బాలీవుడ్ నటి సుస్మితా సేన్ తాజాగా ‘తాలీ’ వెబ్ సీరిస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరి ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం ఇది జియో టీవీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సీరిస్ ట్రైలర్ విడుదలైనప్పుడు తీవ్రంగా విమర్శలు ఎదుర్కొన్న ఆమె ఇందులో ట్రాన్స్‌జెండర్‌గా అద్భుతంగా నటించి విమర్శించిన వారికి సమాధానం చెప్పారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినీ జర్నీ ఎలా ముగిసింది. అప్పుడు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంది. అనే అంశాలపై సుస్మిత కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సుస్మితా సేన్ తన కుమార్తె యొక్క ఆరోగ్య సమస్యల గురించే కాకుండా తన బిడ్డ పట్ల ఎలాంటి విధులను నిర్వహించింది అనే దాని గురించి మాట్లాడారు. ఒక సంఘటనను గుర్తుచేసుకుంటూ..
ఈ సంఘటనతో సినిమాలకు దూరం
సుస్మితా సేన్‌కు 24 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఒక కుమార్తెను దత్తత తీసుకుంది. ఆ సమయంలో తన తల్లి వద్దని వారించినా మెండిగా నిర్ణయం తీసుకుంది. అప్పుడు ఆమెకు పలు భారీ సినిమా అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో పలువురు సన్నిహితులు కూడా వద్దని చెప్పినా సుస్మిత మనుసు మార్చుకోలేదు. కుమార్తెను దత్తత తీసుకుంది. ఆ తర్వాత ఏం జరిగిందో ఇలా చెప్పింది. 'రెనీ నా జీవితంలోకి వచ్చినప్పుడు తన ఆరోగ్యం మెరుగ్గాలేదు. అదే సమయంలో నేను కెనడాలో ఉన్నాను. అక్షయ్ కుమార్, కరీనాతో కలిసి ఒక సినిమా చిత్రీకరణలో ఉన్నాను. పాపను అలా వదిలి రావడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు.. కానీ తప్పలేదు.
(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి' ప్రాజెక్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రాజమౌళి)
అలా షూటింగ్‌లో ఉండగా నా తండ్రి నుంచి ఫోన్ వచ్చింది. పాపకు సీరియస్‌గా ఉంది. ఆస్పత్రిలో చేర్పించామని నాన్న చెప్పాడు. అలాంటి సమయంలో నేను షూటింగ్‌లో పాల్గొనలేకపోయాను. తనను నేను నవమాసాలు మోసి కనకపోయినా అంతే సమానమైన బంధం రెనీతో ఉంది. దీంతో సినిమా షూటింగ్‌లో ఒక్క క్షణం ఉండలేకపోయాను.. సెట్‌లో అందరి ముందు విషయం చెప్పి కెనడా నుంచి తిరిగి ముంబయ్‌కు బయల్దేరాను. విదేశాల్లో షూటింగ్‌లో ఉన్న నేను సినిమాను మధ్యలో ఆపేసి వచ్చేశాను. ఆ క్షణమే నాకు తెలుసు నా సినిమా కెరీర్ ఇక్కడితో ముగిసిందని.
అప్పట్లో నాకు కెరీర్‌పై సీరియస్‌నెస్ లేదని, అందుకే 24 ఏళ్లకే తల్లినయ్యానని కామెంట్స్ చేసేవారు ఎందరో. దీంతో నా పనిలో ఇంకా ఎక్కువ కష్టపడేదానిని కానీ, అప్పటికే నాకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది.’ అని సుస్మిత తెలిపింది. 1994లో విశ్వ సుందరిగా నెగ్గిన సుష్మితా సేన్ బాలీవుడ్‌తో పాటు తెలుగు సినిమాల్లో కూడా నటించింది. తర్వాత ఆమెకు పెద్దగా సినిమా అవకాశాలు రాలేదు.
(ఇదీ చదవండి: అందరిలా నేనెందుకు ఆనందంగా లేనంటే: టాప్ హీరోయిన్)
భారత మెగా టీ20 క్రికెట్ లీగ్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీతో కొంత కాలం సుష్మిత డేటింగ్‌లో ఉన్నారు. సుష్మితా సేన్ చేసిన సామాజిక సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా 2013లో మదర్ థెరిసా అంతర్జాతీయ అవార్డును ఆమె పొందింది. ప్రస్తుతం ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిద్దరూ కూడా దత్తత తీసుకున్నవారే కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment