Live video
-
‘స్వర్గంలో ఎంజాయ్ చేస్తున్నా’.. జైలు నుంచి హత్య కేసు ఖైదీ వీడియో
లక్నో: ఓ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ జైలు నుంచి సోషల్ మీడియాలో లైవ్ వీడియో స్ట్రీమింగ్ చేసిన ఘటన కలకలం రేపుతోంది. ‘జైలు స్వర్గంలా ఉందని, తన జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నానని చెబుతున్న వీడియో ప్రస్తుతం నెట్టింటా వైరల్‌గా మారింది. . ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలి సెంట్రల్ జైలులో ఈ ఘటన వెలుగు చూసింది. వివరాలు.. బరేలీ సెంట్రల్ జైలులో సోషల్ మీడియా ద్వారా ఆసిఫ్ అనే ఖైదీ వీడియో స్ట్రీమింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. రెండు నిమిషాల ఈ వీడియోలో ‘జైలు స్వర్గంలా ఉంది. ఇక్కడ జీవితాన్ని ఆస్వాదిస్తున్నా. త్వరలోనే బయటికి వస్తా’ అంటూ అతడు పేర్కొన్నాడు. కాగా 2019 డిసెంబర్ 2న ఢిల్లీలోని షాజహాన్‌పూర్‌లోని సదర్ బజార్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో. రాకేష్ యాదవ్ అనే కాంట్రాక్టర్‌ను హత్య చేసిన కేసులో ఆసిఫ్ శిక్ష అనుభవిస్తున్నాడు. జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ చేతికి ఫోన్ రావడంతో అక్కడి సిబ్బంది పనితీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో రాకేష్ సోదరుడు జిల్లా మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా జైలు అధికారులు ఆసిఫ్‌కు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని జిల్లా మేజిస్ట్రేట్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై యూపీ జైళ్లశాఖ డీఐజీ కుంత్ కిశోర్ స్పందించారు. ఈ వీడియో తమ దృష్టి వచ్చిందని.. దర్యాప్తు జరుగుతున్నట్లు వెల్లడించారు. పూర్తి విచారణ అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. చదవండి: కాంగ్రెస్‌కు సవాల్.. బీజేపీలో చేరిన ప్రణీత్ కౌర్ रामराज्य हैं उत्तर प्रदेश बरेली जेल में बन्द जेल में बंद आरोपी का वीडियो वायरल PWD ठेकेदार हत्याकांड का आरोपी जेल में है बंद जेल में बंद आरोपी का लाइव वीडियो चैट वायरल,, pic.twitter.com/8yZOg1m2xK— Mαɳιʂԋ Kυɱαɾ αԃʋσƈαƚҽ 🇮🇳🇮🇳 (@Manishkumarttp) March 14, 2024 -
లాభాలు లేక చేతులెత్తేసిన అమెజాన్.. మరోసారి భారీగా ఉద్యోగుల తొలగింపు!
ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ కొత్త ఏడాది 2024లో చేతులెత్తేసింది. ఏడాది ప్రారంభంలోనే ఉద్యోగుల్ని తొలగిస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది. ఆ సంస్థ పేరెంట్ కంపెనీ వీడియో లైవ్ స్ట్రీమ్ సర్వీసులు అందించే ‘ట్విచ్’ ఉద్యోగుల్ని ఫైర్ చేసింది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం..అమెజాన్ ట్విచ్‌లో 35 శాతంతో 500 మంది ఉద్యోగల తొలగింపులపై నిర్ణయం తీసుకుంది. వీడియో లైవ్ స్ట్రీమ్ సేవలు మరింత ఖర్చుతో కూడుకున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ లేఆఫ్స్ సైతం ట్విచ్‌లో ఉన్నత స్థాయి ఉద్యోగులు ఒక్కొక్కరిగా సంస్థను వదిలి వెళ్లిన తర్వాత తెరపైకి రావడం చర్చాంశనీయంగా మారింది. ఒక్కొక్కరిగా గత ఏడాదిలో ట్విచ్‌లో టాప్ ఎగ్జిక్యూటీవ్‌లు ఆ సంస్థకు గుడ్‌బై చెప్పారు. వారిలో ట్విచ్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్, చీఫ్ కస్టమర్ ఆఫీసర్, చీఫ్ కంటెంట్ ఆఫీసర్‌తో పాటు గతంలో అమెజాన్ యాడ్స్ యూనిట్లో పనిచేసిన చీఫ్ రెవెన్యూ ఆఫీసర్ సైతం ట్విచ్‌కు రాజీనామా చేశారు. తాజాగా ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. కారణం అదే డిసెంబర్లో ట్విచ్ సీఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాన్ క్లాన్సీ దక్షిణ కొరియాలో కంపెనీ కార్యకలాపాలను నిలిపివేస్తుందని, పెరిగిపోతున్న ఖర్చుల కారణంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. పెట్టుబడులు ఎక్కువ పెట్టడం.. తిరిగి రాబడులు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఉద్యోగుల్ని తొలగించింది.ఈ సందర్భంగా సీఈఓ మాట్లాడుతూ ‘‘ట్విచ్ నెలకు 1.8 బిలియన్ గంటల ప్రత్యక్ష వీడియో కంటెంట్‌కు సపోర్ట్ చేసేలా భారీ స్థాయిలో వెబ్సైట్లను నిర్వహించడం చాలా ఖరీదైనవని అన్నారు. తొమ్మిదేళ్ల తర్వాత అమెజాన్ 2014లో వీడియో స్ట్రీమింగ్ సర్వీసులు అందించే ట్విచ్‌ను 970 మిలియన్ డాలర్లను వెచ్చించి ఆ సంస్థను కొనుగులో చేసింది. ఈ కొనుగోలు జరిగిన తొమ్మిదేళ్లకు ట్విచ్‌తో పాటు లాభదాయకంగా లేదని ఉద్యోగులకు పింక్ స్లిప్ జారీ చేసిందని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. ఏమాత్రం లాభం లేని ట్విచ్‌లో నష్టాల్ని తగ్గించుకునేందుకు అమెజాన్ గత ఏడాది రెండు సార్లు 400 మందిని తొలగించింది. తాజాగా మరో 500 మందిని ఇంటికి పంపింది. అమెజాన్‌లో 27 వేల మంది ఉద్యోగులు ఆన్లైన్ రిటైల్ దిగ్గజం 2022లో ప్రపంచ వ్యాప్తంగా 27వేల మందికి ఫైర్ చేసిన విషయం తెలిసిందే. -
పేకమేడలా కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం ఉదయం ఓ భవనం పేకమేడలా కుప్పకూలిపోయింది. ఉత్తర ఢిల్లీలోని శాస్త్రీ నగర్లో నాలుగు అంతస్తుల భవనం ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో స్థానికులు భయంతో పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసు, అగ్ని మాపక విభాగాలు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని అంబులెన్స్ సాయంతో స్థానిక ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదాన్ని గ్రహించి ముందుగానే భవనాన్ని ఖాళీ చేయించటం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. భవనాన్ని కూల్చాలని గతంలోనే నోటీసులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. భవనం కూలిపోతున్న వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. #WATCH | A four-storey building collapsed in North Delhi's Shastri Nagar. There was no loss of life as the house was already empty. As soon as the information was received, vehicles of Delhi Police, Fire and Ambulance reached the spot. (Video Source: Local, confirmed by Police) pic.twitter.com/WLTdt8lvl8 — ANI (@ANI) December 5, 2022 ఇదీ చదవండి: బీజేపీతో టచ్‌లో 45మంది టీఎంసీ ఎమ్మెల్యేలు: కేంద్ర మంత్రి -
పట్టాలు తప్పినా వేగంగా దూసుకొచ్చిన రైలు.. జనం పరుగులు!
పాట్నా: బొగ్గు లోడుతో వెళ్తున్న ఓ రైలు బిహార్‌లో పట్టాలు తప్పింది. గుర్పా రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు 53 బోగీలు పట్టాలు తప్పి బోల్తా పడ్డాయి. దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లను దారి మళ్లించారు అధికారులు. ఈస్ట్ సెంట్రల్ రైల్వే, ధన్‌బాద్ డివిజన్ పరిధిలోని కొడెర్మా-మన్పూర్ రైల్వే స్టేషన్ల మధ్య బుధవారం తెల్లవారుజామున 6.24 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ‘బొగ్గు లోడుతో వెళ్తున్న రైలు బోగీలు పట్టాలు తప్పేందుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. బోగీలను తొలగించి రాకపోకలను పునరుద్ధరించేందుకు రైల్వే బృందాలు కృషి చేస్తున్నాయి.’ అని ఈసీఆర్ జోన్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. గూడ్స్ రైలు పట్టాలు తప్పిన క్రమంలో అధికారులు అప్రమత్తమవటంతో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదన్నారు. 10 రైళ్లను దారి మళ్లించామని, నాలుగు రైళ్లు రద్దు చేశామని చెప్పారు. A goods train derails between Koderma and Manpur railway stations under #Dhanbad railway division. pic.twitter.com/Age2J3wcRa — TOI Patna (@TOIPatna) October 26, 2022 ఇదీ చదవండి: హనీట్రాప్: ఆమె ఎవరో తెలియదు.. కానీ, అంతా ఆమె వల్లే జరిగింది! -
అదృష్టం అంటే ఆమెదే.. వీడియో షేర్ చేసిన సజ్జనార్!
రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఎటు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందో ఊహించలేము. ఎన్నో జాగ్రత్తలు పాటిస్తూ వెళ్తున్నా ఎదుటి వ్యక్తులు చేసే తప్పుల వల్ల ప్రాణాలపైకి వస్తుంది. అయితే, కొన్నిసార్లు అదృష్టం బాగుండి త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడతారు. అలాంటి ఓ వీడియోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ మహిళ రెప్పపాటులో పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఈ వీడియోను ఐపీఎస్ అధికారి వీసి సజ్జనార్ ట్విట్టర్లో షేర్ చేశారు. త్రుటిలో తప్పించుకున్నా ఎన్నాళ్లు ఇలా అదృష్టంపై ఆధారపడతాం? రోడ్డుపై వెళ్తున్నప్పుడు బాధ్యతగా వ్యవహరించాలి అంటూ రాసుకొచ్చారు. వీడియోలో.. బిజీ రోడ్డులో ఓ మహిళ రోడ్డు పక్కన వెళ్తూ వీధి దారిని దాటుతుంటుంది. ఆ ముందే ఓ ఆటోను నిలిపి వేచి చూస్తుంటాడు డ్రైవర్. ఓ కారు వేగంగా వచ్చి ఆటోను ఢీకొట్టగా బోల్తా పడింది. అయితే, రోడ్డుపై వెళ్తున్న మహిళ రెండు వాహనాల మధ్య నుంచి రెప్పపాటులో ప్రమాదం నుంచి బయటపడుతుంది. ఈ వీడియో వైరల్‌గా మారిన క్రమంలో రోడ్డుపై వెళ్లేప్పుడు బాధ్యతగా మెలగాలని, ప్రమాదల నివారణకు చట్టాలను పటిష్టం చేయాలని పలువురు కోరుతున్నారు. Narrow escape but how long do we depend on luck? Be responsible on Roads #RoadSafety pic.twitter.com/JEck2aXIuK — V.C. Sajjanar, IPS (@SajjanarVC) September 1, 2022 ఇదీ చదవండి: Viral Video: హనుమాన్ వేషాధారణతో డ్యాన్స్.. ఉన్నట్టుండి స్టేజ్‌పై కుప్పకూలడంతో.. -
సుష్మితా సేన్ లైవ్ వీడియోలో మాజీ బాయ్‌ఫ్రెండ్.. లలిత్ ఎక్కడ?
Sushmita Sen Parties With Her Ex Boyfriend Rohman Shawl: గత కొద్ది రోజులుగా మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్ వార్తల్లో ప్రధానంగా నిలుస్తూ వస్తోంది. సుష్మితా సేన్ తనతో డేటింగ్లో ఉందని వ్యాపారవేత్త, ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ జులై 14న సాయంత్రం సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. లలిత్‌తో సుష్మితా డేటింగ్ చేయడాన్ని పలువురు విమర్శిస్తే, కొంతమంది ఆమెకు మద్దుతుగా నిలిచారు. ఇదిలా ఉంటే వారు డేటింగ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసినప్పటి నుంచి వీరిద్దరూ ఏం చేసిన హాట్ టాపిక్‌గా మారింది. అయితే తాజాగా లలిత్ మోది ఎక్కడా అంటూ సుష్మితా సేన్‌పై ప్రశ్నల వర్షం కురింపించారు నెటిజన్లు. సుష్మితా సేన్ తల్లి సుభ్రా సేన్ ఆగస్టు 8న పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ వీడియోను పోస్ట్ చేసింది సుష్మితా సేన్. ఈ వీడియోలో సుష్మితా సేన్ ఎక్స్ బాయ్‌ఫ్రెండ్ రోహ్మాన్ షా దర్శనమిచ్చాడు. ఇది చూసిన నెటిజన్లు 'లలిత్ ఎక్కడ?', 'ఎక్కడ మోది?' అంటూ ప్రశ్నించారు. ఈ వీడియోలో సుష్మితా కూతుళ్లతో మాట్లాడుతూ కనిపించాడు రోహ్మాన్ షా. అలాగే సుష్మితా సేన్ లైవ్‌లో కనిపించమని అందరిని కోరినప్పుడు రోహ్మాన్ మాత్రం దూరంగా ఉండటాన్ని గమనించవచ్చు. కాగా తనకంటే 15 ఏళ్లు చిన్నవాడైన మోడల్ రోహ్మన్ షాతో సుష్మితా సేన్ మూడేళ్లు డేటింగ్ చేసిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Nikhil Rao (@bg0260) View this post on Instagram A post shared by Lalit Modi (@lalitkmodi) -
Live Video: డబ్బు కోసం ఇంత ఘోరమా?.. కారుతో ఢీకొట్టి మరీ..!
వాషింగ్టన్: డబ్బుల కోసం కొందరు దండగులు ఎంతకైనా తెగిస్తున్నారు. కొత్త కొత్త పద్ధతుల్లో చోరీలకు పాల్పడుతూ అత్యంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి సంఘటనే అమెరికాలోని న్యూయార్క్ నగరంలో జరిగింది. ఓ వ్యక్తిని కారుతో ఢీకొట్టి రక్తపు మడుగులో పడిపోయిన అతడికి చెందిన ఆభరణాలు, డబ్బులు లాక్కెళ్లారు. ఈ భయానక దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. ప్రస్తుతం బాధితుడు ఆసుపత్రిలో మరణంతో పోరాడుతున్నాడు. ఈ చోరీకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ని న్యూయార్క్ పోలీస్ విభాగం(ఎన్‌వైపీడీ) ట్విట్టర్లో షేర్ చేసింది. నగరంలోని బ్రోంక్స్లో గత శనివారం ఉదయం 6.30 గంటలకు ఈ ఘటన జరిగినట్లు పేర్కొంది. ‘ఓ 39 ఏళ్ల వ్యక్తిని కొందరు దుండగులు కారుతో ఢీకొట్టారు. ఆ తర్వాత బలవంతంగా అతడి వస్తువులు, డబ్బులను లాక్కెళ్లారు.’ అని పేర్కొంది ఎన్‌వైపీడీ. ఈ వీడియోలో.. బ్లాక్ సెడాన్ కారు బాధితుడిని వెనకనుంచి ఢీకొట్టింది. దాంతో రోడ్డుపై రక్తపు మడుగులో పడిపోయాడు. కొద్ది క్షణాల్లోనే కారులోంచి దిగిన ఇద్దరు వ్యక్తులు బాధితుడి వద్ద నుంచి వస్తువులు లాక్కెళ్లారు. 🚨WANTED for ROBBERY: Do you know these guys? On 7/23/22 at approx. 6:40 AM, opposite 898 E 169 St in the Bronx, the suspects struck a 39-year-old male with a car, then proceeded to forcibly take his property. Any info? DM @NYPDTips, or anonymously call 800-577-TIPS. pic.twitter.com/RngQ1JUA4C — NYPD NEWS (@NYPDnews) July 24, 2022 సమాచారం అందుకున్న వెంటనే అత్యవసర విభాగం బృందాలు బాధితుడిని హుటాహుటిన లిన్‌కోల్న్ ఆసుపత్రికి తరలించాయి. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇద్దరు కారు దిగి చోరీకి పాల్పడగా మరో వ్యక్తి కారులో ఉన్నట్లు చెప్పారు. దుండగుల గురించి సమాచారం తెలిసినవారు తమకు ఫోన్ చేయాలని, ఆన్లైన్లో సమాచారం అందించాలని కోరారు. ఇదీ చదవండి: లైవ్‌స్ట్రీమ్‌లో భార్య దారుణ హత్య.. భర్తకు ఉరి! -
ఆర్ఎస్ఎస్ ఆఫీస్‌పై బాంబు దాడి.. లైవ్ వీడియో
కన్నూర్: కేరళ పయ్యనూర్‌లోని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) కార్యాలయంపై మంగళవారం తెల్లవారుజామున ఇద్దరు దుండగులు బాంబు విసిరారు. దీంతో భవనం ప్రధాన ద్వారం తలుపులు, కిటికీలు ధ్వంసమయ్యాయి. బాంబు దాడి దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. ధ్వంసమైన తలుపులు, కుర్చీలు, టేబుళ్ల ఫోటోలు, బాంబు దాడి వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దాడికి కొద్ది సమయం ముందు ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చి ఆర్ఎస్ఎస్ కార్యాలయాన్ని పరిశీలించినట్లు సీసీటీవీలో నమోదైంది. #WATCH केरल: कन्नूर जिले के पय्यानुर में RSS कार्यालय पर बम फेंका गया। पय्यान्नूर पुलिस के अनुसार घटना आज सुबह हुई है। घटना में इमारत की खिड़की के शीशे टूटे। pic.twitter.com/Ii2uQRDif1 — ANI_HindiNews (@AHindinews) July 12, 2022 బాంబు దాడి జరిగిన సమయంలో ఆర్ఎస్ఎస్ కార్యాలయం మూసి ఉండటం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. 'కన్నూర్ జిల్లా, పయ్యనూర్‌లోని ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై బాంబు దాడి జరిగింది. ఈరోజు తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. కిటికి అద్దాలు ధ్వంసమయ్యాయి.' అని పయ్యనూర్ పోలీసులు వెల్లడించారు. మరోవైపు.. దాడి జరిగిన ఆర్ఎస్ఎస్ ఆఫీసు స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమీపంలోనే ఉండటం గమనార్హం. దాడి నేపథ్యంలో ఆ ప్రాంతంలో భద్రత పెంచారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని దుండగులను పట్టుకునేందుకు గాలింపు చేపట్టారు. దాడి వెనుక సీపీఎం: బీజేపీ బాంబు దాడి వెనుక సీపీఎం పాత్ర ఉందని ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకులు ఆరోపించారు. దీనిపై ఉన్నతస్థాయి దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. 'ఈ దాడిలో సీపీఎం పాత్ర ఉందని మేము అనుమానిస్తున్నాం. బంగారం స్మగ్లింగ్ వ్యవహారం బహిర్గతమైన తర్వాత అధికార పార్టీ పీకల్లోతు కష్టాల్లోకి జారుకుంది. దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ఇలాంటివి చేస్తోంది.' అని బీజేపీ కన్నూర్ జిల్లా అధ్యక్షుడు ఎన్ హరిస్‌దాసన్ పేర్కొన్నారు. ఇదీ చూడండి: Reverse Waterfall: ఆకాశంలోకి ఎగిరే జలపాతాన్ని ఎప్పుడైనా చూశారా? -
సంచలనం సృష్టిస్తున్న రొనాల్డో బహిరంగ స్నానం
సాధారణంగా సెలబ్రిటీలు ఏం చేసినా వార్తే. మరి అలాంటిది.. పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో చేస్తే సంచలనంగా మారకుండా ఉంటుందా చెప్పండి. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన వ్యక్తిగా రొనాల్డోకు పేరు ఉంది. ప్రస్తుతం మాంచెస్టర్ యునైటెడ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న రొనాల్డో.. మాంచెస్టర్ సిటీతో కీలక మ్యాచ్‌కు ముందు ఒక లైవ్ వీడియోనూ షేర్ చేశాడు. ఆ వీడియోలో రొనాల్డో బహిరంగంగా స్నానం చేయడం కనిపించింది. మాములుగానే రొనాల్డో ఏదైనా షేర్ చేస్తే విరగబడి చూసి అతని ఫ్యాన్స్.. లైవ్ వీడియో అంటే ఊరుకుంటారా. అయితే రొనాల్డో బహిరంగ స్నానం చూసి ఆశ్చర్యపోయినప్పటికి.. తమ ఆరాధ్య ఆటగాడు అలా కనిపించడంతో లైక్స్, కామెంట్స్ చేశారు. రొనాల్డో స్నానం చేస్తున్న సమయంలో దాదాపు 670,000 మంది లైవ్‌లో చూశారు. సూ.. లాఫింగ్ ఎమోజీలు.. జెండాలు ఇలా రకరకాల ఎమోజీలతో కామెంట్స్ చేస్తూ పోయారు. రొనాల్డో ఇలా చేయడం వెనుక సరైన కారణం తెలియదు గానీ.. ఇప్పుడు అతని బహిరంగ స్నానం మాత్రం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ సీజన్లో మాంచెస్టర్ యునైటెడ్ తరపున 31 మ్యాచ్‌లాడిన రొనాల్డో 15 గోల్స్ కొట్టాడు. చదవండి: Shane Warne: దిగ్గజ ఫుట్‌బాలర్స్‌తో వార్న్‌కు దగ్గరి పోలికలు.. మరణం కూడా! Virat Kohli Jersey Gift: 12వ ఆటగాడికి జెర్సీ గిఫ్ట్‌గా ఇచ్చిన కోహ్లి.. ఎవరా వ్యక్తి? Never would I have thought I’d be watching Cristiano Ronaldo have a shower on Instagram live half naked. pic.twitter.com/FJSLDKfVfz — Ziyad⚡️🇲🇦 (@mcfcziyad) February 28, 2022 -
పునీత్ మరణం: లైవ్‌లో న్యూస్ చదువుతూ ఏడ్చేసిన యాంకర్
News Reader Cries While Reading Puneeth Rajkumar Death News: కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఆకస్మిక మరణం చిత్ర పరిశ్రమను విషాదంలో నింపింది. కన్నడిగులు ఆరాధ్యదైవంలా అభిమానించే పునీత్.. 46ఏళ్ల వయసులోనే చనిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ మరణవార్త విని ఇప్పటికే కొందరు అభిమానులు గుండెపోటుతో మరణించినట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. పునీత్ మరణం కన్నడ ఇండస్ట్రీని శోకసంద్రంలో ముంచెత్తింది. ఆయన మరణం తీవ్రంగా కలివేస్తుంది. చదవండి: నెంబర్1 హీరోల అకాల మరణం.. శాండల్‌వుడ్‌కు అది శాపమా? ఈ క్రమంలో పునీత్ మరణవార్తకు సంబంధించి న్యూస్ చదువుతూ ఓ యాంకర్ లైవ్‌లోనే ఏడ్చేసింది. పునీత్ గుండెపోటుతో చనిపోయాడన్న వార్తను చదువుతూ ఆమె కన్నీటి పర్యంతం అయ్యింది. వార్తను చదువుతూ బోరున ఏడ్చేసింది. కొద్ది సేపటి వరకు అలానే ఏడుస్తూ కనిపించింది. కొద్ది సేపటికి సిబ్బంది వచ్చి ఆమెను ఓదార్చడంతో బాధను దిగమింగుతూ న్యూస్‌ను కంటిన్యూ చేసింది. ఇదంతా లైవ్‌లో టెలికాస్ట్ కావడంతోపునీత్ అభిమానులు కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: పునీత్ రాజ్‌కుమార్ నుదిటిన ముద్దు పెట్టిన సీఎం బొమ్మై.. అన్న కొడుకు చేతుల మీదుగా పునీత్ అంత్యక్రియలు -
ఒకే ఇంట్లో ఆలియాభట్-రణ్‌బీర్.. వీడియో వైరల్
బాలీవుడ్ లవ్ బర్డ్స్ రణ్‌బీర్ కపూర్-ఆలియా భట్ పీకల్లోతు ప్రేమలో ఉన్నారన్న సంగతి తెలిసిందే. గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా రణ్‌బీర్ కపూర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. కరోనా కారణంగా తమ వివాహం వాయిదా పడిందని, లేదంటే ఈ పాటికే పెళ్లి జరిగి ఉండేదని తెలిపాడు. కాగా ఎప్పటికప్పుడు పార్టీలు, డిన్నర్ డేటింగులతో చక్కర్లు కొడుతూ పలుసార్లు మీడియాకు చిక్కారు. తాజాగా ఈ ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారని, అందుకు సాక్ష్యం ఇదిగో అంటూ ఓ పాత వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. కాగా జంతువులు, ప్రకృతిపై తనకున్న ప్రేమ గురించి ఆలియా తన ఇన్స్టాగ్రామ్ లైవ్‌లో చెప్తుండగా కర్టెన్ వెనక నుంచి రణ్‌బీర్ కనిపించారు. ఆలియా లైవ్ వీడియోలో రణ్‌బీర్‌ను జూమ్ చేసి మరీ గుర్తించిన నెటిజన్లు ఈ వీడియోను తెగ షేర్లు చేసేస్తున్నారు. అయితే ఈ వీడియో ఇప్పడిది కాదు. గతేడాది లాక్డౌన్లో రణ్‌బీర్-ఆలియా ఓకే ఇంట్లో ఉన్నారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆలియా లైవ్ సెషన్లో కనిపించింది రణ్బీరేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ వీడియోలో ఇద్దరూ వైట్ అండ్ వైట్ దుస్తుల్లో కనిపించారు. కాగా ఇటీవలె కరోనా నుంచి కోలుకున్న ఈ జంట మాల్దీవులకు విహారయాత్రకు వెళ్లి విమర్శలు పాలైన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by RanLia_Eternity🎱 (@ranlia_eternity) చదవండి : నా కొడుకు లవ్ బ్రేకప్‌కు ఆ హీరోయిన్లే కారణం ‘ఇద్దరితో బ్రేకప్.. అతడిని ఎలా లవ్ చేస్తున్నావ్?’ -
లైవ్ వీడియోలో స్నానం చేస్తూ అడ్డంగా..
కాంటాబ్రియా : కరోనా నేపథ్యంలో ప్రపంచంలో ఏ చోట చూసిన వర్క్ ఫ్రం హోం సాధారణమైపోయింది. వర్క్ ఫ్రం చేస్తూనే తమకు నచ్చిన పని చేసుకునే వెసులబాటుకు అవకాశం ఉంటుంది. ఇంట్లోనే ఉంటున్నాం కదా.. వర్క్ ఫ్రం హోం ఎలాగైనా చేయొచ్చులే అనుకొని కొందరు షర్ట్ ఒక్కటే వేసుకొని కింద షార్ట్ లేకపోతే లుంగీ కట్టుకొని మీటింగ్స్‌కు అటెండ్ అవుతుంటారు. మధ్య మధ్యలో ఎవరో ఒకరు వచ్చి డిస్టర్బ్ చేయడం కూడా చాలా సార్లే చూశాం. అయితే కొన్ని సార్లు అదే వర్క్ ఫ్రం హోం వల్ల లైవ్ వీడియోల్లో అడ్డంగా దొరుకుతున్నారు. తాజాగా ఒక వ్యక్తి మాత్రం వర్క్ ఫ్రం హోం పేరుతో మరింత ముందుకు పోయాడు. ఏకంగా బాత్రూంలో స్నానం చేస్తూ లైవ్ వీడియోలో అడ్డంగా దొరికిపోయి పదవిని కోల్పోయో ప్రమాదంలో పడ్డాడు. ఈ ఘటన స్పెయిన్‌లో చోటుచేసుకుంది.(రీల్స్‌పై మోతమోగుతున్న మీమ్స్!) వివరాలు.. స్పెయిన్‌లోని కాంటాబ్రియాలో బెర్నాడో బుస్టిల్లా టోర్రెలావెగా కమ్యునికీ పార్ట్ టైమ్ కౌన్సిలర్‌గా పనిచేస్తున్నాడు. లాక్డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం కార్యక్రమాలన్ని వర్క్ ఫ్రం హోం ద్వారానే చూస్తున్నారు. కాగా బుస్టిల్లా కూడా ఆన్లైన్ మీటింగ్‌లో పాల్గొన్నాడు. ఈ మీటింగ్‌లో ప్రభుత్వ అధికారులు, జర్నలిస్టులు, ఇతరులు పాల్గొన్నారు. ఈ లైవ్ మీటింగ్ టీవీలో కూడా ప్రసారమవుతున్నది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన మీటింగ్ మధ్యాహ్నం వరకు కొనసాగుతూనే ఉన్నది. అతను బయటికి వెళ్లి కూతుర్ని తీసుకురావాలి. టైం అవుతుందని స్నానం చేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ, మీటింగ్‌లో ఏం మాట్లాడుతున్నారో వినాలని లాప్‌టాప్‌ను కూడా బాత్రూమ్లోకి తీసుకెళ్లాడు. వీడియో కనిపించకుండా హైడ్ చేయబోయి, మినిమైజ్ చేశాడు. ఇక అంతే.. అతను స్నానం ఎలా చేస్తున్నాడో అంతా లైవ్‌లో కనిపించింది.(చావు నుంచి కాపాడుకోవడానికే స్పీడుగా) అతని అవతారం చూసి తోటి కౌన్సిలర్లు, అధికారులు షాక్ అయ్యారు. మీటింగ్‌లో ఎంత అరిచినా షవర్ వల్ల బెర్నాడోకి వినిపించలేదు. మీటింగ్‌ను మధ్యలో ఆపేందుకు కుదరదు. డిస్ట్రబెన్స్ కలుగుతుందని అధికారులు తిట్టడంతో అతని ఫ్రెండ్స్ బెర్నాడోకి ఫోన్ చేసినా ప్రయోజనం లేకపోయింది. ఇక చేసేదేం లేక మీటింగ్‌ను వాయిదా వేశారు. బెర్నాడో ప్రశాంతంగా స్నానం చేసిన తర్వత విషయం తెలిసి బాధపడ్డాడు. మీటింగ్ మధ్యలో ఎందుకు స్నానం చేయాల్సి వచ్చిందో సమాధానం చెప్పి, టెక్నికల్ సమస్య వల్ల ఇలా జరిగిందని క్షమాపణలు తెలిపాడు. అయితే దీనికి బాధ్యత వహిస్తూ బుస్టిల్లాను రాజీనామా చేయాలని కంపెనీ కోరింది. ఇప్పుడు ఇదంతా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 🎥VÍDEO | "Decidle algo a Berni. Decidle algo, rápido". El secretario general del PSOE de Torrelavega y concejal, Bernardo Bustillo, se ducha durante un pleno municipal telemático y no apaga la cámara. Atención a la cara del alcalde López Estrada (arriba a la derecha) pic.twitter.com/pdttr7YwWo — 🅰️hora Cantabria (@AhoraCantabria) July 1, 2020 -
లైవ్ వీడియో తీస్తూ ప్రాణం పోగొట్టుకున్నాడు
బుర్ద్వాన్ : పశ్చిమ బెంగాల్‌లోని బుర్ద్వాన్ జిల్లా అండాల్ టౌన్లో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. 24 ఏళ్ల వ్యక్తి తన బైక్‌పై వెళుతూ సరదాగా దానిని లైవ్ వీడియో తీసి ఫేస్బుక్లో షేర్ చేయాలని భావించాడు. అయితే వీడియో తీస్తున్న సమయంలో ఒక్కసారిగా వాహనం అదుపు తప్పి కింద పడ్డాడు. దీంతో తలకు బలమైన గాయం కావడంతో ఆసుపత్రికి తరలించిన కాసేపటికే తుదిశ్వాస విడిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అందజేశారు. శనివారం సాయంత్రం కాళీ మాత గుడికి వెళ్తున్నానని చెప్పినట్లు మృతుడి కుటుంబసభ్యులు పేర్కొన్నారు. అతను బైక్‌పై వచ్చేటప్పుడు తన డ్రైవింగ్‌ను ఫేస్బుక్ లైవ్ వీడియో తీసే క్రమంలో వాహనం ఒక్కసారిగా కంట్రోల్ తప్పడంతో ఈ ప్రమాదం జరిగిందని, ఆ సమయంలో తలకు హెల్మట్ లేకపోవడం వల్లే మృతి చెందాడని పోలీసులు వెల్లడించారు. -
భారత్‌లో తొలి 5జీ లైవ్ వీడియో కాల్
న్యూఢిల్లీ: స్వీడన్‌కు చెందిన టెలికం కంపెనీ ఎరిక్సన్ 5జీ లైవ్ వీడియో కాల్‌ను తొలిసారిగా భారత్‌లో ప్రదర్శించింది. ఇది భారత్‌లో తొలి 5జీ వీడియో కాల్ అని, క్వాల్కామ్ భాగస్వామ్యంతో దీనిని ప్రదర్శిస్తున్నామని ఎరిక్సన్ హెడ్(సౌత్ ఈస్ట్ ఏషియా, ఓషియానియా, ఇండియా) నున్‌జో మిర్టిల్లో చెప్పారు. 5జీ సర్వీస్‌లు మిల్లీమీటర్‌వేవ్(ఎమ్‌ఎమ్‌వేవ్–28 గిగాహెట్జ్, 38 గిగాహెట్జ్ స్పెక్ట్రమ్ బాండ్స్) స్పెక్ట్రమ్ ద్వారా అందుతాయని వివరించారు. 5జీ, 4జీ మొబైల్‌నెట్‌వర్క్స్‌కు ఎమ్‌ఎమ్‌వేవ్ స్పెక్ట్రమ్ కీలకమైనదని పేర్కొన్నారు. ఇక్కడ జరుగుతున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2019లో ఆయన మాట్లాడారు. వచ్చే ఏడాది నుంచి 5జీ ఫోన్లు.... ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ), మెషీన్ టు మెషీన్ కమ్యూనికేషన్స్‌వంటి తాజా టెక్నాలజీలకు 5జీ కీలకం కానున్నదని మిర్టిల్లో పేర్కొన్నారు. 5జీ కారణంగా భారత్‌లో కొత్త అవకాశాలు అందివస్తాయని వివరించారు. వచ్చే ఏడాది నుంచి 5జీ టెక్నాలజీని సపోర్ట్ చేసే స్మార్ట్ఫోన్ల అమ్మకాలు పెరగనున్నాయని క్వాల్కామ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ రాజెన్ వగాడియా పేర్కొన్నారు. ఇంటర్నెట్ స్పీడ్ అధికంగా ఉండే 5జీ సర్వీస్‌లు భారత్‌లో ఇంకా ఆరంభం కాలేదు. ఈ సర్వీసులు ఇప్పటికే అమెరికా, దక్షిణ కొరియాల్లో లభిస్తున్నాయి. 5జీ సర్వీసులకు సంబంధించిన స్పెక్ట్రమ్‌ను ఈ ఆర్థిక సంవత్సరంలోనే వేలం వేయనున్నామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. -
24 గంటల్లో 1.5 మిలియన్ల వీడియోలు తొలగింపు
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ ఫేక్ న్యూస్, హింసాత్మక వీడియోల నిరోధం కోసం నిరంతరం శ్రమిస్తున్నామని వివరించింది. న్యూజిలాండ్ ప్రధాని జసిందా అర్డర్న్ ఈ ఘటనపై ఆదివారం ఫేస్‌బుక్‌ను ప్రశ్నించిన నేపథ్యంలో సంస్థ స్పందించింది. న్యూజిలాండ్ నరమేధానికి సంబంధించి నిబంధనలు ఉల్లంఘించే కంటెంట్‌ను తీసివేయడానికి తీవ్రంగా శ్రమించామని ఫేస్బుక్ అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఘటన జరిగిన 24 గంటల్లోనే 1.5 మిలియన్ల వీడియోల ఫుటేజ్‌ని తొలగించినట్టు వెల్లడించింది. వీడియోగేమ్ తరహాలో లైవ్ స్ట్రీమింగ్ చేసిన వీడియోలను తొలగించామని న్యూజిలాండ్ ఫేస్బుక్ ప్రతినిధి మియా గార్లిక్ తెలిపారు. అలాగే 1.2 మిలియన్ల వీడియోల అప్‌లోడ్‌ను బ్లాక్ చేశామన్నారు. క్రైస్ట్‌చర్చ్ కాల్పుల ఉదంతంలో నిందితుడు బ్రెట్టాన్ టారాంట్ తన దాడిని ఫేస్బుక్లో దాదాపు 17 నిమిషాల పాటు ప్రత్యక్ష ప్రసారం చేశాడు. దీంతో ఫేస్బుక్లో అతని అనుచరులు మొదట ఈ విషయం గురించి ముందుగా తెలుసుకున్నారు. దీనిపై న్యూజిలాండ్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఇలాంటి హింసాత్మక వీడియోలు సోషల్ మీడియాలో విరివిగా షేర్ అవుతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్ట ప్రకారం చెల్లదని.. ఎడిట్ చేసిన వీడియోలయినా సరే, సోషల్ మీడియా వేదికల్లో పోస్ట కావడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ నిబంధనలు న్యూస్ మీడియాకు కూడా వర్తిస్తుందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే లైవ్ వీడియో ఫుటేజ్‌ను ప్రసారం చేసిన స్కై న్యూస్ ఏజెన్సీని న్యూజిలాండ్ బ్రాడ్‌కాస్టర్ జాబితా నుంచి తొలగించినట్టు తెలుస్తోంది. న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్ ప్రాంతంలో మసీదుల్లో శుక్రవారం ఉదయం జాత్యంహకారి జరిపిన కాల్పుల్లో 50 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇద్దరు తెలుగువారు సహా ఏడుగురు భారతీయులు కూడా ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు గన్ కల్చర్‌కి వ్యతిరేకంగా దేశంలో ఒక చట్టాన్ని తెచ్చేందుకు తమ క్యాబినెట్ సూత్రప్రాయ ఆమోదం తెలిపిందని న్యూజిలాండ్ ప్రధాని జసిందా సోమవారం వెల్లడించారు. -
లైవ్ వీడియో తీసి యువకుడు ఆత్మహత్య
దొడ్డబళ్లాపురం : ప్రేమించిన అమ్మాయితో వివాహం జరిపించలేదనే మనస్తాపంతో ఒక భగ్న ప్రేమికుడు మొబైల్లో లైవ్ వీడియో తీసి విషం తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన దొడ్డ పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కల్లుపేటలో నివసిస్తున్న దేవరాజ్ (23) చిన్నప్పుడే తల్లితండ్రులను పోగొట్టుకున్నాడు. అవ్వ ఇంట్లో ఉండేవాడు. ఇటీవల ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆమెతో వివాహం జరిపించాలని ఇరు వైపుల వారినీ కోరాడు. అయితే ఎవ్వరూ అంగీకరించకపోవడంతో సోమవారం సాయంత్రం తన మొబైల్లోనే వీడియో తీసి విషం తాగాడు. పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
జియో అద్భుత ఫీచర్.. అమితాబ్‌తో వీడియో కాలింగ్..!
సాక్షి, ముంబై: రిలయన్స్ జియో ఇన్ఫోకాం లిమిటెడ్ (జియో) ప్రపంచంలోనే మొట్ట మొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత జియో ఇంటరాక్ట్ వేదికను ప్రారంభించనున్నట్లు గురువారం ప్రకటించింది. ఈ వేదికలో ఎన్నో సేవలు అందుబాటులోకి రానుండగా.. తొలుత ‘లైవ్ వీడియో కాల్ ఫీచర్’ను జియో ప్రారంభించబోతోంది. ఈ ఫీచర్‌తో భారతీయ సినీ దిగ్గజాలతో నేరుగా మాట్లాడిన అనుభూతిని వినియోగదారులు పొందవచ్చు. దానిలో భాగంగానే బిగ్ బీ అమితాబ్ బచ్చన్ త్వరలో ప్రారంభించబోయే ‘102 నాటౌట్’ కామెడీ షోని ఈ లైవ్ వీడియో కాల్ ఫీచర్‌తో జియో తన వినియోగదారులకు అందించనుంది. ఇప్పటికే 186 మిలియన్ల సబ్‌స్కైబర్లు, 150 మిలియన్ల స్మార్ట్‌ఫోన్ వినియోగ దారులతో భారతీయ టెలికాం రంగంలో జియో విశిష్టమైన స్థానంలో నిలిచింది. తాజాగా ప్రారంభమయ్యే జియో ఇంటరాక్ట్ సేవలతో దేశంలోని మూవీ ప్రమోషన్ సేవల్లో అగ్రగామిగా జియో అవతరించనుంది. కొద్ది రోజుల్లోనే వీడియో కాల్ సెంటర్లు, వీడియో కేటలాగ్, వర్చువల్ షో రూమ్‌లు ప్రవేశ పెట్టి తమ సేవలు అందిస్తామని జియో ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, కృత్రిమ మేధతో వినియోగదారులకు ఇంత గొప్ప సేవలు అందించడం ప్రపంచంలో ఇదే మొదటిసారి. ‘లైవ్ వీడియో కాల్’ విత్ అమితాబ్ జియో ఇంటరాక్ట్‌లో మొదటి సర్వీస్‌గా లైవ్ వీడియో కాల్ నిలవనుంది. జియో కస్టమర్లు ఈ ఫీచర్‌తో మే 4న బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌తో వీడియో కాల్ మాట్లాడిన అనుభూతి పొందొచ్చు. దీనికి కస్టమర్లు చేయాల్సిందల్లా ‘మై జియో అప్లికేషన్’ను డౌన్లోడ్ చేసుకోవడమే. యాప్ డౌన్లోడ్ తర్వాత జియో ఇంటరాక్ట్‌పై క్లిక్ చేసి.. స్టార్ట్ వీడియో కాల్‌పై నొక్కితే చాలు అమితాబ్‌తో వీడియో కాల్ మాట్లాడిన అనుభూతి పొందొచ్చు. ఆయన కామెడీ షో 102 నాటౌట్‌పై ప్రశ్నలు కూడా అడగవచ్చు. మొత్తం మీద జియో వినూత్న ఆఫర్లతో తన వినియోగదారులకు తీపి కబురు అందించింది. -
ప్రేమ విఫలం : లైవ్‌లో ఆత్మహత్య
సాక్షి, గద్వాల : ప్రేమించిన యువతి మోసం చేసిందని ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. లైవ్‌లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణం జోగులాంబ గద్వాల జిల్లాలో వడ్డేపల్లి మండలం జక్కేరెడ్డి పల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మహేందర్ రెడ్డి అదే గ్రామానికి చెందిన ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. అయితే ఆ యువతి నిరాకరించడంతో పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. మహేందర్ ఓ పురుగుల మందుల కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. -
సరికొత్త ఆప్షన్ తో రానున్న ఫేస్ బుక్
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ వినియోగ దారులకు మరింత చేరువయ్యేందుకు సరికొత్త లైవ్ వీడియో ఆప్షన్ తో వచ్చేస్తోంది. ఇప్పటి వరకూ ఈ ఆప్షన్ కేవలం ఆన్‌డ్రాయిడ్ ఫోన్లు, ఐఓఎస్ డివైస్ లో మాత్రమే అందుబాటులో ఉండేది. ఇకపై కంప్యూటర్లు, ల్యాప్ టాప్ డెస్క్ టాప్ లపై కూడా లైవ్ వీడియో అందుబాటులోకి తీసుకురానుంది. జర్నలిస్టులు, వ్లాగర్లు, పలు సామాజిక సంస్థల డిమాండు మేరకు ఈ సరికొత్త ఆప్షన్ ను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఫేస్ బుక్ ప్రతినిధి తెలిపారు. ఇకపై ల్యాప్ టాప్ కెమెరా, కంప్యూటర్ కు అనుసంధానించిన కెమెరా సాయంతో లైవ్ వీడియోలో సంభాషణలు సాగించడానికి వీలుంటుంది. వచ్చే అక్టోబర్, నవంబర్ నాటి కల్లా అందుబాటు లోకి తీసుకొచ్చేందుకు ఫేస్ బుక్ ముమ్మర ప్రయత్నం చేస్తోంది. -
ఫేస్బుక్ లైవ్ వీడియోలో కాల్పుల కలకలం
న్యూయార్క్: ఫేస్ బుక్ లైవ్ వీడియో స్ట్రీమింగ్ సందర్భంగా అమెరికాలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ తరహా ప్రమాద ఘటనలు విషాదాన్ని నింపుతున్నాయి. తాజాగా వర్జీనియాలో స్వంత షూటింగ్ రికార్డింగ్ లో కాల్పుల ఉదంతం రికార్డయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుండగా, మరోవ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. వర్జీనియా లోని నార్ ఫోక్ , పరిసరాల్లోని బర్క్లీ లో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఫేస్ బుక్ లో ఈ వీడియో వైరల్ అయింది. వివరాల్లోకి వెళితే...టీజే విలియమ్స్ అతని ఇద్దరు స్నేహితులతో కారులో వెడుతూ హిప్ హాప్ సంగీతం వింటూ.. వీడియోను రికార్డు చేస్తున్నారు. ఇంతలో తుపాకీల మోత. దాదాపు ఇరవై సార్లు తుపాకీ గుళ్ల మోత వినిపించింది. దీంతో కారులో ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలు కావడం ఫోన్ ఎగిరి కిందపడడం...క్షణాల్లో జరిగిపోయింది. ఈ కాల్పుల ఘటనను నార్ ఫోక్ పోలీసులు ధృవీకరించారు. బాధితులను సెంటారా జనరల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. ఇద్దరికి తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలోఉన్నారని, మరొకరికి స్వల్ప గాయాలతో కోలుకుంటున్నాడని వెల్లడించారు. కాగా సీబీఎస్ న్యూస్ ప్రకారం, చికాగోలో ఇలాంటి మూడు ఘటనలు నమోదయ్యాయి. ఆంటోనియో పెర్కిన్స్ అనే వ్యక్తి ప్రత్యక్ష ప్రసారం కోసం వీడియో చిత్రీకరిస్తుడగా.. ఓ గ్యాంగ్ కాల్పులు జరపడంతో ప్రాణాలు కోల్పోయాడు. రెండవ ఘటనలో మరోవ్యక్తి కాల్పులకు బలయ్యాడు. ఈ ఏడాది మార్చి లో జరిగిన మూడవ ఘటనలో ఓవ్యక్తి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. -
నిఘా నేత్రం
పెరుగుతున్న సీసీ కెమెరాల వినియోగం ఈ నిఘా వ్యవస్థతో చోరీల నియంత్రణ కంప్యూటర్లు, సెల్ఫోన్లలో లైవ్ వీడియో ప్రస్తుతం నగరంలో భద్రత ప్రమాణాలు పెరుగుతున్నాయి. ఒకప్పుడు ప్రముఖ వ్యాపార సంస్థలు, షాపింగ్ మాల్క్కే పరిమితమైన సీసీ కెమెరాల వినియోగం నేడు చిన్నచిన్న నగదు దుకాణాలు, సూపర్ మార్కెట్లు, వస్త్ర దుకాణాలు, ఏటీఎం కేంద్రాలు, బ్యాంకులు, పెద్ద ఎత్తున సిబ్బంది పనిచేసే ప్రభుత్వ కార్యాలయాలకు కూడా విస్తరించింది. నగరంలోని రైల్వే స్టేషన్లో ఒకటో నెంబరు ప్లాట్‌ఫారమ్‌పై 8 సీసీ కెమెరాల ఏర్పాటు ప్రక్రియ చురుగ్గా జరుగుతోంది. తర్వాత మిగిలిన ప్లాట్‌ఫారమ్స్ కూడా దీనిని విస్తరించనున్నారు. ప్రముఖుల ఇళ్లలో సైతం వీటిని అమర్చుకుంటున్నారు. నేర నియంత్రణలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో వీటి వినియోగం క్రమేణా పెరుగుతోంది. వీటి ధర అందుబాటులో ఉండడంతో ఈ ఆధునిక టెక్నాలజీని వినియోగించుకునేందుకు అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. అవసరాలను బట్టి మార్కెట్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన సీసీ కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. - ద్వారకానగర్ నేర పరిశోధనలో కీలకం ఇంటికి, దుకాణానికి వేసిన తాళం వేసినట్టే ఉంటాయి. ఇంట్లో వస్తువులు చోరీకి గురవుతుంటాయి. ఇలాంటి కేసుల్లో నిందితుల్ని పట్టుకోవడంలో తీవ్ర జాప్యం అవుతుంది. అదే సీసీ కెమెరాలు ఉంటే పని మరింత సులువుతుంది. ఇటీవల పలు కేసుల్లో సీసీ కెమెరాల ఫుటేజీలు కీలకంగా మారాయంటే వీటి పనితీరు ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. చిమ్మచీకట్లో సైతం మనిషి కదలికను గుర్తించే కెమెరాలు మార్కెట్లో లభిస్తున్నాయి. సెల్ఫోన్లో లైవ్ చూపించే కెమెరాలను ఇంటికి, దుకాణంలో అమర్చుకుంటే నిశ్చింతగా ఉండొచ్చు. పలు రకాలు సీసీ కెమెరాలు ఇది ఐఆర్ బుల్లెట్ విత్ మెటల్ కెమెరా ప్రత్యేకత: కెమెరా మొత్తం మెటల్ బాడీతో ఉంటుంది. ఉదయం, రాత్రి సమయాల్లో రికార్డు చేస్తుంది. నిఘా పరిధి : 10 మీటర్లు ధర : రూ.2,275 నుంచి..ఆపై ఐఆర్ బుల్లెట్ విత్ ఎల్ఈడీ ప్రత్యేకత : కెమెరా మొత్తం మెటల్ బాడీతో రూపొందించడమే కాకుండా 48 ఎల్ఈడీ లైట్లు కూడా ఉంటాయి. వీటి సాయంతో రాత్రి సమయాల్లో కూడా వీడియో క్లారిటీగా వస్తుంది. నిఘా పరిధి : 30 మీటర్లు ధర : రూ.3 వేల నుంచి ఆపై... ఐఆర్ బుల్లెట్ కెమెరా ప్రత్యేకత ః వైర్లెస్ పవర్‌పుల్ బుల్లెట్ కెమెరా ఉదయం, రాత్రి సమయాల తోపాటు జీరో లైట్లో కూడా రికార్డు చేస్తుంది. నిఘా పరిధి: 20 నుంచి 25 మీటర్లు ధర : రూ.2,500 నుంచి ప్రారంభం సీసీ కెమెరాలు అమర్చేది ఇలా... స్టెప్ 1: ఇంట్లో డిజిటల్ వీడియో రికార్డర్ (డీవీఆర్)ను అమర్చుకోవాలి... ఇంట్లో కెమెరాలను బిగించి పవర్ సప్లయి బాక్స్‌ను అనుసంధానించాలి. ఈ బాక్స్ కెమెరాలు కరెంటును డీసీ నుంచి ఏసీకి మార్చుతుంది. ఈ కెమెరాలను డిజిటల్ వీడియో రికార్డర్ (డీవీఆర్)కు కనెక్ట్ చేయాలి. ఒక్క డీవీఆర్ 4 నుంచి 32 సీసీ కెమెరాల వరకు కనెక్ట్ చేయవచ్చు. దీని ధర రూ.6,550. తర్వాత దీనిని ‘రూటర్’అనే పరికరానికి అమర్చాలి. ఇది ఇంట్లో అమర్చిన కెమెరాల కనెక్షన్లను డీవీఆర్కు అందిస్తుంది. ఇంట్లో 360 డిగ్రీల కోణంలో కెమెరాలు తిరుగుతూ చిత్రించాలి. కావాలంటే రొటేటర్ అనే పరికరాన్ని కూడా కెమెరాలకు అమర్చుకోవచ్చు. డోర్లో వీడియో ఫోన్ ప్రత్యేకత: సీసీ కెమెరాలు మాత్రమే కాకుండా వీడియో డోర్ ఫోన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటితో ఇంటి తలుపు ముందుకు ఎవరు వచ్చారో తెలుసుకోవచ్చు. వారితో మాట్లాడవచ్చు. అంతేకాకుండా ఇంట్లో లేని సమయాల్లో ఎవరు డోర్ కొట్టినా వారి చిత్రాలను నిక్షిప్తం చేస్తుంది. ప్రారంభం ధర: రూ. 6,255 నుంచి ఆపై.... ఐఆర్ డోమ్ కెమెరా ప్రత్యేకత: ఉదయం, రాత్రి సమయాల్లో రికార్డ్ చేస్తుంది. ఉదయం సమయంలో కలర్, రాత్రి సమయాల్లో బ్లాక్ అండ్ వైట్ల లో చిత్రీకరిస్తుంది. చీకట్లో కూడా చిత్రాలను రికార్డు చేయడంలో మరో విశేషం. నిఘా పరిధి: 5 నుంచి 10 మీటర్లు ధర : రూ.1500ల నుంచి ప్రారంభం స్టెప్ 2 : సెల్‌ఫోన్‌కు ఇలా కనెక్ట్ చేసుకోవాలి... మొదట సంబంధిత నెట్వర్క్ మనకు ఒక ఇంటర్నెట్ ప్రొటోకాల్ (స్టాటిక్ ఐపీ) నంబర్ ఇస్తుంది. ఈ నంబర్‌ను అంతకుముందే ఇంట్లో అమర్చిన డిజిటల్ వీడియో రికార్డర్ (డీవీఆ ర్)తో కాన్ఫిగరేషన్ చేయాలి. అప్పుడు మనకు ఒక యూజర్ ఐడీ, పాస్వర్డ్ వస్తుంది. ఇప్పుడు మన సెల్ఫోన్లో ఇంట్లోని సీసీ కెమెరాల పనితీరును చూడాలనుకుంటే, సెల్ఫోన్లో ఇంటర్నెట్ ఆన్ చేసి మన దగ్గరున్న ఐపీ నంబర్‌ను టైప్ చేస్తే సెల్‌ఫోన్ స్క్రీన్ మీద యూజర్ ఐడీ, సాప్వర్డ్ అని అడుగుతుంది. అది టైప్ చేస్తే సీసీ కెమెరాల నుంచి లైవ్ దృశ్యాలు ఫోన్లో కనిపిస్తాయి. డీవీఆర్‌లో ఉండే హార్డ్ డిస్క్ సుమారు 30 గిగా బైట్స్ జీబీల మెమరీని రికార్డ్ చేస్తుంది. టీవీకీ ఉండే ఏవీ హోల్‌కు నేరుగా కనెక్ట్ చేస్తే చాలు. ఇవి ఎక్కువగా షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లో వినియోగిస్తున్నారు. రూటర్ ఇంట్లో అమర్చిన కెమెరాల కనెక్షన్లను డీవీఆర్కు అనుసంధానానికి ‘రూటర్’ అనే పరికరాన్ని ఉపయోగిస్తారు. ఇది డీవీఆర్ నుంచి సెల్‌ఫోన్‌కు ఇంటర్నెట్ షేరింగ్ చేస్తుంది. ధర దాదాపు రూ.7 వేలు. రొటేటర్ దీన్ని స్కానర్ అని కూడా పిలుస్తారు. వీటిలో ఇండోర్, అవుట్డోర్ అని రెండు ఆప్షన్స్ ఉంటాయి. కెమెరాను 360 డిగ్రీల కోణంలో తిప్పుతూ చుట్టూ రికార్డ్ చేయడం దీని ప్రత్యేకత. ధర రూ.645 నుంచి రూ.5,250 వరకు ఉంది. సీసీ కెమెరాలు తప్పనిసరి ఎన్ఫోర్స్మెంట్ యాక్ట్ 2013 ప్రకారం వందమంది ఉంటే ప్రతి చోట సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని ప్రజా భద్రత చట్టం చెబుతోంది. దీంతో అపార్టుమెంట్లు, షాపింగ్ కాంప్లెక్స్‌లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. - సత్యనారాయణ, సైబర్ క్రైమ్ సీఐ, విశాఖపట్నం.