Burdwan district
-
లైవ్ వీడియో తీస్తూ ప్రాణం పోగొట్టుకున్నాడు
బుర్ద్వాన్ : పశ్చిమ బెంగాల్‌లోని బుర్ద్వాన్ జిల్లా అండాల్ టౌన్లో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. 24 ఏళ్ల వ్యక్తి తన బైక్‌పై వెళుతూ సరదాగా దానిని లైవ్ వీడియో తీసి ఫేస్బుక్లో షేర్ చేయాలని భావించాడు. అయితే వీడియో తీస్తున్న సమయంలో ఒక్కసారిగా వాహనం అదుపు తప్పి కింద పడ్డాడు. దీంతో తలకు బలమైన గాయం కావడంతో ఆసుపత్రికి తరలించిన కాసేపటికే తుదిశ్వాస విడిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అందజేశారు. శనివారం సాయంత్రం కాళీ మాత గుడికి వెళ్తున్నానని చెప్పినట్లు మృతుడి కుటుంబసభ్యులు పేర్కొన్నారు. అతను బైక్‌పై వచ్చేటప్పుడు తన డ్రైవింగ్‌ను ఫేస్బుక్ లైవ్ వీడియో తీసే క్రమంలో వాహనం ఒక్కసారిగా కంట్రోల్ తప్పడంతో ఈ ప్రమాదం జరిగిందని, ఆ సమయంలో తలకు హెల్మట్ లేకపోవడం వల్లే మృతి చెందాడని పోలీసులు వెల్లడించారు. -
డాక్టర్ అవతారం ఎత్తిన ఏసీ టెక్నిషియన్
కోల్‌కతా: ఏసీ టెక్నిషియన్ డాక్టర్‌గా అవతారం ఎత్తడంతో ఓ బాలుడు మృతి చెందిన సంఘటన పశ్చిమ బెంగాల్లో కలకలం రేపింది. 10వ తరగతి చదువుతున్న అర్జిత్(16) అనే బాలుడు ఆనారోగ్యంతో బాధ పడుతుండటంతో కుటుంబ సభ్యులు దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ అన్నిపరీక్షలు చేసిన వైద్యులు సమస్య ఏమిటో తేల్చలేకపోయారు. దీంతో అతడిని బుర్ద్వాన్‌లోని అన్నపూర్ణ నర్సింగ్ హోంలోకి తరలించారు. నర్సింగ్ హోంకి చేరిన తరువాత ఆక్సిజన్ పెట్టిన కొద్దిసేపటికే అర్జిత్‌కు తీవ్రమైన ఛాతీ నొప్పిరావడంతో అనుమానం వచ్చిన బంధువులు.. బాలుడిని అంబులెన్స్‌లో 105 కి.మీ దూరంలో ఉన్న కోల్‌కత్తాలోని రవీంద్రనాధ్ ఠాగూర్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కార్డీయాక్ సైన్సెస్ లో చేర్పించారు. అక్కడ చేరిన కొంత సమయానికే బాలుడు మృతి చెందాడు. అయితే, అంబులెన్స్ డ్రైవర్‌గా ఉన్న టేరాబాబు షా, సిలిండర్ ఫిట్ చేసిన సర్పరాజుద్దీన్ అంతకుముందు అన్నపూర్ణ నర్సింగ్ హోంలో వైద్య సహాయకులుగా కనిపించారు. ఆ తర్వాత సర్పరాజుద్దీన్ ఆక్సిజన్ సిలిండర్ ఫిట్‌చేసే మెకానిక్‌గా కనిపించడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టగా విచారణలో సర్పరాజుద్దీన్ అసలు నిజం ఒప్పుకున్నాడు. తాను వైద్యుడిని కాదని ఏసీ టెక్నిషియన్ అని ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు అతడ్ని, అంబులెన్స్ డ్రైవర్‌ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. -
శవంతో 5 రోజులు ఒంటరిగా గడిపింది!
కోల్‌కతా: తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని గిరిజన మహిళ ఐదు రోజులు ఇంట్లో ఒంటరిగా గడిపిన ఘటన పశ్చిమ బెంగాల్ లో ఆలస్యంగా వెలుగు చూసింది. బరద్వాన్ జిల్లాలోని ముక్తర్ఫార్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంటి నుంచి దుర్వాసన వస్తుండడంతో, ఏదో జరిగిందన్న అనుమానంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కుళ్లిపోయిన స్థితిలో ఓ వ్యక్తి మృతదేహంతో మహిళ ఉండడాన్ని చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. మృతదేహాన్ని ఇంట్లో ఉంచుకోవడం ఇక్కడి గిరిజనుల ఆచారమని చెబుతున్నారు. మృతి చెందిన వ్యక్తిని పాంచు సొరేన్గా గుర్తించామని, నాలుగైదు రోజుల క్రితమే అతడు చనిపోయి ఉండొచ్చని పోలీసులు తెలిపారు. కోల్‌కతాకు చెందిన ఓ వ్యక్తి తన సోదరి అస్తిపంజరం రెండు నెలలు గడిపిన ఘటన గతేడాది జూన్ లో వెలుగు చూసిన విషయం గుర్తుండే ఉంటుంది.