A Four-Storey Building Collapsed In North Delhi Shastri Nagar - Sakshi
Sakshi News home page

ఢిల్లీలో కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం

Published Mon, Dec 5 2022 1:34 PM | Last Updated on Mon, Dec 5 2022 2:22 PM

A Four-Storey Building Collapsed In North Delhi Shastri Nagar - Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం ఉదయం ఓ భవనం పేకమేడలా కుప్పకూలిపోయింది. ఉత్తర ఢిల్లీలోని శాస్త్రీ నగర్‌లో నాలుగు అంతస్తుల భవనం ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో స్థానికులు భయంతో పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసు, అగ్ని మాపక విభాగాలు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని అంబులెన్స్‌ సాయంతో స్థానిక ఆసుపత్రులకు తరలించారు.   

ప్రమాదాన్ని గ్రహించి ముందుగానే భవనాన్ని ఖాళీ చేయించటం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. భవనాన్ని కూల్చాలని గతంలోనే నోటీసులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. భవనం కూలిపోతున్న వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

ఇదీ చదవండి: బీజేపీతో టచ్‌లో 45మంది టీఎంసీ ఎమ్మెల్యేలు: కేంద్ర మంత్రి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement