'పెళ్లైతే చేసుకుంటా.. కానీ మాజీ బాయ్‌ఫ్రెండ్స్‌తో'.. హీరోయిన్ | Sushmita Sen opens up about wedding plans Goies Viral | Sakshi
Sakshi News home page

Sushmita Sen: 'పెళ్లయినా మాజీలతో అలానే ఉంటా'.. సుస్మితా సేన్ ఆసక్తికర కామెంట్స్!

Apr 5 2024 8:00 PM | Updated on Apr 6 2024 3:48 PM

Sushmita Sen opens up about wedding plans Goies Viral - Sakshi

బాలీవుడ్ స్టార్ హీరోయిన్, మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ పరిచయం అక్కర్లేని పేరు. గతేడాది తాలి, ఆర్య-3 వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులను అలరించింది. అయితే ఇప్పటి వరకు పెళ్లి చేసుకోని ప్రపంచసుందరి చాలాసార్లు డేటింగ్‌ రూమర్స్ వినిపించాయి. అంతే కాదు.. ఐపీఎల్‌ మాజీ ఛైర్మన్‌తో లలిత్‌ మోదీతో కొంత కాలం సుష్మిత డేటింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. 

గతేడాది దీపావళి సందర్భంగా సుస్మిత తన మాజీ ప్రియుడు రోహ్మాన్ షాల్‌తో కనిపించింది. 2022లోనే వీరిద్దరికీ  బ్రేకప్ అయినప్పటికీ.. చాలా సందర్భాల్లో జంటగా కనిపించారు. దీంతో మరోసారి సుస్మిత సేన్‌పై పెళ్లి వార్తలొచ్చాయి. దీంతో మరోసారి వ్యక్తిగత విషయాలతో వార్తల్లో నిలిచింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె తన పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. మీ లైఫ్‌లో బ్రేకప్‌ అయినప్పుడు ప్రశ్నించగా.. సుస్మిత తనదైన శైలిలో సమాధానాలిచ్చింది. 

సుస్మిత మాట్లాడుతూ..'నా జీవితం తెరిచిన పుస్తకం లాంటిది. నేను చాలా నిజాయితీగా, నిర్భయంగా జీవిస్తున్నా. గౌరవం అనేది మన జీవితంలో ఒక అంశం మాత్రమే కాదు. అది మీరంటే ఏంటో నిర్ణయిస్తుంది. కాబట్టి మనం తీసుకునే నిర్ణయాలు బాధపెట్టాయా? లేదా ద్రోహం చేశాయా? లేదా మీరు మనం ఏదైనా తప్పు చేశామా? అన్నవి నేను పెద్దగా పట్టించుకోను. జీవితంలో ఎదురయ్యే వాటి నుంచి పాఠాలు నేర్చుకోవడం.. ముందుకు సాగడమేనని' చెప్పుకొచ్చింది. ఒకవేళ మీరు పెళ్లి చేసుకుంటే.. మాజీలతో స్నేహితులుగా ఉండగలరా? అని యాంకర్ ప్రశ్నించారు.  

దీనిపై సుస్మిత మాట్లాడుతూ..'కచ్చితంగా వారితో ఫ్రెండ్లీగానే ఉంటాను. కానీ కాస్తా కష్టంగానే ఉంటుందని భావిస్తున్నా. చాలా మంది తమ మాజీలతో అలానే ఉంటారు. కానీ ఇక్కడ వారితో లిమిట్స్‌ ఉంటాయా అనే విషయమైతే తెలియదు. కానీ అది సాధ్యమే. ఇలాంటివీ నేను చూశాను కూడా. ఎందుకంటే ప్రస్తుతం నా జీవితంలో సంతోషంగా ఉన్నా. పెళ్లి చేసుకోవడానికి కావాల్సింది సరైన సమయం, కారణం కాదు. నాకు తగినట్లుదా సరైన వ్యక్తి దొరికితే   కచ్చితంగా పెళ్లి చేసుకుంటా' అని తెలిపింది.

సుస్మితా సేన్ రిలేషన్స్‌

సుస్మిత సేన్  మొదట బాలీవుడ్‌ నటుడు రణ్‌దీప్ హుడాతో డేటింగ్‌లో ఉన్నారు. ఆ తర్వాతమోడల్ రోహ్‌మన్ షాల్‌తో 2018 నుండి 2021 వరకు మూడేళ్ల పాటు ప్రేమాయణం కొనసాగించారు. ఆ తర్వాతవ్యాపారవేత్త, ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement