
ప్రతీకాత్మక చిత్రం
బుర్ద్వాన్ : పశ్చిమ బెంగాల్‌లోని బుర్ద్వాన్ జిల్లా అండాల్ టౌన్‌లో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. 24 ఏళ్ల వ్యక్తి తన బైక్‌పై వెళుతూ సరదాగా దానిని లైవ్ వీడియో తీసి ఫేస్‌బుక్‌లో షేర్ చేయాలని భావించాడు. అయితే వీడియో తీస్తున్న సమయంలో ఒక్కసారిగా వాహనం అదుపు తప్పి కింద పడ్డాడు. దీంతో తలకు బలమైన గాయం కావడంతో ఆసుపత్రికి తరలించిన కాసేపటికే తుదిశ్వాస విడిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అందజేశారు. శనివారం సాయంత్రం కాళీ మాత గుడికి వెళ్తున్నానని చెప్పినట్లు మృతుడి కుటుంబసభ్యులు పేర్కొన్నారు. అతను బైక్‌పై వచ్చేటప్పుడు తన డ్రైవింగ్‌ను ఫేస్‌బుక్ లైవ్ వీడియో తీసే క్రమంలో వాహనం ఒక్కసారిగా కంట్రోల్ తప్పడంతో ఈ ప్రమాదం జరిగిందని, ఆ సమయంలో తలకు హెల్మట్ లేకపోవడం వల్లే మృతి చెందాడని పోలీసులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment