నా. నేను చేయబోయే రెండు సినిమాల్లో ఒకటి జూలైలో మొదలవుతుంది. ఆ తర్వాత రెండో సినిమా ప్రారంభమవుతుంది. ఈ ఏడాది నటిగానే కాదు.. ఓ తల్లిగా కూడా నా బిడ్డల భవిష్యత్తుని మరింత పటిష్టంగా ప్లాన్ చేయాలనుకుంటున్నా’’ అని తెలిపారు. 2000లో ఓ పాపను, ఆ తర్వాత పదేళ్లకు మరో పాపను సుస్మితా దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. వీళ్లని తన కన్నబిడ్డల్లా చూసుకుంటున్నారామె. రీనీ, అలీషా తనకు రెండు కళ్లు అని కూడా ఆమె పేర్కొన్నారు.