కోల్‌కతా: ఏసీ టెక్నిషియన్ డాక్టర్‌గా అవతారం ఎత్తడంతో ఓ బాలుడు మృతి చెందిన సంఘటన పశ్చిమ బెంగాల్‌లో కలకలం రేపింది. 10వ తరగతి చదువుతున్న అర్జిత్(16) అనే బాలుడు ఆనారోగ్యంతో బాధ పడుతుండటంతో కుటుంబ సభ్యులు దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ అన్నిపరీక్షలు చేసిన వైద్యులు సమస్య ఏమిటో తేల్చలేకపోయారు. దీంతో అతడిని బుర్ద్వాన్‌లోని అన్నపూర్ణ నర్సింగ్ హోంలోకి తరలించారు. నర్సింగ్ హోంకి చేరిన తరువాత ఆక్సిజన్ పెట్టిన కొద్దిసేపటికే అర్జిత్‌కు తీవ్రమైన ఛాతీ నొప్పిరావడంతో అనుమానం వచ్చిన బంధువులు.. బాలుడిని అంబులెన్స్‌లో 105 కి.మీ దూరంలో ఉన్న కోల్‌కత్తాలోని రవీంద్రనాధ్ ఠాగూర్ ఇంటర్‌నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ కార్డీయాక్ సైన్సెస్ లో చేర్పించారు. అక్కడ చేరిన కొంత సమయానికే బాలుడు మృతి చెందాడు.
అయితే, అంబులెన్స్ డ్రైవర్‌గా ఉన్న టేరాబాబు షా, సిలిండర్ ఫిట్ చేసిన సర్పరాజుద్దీన్ అంతకుముందు అన్నపూర్ణ నర్సింగ్ హోంలో వైద్య సహాయకులుగా కనిపించారు. ఆ తర్వాత సర్పరాజుద్దీన్ ఆక్సిజన్ సిలిండర్ ఫిట్‌చేసే మెకానిక్‌గా కనిపించడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టగా విచారణలో సర్పరాజుద్దీన్ అసలు నిజం ఒప్పుకున్నాడు. తాను వైద్యుడిని కాదని ఏసీ టెక్నిషియన్ అని ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు అతడ్ని, అంబులెన్స్ డ్రైవర్‌ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment