సరికొత్త ఆప్షన్ తో రానున్న ఫేస్ బుక్ | Facebook Live Video Is Coming Soon to Desktops | Sakshi
Sakshi News home page

సరికొత్త ఆప్షన్ తో రానున్న ఫేస్ బుక్

Published Thu, Sep 15 2016 8:27 PM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM

సరికొత్త ఆప్షన్ తో రానున్న ఫేస్ బుక్ - Sakshi

సరికొత్త ఆప్షన్ తో రానున్న ఫేస్ బుక్

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ వినియోగ దారులకు  మరింత చేరువయ్యేందుకు   సరికొత్త  లైవ్ వీడియో ఆప్షన్ తో వచ్చేస్తోంది.  ఇప్పటి వరకూ ఈ ఆప్షన్ కేవలం ఆన్డ్రాయిడ్ ఫోన్లు, ఐఓఎస్ డివైస్ లో మాత్రమే అందుబాటులో ఉండేది. ఇకపై కంప్యూటర్లు, ల్యాప్ టాప్ డెస్క్ టాప్ లపై కూడా లైవ్ వీడియో  అందుబాటులోకి తీసుకురానుంది.

జర్నలిస్టులు, వ్లాగర్లు, పలు సామాజిక సంస్థల డిమాండు మేరకు ఈ సరికొత్త ఆప్షన్ ను త్వరలో  అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఫేస్ బుక్ ప్రతినిధి తెలిపారు. ఇకపై ల్యాప్ టాప్ కెమెరా, కంప్యూటర్ కు అనుసంధానించిన కెమెరా సాయంతో లైవ్ వీడియోలో సంభాషణలు సాగించడానికి వీలుంటుంది. వచ్చే అక్టోబర్, నవంబర్ నాటి కల్లా అందుబాటు లోకి తీసుకొచ్చేందుకు ఫేస్ బుక్ ముమ్మర ప్రయత్నం చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement