
Sushmita Sen Parties With Her Ex Boyfriend Rohman Shawl: గత కొద్ది రోజులుగా మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్ వార్తల్లో ప్రధానంగా నిలుస్తూ వస్తోంది. సుష్మితా సేన్ తనతో డేటింగ్‌లో ఉందని వ్యాపారవేత్త, ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ జులై 14న సాయంత్రం సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. లలిత్‌తో సుష్మితా డేటింగ్ చేయడాన్ని పలువురు విమర్శిస్తే, కొంతమంది ఆమెకు మద్దుతుగా నిలిచారు. ఇదిలా ఉంటే వారు డేటింగ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసినప్పటి నుంచి వీరిద్దరూ ఏం చేసిన హాట్ టాపిక్‌గా మారింది. అయితే తాజాగా లలిత్ మోది ఎక్కడా అంటూ సుష్మితా సేన్‌పై ప్రశ్నల వర్షం కురింపించారు నెటిజన్లు.
సుష్మితా సేన్ తల్లి సుభ్రా సేన్ ఆగస్టు 8న పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ వీడియోను పోస్ట్ చేసింది సుష్మితా సేన్. ఈ వీడియోలో సుష్మితా సేన్ ఎక్స్ బాయ్‌ఫ్రెండ్ రోహ్మాన్ షా దర్శనమిచ్చాడు. ఇది చూసిన నెటిజన్లు 'లలిత్ ఎక్కడ?', 'ఎక్కడ మోది?' అంటూ ప్రశ్నించారు. ఈ వీడియోలో సుష్మితా కూతుళ్లతో మాట్లాడుతూ కనిపించాడు రోహ్మాన్ షా. అలాగే సుష్మితా సేన్ లైవ్‌లో కనిపించమని అందరిని కోరినప్పుడు రోహ్మాన్ మాత్రం దూరంగా ఉండటాన్ని గమనించవచ్చు. కాగా తనకంటే 15 ఏళ్లు చిన్నవాడైన మోడల్ రోహ్మన్ షాతో సుష్మితా సేన్ మూడేళ్లు డేటింగ్ చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment