Randeep Hooda Spoke About His Breakup With Sushmita Sen - Sakshi
Sakshi News home page

Randeep Hooda: 'మాజీ మిస్ యూనివర్స్‌తో బ్రేకప్.. నా మంచి కోసమే జరిగింది'

Published Sun, Aug 20 2023 6:12 PM | Last Updated on Mon, Aug 21 2023 8:42 PM

Randeep Hooda Spoke About His Breakup With Sushmita Sen - Sakshi

మాన్‌సూన్  వెడ్డింగ్ హాలీవుడ్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన నటుడు రణదీప్ హుడా. ఆ తర్వాత పలు బాలీవుడ్ చిత్రాలతో స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు.  తాజాగా ఈ రోజు రణ్‌దీప్ 47వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. అయితే అప్పట్లో మాజీ మిస్ యూనివర్స్, సుస్మితాసేన్‌తో డేటింగ్‌లో ఉండడం అందరినీ దృష్టని ఆకర్షించింది. బాలీవుడ్‌లో వీరిద్దరి రిలేషన్‌ హాట్ టాపిక్‌గా మారింది.  2006 నుంచి దాదాపు మూడేళ్ల పాటు డేటింగ్ ఈ జంట వార్తల్లో నిలిచారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రణదీప్‌ హుడా సుస్మితాసేన్‌తో రిలేషన్‌ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆమెతో బ్రేకప్ కావడంపై రణ్‌దీప్ స్పందించారు. 

(ఇది చదవండి: మూడేళ్ల గ్యాప్‌, అయినా తగ్గేదేలే.. రెమ్యునరేషన్‌ డబుల్‌..)

రణ్‌దీప్ హుడా మాట్లాడుతూ..' నేను 'మిస్ యూనివర్స్ సుస్మితా సేన్‌తో రిలేషన్‌లో లేను. అంతే కాదు ఆమెపై నాకు ఏ విధంగానూ ఫీలింగ్స్ లేవు. సుస్మిత సేన్ జీవితంలోకి నేను వెళ్లకూడదని కోరుకున్నందున.. నా జీవితంలో కేవలం ఒక థియేటర్ రిహార్సల్‌ను మాత్రమే కోల్పోయాను. నా విలువల పరంగా ఇది నేను చేసిన చెత్త పని అని భావించా. కానీ ఆమెతో బ్రేకప్ కావడం నాకు మంచే జరిగింది. ఎందుకంటే నేను పెద్ద స్టార్‌ను కూడా కాదు. కొన్నిసార్లు తాము అనుకున్న సొంత మార్గాల్లోనే వెళ్లడం ఉత్తమమైన పని. ఆ తర్వాతే నేనేంటో నాకు తెలుసొచ్చింది.' అని అన్నారు.

అయితే సుస్మితా సేన్‌తో బ్రేకప్ తర్వాత  కెరీర్‌లో బిజీగా మారిపోయారు. రణదీప్ హుడా ప్రస్తుతం 'స్వతంత్ర వీర్ సావర్కర్', 'లాల్ రంగ్ 2' చిత్రాలతో బిజీగా ఉన్నారు.  మరోవైపు, సుస్మితా సేన్ ఇటీవలే విడుదలైన 'తాలీ' వెబ్ సిరీస్‌తో ప్రశంసలు అందుకుంటోంది. ఈ సిరీస్‌లో ట్రాన్స్‌జెండర్స్ హక్కుల కోసం పోరాడే పాత్రలో కనిపించింది. 

(ఇది చదవండి: అప్పు ఎగ్గొట్టిన స్టార్ హీరో.. వేలానికి ఖరీదైన విల్లా!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement